బ్యాటరీతో నడిచే ఐడియా వైఫై డాంగిల్ | Idea Launches Battery Equipped 3G Wi-Fi Dongle at Rs 2999 | Sakshi
Sakshi News home page

బ్యాటరీతో నడిచే ఐడియా వైఫై డాంగిల్

Published Thu, Dec 18 2014 1:42 AM | Last Updated on Sat, Sep 2 2017 6:20 PM

బ్యాటరీతో నడిచే ఐడియా వైఫై డాంగిల్

బ్యాటరీతో నడిచే ఐడియా వైఫై డాంగిల్

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికం కంపెనీ ఐడియా సెల్యులార్ స్మార్ట్‌వైఫై హబ్ పేరుతో బ్యాటరీతో పనిచేసే 3జీ వైఫై డాంగిల్‌ను మార్కెట్లోకి తెచ్చింది. ధర రూ.2,999 ఉంది. 1500 ఎంఏహెచ్ బ్యాటరీని దీనికి పొందుపరిచారు. డాంగిల్‌ను పవర్ సాకెట్‌కు, ల్యాప్‌టాప్‌కుగానీ అనుసంధానించే అవసరమే లేదు. ఎక్కడైనా ఉంచి ఇంటర్నెట్‌లో విహరించొచ్చు. ల్యాప్‌టాప్, ట్యాబ్లెట్, స్మార్ట్‌ఫోన్.. ఇలా 10 ఉపకరణాల్లో ఒకేసారి నెట్‌ను ఆస్వాదించొచ్చు.

డౌన్‌లోడ్  వేగం 21.6 ఎంబీపీఎస్, అప్‌లోడ్ వేగం 11 ఎంబీపీఎస్ వరకు ఉంటుందని కంపెనీ తెలిపింది. డాంగిల్ 900, 2100 మెగాహెర్ట్జ్ బ్యాండ్‌ను సపోర్ట్ చేస్తుం ది. ఇల్లు, చిన్న కార్యాలయాలకు ఇది ఉపయుక్తంగా ఉంటుందని ఐడియా తెలిపింది. బండిల్ ఆఫర్‌లో ఒక నెల 6 జీబీ 3జీ డేటా ఉచితం.
 
అతిపెద్ద ఈ కామర్స్ మార్కెట్‌గా ఆసియా: సర్వే
బీజింగ్: ప్రపంచంలోనే అతి పెద్ద ఈ కామర్స్ మార్కెట్‌గా ఈ ఏడాది ఆసియా అవతరిస్తుందని ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్(ఈఐయూ) సర్వేలో వెల్లడైంది. ఇప్పటివరకూ అగ్రస్థానంలో ఉన్న ఉత్తర అమెరికాను తోసిరాజని ఆసియా ప్రాంతం మొదటి స్థానంలోకి దూసుకువస్తుందని ఈఐయూ సర్వే పేర్కొంది. ఎకనామిస్ట్ మ్యాగజైన్ గ్రూప్ అడ్వైజరీ కంపెనీగా వ్యవహరిస్తున్న ఈఐయూ  ఈ సర్వేను నిర్వహించింది. చైనా, హాంగ్‌కాంగ్, తైవాన్, మకావూ, భారత్, జపాన్, సింగపూర్, కొరియా తదితర దేశాల్లో  మొత్తం 5,500 మంది మహిళలపై ఈఐయూ ఈ సర్వేను నిర్వహించింది. వివరాలు...
- ఈ కామర్స్‌లో రిటైల్ అమ్మకాలు ఈ ఏడాది ఆసియాలో 5 శాతం వృద్ధితో 7.6 లక్షల కోట్ల డాలర్లకు పెరుగుతాయి. ఇది ఉత్తర అమెరికాలో 2.5 శాతం, యూరప్‌లో 0.8 శాతం చొప్పున వృద్ధి ఉండొచ్చు.
- ఆసియా మహిళలకు స్వేచ్ఛ, ఆర్థిక శక్తి పెరగడం, ఆన్‌లైన్ షాపింగ్‌పై మక్కువ పెరుగుతుండడం  వంటి కారణాల వల్ల అసియాలో ఈ కామర్స్ హవా పెరుగుతోంది.
- షాప్‌కు వెళ్లడం కంటే ఆన్‌లైన్‌లోనే షాపింగ్ చేయడానికి ప్రాధాన్యత ఇస్తామని సగానికి పైగా మహిళలు చెప్పారు.
- వస్తువులు, సేవలకోసం రోజులో ఒక్కసారైనా నెట్‌ను వాడతామని 63% మంది చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement