Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Police Questioned Vallabhaneni Vamsi For The Second Day1
‘నాపై కేసులన్నీ ఆరోపణలే’

సాక్షి, విజయవాడ: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రెండో రోజు కస్టడీ ముగిసింది. ఐదు గంటల పాటు ఆయనను పోలీసులు విచారించారు. కృష్ణలంక పోలీస్‌ స్టేషన్‌ నుంచి వంశీని జీజీహెచ్‌కి పోలీసులు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం మళ్లీ తిరిగి జైలుకు తరలించనున్నారు. విచారణలో భాగంగా వంశీని 20 ప్రశ్నలను పోలీసులు అడిగారు. తనపై ఉన్న కేసులు తప్పుడువేనని వంశీ చెప్పినట్లు సమాచారం. తనపై కేసులు అన్ని ఆరోపణలేనని.. కేసులు ఎందుకు పెడుతున్నారో అందరికీ తెలిసిందేనని చెప్పినట్లు తెలిసింది.కాగా, వంశీ రిమాండ్‌ను మరో 14 రోజుల పాటు పొడిగిస్తూ ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీ చేసింది. టీడీపీ కార్యాలయంలో పనిచేసే సత్యవర్ధన్‌ను బెదిరించి, కిడ్నాప్‌ చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసులో వంశీకి జ్యుడీషియల్‌ రిమాండ్‌ ముగిసింది. దీంతో వంశీతో పాటు మరో నలుగురిని పోలీసులు మంగళవారం వర్చువల్‌గా న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. వీరికి మార్చి 11 వరకు రిమాండ్‌ను పొడిగించారు.అనంతరం పోలీసులు వంశీతో పాటు మరో నలుగురికి వైద్యపరీక్షలు నిర్వహించి జైలుకు తరలించారు. కాగా మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, ఆయన అనుచరులే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అక్రమ కేసుల పరంపరను కొనసాగిస్తోంది. తాజాగా స్థలం కబ్జా పేరుతో మంగళవారం మరో కేసును గన్నవరం పోలీస్‌స్టేషన్‌లో నమోదు చేశారు.

Ysrcp Mlc Lella Appi Reddy Slams On Chandrababu Government2
‘ప్రధాన ప్రతిపక్ష గుర్తింపుపై చంద్రబాబు సర్కార్‌ నిరంకుశ వైఖరి’

సాక్షి, తాడేపల్లి: ప్రజాస్వామ్య స్పూర్తికి తూట్లు పొడుతూ అసెంబ్లీలో అసలు ప్రధాన ప్రతిపక్ష గుర్తింపునే ఇవ్వకుండా, ప్రశ్నించే గొంతు వినిపించకుండా కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి మండిపడ్డారు. ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాన ప్రతిపక్ష గుర్తింపు అంటే ఏదో రాజకీయపరమైన హోదాగా కూటమి పార్టీలు విషప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాన ప్రతిపక్ష గుర్తింపు అనేది ఒక బాధ్యత, దీనివల్ల అసెంబ్లీలో ఎక్కువ సమయం ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు ఉండే అవకాశం వైఎస్సార్‌సీపీకి దక్కుతుందన్నారు. దీనిని కూడా వక్రీకరించడం దుర్మార్గమన్నారు.ఇంకా ఆయన ఏమన్నారంటే..ఏపీ అసెంబ్లీలో నాలుగు పార్టీలు ఉంటే, దానిలో మూడు పార్టీలు ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నాయి. మిగిలిన వైఎస్సార్‌సీపీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాల్సి ఉంది. పార్లమెంట్ చట్టం 1977 ప్రకారం సభలో సభ్యుల సంఖ్యతో సంబంధం లేకుండా ప్రధాన ప్రతిపక్షంను గుర్తించాలి. కూటమి ప్రభుత్వం దీనిని ఏ మాత్రం ఖాతరు చేయడం లేదు. ప్రధాన ప్రతిపక్ష గుర్తింపును వైఎస్సార్‌సీపీ కోరుతుంటే దీనిని రాజకీయం చేయడం దుర్మార్గం. దీనిపై కూటమి పార్టీలు చేస్తున్న ఈ విమర్శలను చూసి ప్రజాస్వామికవాదులే ఆశ్చర్యపోతున్నారు.ప్రజా సమస్యలను ప్రస్తావించకుండా అడ్డుకుంటున్నారుతొమ్మిది నెలల కూటమి పాలనపై ఇప్పటికే ప్రజల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత ప్రారంభమైంది. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను ఎక్కడా నెరవేర్చడం లేదు. మరోవైపు గ్రూప్-2 నిరుద్యోగులు, మిర్చి రైతులు, విద్యుత్ చార్జీల భారాన్ని మోయలేని ప్రజలు బాహాటంగానే ప్రభుత్వం మీద తమ నిరసనను తెలియచేస్తున్నారు. వీటన్నింటినీ ప్రజల పక్షాన ఎక్కడ వైఎస్సార్‌సీపీ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఎండగడుతుందోననే భయంతోనే కూటమి ప్రభుత్వం ఉంది. న్యాయంగా వైఎస్సార్‌సీపీకి దక్కాల్సిన ప్రధాన ప్రతిపక్ష గుర్తింపును దూరం చేస్తూ, ప్రజా సమస్యలపై ఎక్కడ వైఎస్సార్‌సీపీ తమను ప్రశ్నిస్తుందోనని కంగారుపడుతోంది. ప్రతిపక్షంగా అడిగే ప్రశ్నలకు అసెంబ్లీలో సమాధానం చెప్పుకోలేని నిస్సహాయ స్థితిలో కూటమి ప్రభుత్వం ఉంది. తమ పాలనా వైఫల్యాలను ప్రజాగొంతుకగా వైఎస్సార్‌సీపీ సభలో వినిపిస్తే తట్టుకోలేమనే ఉద్దేశంతోనే ప్రధాన ప్రతిపక్ష గుర్తింపును నిరాకరిస్తున్నారు.ప్రధాన ప్రతిపక్షంగా శాసనమండలిలో పోరాడుతున్నాంశాసనమండలిలో ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షంగా వైఎస్సార్‌సీపీ అనేక ప్రజా సమస్యలపై మాట్లాడుతోంది. ప్రధాన ప్రతిపక్ష గుర్తింపు ఉండటం వల్ల వైఎస్సార్‌సీపీ సభ్యులకు ఎక్కువ సమయం లభిస్తోంది. తాజాగా వైస్ చాన్సలర్ల బలవంతపు రాజీనామాలపై ప్రభుత్వాన్ని నిలదీయడంతో సమాధానం చెప్పలేక కూటమి ప్రభుత్వం కంగారు పడింది. గవర్నర్ ప్రసంగంలో మాట్లాడించిన మాటలు, చెప్పించిన అబద్ధాలపై నిలదీయడంతో అధికారపక్షం నీళ్ళు నమిలింది. తమ తప్పులను ఒప్పుకోవాల్సిన పరిస్థితిలో పడింది.ప్రజాస్వామ్యంలో అధికారపక్షానికి ఎంత బాధ్యత ఉంటుందో, ప్రధాన ప్రతిపక్షంకు అంతకంటే ఎక్కువ బాధ్యత ఉంటుంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో తెలుగుదేశానికి ప్రతిపక్షంగా చట్టసభల్లో మాట్లాడేందుకు ఎంతో సమయం లభించింది. సభలో ప్రధాన ప్రతిపక్షం లేకుండా చర్చలు జరిగితే వాటిని అర్థమవంతమైనవని అంటారా? ప్రధాన ప్రతిపక్షంగా ప్రశ్నించే వాటికి ధీటుగా సమాధానం చెప్పగలిగితేనే కూటమి ప్రభుత్వ పాలనా సామర్థ్యం ప్రజలకు తెలుస్తుంది. ఇటువంటి సంప్రదాయాలకు తిలోదకాలు ఇస్తూ, అసలు ప్రధాన ప్రతిపక్ష గుర్తింపే లేకుండా, ప్రశ్నించేవారే లేకుండా ఏకపక్షంగా పాలనను సాగించాలని అనుకోవడం నిరంకుశత్వం అవుతుంది. సంఖ్యాబలం రీత్యా మాకే ప్రధాన ప్రతిపక్ష గుర్తింపు వస్తుందంటే, జనసేన పార్టీ కూటమి ప్రభుత్వం నుంచి బయటకు వచ్చి ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించాలి.

TVK Vijay And Prashant Kishor step out together In Tamil Nadu3
#GETOUT: తమిళనాట పొలిటికల్‌ హీట్‌.. విజయ్‌, పీకే ప్లానేంటి?

చెన్నై: తమిళనాడులో రాజకీయం ఆసక్తికరంగా మారింది. నేడు సినీ నటుడు విజయ్‌ స్థాపించిన తమిళగ వెట్రి కళగం(టీవీకే) పార్టీ మొదటి ఆవిర్భావ దినోత్సవం. ఈ నేపథ్యంలో చెన్నైలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు పార్టీ చీఫ్‌ విజయ్‌. ఈ కార్యక్రమానికి రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ హాజరవుతున్నారు. దీంతో, తమిళ పాలిటిక్స్‌ రసవత్తరంగా మారింది.కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే తమిళగ వెట్రి కళగం(టీవీకే) పార్టీని స్థాపించి ముందుకు సాగుతున్నారు. నేడు పార్టీ మొదటి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబోతున్నారు. చెన్నైలోని మామల్లపురంలో భారీ సభ నిర్వహిస్తున్నారు. ఈ సభకు దాదాపు మూడు వేల మంది ముఖ్య నేతలు, కార్యకర్తలు హాజరుకానున్నారు. ఈ క్రమంలో పాస్‌లను సైతం అందించారు. ఇక తమిళనాడులో వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇతర పార్టీలతో పొత్తులపై, ప్రచార యాత్రలపై విజయ్ కీలకమైన ప్రకటన చేస్తారని సమాచారం. పార్టీ అధ్యక్షుడు నటుడు విజయ్ సహా రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌తో పాటు టీవీకే ఇతర ముఖ్య నేతలు ఈ సభకు హాజరుకానున్నారు. దీంతో, వేదికపై నుంచి కీలక ప్రకటనలు వెలువడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.தமிழக மக்களின் தலையெழுத்தை மாற்றப்போகும் கையெழுத்து ❤️#Getout #TVKForTN pic.twitter.com/3yAUgiQqZ7— Mʀ.Exᴘɪʀʏ (@Jana_Naayagan) February 26, 2025హాట్‌ టాపిక్‌ బ్యానర్‌..మరోవైపు.. టీవీకే పార్టీ ఆవిర్భావ వేడుక సందర్భంగా ఏర్పాటు చేసిన బ్యానర్లు అందరి దృష్టిని ఆకర్షించాయి. అందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మొత్తం 6 అంశాలను ప్రస్తావించారు. ఇలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను విమర్శిస్తూ #GETOUT అనే హ్యాష్‌ ట్యాగ్‌ను చేర్చారు. ఈ బ్యానర్‌పై విజయ్‌ సంతకం కూడా చేశారు. అందులో మహిళల భద్రత, సంక్షేమానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఘటనలను ప్రస్తావిస్తూ ప్రభుత్వాలు చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నాయని పేర్కొన్నారు. ఇక నియంతృత్వ పాలనను సాగిస్తూ ప్రజా గొంతులను అణిచివేయడం, ఓటు బ్యాంకుల కోసం కులమతాల పేరుతో ప్రజలను విడగొట్టడాన్ని కూడా ఈ పోస్టర్‌లో పేర్కొన్నారు. పాలన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఆర్భాటాలు చేస్తున్నారని ఆరోపించారు. నూతన విద్యా విధానం, త్రిభాషా సూత్రానికి వ్యతిరేకంగా పోరాడటానికి ప్రతిజ్ఞ చేద్దామని కూడా ఆ పోస్టర్‌లో ఉంది.அமைதியான அரசியலை உருவாக்கும் அமைதியான தலைவன்!#GetOut #vijay #tvk pic.twitter.com/AZQXVGVZZB— தமிழச்சி TVK (@tvkvijay_4tn) February 26, 2025 என் நெஞ்சில் குடி இறுக்கும்.... 🔥🥹#TVKForTN #TVKVijay @TVKVijayHQ #தமிழகவெற்றிக்கழகம்#இரண்டாம்_ஆண்டில்_தவெக#Getout pic.twitter.com/mFysxwb0IL— MASTER_JD_❤️‍🔥 (@badlucksarath12) February 26, 2025

CM Revanth Reddy comments on the death of Tollywood producer Kedar Selagamsetty4
నిర్మాత కేదార్‌ మరణంపై సీఎం రేవంత్‌ సంచలన వ్యాఖ్యలు

సాక్షి,ఢిల్లీ : టాలీవుడ్‌ నిర్మాత కేదార్‌ సెలగంశెట్టి (Kedar Selagamsetty) మరణంపై సీఎం రేవంత్‌రెడ్డి (cm revanth reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. దుబాయ్‌లో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ బిజినెస్ పార్ట్‌నర్ ఫ్రెండ్ కేదార్ చనిపోవడం వెనక మిస్టరీ ఏమిటి? అంటూ ఆయన ప్రశ్నించారు. కేటీఆర్ దానిపైన ఎందుకు విచారణ కోరడం లేదు? రాడిసన్ కేసులో కేదార్ నిందితుడుగా ఉన్నారని రేవంత్‌ అన్నారు.‘‘కేసులతో సంబంధం ఉన్నవారు వరుసగా చనిపోవడం వెనుక ఉన్న మిస్టరీ ఏమిటి? ముందు సంజీవరెడ్డి, తర్వాత రాజలింగం, ఇప్పుడు కేదార్.. వారి మరణాల వెనకాల మిస్టరీ ఉంది. దీనిపైన కేటీఆర్ ఎందుకు విచారణ కోరలేదు ఫిర్యాదులు వస్తే దర్యాప్తు చేస్తాం’’ అని రేవంత్‌ చెప్పారు.ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీతో ఆయ‌న అధికారిక నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి బుధ‌వారం ఉద‌యం స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్రానికి సంబంధించిన ప‌లు అంశాల‌ను ముఖ్య‌మంత్రి .. ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం జరిగిన మీడియా చిట్‌చాట్‌లో రేవంత్‌ మాట్లాడారు.ప్రధాని మోదీతో సీఎం రేవంత్‌ చర్చప్రధాని మోదీతో ఐదు అంశాలపై చర్చించినట్లు సీఎం రేవంత్‌రెడ్డి మీడియాతో జరిపిన చిట్‌చాట్‌లో తెలిపారు. ప్రధానంగా హైదరాబాద్ మెట్రో రైల్ పేజ్ 2 విస్తరణ, దక్షిణభాగానికి రీజినల్ రింగ్ రోడ్డు అనుమతి, రీజినల్ రింగ్ రైల్వే ఏర్పాటు, మూసి పునరుజ్జీవన ప్రాజెక్టుకు ఆర్ధిక సహాయం, మూసి గోదావరి లింకు కోసం ఆర్థిక సహాయం, రాష్ట్రంలో పెరిగిన ప‌ట్ట‌ణాలు, ఇత‌ర అవ‌స‌రాల దృష్ట్యా తెలంగాణ‌కు అద‌నంగా 29 ఐపీఎస్ పోస్టులు మంజూరు చేయాల‌ని పీఎం మోదీని కోరినట్లు చెప్పారు. ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై ప్రధాని మోదీ ఆరాఇక శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (slbc) సొరంగ మార్గంలో ప్రమాదంపై ప్రధాని మోదీ ఆరా తీశారు. సొరంగంలో గల్లంతైన ఎనిమిది మందిని కాపాడే చర్యలు గురించి ఆరా తీసినట్లు రేవంత్‌ చిట్‌చాట్‌లో చెప్పారు. 11 శాఖలు సమన్వయంతో రెస్క్ ఆపరేషన్స్ చేస్తున్నామని, సొరంగంలో గల్లంతైన ఎనిమిది మందిని కాపాడే చర్యలు కొనసాగిస్తూనే.. ప్రమాదానికి కారణాలేంటి, దీని నుంచి ఎలా బయటపడాలనే కోణంలో ప్రభుత్వం ముమ్మర కసరత్తు చేస్తోందని బదులిచ్చామన్నారు.

Terrorist Attack On Army Vehicle In Rajouri District5
Jammu and Kashmir: ఆర్మీ వాహనంపై ఉగ్రవాదుల కాల్పులు

జమ్మూ: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల కాల్పుల కలకలం సృష్టిస్తున్నాయి. పెట్రోలింగ్‌ చేస్తున్న ఆర్మీ జవాన్ల వాహనంపై ఉగ్రవాదులు నాలుగు రౌండ్లు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.బుధవారం జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీ జిల్లా సుందర్‌ మానీ బల్లా రోడ్డు, ఫాల్‌ గ్రామం సమీపంలో మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో పెట్రోలింగ్‌ చేస్తున్న ఆర్మీ జవాన్ల వాహనంపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని డిఫెన్స్‌ అధికార ప్రతినిథి తెలిపారు.ఉగ్రవాదుల కాల్పులపై సమాచారం అందుకున్న వెంటనే ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నామని డిఫెన్స్‌ అధికార ప్రతినిథి వెల్లడించారు. అనంతరం, ఉగ్రవాదుల ఏరివేతకు సెర్చ్‌ ఆపరేషన్‌ను మొదలు పెట్టినట్లు చెప్పారు. ప్రస్తుతం, ఉగ్రవాదుల కోసం సుందర్‌ బానీ ఏరియా మొత్తాన్ని ఆర్మీ జవాన్లు జల్లెడ పడుతున్నారు.

Vidarbha Batter Danish Malewar Scored Hundred In Ranji Trophy Final Against Kerala6
రంజీ ఫైనల్లో శతక్కొట్టిన యువ కెరటం​

రంజీ ట్రోఫీ 2024-25 (Ranji Trophy) ఎడిషన్‌ ఫైనల్‌ (Ranji Final) మ్యాచ్‌ ఇవాళ (ఫిబ్రవరి 26) మొదలైంది. గతేడాది రన్నరప్‌ విదర్భ (Vidarbha).. తొలిసారి ఫైనల్‌కు చేరిన కేరళతో (Kerala) తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో కేరళ టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. తొలుత బౌలింగ్‌ చేసిన కేరళకు ఆదిలోనే ఫలితం లభించింది. ఆ జట్టు బౌలర్‌ నిధీశ్‌ మ్యాచ్‌ రెండో బంతికే విదర్భ ఓపెనర్‌ పార్థ్‌ రేఖడేను (0) ఔట్‌ చేశాడు. అనంతరం నిధీశ్‌ ఏడో ఓవర్‌లో మరో వికెట్‌ తీశాడు. 11 పరుగుల స్కోర్‌ వద్ద నిధీశ్‌ దర్శన్‌ నల్కండేను (1) పెవిలియన్‌కు పంపాడు. మరికొద్ది సేపటికే విదర్భ మూడో వికెట్‌ కోల్పోయింది. ఈసారి ఏడెన్‌ యాపిల్‌ టామ్‌ కేరళకు సక్సెస్‌ అందించాడు. టామ్‌.. విదర్భ స్టార్‌ బ్యాటర్‌ ధృవ్‌ షోరేను (16) ఔట్‌ చేశాడు. ఫలితంగా విదర్భ 24 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.Danish Malewar in his last 13 innings 👏61, 46, 42, 59, 115, 17, 13, 3, 75, 0, 79, 29, 104*(still batting)#RanjiTrophy2025pic.twitter.com/HmdjKiXaOm— CricTracker (@Cricketracker) February 26, 2025సెంచరీతో కదంతొక్కిన దనిశ్‌ మలేవార్‌ఈ దశలో 21 ఏళ్ల దనిశ్‌ మలేవార్‌ (Danish Malewar) సెంచరీతో కదంతొక్కి విదర్భను మళ్లీ మ్యాచ్‌లోకి తీసుకొచ్చాడు. దనిశ్‌ 168 బంతుల్లో సెంచరీ పూర్తి చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. దనిశ్‌ తన సెంచరీ మార్కును సిక్సర్‌, బౌండరీతో అందుకున్నాడు. దనిశ్‌కు స్టార్‌ ఆటగాడు కరుణ్‌ నాయర్‌ (Karun Nair) సహకారం అందిస్తున్నాడు. కరుణ్‌ సైతం అర్ద సెంచరీని పూర్తి చేసుకున్నాడు. దనిశ్‌, కరుణ్‌ నాలుగో వికెట్‌కు అజేయంగా 158 పరుగులు జోడించారు. 63 ఓవర్లు ముగిసే సరికి విదర్భ స్కోర్‌ 183/3గా ఉంది. దనిశ్‌ 116.. కరుణ్‌ 51 పరుగులతో ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నారు.భీకర ఫామ్‌లో దనిశ్‌దనిశ్‌ ప్రస్తుత రంజీ సీజన్‌లో భీకర ఫామ్‌లో ఉన్నాడు. ఈ సీజన్‌లో దనిశ్‌ 13 ఇన్నింగ్స్‌ల్లో రెండు సెంచరీలు, నాలుగు హాఫ్‌ సెంచరీల సాయంతో 600 పైచిలుకు పరుగులు చేశాడు. ఫైనల్లో సెంచరీతో మెరిసిన దనిశ్‌.. క్వార్టర్‌ ఫైనల్‌, సెమీస్‌లో అర్ద సెంచరీలతో రాణించాడు. దనిశ్‌ ఇదే సీజన్‌తో ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆంధ్రతో జరిగిన అరంగ్రేటం మ్యాచ్‌లోనే అర్ద సెంచరీతో ఆకట్టుకున్నాడు. అనంతరం వరుసగా 46, 42, 59, 115, 17, 13, 3, 75, 0, 79, 29, 118* పరుగులు స్కోర్‌ చేశాడు.

