బీఎస్‌ఎన్‌ఎల్‌ పండుగ ఆఫర్ : 90 రోజులు ఫ్రీ | Sakshi
Sakshi News home page

బీఎస్‌ఎన్‌ఎల్‌ పండుగ ఆఫర్ : 90 రోజులు ఫ్రీ

Published Mon, Oct 28 2019 12:59 PM

455day aditional offer on BSNL1699 prepaid plan  - Sakshi

సాక్షి, ముంబై: ప్రభుత్వ రంగ సంస్థ  భారత్ సంచార్ నిగం లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్)  తన చందాదారులకు అద్భుత ఆఫర్‌ తీసుకొచ్చింది.  పండుగ సీజన్ సందర్భంగా  ప్లాన్‌ను సమీక్షించి  బీఎస్‌ఎన్‌ఎల్‌ రూ .1,699 వార్షిక ప్రీ పెయిడ్‌ ప్లాన్‌పై అదనపు ప్రయోజనలను అందిస్తోంది. అక్టోబర్ 31 లోపు రీఛార్జ్ చేసే వినియోగదారులకు  మాత్రమే ఈ ప్రయోజనాలు వర్తిస్తాయని  సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.

ఆఫర్‌ వివరాలు
రూ .1,699 ప్రీపెయిడ్ ప్లాన్ చెల్లుబాటును 455 రోజులకు పొడిగించింది. వాస్తవానికి  ఈ ప్లాన్‌ వాలిడిటీ 365 రోజులు మాత్రమే. దీంతోపాటు అక్టోబర్‌ మాసంలో రోజుకు 3.5 జీబీ (1.5 జీబీ అదనం) డేటాను అందిస్తోంది. నవంబరు డిసెంబర్‌ మాసాల్లో రోజుకు 3 జీబీ డేటా అందిస్తుంది. అలాగే ఏడాదిపాటు ఉచిత వ్యక్తిగతీకరించిన రింగ్ బ్యాక్ టోన్ (పిఆర్‌బిటి) లేదా కాలర్ ట్యూన్‌లను కూడా అందిస్తుంది.  రోజుకు 2 జీబీ డేటాతో పాటు రోజుకు 250 నిమిషాలు కాలింగ్,  రోజువారీ 100 ఎస్ఎంఎస్ లు ఉచితం. అంటే అక్టోబర్ 31 లోపు  రీచార్జ్‌ చేసుకున్న కస‍్టమర్లకు 90 రోజుల  అదనపు ప్రయోజనాలు అందుబాటులో వుంటాయి. 

Advertisement
 
Advertisement
 
Advertisement