జియో కస్టమర్లకు శుభవార్త: హైదరాబాద్‌లో 5జీ సేవలు, ఈ స్పెషల్‌ ఆఫర్‌ కూడా! | Reliance Jio 5g Service Launched In Hyderabad And Bangalore | Sakshi
Sakshi News home page

జియో కస్టమర్లకు శుభవార్త: హైదరాబాద్‌లో 5జీ సేవలు, ఈ స్పెషల్‌ ఆఫర్‌ కూడా!

Published Thu, Nov 10 2022 9:35 PM | Last Updated on Thu, Nov 10 2022 9:46 PM

Reliance Jio 5g Service Launched In Hyderabad And Bangalore - Sakshi

ప్రముఖ టెలికం సంస్థలు రిలయన్స్ జియో (Reliance Jio), అక్టోబర్‌ నెలలోనే దేశంలో 5జీ సేవలను (5G Services) ప్రారంభించిన సంగతి తెలిసిందే. తొలి దశ 5జీ నెట్‌వర్క్‌ (5G Network) సర్వీసులను అందుబాటులోకి  తీసుకువచ్చింది. ఇందులో భాగంగా ముందుగా 6 నగరాల్లో జియో ట్రూ 5జీ (Jio True 5G) సర్వీస్‌లు ప్రారంభించగా, తాజాగా మరో రెండు నగరాలకు తన 5జీ సర్వీస్‌లను విస్తరించింది.

Jio True 5Gతో వినియోగదారులు తమ స్మార్ట్‌ఫోన్‌లలో 500 Mbps నుంచి 1 Gbps వరకు స్పీడ్‌ పొందవచ్చని కంపెనీ పేర్కొంది. ఇప్పటికే ఆరు నగరాల్లో లక్షల మంది వినియోగదారులకు JioTrue5G సేవలను అందిస్తోంది. తాజాగా  బెంగళూరు, హైదరాబాద్‌లో జియో ట్రూ 5జీ సేవలు లాంచ్‌తో పాటు వినియోగదారులకు వెల్‌కమ్ ఆఫర్‌ను కూడా ప్రకటించింది. ఆఫర్‌లో భాగంగా, ఈ రెండు నగరాల్లోని జియో 5జీ వినియోగదారులు అదనపు ఖర్చులు లేకుండా 1Gbps+ స్పీడ్‌తో అన్‌లిమిటెడ్‌ డేటాను పొందగలరు. నవంబర్‌ 10 నుంచి ఈ రెండు నగరాల్లో జియో 5జీ సేవలు ప్రారంభం కానున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement