
టెల్కోల ఆదాయం తగ్గొచ్చు జియో ఎఫెక్ట్
రిలయన్స్ జియో ఉచిత సేవల వల్ల 2016–17 ఆర్థిక సంవత్సరపు జనవరి–మార్చి త్రైమాసికం (క్యూ4)లోనూ టెలికం కంపెనీల ఆదాయంపై ప్రతికూల ప్రభావం పడుతోందని అంచనా.
ముంబై: రిలయన్స్ జియో ఉచిత సేవల వల్ల 2016–17 ఆర్థిక సంవత్సరపు జనవరి–మార్చి త్రైమాసికం (క్యూ4)లోనూ టెలికం కంపెనీల ఆదాయంపై ప్రతికూల ప్రభావం పడుతోందని అంచనా. త్రైమాసికం పరంగా చూస్తే టెల్కోల మొబైల్ రెవెన్యూ 6.5–7.5 శాతంమేర తగ్గొచ్చని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ అంచనా వేసింది.
సెల్యులర్ సర్వీసులకు త్వరలో కొత్త మార్గదర్శకాలు: టెలికం రెగ్యులేటర్ ట్రాయ్ రానున్న కొన్ని వారాల్లో సెల్యులర్ సర్వీసులకు సంబంధించి కొత్త మార్గదర్శకాలను తీసుకురానుంది. మొబైల్ సర్వీసులు సహా వీఓఎల్‌టీఈ వంటి కొత్త టెక్నాలజీకి నాణ్యత ప్రమాణాలను తీసుకువస్తామని ట్రాయ్ చైర్మన్ శర్మ పేర్కొన్నారు.
కాల్ డ్రాప్ సమస్యలు కొనసాగుతున్నాయ్: టెలికం ఆపరేటర్లు సహా కేంద్ర ప్రభుత్వం కాల్ డ్రాప్ సమస్య తగ్గిపోయిందని చెబుతుంటే.. మరొకవైపు డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికం (డాట్) సర్వేలో అందుకు భిన్నమైన అంశాలు వెల్లడయ్యాయి. ఒక సర్వే ప్రకారం చూస్తే చాలా మంది మొబైల్ సబ్‌స్క్రైబర్లు ఇంకా కాల్ డ్రాప్ సమస్యను ఎదుర్కొంటున్నారు.