గుడ్‌న్యూస్‌: తక్కువ ధరకు 5 నెలల వ్యాలిడిటీ.. సూపర్‌ రీచార్జ్‌ ప్లాన్‌ | BSNL Re Introduces Rs 397 Plan 150 Days Validity Unlimited Calls | Sakshi
Sakshi News home page

గుడ్‌న్యూస్‌: తక్కువ ధరకు 5 నెలల వ్యాలిడిటీ.. సూపర్‌ రీచార్జ్‌ ప్లాన్‌

Published Mon, Aug 28 2023 7:25 PM | Last Updated on Mon, Aug 28 2023 8:43 PM

BSNL Re Introduces Rs 397 Plan 150 Days Validity Unlimited Calls - Sakshi

తక్కువ ధరకు ఎక్కువ వ్యాలిడిటీని అందించే సూపర్‌ రీచార్జ్‌ ప్లాన్‌ (Recharge Plan) ను ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ (BSNL) తీసుకొచ్చింది. 150 రోజుల వ్యాలిడిటీతో వచ్చే రూ. 397 ప్లాన్‌ను తిరిగి ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ కస్టమర్లకు రోజుకు 2 జీబీ డేటాను అందిస్తుంది.

బీఎస్‌ఎన్‌ఎల్‌ రూ. 397 ప్లాన్ కొత్తది కాదు. ఈ ప్లాన్‌ను బీఎస్‌ఎన్‌ఎల్‌ గతంలోనే అందించింది. అయితే ప్రస్తుతం పెట్టిన ప్లాన్‌లో మాత్రం కొన్ని ప్రయోజనాలు మారాయి. ఇంతకుముందు ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 180 రోజులు ఉండగా ప్రస్తుత ప్లాన్‌ వ్యాలిడిటీ 150 రోజులకు తగ్గింది.

రోజుకు 2 జీబీ డేటా, 100 ఎస్సెమ్మెస్‌లు, అపరిమిత ఫోన్ కాల్స్ వంటి ప్రయోజనా‌లు ఉన్నా ఇవన్నీ 30 రోజుల్లోనే ముగుస్తాయి. పాత ప్లాన్‌లో ఈ ప్రయోజనాలన్నీ 60 రోజులపాటు ఉండేవి. ఎక్కువ కాలం వ్యాలిడిటీ కావాలనుకునే కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని ఈ ప్లాన్‌ను బీఎస్‌ఎన్‌ఎల్‌ మళ్లీ ప్రవేశపెట్టింది.

ఇదీ చదవండి: అతి తక్కువ ధరలో రీచార్జ్‌ ప్లాన్స్‌.. నెలంతా అన్‌లిమిటెడ్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement