
రిలయన్స్ జియో తన ఫైబర్ వినియోగదారులకు శుభవార్త అందించింది. జియోఫైబర్ యూజర్లు నెల నెల ప్లాన్ కాకుండా వార్షిక, ఆరు నెలల ప్లాన్లు ఎంచుకుంటే అదనపు వ్యాలిడిటీని అందించనున్నట్లు పేర్కొంది. జియోఫైబర్ వార్షిక ప్యాకేజీలపై 30 రోజుల అదనపు వ్యాలిడిటీని, ఆరునెలల ప్యాకేజీపై 15 రోజులు అదనంగా అందిస్తోంది. జియో ఫైబర్ వార్షిక ప్యాకేజీ రూ.4,788(నెలకు రూ.399 రూపాయల బేస్ ప్లాన్ కోసం) నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ కొత్త ఆఫర్ కింద వార్షిక కనెక్షన్ తీసుకున్న కానీ, వార్షిక ప్లాన్ కు అప్ గ్రేడ్ అయిన వ్యాలిడిటీ 395 రోజులకు పెరగనుంది. అలాగే ఆరు నెలల ప్లాన్లపై 15 రోజులు అదనంగా వ్యాలిడిటీ లభిస్తుంది. ఈ కొత్త ఆఫర్ ప్రస్తుతం అందుబాటులో ఉన్న అన్ని వార్షిక, ఆరు నెలల ప్లాన్లకు వర్తించనుంది.
ఈ ఆఫర్ జియోఫైబర్ రూ.399, రూ.699, రూ.999, రూ.1,499, రూ.2,499, రూ.3,999, రూ.8,4999 నెలవారీ ప్రణాళికలకు వర్తిస్తుంది. ఈ ప్లాన్ గల వినియోగదారులు 12 నెలల పాటు కొనుగోలు చేస్తే 30 రోజుల అదనపు డేటాను పొందవచ్చు. అదేవిధంగా, వినియోగదారులు జియోఫైబర్ సెమీ-వార్షిక ప్యాక్‌లను కొనుగోలు చేస్తే ఆరు నెలల చెల్లుబాటుతో పాటు 15 రోజులు అదనంగా డేటా ఇవ్వబడుతుంది.-ప్రస్తుతానికి, త్రైమాసిక లేదా నెలవారీ జియోఫైబర్ ప్లాన్లపై ఎటువంటి ఆఫర్లు లేవు.
Comments
Please login to add a commentAdd a comment