సాక్షి,ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) టెలికాం విభాగం రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ మార్చి త్రైమాసిక ఫలితాల్లో అదర గొట్టింది. నికర లాభంతో 13 శాతం జంప్‌చేయగా, ఆదాయం 11.9 శాతం ఎగిసింది. కార్యకలాపాల ద్వారా ఆదాయం రూ. 23,394 కోట్లుగా ఉంది, గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ. 20,901 కోట్లతో పోలిస్తే 12 శాతం పెరిగిందని రిలయన్స్ జియో తెలిపింది. ఈ ఫలితాలు విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగానే వచ్చినప్పటికీ, ఐదు త్రైమాసికాల్లో లాభం, రాబడి వృద్ధి మందగించడం గమనార్హం. దీనికి ఇటీవలి కాలంలో జియో టారిఫ్ పెంపు లేకపోవడం, అధిక ఖర్చులు కారణంగా మార్కెట్‌వర్గాలు భావిస్తున్నాయి. (నీకో నమస్కారం సామీ..బ్లూటిక్ తిరిగిచ్చేయ్! బిగ్‌బీ ఫన్నీ ట్వీట్ వైరల్)
గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ. 4,173 కోట్లతో పోలిస్తే నికర లాభం సంవత్సరానికి 13 శాతం (YoY) పెరిగి రూ. 4,716 కోట్లకు చేరుకుంది. సీక్వెన్షియల్ ప్రాతిపదికన, డిసెంబర్ త్రైమాసికంలో రూ.4,638 కోట్ల లాభంతో పోలిస్తే లాభం 1.7 శాతం పెరిగింది. అలాగే ఈ త్రైమాసికంలో రూ.23,394 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఆదాయం క్వార్టర్ ఆన్ క్వార్టర్ ప్రాతిపదికన 1.7 శాతం పుంజుకుంది. ఈ త్రైమాసికంలో ఎబిటా రూ. 12,210 కోట్లుగాను, ఎబిటా మార్జిన్ 52.19 శాతంగా ఉంది. (నెట్‌ఫ్లిక్స్ స్కాం 2023 కలకలం: ఈ జాగ్రత్తలు తెలుసుకోండి!)
Comments
Please login to add a commentAdd a comment