KSR Comment On 2025 AP Budget Session Governor Speech7
మొత్తానికి ‘సూపర్ సిక్స్ వేస్ట్’ అని గవర్నర్‌తో చెప్పించారే!

ఏ రాష్ట్రంలోనైనా అధికారంలో ఉన్న పార్టీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఇచ్చే గవర్నర్‌ ప్రసంగంలో ఎన్నికల హామీల అమలు, ప్రగతి తదితర అంశాలకు ప్రాధాన్యత ఇస్తుంది. కానీ.. తెలుగుదేశం పార్టీ మాత్రం దీనికి భిన్నం. ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో ఎన్నికల ప్రణాళిక, హామీల ఊసే లేకుండా గవర్నర్‌ ప్రసంగాన్ని(Governor Speech) ముగించేసింది. ఏమిటి దీనర్థం? వాగ్ధానాలను అమలు చేయలేకపోవడాన్ని కప్పిపుచ్చుకునేందుకు చేసిన ప్రయత్నమే అని స్పష్టంగా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్(Syed Abdul Nazeer) ప్రసంగం మొత్తాన్ని తరచి చూసినా సూపర్‌ సిక్స్‌ గురించి ప్రస్తావించిన విషయం పెద్దగా కనపడదు. ఎన్నికల ప్రచారంలో ఈ ఆరు హామీలపైనే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి రాష్ట్రమంతా ఊదరగొట్టిన విషయం తెలిసిందే. ఎలాగోలా అధికారంలోకి వచ్చిన తరువాత మాత్రం చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ , లోకేష్‌లు ఈ హామీల ఎగవేతకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. హామీల అమలుకు బదులు ప్రతిపక్షాలపై ప్రతీకారం తీర్చుకోవడంపైనే పాలకపక్షం దృష్టి కేంద్రీకరిస్తున్నట్లు ఇటీవలి పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. వైఎస్సార్‌సీపీ కార్యకర్తల, నేతల ఆస్తుల విధ్వంసం, రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలుతో రాష్ట్రం ఇప్పటికే అరాచక పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. గవర్నర్‌ ప్రసంగంలో గత ప్రభుత్వంపై విమర్శలు!. జగన్‌ అధికారంలో ఉండగా ప్రశంసించిన మంత్రివర్గాన్నే ఇప్పుడు గవర్నర్‌ విమర్శించాల్సిన పరిస్థితి. ప్రసంగాన్ని గవర్నర్‌ స్వయంగా కాకుండా.. పాలకపక్షం తయారు చేసి ఆయన చేత చదివిస్తుంది మరి! భారత రాజ్యాంగంలోని ఒకానొక వైరుద్ధ్యమిది. 👉గత ఎన్నికల ప్రచారంలో టీడీపీ టాప్ 25 హామీలు అంటూ ప్రత్యేక పత్రాలను విడుదల చేసింది. మెగా డీఎస్సీపై తొలి సంతకం అన్నారు. సంతకమైతే పెట్టారు కానీ.. గడువులోగా అమలు చేయలేదు. గవర్నర్‌ ప్రసంగంలో దీని గురించి స్పష్టత ఏమీ ఇవ్వలేదు. వృద్ధాప్య ఫించన్ల మొత్తాన్ని వెయ్యి రూపాయలు పెంచిన విషయాన్ని చెప్పారు. కానీ, లక్షల సంఖ్యలో ఫించన్ల కోతకు కారణమేమిటో వివరించలేదు. అలాగే పద్దెనిమిదేళ్లు నిండిన మహిళలందరికీ రూ.1500, పండుగ కానుకలు, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, యువతకు నెలకు రూ.మూడు వేల నిరుద్యోగ భృతి, తల్లికి వందనం పథకంలో భాగంగా ఇంట్లోని ప్రతి విద్యార్థికి రూ.15 వేలు చొప్పున చెల్లింపు, ప్రతి రైతుకు ఏడాదికి రూ.20 వేలు, వలంటీర్ల గౌరవ వేతనం రూ.పది వేలకు పెంపు, అందరికీ అందుబాటులో ఉచిత ఇసుక, అన్నా క్యాంటీన్లు, మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు, పూర్ టు రిచ్, బీసీలకు ఏభై ఏళ్లకే ఫించన్‌ వర్తింపు, పెళ్లికానుక కింద రూ.లక్ష, పోలవరం, సాగునీటి ప్రాజెక్టుల పూర్తి వంటి అంశాలను ప్రస్తావించారు. వీటిల్లో.. గ్యాస్ సిలిండర్లు పథకం అరకొరగా అమలు అవుతోంది. ఇసుక ఉచితం అనేది ఉత్తుత్తి మాటగానే మిగిలిపోయింది. వీటితోపాటు మిగిలిన హామీల పురోగతి, అమలుకు ఉన్న అడ్డంకులను గవర్నర్‌తో చెప్పించి ఉంటే చంద్రబాబు ప్రభుత్వ నిబద్ధత ప్రజలకు తెలిసేది. కానీ సూపర్ సిక్స్ హామీలను ఇవ్వనట్లు గవర్నర్ ప్రసంగం సాగిందనిపిస్తుంది. జగన్ ప్రభుత్వం ఏటా ఎన్నికల ప్రణాళికలోని అంశాల అమలును గవర్నర్ ప్రసంగం ద్వారా ప్రజలకు నివేదించేది. టీడీపీ ప్రభుత్వం(TDP Government) మాత్రం అలవికాని హామీలను ఇవ్వడమే కాకుండా.. ఆచరణ ప్రశ్నార్థకంగా ఉన్న పలు అంశాలను చెప్పుకుని ప్రజలను మభ్య పెట్టే యత్నం చేస్తోంది. ఉదాహరణకు.. ఒక కుటుంబం-ఒక పారిశ్రామికవేత్త అనే విధానాన్ని ప్రభుత్వం తీసుకువచ్చిందట. కుల వృత్తుల ద్వారా ఆత్మగౌరవం, ఆర్థిక స్ధిరత్వం వస్తుందట. గీత కార్మికులకు పదిశాతం మద్యం షాపులను కేటాయించడం ప్రభుత్వ ప్రగతి అట. ఐటీ నుంచి కృత్రిమ మేధ వరకు టెక్నాలజీ వినియోగంలో ఏపీ కొత్త పుంతలు తొక్కుతోందని, విప్లవానికి నాయకత్వం వహిస్తోందని చెబితే జనం చెవిలో పూలు పెడుతున్నట్లు అనిపించదా!. 👉యథా ప్రకారం స్వర్ణాంధ్ర -2047 సాధనకు పది సూత్రాలను రూపొందించి ముందుకు వెళుతున్నారని తెలిపారు. విశేషం ఏమిటంటే ఆ పది సూత్రాలు తమకే అర్థం కాలేదని తెలుగుదేశం మీడియా అంటోంది. ఆరున్నర లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు, నాలుగు లక్షల ఉద్యోగాలు వచ్చేశాయన్నట్లుగా గవర్నర్‌తో చెప్పిస్తే ఏమి ప్రయోజనం?. అది నిజమో ,కాదో ప్రజలకు తెలియదా? తాము ఉద్యోగాలు ఇచ్చేసినట్లు చెప్పలేదని, అవకాశాలు కల్పించామని అన్నామని మంత్రి లోకేష్ శాసనమండలిలో కొత్త భాష్యం చెప్పారు. కానీ వారి పత్రిక ఈనాడులో పెట్టుబడులు, ఉద్యోగాలు వచ్చేసినట్లే రాశారు. వారికి కూడా తెలుగు అర్థం కాలేదా!. కేంద్ర పధకాలను పునరుద్దరించారట. తొమ్మిదివేల కోట్ల అప్పు తీర్చారట. విశేషం ఏమిటంటే గత జగన్ ప్రభుత్వ టైమ్ లోనే కేంద్రం ఆయా స్కీముల కింద నిధులు ఎక్కువ ఇచ్చిందని ఆర్థిక శాఖ అధికారులు చంద్రబాబు(Chandrababu)కు కొద్ది రోజుల క్రితం వివరించారు. అయినా గవర్నర్ మాత్రం ఇలా చెబుతున్నారు. 👉ఇక రోడ్లు, ఇతర పనుల బిల్లులు రూ.పది వేల కోట్లు చెల్లించామని అంటున్నారు. మంచిదే. కాని దీనివల్ల ఆర్థిక కార్యకలాపాలు పుంజుకున్నాయని అనడమే ఒకింత ఆశ్చర్యం!!. ఒక పక్క జనం వద్ద డబ్బులు లేక కొనుగోలు శక్తి ఆశించిన స్థాయిలో లేక, జీఎస్టీ తగ్గిందని నివేదికలు చెబుతున్నాయి. మరోపక్క గవర్నర్ మాత్రం ఇలా చెబుతున్నారు. గూగుల్, మిట్టల్, టాటా పవర్, బీపీసీఎల్‌, ,గ్రీన్ కో వంటి దిగ్గజ సంస్థలను ఆకర్షిస్తున్నామని తెలిపారు. వీటిలో బీపీసీఎల్‌, గ్రీన్ కోలు జగన్ ప్రభుత్వ టైమ్‌లోనే ప్రతిపాదనలు పెట్టాయి. గ్రీన్ కో కర్నూలు జిల్లాలో రెన్యుబుల్ ఎనర్జీ రంగంలో ఇప్పటికే భారీగా పెట్టుబడులు పెట్టింది. కూటమి సర్కార్ వీటిని తన ఖాతాలో వేసుకుంటోంది. మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఎప్పటికి వస్తుందో తెలియదు. వలంటీర్లు లక్షన్నర మందిని తొలగించారు. ఇతరత్రా కొన్నివేల మంది ఉద్యోగాలు కోల్పోయారు. మరి నాలుగు లక్షల ఉద్యోగావకాశాలు ఎక్కడ వచ్చాయో ప్రభుత్వం వివరంగా చెబితే బాగుండేది. సూపర్ సిక్స్ హామీలు ఇచ్చి ప్రజలందరిని స్కీమ్‌లు, డబ్బులతో ముంచి లేపుతానని చెప్పిన చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు పాత కొటేషన్ ను అందుకుంది. ఎవరికైనా చేపను ఇస్తే అది అతని ఆకలిని ఒక్క రోజే తీర్చగలదు. అదే కనుక మనిషికి చేపలు పట్టడం నేర్పితే జీవితాంతం తిండి లభిస్తుందనే సూక్తిని చంద్రబాబు అనుసరిస్తున్నారని గవర్నర్ తెలిపారు. అంటే అర్థమైంది కదా? సూపర్ సిక్స్, ఇతర హామీలు వేస్ట్ అని చెప్పడమే ఇది! ఇక మెగా పోర్టులు, అంతర్జాతీయ విమానాశ్రయాలు, మల్టీ మోడల్ రవాణా కేంద్రాలు.. ప్రపంచ మార్కెట్లో అనుబంధంగా కొత్త వాణిజ్య కారిడార్లు.. ఇలా ఏవేవో చెప్పి ప్రజలను మభ్య పెట్టేయత్నం సాగించారు. రోడ్లను బాగు చేసేసినట్లు, కొత్త రోడ్లు వేయబోతున్నట్లు తెలిపారు. విద్యుత్ ఛార్జీలను ఇప్పటికే రూ.15వేల కోట్ల మేర బాదిన ప్రభుత్వం ఇప్పుడు పెంచడం లేదని చెప్పుకుంటోంది. తల్లికి వందనం త్వరలో అమలు చేస్తామని చెప్పారు. కాని ఈ ఏడాది ఎందుకు ఇవ్వలేదో వెల్లడించలేదు. అన్నా క్యాంటిన్లు హామీ అమలు నిజమే కాని, దానితోనే పేదరికం పోయేటట్లయితే, పేదల ఆకలి తీరేటట్లయితే వాటినే రాష్ట్రం అంతటా వీధి, వీధిన పెడితే సరిపోతుంది కదా? మరి ఇది చేపల వల అవుతుందా? లేక చేపలు ఇచ్చినట్లు అవుతుందో వివరిస్తే బాగుంటుంది. మొత్తం మీద గవర్నర్ స్పీచ్‌లో ఏదో జరిగిపోతోందన్న పిక్చర్ ఇవ్వడానికి చేసిన ప్రయత్నంలో తెలియకుండానే సూపర్ సిక్స్ హామీలు మోసపూరితమైనవని, ప్రజలను సోమరిపోతులను చేసేవి అని చెప్పకనే చెప్పినట్లయ్యింది. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

 I wearing mangalsutra, bangles says American shares how she responded to Indian womans question8
మంగళసూత్రం, మెట్టెలు అందుకే.... అమెరికన్‌ మహిళ వీడియో వైరల్‌

సాంప్రదాయ భారతీయ వివాహాలలో వివాహిత మహిళలను మంగళసూత్రం, నుదుటిన బొట్టు, కాళ్లకు మెట్టెలు విధిగా పాటిస్తారు. మంగళసూత్రం భార్యాభర్తల మధ్య ప్రేమకు ప్రతీక అని. స్త్రీ మంగళసూత్రాన్ని ధరించినప్పుడు, వైవాహిక జీవితాన్ని అన్ని కష్టాల నుండి కాపాడుతుందని చెబుతారు. మహిళలు కూడా అది తమకు శుభప్రదంగా, మంగళకరంగా ఉంటుందని భావిస్తారు తాజాగా అమెరికాకు చెందిన ఒక మహిళ మంగళసూత్రాలు, మెట్టెలు, పట్టీలు బొట్టు ధరించడం విశేషంగా నిలిచింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది అంతేకాదు భారతదేశంలో వివాహిత హిందూ మహిళలు ధరించే మంగళసూత్రం లేదా కుంకుమ, ఎందుకు ధరిస్తారనే ప్రశ్నలకు కౌంటర్‌ కూడా ఇచ్చింది.గోవాకు చెందిన వ్యక్తిని వివాహం చేసుకుంది అమెరికాకుచెందిన జెస్సికా. సూపర్ మార్కెట్ నుంచి బైటికి వస్తున్నప్పుడు ఆమె మెడలో మంగళసూత్రం, మెట్టెలు, పట్టీలు పెట్టుకొని, భారతీయ సంప్రదాయాలను స్వీకరించడం గురించి ఒక అమెరికన్ మహిళ సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్ అయ్యింది. అమెరికాలో ఉంటూ కూడా ఇవన్నీ ధరించడం చర్చకు దారితీసింది. ఇలా ఎందుకు ధరిస్తావని అమెరికాలోని ఇండియన్స్‌ తనని విచిత్రమైన ప్రశ్నలు అడుగుతారని చెప్పుకొచ్చింది. ‘నేను ఒక భారతీయడ్ని పెళ్లి చేసుకున్నా. వివాహిత హిందూ మహిళ ఈ వస్తువులను ధరించడం కామనే కదా.. అని చెప్పాను. ఇలా చెప్పడం కరెక్టే కదా. నేను సరిగ్గానే స​మాధానం చెప్పానా?’ కామెంట్‌ చేయాలంటూ నెటిజనులను కోరింది.చదవండి: వింగ్‌డ్‌ బీన్స్‌..పోషకాలు పుష్కలం : ఒకసారి పాకిందంటే!ఒక్క ర​‍క్త పరీక్ష : రానున్న పదేళ్లలో మన మరణం గుట్టు! కొత్త పరిశోధన నెటిజన్లు ఏమన్నారంటేఆచారాలను పాటిస్తూ, భర్త సంస్కృతిని గౌరవించినందుకు చాలామంది జెస్సికాను ప్రశంసించారు. మరికొందరు తమ అనుభవాలను పంచుకున్నారు. పంజాబీ సిక్కుని పెళ్లి చేసుకొని 39 ఏళ్లు. అయినా ఇప్పటికే ప్రశ్నలు ఎదురైతాయి. అయినా వాటిని ధరించడం ఇష్టం.. అందుకే వేసుకుంటాను.. సత్ శ్రీ అకల్ అని చెప్పి వెళ్ళిపోతాను అని ఒకరు వ్యాఖ్యానించగా, పెళ్లై 23 ఏళ్లు..అయినా సరే భారతీయ ఆహారం ఇష్టమా? దానిని ఎలా వండాలో తెలుసా? అని అడుగుతారు.. వచ్చు అని చెబితే తెగ ఆశ్చర్య పోతారు అంటూ ఒకింత అసహనం వ్యక్తం చేసింది మరో మహిళ. ‘‘ఎయిర్‌పోర్టుల్లో సెక్యూరిటీ సిబ్బంది కూడా అడుగుతారు.. ఒక భారతీయుడిని వివాహం చేసుకున్నానని వారికి చెబుతాను. అపుడు వారు దాన్ని లైక్‌ చేస్తారు. అలాగే నువ్వు నిజమైన భారతీయ మహిళవి' అన్నపుడు నాకు భలే గర్వంగా అనిపిస్తుంది. జెస్సికా సాంప్రదాయాలను పాటించడాన్ని ప్రేమిస్తున్నాను" అని మరొక యూజర్‌ రాశారు.కాగా ఇన్‌స్టాగ్రామ్‌లో వెర్నేకర్ ఫ్యామిలీ పేరుతో ఉన్న జెస్సికా వెర్నేకర్, భారతీయుడితో తన ప్రేమ, పెళ్లి గురించి కొన్ని రీల్స్‌ ద్వారా పంచుకుంది. స్పోర్ట్స్ బైక్‌పై ప్రయాణం ద్వారా అతణ్ని కలుసుకున్నట్టు గుర్తుచేసుకుంది. ఆ పరిచయం ప్రేమగా నైట్‌క్లబ్‌లకు వెళ్లి కలిసి నృత్యం చేసేవాళ్ళమని, పెళ్లి చేసుకున్నా మని తెలిపింది. తన భర్త అమ్మమ్మతో సహా తన కుటుంబాన్ని మొత్తం ఆకట్టుకున్నాడని చెప్పింది. ప్రస్తుతం జెస్సికా భర్తతో కలిసి అమెరికాలో నివసిస్తోంది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు.https://www.instagram.com/reel/DGdYI6dxmSo/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

slbc Tunnel rescue operation continues On 26 Feb live updates9
SLBC వద్దకు ఆపరేషన్ మార్కోస్ టీమ్‌.. ప్రస్తుత పరిస్థితి ఇలా..

