దేశంలో రెండవ అతిపెద్ద టెలికాం ఆపరేటర్ అయిన ఎయిర్‌టెల్ 30, 60, 90 రోజుల వ్యాలిడిటీతో రీచార్జ్ ప్లాన్లను అందిస్తోంది. నెలంతా కచ్చితమైన వ్యాలిడిటీని ఇచ్చే ప్లాన్ల కోసం వినియోగదారుల నుంచి అభ్యర్థనలు రావడంతో 30, 60, 90 రోజుల ప్లాన్లను ఎయిర్‌టెల్ ప్రవేశపెట్టింది.ఇంతకుముందు 28, 56 లేదా 84 రోజుల వ్యాలిడిటీ ప్లాన్లు మాత్రమే అందుబాటులో ఉండేవి.
30 రోజుల ప్లాన్లు
ఎయిర్‌టెల్‌లో మొత్తం మూడు 30 రోజుల ప్లాన్లు ఉన్నాయి. ఈ ప్లాన్లు వరుసగా రూ.199, రూ.296, రూ.489 ధరల శ్రేణిలో లభిస్తాయి. ఈ అన్ని ప్లాన్లతో అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు, ఎయిర్‌టెల్ థ్యాంక్స్ ప్రయోజనాలను పొందవచ్చు.
రూ.199 ప్లాన్‌లో 3 జీబీ డేటా, రూ.296 ప్లాన్‌లో 25 జీబీ డేటా, రూ.489 ప్లాన్‌లో 50 జీబీ డేటా లభిస్తుంది. ఇక రూ.296, రూ.489 ప్లాన్లలో అపరిమిత 5జీ డేటా ఆఫర్ కూడా ఉంది.
60 రోజుల వాలిడిటీతో..
ఎయిర్ టెల్ రూ.519 ప్లాన్ 60 రోజుల వాలిడిటీని అందిస్తుంది. అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు, రోజుకు 1.5 జీబీ డేటా లభిస్తుంది. ఈ ప్లాన్లో అపరిమిత 5జి డేటా, అపోలో 24|7 సర్కిల్, ఉచిత హలోట్యూన్స్, వింక్ మ్యూజిక్ వంటి ఎయిర్‌టెల్ థ్యాంక్స్ ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
90 రోజుల ప్లాన్లు
90 రోజుల ప్లాన్ ధర రూ.779. రోజుకు 1.5 జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. దీనితో పాటు అపరిమిత 5 జి డేటా, అపోలో 24|7 సర్కిల్, ఉచిత హలోట్యూన్స్, వింక్ మ్యూజిక్ కూడా పొందవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment