prepaid
-
జియో రెండు ఆఫర్లు.. ఒకే రూపాయి తేడా!
న్యూఢిల్లీ: ఇప్పుడున్న రోజుల్లో రూపాయికి ఏమొస్తుందని ఎవరినైనా అడిగితే చాక్లెట్ కూడా కష్టమే అని అంటారు. అయితే జియో సంస్థ కేవలం రూపాయికి ఎంతో తేడా చూపింది. మరింత విలువను ఆపాదించింది. వినడానికి వింతగానే ఉన్నా దీని గురించి తెలుసుకుంటే ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. రిలయన్స్ జియో అందిస్తున్న రూ. 448, రూ. 449 ప్రీపెయిడ్ ప్లాన్లను పరిశీలిస్తే రూపాయి విలువెంతో అర్థం అవుతుంది. కేవలం రూపాయి తేడాతో జియో ఎంత మ్యాజిక్ చేసిందో ఇప్పుడు చూద్దాం.రిలయన్స్ జియో తన ప్రీపెయిడ్ కస్టమర్లకు 28 రోజుల వ్యాలిడిటీ కలిగిన రెండు ప్లాన్లను అందిస్తోంది. వీటిలో ఒక ప్లాన్ ధర రూ.448 కాగా, మరొక ప్లాన్ ధర రూ.449. దీనిని వినగానే ఒక్క రూపాయి తేడాతో రెండు ప్లాన్లు ఎందుకని మనకు అనిపిస్తుంది. పైగా చూసేందుకు ఈ రెండు ప్లాన్లు ఒకే విధంగా కనిపిస్తాయి.అయితే ఆ రెండు ప్లాన్ల వివరాలను చూస్తే ఎవరైనా సరే ఆశ్చర్యపోవాల్సిందే. రూ. 448 ప్రీపెయిడ్ ప్లాన్ తీసుకుంటే కంపెనీ 28 రోజుల పాటు అపరిమిత కాలింగ్ సౌకర్యాన్ని అందిస్తుంది. ప్రతిరోజూ 100 ఉచిత ఎస్ఎంఎస్లను అందిస్తుంది. అయితే డేటా విషయానికి వస్తే ఈ ప్లాన్‌లో 56 జీబీ డేటా ఉంటుంది. దీనిలో రోజుకు 2 జీబీ డేటా అందుతుంది. ఈ ప్లాన్‌లో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే జియో సినిమా ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను ఉంటుంది. అలాగే జియో టీవీ యాప్, సోని లివ్, జీ5, లైన్గాటా ప్లే, డిస్కవరీ ప్లస్, సన్ నెక్స్ట్, కన్చా లాంకా, ప్లానెట్ మరాఠీ, చౌపాల్, ఫన్ కోడ్, హోయ్‌చోయ్ మొదలైన వినోద వేదికల్లో సబ్స్క్రిప్షన్ జతచేరుతుంది.ఇక రిలయన్స్ జియో రూ. 449 ప్లాన్ విషయానికొస్తే ఈ ప్లాన్ యొక్క వాలిడిటీ కేవలం 28 రోజులు. అయితే ఇందులో 84 జీబీ డేటా ఉంటుంది. ప్రతిరోజూ 3 జీబీ డేటా అందుతుంది. దీనిలో అపరిమిత కాలింగ్, 100 ఉచిత ఎస్ఎంఎస్ సౌకర్యం కూడా జతచేరుతుంది. అయితే ఈ ప్లాన్‌లో ఎలాంటి సబ్స్క్రిప్షన్ ఉండదు. ఇదంతా తెలుసుకున్నాక ఈ రెండు ప్లాన్ల మధ్య తేడా ఇంత ఉందా అని అనిపిస్తుంది.ప్రతిరోజూ ఎక్కువ డేటా వినియోగం అవసరమయ్యే వారు రూ. 449 ప్లాన్ తీసుకోవచ్చు. దీనిలో ప్రతిరోజూ 3జీబీ డేటా లభిస్తుంది. ఫోనులో ఆటలు ఆడేవారికి ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. అయితే మరింత వినోదాన్ని కోరుకునేవారు రూ. 448 ప్లాన్ తీసుకోవడం ఉత్తమం. ఎందుకంటే దీనిలో వివిధ వినోద మాధ్యమాల సబ్స్క్రిప్షన్ లభిస్తుంది. అయితే రోజుకు 2 జీబీ డేటా మాత్రమే లభిస్తుంది. ఇప్పుడు చెప్పండి... ఒక్క రూపాయిని జియో ఎంత పవర్‌ఫుల్‌గా మార్చిందో.. -
ఎయిర్టెల్ అదిరిపోయే ఆఫర్.. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ను ఉచితంగా చూడొచ్చు!
ప్రముఖ టెలికం దిగ్గజం ఎయిర్టెల్ ఈ ఏడాది డిసెంబర్ నెల చివరి నాటికి దేశం మొత్తం 5జీ సేవల్ని అందించాలని భావిస్తోంది. సంస్థ ప్రణాళికల్లో భాగంగా రాబోయే వారాల్లో దేశంలో 5జీ నెట్వర్క్ అందుబాటులో ఉన్న నగరాల సంఖ్య 300కి చేరుతుంది. ఈ తరుణంలో ఎంపిక చేసిన ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ ప్లాన్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్లాన్స్‌లో యూజర్లు అన్లిమిటెడ్ 5జీ డేటాను పొందవచ్చు. తద్వారా 5జీ నెట్వర్క్ అందుబాటులో ఉన్న నగరాల్లో యూజర్లు నెట్‌వర్క్‌లో ఎలాంటి అవాంతరాలు లేకుండా ఇంటర్నెట్ను వినియోగించుకోవచ్చు. వీటితో పాటు అమెజాన్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ను ఉచితంగా వీక్షించవచ్చు. ఉచితంగా అమెజాన్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ప్లాట్‌ఫామ్స్ ఎయిర్టెల్ రూ. 499 ప్లాన్ : ఈ ప్లాన్‌లో వినియోగదారులు 28 రోజుల వ్యాలిడిటీతో 5జీ అన్ లిమిడెట్ కాలింగ్, అన్లిమిటెడ్ డేటా, రోజుకు 100 ఎస్ఎంఎస్లు పంపుకోవచ్చు. అంతేకాదు 3 నెలల పాటు డిస్నీప్లస్ హాట్‌స్టార్, ఎక్స్ట్రీమ్యాప్స్ బెన్ఫిట్స్, వింక్ సబ్స్క్రిప్షన్ ఇలా అనేక ఆఫర్లు పొందవచ్చు. ఒకవేళ 5జీ లేకపోతే 4జీ యూజర్లు ప్రతిరోజు 3జీబీ డేటాను వినియోగించుకోవచ్చు ఎయిర్టెల్ రూ. 839 ప్లాన్ : 84 రోజుల వ్యాలిడిటీతో 5జీ డేటా, అన్లిమిటెడ్ కాలింగ్, 100 ఎస్ఎంస్ఎస్లు పంపుకోవచ్చు. 3నెలల పాటు డిస్నీప్లస్‌హాట్ స్టార్, ఎక్స్ట్రీమ్ యాప్ బెన్ఫిట్స్, రివార్డ్స్ మినీ సబ్స్క్రిప్షన్, వింక్ సబ్‌స్క్రిప్షన్‌ను సొంతం చేసుకోవచ్చుకోవచ్చు. 4జీ యూజర్లు రోజుకు 2జీబీ డేటాను వినియోగించుకునే సౌకర్యం కల్పిస్తుంది ఎయిర్టెల్ సంస్థ. ఎయిర్టెల్ రూ.699 ప్లాన్ : ఈ సరికొత్త ప్లాన్‌లో ఎయిర్టెల్ అన్ లిమిటెడ్ 5జీ డేటా, 100 ఎస్ఎంఎస్లను 56 రోజుల పాటు వినియోగించుకోవచ్చు. వీటితో పాటు డిస్నీప్లస్‌హాట్ స్టార్, అమెజాన్ ప్రైమ్ బెన్ఫిట్స్ పొందవచ్చు. 4జీ యూజర్లు ప్రతి రోజు 3జీబీ డేటా పొందవచ్చు. ఎయిర్టెల్ రూ.999ప్లాన్ : 84 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 100ఎస్ఎంఎస్లు పంపుకోవచ్చు. 84రోజుల పాటు అమెజాన్ ప్రైమ్ మెంబర్ షిప్, ఎక్స్ట్రీమ్ యాప్ బెన్ఫిట్స్, వింక్ సబ్స్క్రిప్షన్, రివార్డ్స్ మినీ సబ్‌స్క్రిప్షన్‌తో పాటు ఇతర ప్రయోజనాలు పొందవచ్చు. 4జీ యూజర్లు 2.5 జీబీ డేటాను సొంతం చేసుకోవచ్చని ఎయిర్టెల్ తెలిపింది. చదవండి👉 ‘మాధురీ మేడం వడపావ్ అదిరింది’.. యాపిల్ సీఈవో టిమ్‌కుక్ వైరల్ -
ఎయిర్టెల్ యూజర్లకు బంపరాఫర్!
ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం ఎయిర్టెల్ రూ.799 బ్లాక్ పేరుతో కొత్త పోస్ట్ పెయిడ్ ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ప్రీమియం సర్వీసులు పొందే ఈ ఒక్క ప్లాన్ కింద డీటీహెచ్‌తో పాటు ఫైబర్, మొబైల్ సేవల్ని వినియోగించుకోవచ్చు. ఎయిర్టెల్ బ్లాక్ రూ.799 పోస్ట్ పెయిడ్ ప్లాన్ ఎయిర్టెల్ బ్లాక్ రూ.799 పోస్ట్ పెయిడ్ ప్లాన్‌లో మొత్తం 3 కనెక్షన్లు పొందవచ్చు. అందులో 2 పోస్ట్ పెయిడ్ కనెక్షన్, మరోకటి డీటీహెచ్ కనెక్షన్. బేస్ రూ. 799 ప్లాన్ పోస్ట్‌పెయిడ్, డీటీహెచ్ ప్రయోజనాలను అందిస్తుంది. సాధారణ ఎయిర్టెల్ పోస్ట్‌పెయిడ్ ఆఫర్‌లాగానే 105 జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్ పంపుకోవచ్చు. అదనంగా, ఎయిర్టెల్ బ్లాక్ రూ. 799 ప్లాన్ వినియోగదారులకు రూ. 260 విలువైన టీవీ ఛానెళ్లు డీటీహెచ్ కనెక్షన్ కింద లభిస్తాయి. ఓటీటీ సర్వీసులు సైతం వీటితో పాటు ఎయిర్టెల్ బ్లాక్ రూ.799లో యూజర్లు అమెజాన్ ప్రైమ్ వీడియా,డిస్నీ ప్లస్ హాట్ స్టార్ తో పాటు ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ యాప్ సర్వీసుల్ని ఉపయోగించుకోవచ్చు. ఎయిర్టెల్ షాప్‌లో బై నౌ- పే లేటర్ ఎయిర్టెల్ బ్లాక్ రూ.799లో కస్టమర్లు వన్ బిల్ అండ్ వన్ కాల్ సెంటర్ సర్వీసులు, 60 సెకండ్లలో కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్స్ అందుబాటులోకి వస్తారు. అలాగే ఫ్రీ సర్వీసు విజిట్లు, ఎయిర్టెల్ షాప్‌లో బై నౌ- పే లేటర్ సదుపాయం వంటివి లభిస్తాయి. 5జీ సేవలు సైతం ఎయిర్ టెల్ బ్లాక్ కస్టమర్లు వీవోఎల్టీఈ (VoLTE),వోవైఫై (VoWiFi) సేవలతో పాటు, అన్లిమిటెడ్ 5జీ సేవలు వినియోగించుకోవచ్చు. తద్వారా ఈ ఏడాది జూన్ నాటి 4వేల టౌన్లలో 5జీ సేవల్ని అందించే లక్ష్యంగా పెట్టుకుంది. -
చార్జీ పెంపు.. ఎయిర్‌టెల్‌ను ప్రశ్నించనున్న కేంద్రమంత్రి
న్యూఢిల్లీ: డేటా వ్యయం, పరికరాల ధర పెరగడం ఆందోళన కలిగిస్తోందని ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. కనీస నెలవారీ చార్జీని ఎయిర్టెల్ 57 శాతం పెంచిన నేపథ్యంలో మంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ‘డేటా ధరలు అధికం కావడం వేగవంతమైన డిజిటైజేషన్‌కు అవరోధాలు. 2025 నాటికి 120 కోట్ల భారతీయులను ఆన్‌లైన్‌కు తీసకురావాలన్నది మా లక్ష్యం. ప్రస్తుతం 83 కోట్ల మంది ఇంటర్నెట్ వినియోగిస్తున్నారు. పెరుగుతున్న డేటా వినియోగం లేదా పరికరాల ధరలో ఏదైనా పెరుగుదల వంటి సమస్యలు వస్తే ఖచ్చితంగా పరిశీలిస్తాం. ఎయిర్టెల్ ఇటీవల మొబైల్ సేవల ధరల పెంపుపై అధ్యయనం చేయలేదు. టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్ పరిశీలించే వరకు వేచి చూస్తాం.ట్రాయ్‌తో తప్పకుండా మాట్లాడబోతున్నాం. రష్యా–ఉక్రెయిన్ సమస్య కారణంగా ఇది స్వల్పకాలికమా? లేదా దీర్ఘకాలికమా? ఇది ట్రెండ్‌గా మారబోతుందా? ఇవీ మేం అడగబోయే ప్రశ్నలు. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ధరలపై ప్రభావం పడింది. డేటా ధరల ప్రభావాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉంది. చార్జీలు పెంచడానికి కారణం ఏమిటని ఆపరేటర్‌ను ప్రశ్నిస్తాం. డేటా వ్యయాలు అందుబాటులో ఉండాలన్నదే మా ఆశయం’ అని ఆయన అన్నారు. చదవండి: గూగుల్ నుంచి ఇది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు! -
ఎయిర్టెల్ బంపర్ ఆఫర్.!
సాక్షి, ముంబై: జియోకు పోటీగా భారతి ఎయిర్టెల్ తన వినియోగదారులకు కొత్తగా మరో ప్రీపెయిడ్ రీఛార్జ్‌ను లాంచ్ చేసింది. తాజాగా జియో గతవారం తన వినియోగదారుల కోసం రూ. 447 ప్రీపెయిడ్ రీఛార్జ్‌ను ప్రకటించింది. దీనికి పోటీగా ఎయిర్టెల్ రూ. 456 రీఛార్జ్‌ను అందించనుంది. ఈ రీఛార్జ్‌తో అపరిమిత వాయిస్ కాల్స్‌తో పాటు 50 జీబీ డేటా , రోజుకు 100 ఫ్రీ ఎస్ఎమ్ఎస్లను అందిస్తోంది. ఈ ప్లాన్ గడువు 60 రోజులుగా ఉండనుంది. ఈ ప్లాన్ ఎయిర్టెల్ థాంక్స్ యాప్‌తో పాటు గూగుల్ పే, పేటీఎం యాప్‌ల్లో రీఛార్జ్ చేసుకోవచ్చును. ఎయిర్టెల్ ప్రవేశపెట్టిన కొత్త రీఛార్జ్‌తో పలు బంపర్ ఆఫర్లను ఇస్తుంది. 30 రోజుల పాటు పలు సర్వీస్‌లను ఉచితంగా పొందవచ్చు.. ఈ రీఛార్జ్‌తో రూ. 100 ఫాస్ట్‌టాగ్ క్యాష్‌బ్యాక్ రానుంది. ఈ కొత్త రీఛార్జ్‌తో రానున్న ఆఫర్లు అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్రీమియం వింక్ మ్యూజిక్ చదవండి: మైక్రోసాఫ్ట్ విండోస్ వినియోగదారులకు శుభవార్త..! -
ఇది చేస్తే రైల్వే స్టేషన్లలో ఎంతైనా వైఫై వాడొచ్చు
న్యూఢిల్లీ: ఇండియన్ రైల్వేకు చెందిన బ్రాండ్‌బ్యాండ్, వీపీఎన్ సర్వీసెస్ కంపెనీ రైల్‌టెల్ దేశంలోని 4 వేల రైల్వే స్టేషన్లలో ప్రీపెయిడ్ వైఫై సేవలను ప్రారంభించింది. ఇప్పటికే 5,950కి పైగా స్టేషన్లలో ఉచిత హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలను అందిస్తున్న విషయం తెలిసిందే. వన్ టైమ్‌పాస్‌వర్డ్ (ఓటీపీ) ఆధారిత ధ్రువీకరణతో ఎవరైనా సరే ఇంటర్నెట్ సేవలను పొందవచ్చు. తాజాగా విడుదల చేసిన ప్రీపెయిడ్ ప్లాన్ ప్రకారం ప్రయాణికులు రోజుకు 30 నిమిషాల ఉచిత వైఫైను 1 ఎంబీపీఎస్ వేగంతో ఉపయోగించుకోవచ్చు. కానీ అంతకంటే ఎక్కువ వేగవంతమైన లేదా 34 ఎంబీపీఎస్ వేగం వరకు ఇంటర్నెట్ కోసం వినియోగదారులు నామమాత్రపు రుసుమును చెల్లించాల్సి ఉంటుంది. రోజుకు 5 జీబీ డేటా చార్జీ రూ.10, 10 జీబీకి రూ.15 చార్జీ, అలాగే ఐదు రోజుల వ్యాలిడిటీతో 10 జీబీ చార్జీ రూ.20, 20 జీబీ చార్జీ రూ.30గా ఉన్నాయి. 10 రోజుల వ్యాలిడిటీతో 20 జీబీ చార్జీ రూ.40, 30 జీబీకి రూ.50, అదేవిధంగా 30 రోజుల వ్యాలిడిటీ ఉండే 60 జీబీకి రూ.70 చార్జీలున్నాయి. వినియోగదారులు వారి అవసరాలకు అనుగుణమైన ప్లాన్స్‌ను ఎంచుకునేలా రూపొందించామని రైల్‌టెల్ సీఎండీ పునీత్ చావ్లా తెలిపారు. -
బీఎస్ఎన్ఎల్ పండుగ ఆఫర్ : 90 రోజులు ఫ్రీ
సాక్షి, ముంబై: ప్రభుత్వ రంగ సంస్థ భారత్ సంచార్ నిగం లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) తన చందాదారులకు అద్భుత ఆఫర్ తీసుకొచ్చింది. పండుగ సీజన్ సందర్భంగా ప్లాన్‌ను సమీక్షించి బీఎస్ఎన్ఎల్ రూ .1,699 వార్షిక ప్రీ పెయిడ్ ప్లాన్‌పై అదనపు ప్రయోజనలను అందిస్తోంది. అక్టోబర్ 31 లోపు రీఛార్జ్ చేసే వినియోగదారులకు మాత్రమే ఈ ప్రయోజనాలు వర్తిస్తాయని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఆఫర్ వివరాలు రూ .1,699 ప్రీపెయిడ్ ప్లాన్ చెల్లుబాటును 455 రోజులకు పొడిగించింది. వాస్తవానికి ఈ ప్లాన్ వాలిడిటీ 365 రోజులు మాత్రమే. దీంతోపాటు అక్టోబర్ మాసంలో రోజుకు 3.5 జీబీ (1.5 జీబీ అదనం) డేటాను అందిస్తోంది. నవంబరు డిసెంబర్ మాసాల్లో రోజుకు 3 జీబీ డేటా అందిస్తుంది. అలాగే ఏడాదిపాటు ఉచిత వ్యక్తిగతీకరించిన రింగ్ బ్యాక్ టోన్ (పిఆర్బిటి) లేదా కాలర్ ట్యూన్లను కూడా అందిస్తుంది. రోజుకు 2 జీబీ డేటాతో పాటు రోజుకు 250 నిమిషాలు కాలింగ్, రోజువారీ 100 ఎస్ఎంఎస్ లు ఉచితం. అంటే అక్టోబర్ 31 లోపు రీచార్జ్ చేసుకున్న కస్టమర్లకు 90 రోజుల అదనపు ప్రయోజనాలు అందుబాటులో వుంటాయి. -
పెట్రోల్ పంపుల్లో ఫాస్ట్యాగ్లు