సాక్షి, నాగర్‌కర్నూల్‌: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా నేడు ఆపరేషన్ మార్కోస్ టన్నెల్ రంగంలోకి దిగుతోంది. మరికాసేపట్లో టన్నెల్ వద్దకు ఇండియన్ మెరెయిన్ కమాండో ఫోర్స్ రానుంది.ఈ కమాండ్స్‌ నేల, నీరు, ఆకాశంలో రెస్క్యూ కార్యక్రమాలు చేపడతారు. ఆపరేషన్ మార్కోస్ రంగంలోకి దిగుతున్న నేపథ్యంలో కార్మికులు బయటకు వస్తారని అందరూ ఆశిస్తున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకునేందుకు సొరంగంపై నుంచి కాని, పక్క నుంచి కానీ.. వెళ్లే మార్గాలను కూడా అన్వేషిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. టన్నెల్‌ బురదమయం..ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో చిక్కుకున్న ఎనిమిది మంది కాపాడేందుకు సహాయచర్యలు శరవేగంగా జరుగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, నేవీ, ఆర్మీ, హైడ్రా, ర్యాట్ హోల్‌ మైనర్స్‌ సహా పలు సహాయక బృందాలు వారి వద్దకు వెళ్లేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటి వరకు సహాయక బృందాలు 13.5 కిలోమీటర్ల వరకు మాత్రమే చేరుకున్నాయి. అక్కడ.. ధ్వంసమైన టీబీఎం పరికరాలు ఉండటంతో సహాయకచర్యలకు ఆటంకం కలుగుతోంది. మరోవైపు.. 11.5 కి.మీ నుంచి ఎయిర్‌ సప్లయ్‌ పైప్‌లైన్‌ వ్యవస్థ ధ్వంసమైంది. జీఎస్‌ఐ, ఎన్‌జీఆర్‌ఐ నిపుణులు బురద పరిస్థితిపై అంచనా వేస్తున్నారు.ప్రస్తుతం టన్నెల్‌లో 200 మీటర్ల వరకు 15 అడుగుల ఎత్తులో బురద పేరుకుపోయింది. గంటకు 3600 నుంచి 5000 లీటర్ల ఊట వస్తోంది. సొరంగ మార్గంలో 10వేల క్యూబిక్‌ మీటర్ల బురద ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం కన్వేయర్‌ బెల్ట్‌కు సిబ్బంది మరమ్మతులు చేస్తున్నారు. కన్వేయర్‌ బెల్ట్‌తో గంటకు 800 టన్నుల బురద బయటకు తోడే అవకాశముందని చెబుతున్నారు.ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో పైకప్పు కూలిన ప్రాంతం భయంకరమైన ఊబిలా మారింది. పైకప్పు కూలినచోట 70% బురద, 30% నీళ్లు ఉండటంతో అక్కడ అడుగు వేయడానికి వీలులేకుండా ఉందని నిర్ధారించారు. ముఖ్యంగా 13.85 కిలోమీటర్ల పొడవైన సొరంగంలో చివరి 40 మీటర్లు సహాయ చర్యలకు సవాల్‌గా మారినట్లు తెలుస్తోంది. కూలిపోయే ప్రమాదం.. అక్కడి పరిస్థితిని రెస్క్యూ టీం సభ్యులు వీడియో తీశారు. ‘ఇక్కడ చాలా ప్రమాదకరంగా ఉంది.. పైకప్పునకు క్రాక్‌ వచ్చింది. కూలిపోయే ప్రమాదం ఉంది. ఇక్కడి నుంచి వెంటనే వెనక్కి వెళ్దాం పదండి..’ అంటూ రెస్క్యూ టీం సభ్యులు వీడియోలో మాట్లాడారు. మంగళవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఈ బృందం తిరిగి బయటకు వచ్చింది. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు సొరంగంలోకి వెళ్లిన ఐదో రెస్క్యూ బృందం ప్రమాద స్థలానికి 40 మీటర్ల సమీపం వరకే వెళ్లగలిగింది.

Mazaka Movie Review And Rating In Telugu10
Mazaka Review: ‘మజాకా’ మూవీ రివ్యూ

టైటిల్‌: మజాకానటీనటులు: సందీప్‌ కిషన్‌, రావు రమేశ్‌, రీతూవర్మ, అన్షు, మురళీ శర్మ తదితరులునిర్మాణ సంస్థ: ఎకె ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్ బ్యానర్స్నిర్మాత: రాజేశ్‌ దండకథ, స్క్రీన్ ప్లే, మాటలు: ప్రసన్న కుమార్ బెజవాడదర్శకత్వం: త్రినాథరావు నక్కినసంగీతం: లియోన్‌ జేమ్స్‌సినిమాటోగ్రఫీ: నిజార్‌ షఫీవిడుదల తేది: ఫిబ్రవరి 26, 2025యంగ్‌ హీరో సందీప్‌ కిషన్‌కి ఈ మధ్య సరైన హిట్టే పడలేదు. వరుస సినిమాలు చేస్తున్నప్పటికీ.. బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అనే పదానికే దూరమయ్యాడు. అందుకే ఈ సారికి ఎలాగైన హిట్‌ కొట్టాలని ‘ధమాకా’ డైరెక్టర్‌ త్రినాథరావు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ‘మజాకా’(Mazaka Review)తో సందీప్‌ హిట్‌ ట్రాక్‌ ఎక్కడా? సినిమా ఎలా ఉంది? రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. వెంకటరమణ అలియాస్‌ రమణ(రావు రమేశ్‌) ఓ ప్రైవేట్‌ ఉద్యోగి. అతని కొడుకు కృష్ణ(సందీప్‌ కిషన్‌) ఇంజనీరింగ్‌ చదివి ఉద్యోగం కోసం వెతుకుతుంటాడు. రమణ మాత్రం ఇంట్లో ఆడదిక్కు లేదని.. కొడుక్కి త్వరగా పెళ్లి చేసి ఓ ఫ్యామిలీ ఫోటోని ఇంట్లో పెట్టుకోవాలని ఆశ పడుతుంటాడు. కానీ..