
యునినార్ క్రికెట్ అన్‌లిమిటెడ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికం కంపెనీ యునినార్ క్రికెట్ అన్‌లిమిటెడ్ పేరుతో ప్రత్యేక ప్యాక్‌ను విడుదల చేసింది. ఈ ప్యాక్ ద్వారా ప్రస్తుత ప్రపంచ కప్ క్రికెట్ విశేషాలు కస్టమర్లు తెలుసుకోవచ్చు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో స్కోర్ సమాచారం, ప్రత్యక్ష ప్రసారాన్ని వినొచ్చు. అంతేగాక కాంటెస్ట్‌లో పాల్గొని ఎల్‌ఈడీ టీవీలు, బంగారు నాణేలతోపాటు ఇతర బహుమతులు గెలుపొందవచ్చని ఆంధ్రప్రదేశ్ సర్కిల్ బిజినెస్ హెడ్ సతీష్ కుమార్ కన్నన్ తెలిపారు. ఇందుకు కస్టమర్లు నెల చందా రూ.30 చెల్లించాలి.