టెలికం సంస్థ జియో తాజాగా హైదరాబాద్, బెంగళూరులో 5జీ సర్వీసులు అందుబాటులోకి తెచ్చింది. నవంబర్ 10 నుంచి జియో ట్రూ–5జీ సేవలు అందుబాటులోకి వచ్చినట్లు సంస్థ తెలిపింది. ’జియో వెల్‌కం ఆఫర్’ ఆహ్వానం పొందిన యూజర్లు ఎటువంటి అదనపు చార్జీలు లేకుండానే 1 జీబీపైగా స్పీడ్‌తో అపరిమిత 5జీ డేటా పొందవచ్చని పేర్కొంది. జియోట్రూ 5జీ ఇప్పటికే ఆరు నగరాల్లో (ముంబై, ఢిల్లీ, కోల్‌కతా మొదలైనవి) లక్షలాది యూజర్లకు సర్వీసులు అందిస్తున్నట్లు కంపెనీ వివరించింది.
ఇప్పటికీ వరకు అంతా బాగానే ఉంది, అయితే మీరు 5జీ సేవలను వినియోగించాలంటే ఆ నెట్వర్క్ సపోర్ట్ చేసే స్మార్ట్‌ఫోన్ ఉపయోగిస్తూ ఉండాలి. వీటితో పాటు జియో 5జీ అందుబాటులోకి రావాలంటే మీ స్మార్ట్‌ఫోన్‌లో కొన్ని సెట్టింగ్స్ మార్చాల్సి ఉంటుంది. అవేంటో ఓ లుక్కేద్దాం!
►మొదటగా మీ ఫోన్ 'సెట్టింగ్స్’ ఓపన్ చేయండి
►ఆపై 'మొబైల్ నెట్‌వర్క్' సిమ్ కార్డ్‌కు సంబంధించిన ఆప్షన్‌ని ఎంచుకోండి.
►తర్వాత, జియో సిమ్‌ని ఎంచుకున్నాక, 'ప్రాధాన్య నెట్‌వర్క్( Preferred Nertwork Type) ఆప్షన్‌పై క్లిక్ చేయండి
►ఆపై మీకు 3G, 4G, 5Gలను చూపిస్తుంది. అందులోంచి మీరు 5G సేవలను సెలక్ట్ చేసుకోండి.
ఈ విధంగా 5G నెట్‌వర్క్‌ని ఎంచుకున్న తర్వాత, మీరు మీ స్మార్ట్‌ఫోన్ నెట్‌వర్క్ స్టేటస్ బార్‌లో 5G గుర్తును చూస్తారు. ఒక వేళ ఈ సెట్టింగ్స్ మార్చినా మీరు 5జీ నెట్వర్క్ ఉపయోగించలేకపోతే ఓ సారి మీ మొబైల్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేసి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఇప్పటికే చాలా మంది స్మార్ట్‌ఫోన్ కంపెనీలు 5జీ సేవలకు సంబంధించి అప్‌డేట్‌ను విడుదల చేయగా, యాపిల్ మాత్రం డిసెంబర్ నాటికి విడుదల ప్లాన్ చేస్తోంది. మరో విషయం ఏంటంటే.. 5Gని యాక్సెస్ చేయడానికి కస్టమర్లు కొత్త సిమ్‌ను కొనుగోలు చేయనవసరం లేదని జియో, ఎయిరెటెల్ సంస్థలు ప్రకటించిన సంగతి తెలిసిందే.
చదవండి: ‘వెనక ఇంత జరిగిందా’.. ఉద్యోగులకు ఊహించని షాకిచ్చిన ప్రముఖ ఐటీ కంపెనీ!
Comments
Please login to add a commentAdd a comment