ఆడదిక్కు లేని ఇంటికి పిల్లని ఇచ్చేందుకు ఎవ్వరూ ముందుకు రారు. దీంతో పెళ్లిళ్ల బ్రోకర్‌ ఇచ్చిన సలహాతో ముందుగా తానే పెళ్లి చేసుకొని..ఆ తర్వాత కొడుక్కి పిల్లని వెతుకుదామని ఫిక్స్‌ అవుతాడు. అదే సమయంలో బస్‌స్టాఫ్‌లో యశోద(అన్షు)ని చూసి ఇష్టపడతాడు. మరోవైపు కృష్ణ కూడా మీరా(రీతూవర్మ)తో ప్రేమలో పడతారు. ఇలా తండ్రికొడుకులిద్దరు ఒకరికి తెలియకుండా ఒకరు ఒకేసారి ప్రేమలో పడిపోతారు. వీరిద్దరి ప్రేమలో ఎలాంటి మలుపులు చోటు చేసుకున్నాయి? ఇంజనీరింగ్‌ చదివే కొడుకు ఉన్న రమణ ప్రేమను యశోద ఎలా ఒప్పుకుంది? పగతో రగిలిపోయే వ్యాపారవేత్త భార్గవ్‌ వర్మ(మురళీ శర్మ)తో వీరిద్దరికి ఉన్న సంబంధం ఏంటి? చివరకు తండ్రికొడుకుల ఆశపడినట్లు ఇంట్లోకి ఫ్యామిలీ ఫోటో వచ్చిందా రాలేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే..కొన్ని సినిమాలకి కథే సరిగా ఉండదు కానీ కామెడీ సీన్లతో పాసైపోతుంది. పాటలు, కామెడీ వర్కౌట్‌ అయితే వంద కోట్లు కలెక్షన్స్‌ని కూడా రాబడతాయి. త్రినాథరావు, ప్రసన్న కుమార్‌ కాంబినేషన్‌ దీన్నే నమ్ముకుంది. రొటీన్‌ కథకి బలమైన కామెడీ సన్నివేశాలను రాసుకొని ఫుల్‌ ఎంటర్‌టైనింగ్‌గా సినిమాను తీర్చిదిద్దుతారు. ‘ధమాకా’ వరకు వీరిద్దరి మ్యాజిక్‌ వర్కౌట్‌ అయింది. కానీ ‘మజాకా’ విషయంలో కాస్త బెడిసి కొట్టిందనే చెప్పాలి. కథే రొటీన్‌ అంటే స్క్రీన్‌ప్లే అంతకన్న రొటీన్‌గా ఉంటుంది. ఇక్కడో కామెడీ సీన్‌.. అక్కడో పాట..మధ్యలో ఎమోషనల్‌ సన్నివేశం..ఇలా సెట్‌ చేస్తే సరిపోతుంది సినిమా ఆడేస్తుంది అనుకున్నారేమో.వాస్తవానికి ఈ కథ లైన్‌ చాలా బాగుంది. కొడుకు పుట్టగానే భార్య చనిపోతే..మళ్లీ పెళ్లి చేసుకోకుండా, కొడుకు కోసం అలానే ఉండిపోయిన తండ్రి.. చివరకు కొడుకు పెళ్లి కోసమే..మళ్లీ పెళ్లి చేసుకోవాలనుకోవడం. ఫ్యామిలీ ఫోటో కోసం ఆశపడడం.. మంచి ఎమోషనల్‌ ఉన్న పాయింట్‌ ఇది. కామెడీ వేలో ఈ కథను చెప్పాలనుకోవడం మంచి ఆలోచననే. కానీ కామెడీ కోసం రాసుకున్న సీన్ల విషయంలోనే జాగ్రత్తపడాల్సింది. కథలో కామెడీ సన్నివేశాలను ఇరికించినట్లుగా అనిపిస్తుందే కానీ సిట్యువేషనల్‌కి తగ్గట్లుగా వచ్చినట్లు అనిపించదు.తండ్రి కొడుకులిద్దరు కలిసి ప్రేమ లేఖలు రాయడం.. ప్రేమించిన అమ్మాయి కోసం గోడలు దూకడం..‘ఖుషీ’ సీన్‌ రిపీట్‌.. ఇవన్నీ కొంతమందిని ఫుల్‌గా నవ్విస్తే..మరికొంతమందికి అతిగా అనిపిస్తాయి. ఫస్టాప్‌ వరకు కథ రొటీన్‌గానే సాగుతుంది. ఇంటర్వెల్‌ ట్విస్ట్‌ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ఇక సెకండాఫ్‌లో ప్రారంభంలో వచ్చే ఓ ట్వీస్ట్‌ ఆకట్టుకుంటుంది కానీ..ఆ తర్వాత కథనం రొటీన్‌గా సాగుతంది. కామెడీతో కూడా అంతగా వర్కౌట్‌ కాలేదు. అనకాపల్లి ఎపిసోడ్‌ అతికించినట్లుగా ఉంటుంది. కథనం ఊహకందేలా సాగుతుంది. క్లైమాక్స్‌లో వచ్చే ఎమోషనల్‌ సీన్లు కొంతవరకు ఆకట్టుకుంటాయి. సినిమా ముగింపు బాగుంటుంది. ఎవరెలా చేశారంటే.. తండ్రికొడుకులుగా రావు రమేశ్‌, సందీప్‌ కిషన్‌ తెరపై హుషారుగా కనిపించారు. ముఖ్యంగా లేటు వయసులో ప్రేమలో పడిన రమణ పాత్రలో రావు రమేశ్‌ ఇరగదీశాడు. యంగ్‌ లుక్‌లో కనిపించడమే కాదు..డ్యాన్స్‌, యాక్షన్‌తో ఆకట్టుకున్నాడు. ఆయనతో వచ్చే ఒకటిరెండు కామెడీ సీన్లు నవ్వులు పూయిస్తాయి. కృష్ణ పాత్రకి సందీప్‌ కిషన్‌ న్యాయం చేశాడు. ఆయన కామెడీ టైమింగ్‌ కూడా సినిమాకి ప్లస్‌ అయింది. రీతూ వర్మ, అన్షులకు బలమైన పాత్రలు లభించాయి. కథ మొత్తం వీరిద్దరి చుట్టూనే తిరుగుతాయి.కానీ నటనకు పెద్దగా స్కోప్‌ లేదు. పగతో రగిలిపోయే భార్గవ్‌ వర్మ పాత్రలో మురళీ శర్మ చక్కగా నటించాడు. హైపర్‌ ఆది కామెడీ జస్ట్‌ ఓకే. శ్రీనివాస్ రెడ్డి, ర‌ఘుబాబుతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు.లియోన్‌ జేమ్స్‌ నేపథ్య సంగీతం బాగుంది. పాటలు బాగున్నప్పటకీ అవి వచ్చే సందర్భమే సరిగా లేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. Rating : 2.75/5

