
నిమిషానికి 20 పైసలు: టెలినార్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికం కంపెనీ టెలినార్ రూ.22 విలువ గల స్పెషల్ టారిఫ్ వోచర్‌ను ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా దేశంలో ఏ ప్రాంతానికి చేసే కాల్ అయినా నిముషానికి 20 పైసలు మాత్రమే చార్జీ చేస్తారు. వోచర్ కాలపరిమితి 28 రోజులు. సర్కిల్‌లో ఇదే చవకైన కాల్ రేట్ అని కంపెనీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సర్కిల్ బిజినెస్ హెడ్ శ్రీనాథ్ కొటియన్ తెలిపారు.