న్యూఢిల్లీ: టోల్‌ప్లాజాల వద్ద వాహన క్యూలను తగ్గించే ఫాస్ట్యాగ్లు ఇకపై పెట్రోల్ పంపుల్లోనూ అందుబాటులోకి రానున్నాయి. వాహనం విండ్ స్క్రీన్‌పై అతికించే ఈ ఫాస్ట్యాగ్స్ ద్వారా టోల్ ప్లాజాల వద్ద రుసుము ఆటోమేటిక్‌గా జమ అవుతుంది. రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్(ఆర్ఎఫ్ఐడీ) విధానం ద్వారా లింక్ అయి ఉన్న ప్రీపెయిడ్ లేదా సేవింగ్ అకౌంట్ నుంచి నేరుగా లావాదేవీ జరిగిపోతుంది. దీనివల్ల ప్లాజాల వద్ద వాహనాలు ఆపే అవసరం ఉండదు. ఈ ఫాస్ ట్యాగ్‌లను దేశవ్యాప్తంగా ఉన్న పెట్రోల్ పంపుల వద్ద త్వరలోనే అందుబాటులో ఉంచుతారు. వీటితో పార్కింగ్ ఫీజు చెల్లింపులు, పెట్రోల్ కొనుగోలు కూడా చేసుకోవచ్చు. ఫాస్ట్యాగ్ల విక్రయం, పంపిణీకి సంబంధించి పలు కంపెనీలతో ఒప్పందం కుదుర్చున్న అనంతరం రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ విషయం తెలిపారు. -
ప్రీపెయిడే ముద్దు గురూ!!
ముంబయి/న్యూఢిల్లీ: కస్టమర్లను కాపాడుకోవాలి.. కొత్త వారిని ఆకర్షించాలి.. ఆదాయం పెంచుకుకోవాలి.. ఇలా ఎన్నో టార్గెట్లతో సతమతమౌతోన్న టెలికం కంపెనీలకు ఇంకొక చిక్కొచ్చిపడింది. కొత్త కొత్త మార్గాలతో రాబడి పెంచుకుని పూర్వవైభవాన్ని సొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తున్న టెల్కోలకు పోస్ట్‌పెయిడ్ రూపంలో సమస్య ఎదురైంది. మొబైల్ యూజర్లు పోస్ట్‌పెయిడ్ నుంచి ప్రీపెయిడ్కు మారిపోతున్నారు. పోస్ట్‌పెయిడ్ ప్లాన్స్‌తో పోలిస్తే ప్రీపెయిడ్ ప్లాన్స్ అధిక విలువ కలిగి ఉండటం ప్రధాన కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. టెలికం కంపెనీలు పోస్ట్‌పెయిడ్ విభాగాన్ని ప్రోత్సహిస్తున్నప్పటికీ యూజర్లు అటువైపు నుంచి ప్రీపెయిడ్ వైపునకు వస్తున్నారు. టెల్కోలకు సాధారణంగా పోస్ట్‌పెయిడ్ విభాగం నుంచి రాబడి ఎక్కువగా ఉంటుంది. పోస్ట్‌పెయిడ్ యూజర్లు తగ్గారు.. కస్టమర్లు ప్రీపెయిడ్ ప్లాన్స్‌కు ఆకర్షితులౌతుండటంతో పోస్ట్‌పెయిడ్ విభాగపు సబ్స్క్రైబర్ల సంఖ్య త్రైమాసికం పరంగా చూస్తే తగ్గింది. సెప్టెంబర్ క్వార్టర్లో 2 శాతంమేర క్షీణించింది. సాధారణంగానే పోస్ట్‌పెయిడ్ కస్టమర్ల కన్నా ప్రీపెయిడ్ యూజర్లు ఎక్కువగా ఉంటారు. సెప్టెంబర్ క్వార్టర్లో మొత్తం సబ్స్క్రైబర్ల (4జీ ఎల్టీఈ యూజర్లు సహా) సంఖ్యలో ప్రీపెయిడ్ విభాగపు వాటా 95.6 శాతానికి ఎగసింది. జూన్ త్రైమాసికంలో ఇది 95.5 శాతంగా ఉంది. టెలికం రెగ్యులేటర్ ట్రాయ్ గణాంకాల ప్రకారం.. సెప్టెంబర్ త్రైమాసికంలో పోస్ట్‌పెయిడ్ సబ్స్క్రైబర్ల సంఖ్య (ఎల్టీఈ యూజర్లు సహా) 5.17 