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

International View all
title
ఒక్క ర​‍క్త పరీక్ష : రానున్న పదేళ్లలో మన మరణం గుట్టు! కొత్త పరిశోధన

ఎన్నాళ్లు బతుకుతాం? ఎపుడు చచ్చిపోతాం?  ఎలాంటి జబ్బులొస్తాయి?

title
పౌరసత్వంపై ట్రంప్‌ సంచలన ప్రకటన.. వారందరికీ ‘గోల్డ్‌కార్డు’ వీసా

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నార

title
USA: ఎలాన్‌ మస్క్‌కు బిగ్‌ షాక్‌..

వాషింగ్టన్‌: అగ్రరాజ్యం అమెరికాలో కీలక పరిణామం చోటుచేసుకుంది

title
పుతిన్‌కు అండగా ట్రంప్‌ సంచలన నిర్ణయం.. భారత్‌ వైఖరి ఇదే..

ఐక్యరాజ్యసమితి: బైడెన్‌ సారథ్యంలోని అమెరికా ప్రభుత్వం గత మూడ

title
దక్షిణ కొరియాలో కూలిన ఎలివేటెడ్‌ హైవే

సియోల్‌: దక్షిణ కొరియా రాజధాని సియోల్‌ సమీపంలో నిర్మాణంలో ఉన

NRI View all
title
Hong kong: హాంకాంగ్‌లో ఘనంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం

హాంకాంగ్ తెలుగు సమాఖ్య అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం 2025ని ఘనంగా జరుపుకుంది.

title
తానా ప్రపంచసాహిత్యవేదిక ఆధ్వర్యంలో “నా భాషే నా శ్వాస” సదస్సు విజయవంతం

డాలస్ :  ఉత్తరఅమెరికా తెలుగుసంఘం (తానా) సాహిత్యవిభాగం

title
డా. తాడేపల్లి లోకనాథశర్మ శాస్త్రీయ సంగీతంపై ప్రత్యేక భాషణం

శ్రీ సాంస్కృతిక కళాసారథి సంస్థ ఆధ్వర్యంలో సింగపూర్‌లో తెలుగువారి కోసం, గానకళానిధి కలైమామణి డాక్టర్ తాడేపల్లి లోకనాథశర్మ

title
Canada New Visa Rules : భారతీయ విద్యార్థులు, వర్కర్లకు పీడకల!

వలసదారుల విషయంలో  డొనాల్డ్‌ ట్రంప్‌ నేతృత్వంలోని అమెరికా కఠిన చర్యలు ఆ

title
ఎఫ్‌బీఐ డైరెక్టర్‌ కాశ్‌ పటేల్‌ లవ్‌స్టోరీ : అందంలోనే కాదు టాలెంట్‌లోనూ!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌  ట్రంప్‌ (Donald Trump) తన  మద్దతు ద

Advertisement

వీడియోలు

Advertisement