కోట్లకు తగ్గింది. మెట్రోలు సహా ఏ, బీ కేటగిరి సర్కిళ్లలోనూ ప్రీపెయిడ్ యూజర్ల సంఖ్య పెరిగింది. ఆదాయం 10 శాతం డౌన్ సెప్టెంబర్ క్వార్టర్లో పోస్ట్‌పెయిడ్ విభాగపు ఆదాయం త్రైమాసికం పరంగా చూస్తే 10 శాతంమేర తగ్గింది. రూ.5,900 కోట్లుగా నమోదయ్యింది. వార్షిక ప్రాతిపదికన చూస్తే 23 శాతంమేర తగ్గింది. ‘జూన్ త్రైమాసికం నుంచి గమనిస్తే సెప్టెంబర్ క్వార్టర్లో పోస్ట్‌పెయిడ్ విభాగపు ఆదాయం 10 శాతంమేర క్షీణతతో రూ.5,900 కోట్లకు తగ్గిందని కొటక్ సెక్యూరిటీస్ తెలిపింది. ఇదే సమయంలో ప్రీపెయిడ్ విభాగపు ఆదాయం 9 శాతం వృద్ధితో రూ.24,000 కోట్లకు పెరిగింది. దీనికి జియో ప్రధాన కారణమనే అభిప్రాయముంది. పరిశ్రమ ఆదాయంలో పోస్ట్‌పెయిడ్ విభాగపు వాటా 20 శాతానికి పడిపోయింది. 2016 ఆర్థిక సంవత్సరంలో ఈ వాటా దాదాపు 30–40 శాతం గా ఉండేదని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. టెల్కోలపై ఒత్తిడి ఇంకా పెరగనుందా? టెల్కోలు ఆదాయం పెంచుకునేందుకు ఎక్కువ మందిని పోస్ట్‌పెయిడ్ విభాగంలోకి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తుంటాయి. అయితే ప్రీపెయిడ్‌లో మంచి డీల్స్ లభిస్తున్నాయి. దీంతో కస్టమర్లు ప్రీపెయిడ్ వైపు ఆకర్షితులౌతున్నారు. ఈ ట్రెండ్ నేపథ్యంలో వచ్చే త్రైమాసికాల్లో టెల్కోలపై ఆర్థికపరమైన ఒత్తిళ్లు ఎక్కువ కావొచ్చని నిపుణులు అభిప్రాయపడ్డారు. ‘రానున్న నెలల్లో పోస్ట్‌పెయిడ్ కస్టమర్లను దక్కించుకోవడం టెల్కోలకు కష్టతరం కావొచ్చు. ప్రీపెయిడ్ విభాగంలో మంచి ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికే పరిశ్రమలో ధరల పోటీ నడుస్తోంది’ అని ఫిచ్ డైరెక్టర్ నితిన్ సోని తెలిపారు. ప్రీపెయిడ్ విభాగంలోని ధరల తగ్గింపు అనేది పోస్ట్‌పెయిడ్, ప్రీపెయిడ్ సేవల మధ్య ధరల విలువలో వ్యత్యాసానికి దారితీసిందని, దీంతో యూజర్లు ప్రీపెయిడ్కు వెళ్తున్నారని కోటక్ సెక్యూరిటీస్ పేర్కొంది. పోస్ట్‌పెయిడ్ ఆదాయంపై నెలకొని ఉన్న తీవ్రమైన ఒత్తిడి నేపథ్యంలో టెలికం కంపెనీలు ఈ విభాగంలోని ప్లాన్స్ ధరలు సవరించడం సహా డిస్కౌంట్లను కూడా ప్రకటిస్తున్నాయని నిపుణులు పేర్కొన్నారు. 2017 తొలినాళ్లలో టారిఫ్‌లలో మార్పులు చేయడం పోస్ట్‌పెయిడ్ విభాగపు ఆదాయంపై ప్రతికూల ప్రభావం చూపిందని ఈవైకు చెందిన ప్రశాంత్ సింఘాల్ తెలిపారు. -
ప్రీపెయిడ్ సాధనాల పరిమితి నెలకు రూ. 50,000
ముంబై: మొబైల్ వాలెట్లు తదితర ప్రీపెయిడ్ ఇన్స్ట్రుమెంట్స్ (పీపీఐ)లో నెలకు రూ. 50,000కు మించి లోడ్ చేయరాదని రిజర్వ్ బ్యాంక్ ఆదేశించింది. అలాగే వీటిని జారీ చేసే సంస్థలు పీపీఐ బ్యాలెన్స్‌లపై వడ్డీ చెల్లించడానికి లేదని స్పష్టం చేసింది. మీల్ వోచర్లు మినహా పీపీఐలను పేపర్ రూపంలో జారీ చేయరాదని కూడా సూచించింది. ఈ ఏడాది డిసెంబర్ 31 తర్వాత ఈ వోచర్లు కూడా ఎలక్ట్రానిక్ ఫార్మాట్లోనే జారీ చేయాల్సి ఉంటుందని రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. మరోవైపు పీపీఐల ఇంటర్ఆపరబిలిటీని దశలవారీగా అమల్లోకి తెస్తామని వివరించింది. ఆరు నెలల్లోగా వివిధ సంస్థల వాలెట్స్కి.. ఆ తర్వాత వాలెట్లు, బ్యాంకులకు మధ్య కూడా దీన్ని అందుబాటులోకి తేనున్నట్లు తెలిపింది. తాజా ఆదేశాలు తక్షణం అమల్లోకి వస్తాయని పేర్కొంది. -
రూ.148కే వొడాఫోన్ అపరిమిత వాయిస్ కాల్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వొడాఫోన్ ప్రీ పెయిడ్ వినియోగదారుల కోసం సరికొత్త ఆఫర్‌ను తీసుకొచ్చింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని యూజర్లకు రూ.148కే అపరిమిత వాయిస్ కాల్స్, ఇంటర్నెట్ ప్యాక్‌ను అందించనున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇది రూ.148, రూ.295 రెండు ప్యాకుల్లో, రెండు రాష్ట్రాల్లోని 43 వొడాఫోన్ స్టోర్లు, 90 వేలకు పైగా రిటైల్ ఔట్లెట్లలో లభిస్తుందని పేర్కొంది. -
పది కోట్ల ప్రీపెయిడ్ కనెక్షన్లు ఫట్!!
ఒకటి కాదు.. రెండు కాదు.. దాదాపు పదికోట్ల వరకు ప్రీపెయిడ్ మొబైల్ కనెక్షన్లు పాకిస్థాన్‌లో ఆగిపోనున్నాయి. ప్రభుత్వం ఇచ్చిన 28 రోజుల గడువు లోగా వినియోగదారుల వివరాలను పరిశీలించడం తమ వల్ల కాదని ఆపరేటర్లు చేతులు ఎత్తేయడం వల్లే ఈ పరిస్థితి తలెత్తుతోంది. మొత్తం పరిశీలించాలంటే కనీసం 150-200 రోజుల గడువు కావాలని ఆపరేటర్లు కోరారు. లేనిపక్షంలో ప్రస్తుతమున్న ప్రీపెయిడ్ సిమ్ కార్డులను బ్లాక్ చేయాల్సి వస్తుందని చెబుతున్నారు. పాకిస్థాన్‌లో మొత్తం 14 కోట్ల మొబైల్ కనెక్షన్లున్నాయి. వాటిలో కేవలం 10 శాతం మాత్రమే పోస్ట్ పెయిడ్. డిసెంబర్ 16 నాటి పెషావర్ స్కూలు దాడి తర్వాత మొత్తం ప్రీపెయిడ్ కనెక్షన్లన్నింటినీ మళ్లీ వినియోగదారుల వివరాలు పరిశీలించాలని పాక్ హోం శాఖ ఆదేశించింది. అక్కడున్న ఐదుగురు ఆపరేటర్లు... మొబిలింక్, యుఫోన్, టెలినార్, వారిద్, జాంగ్ సంస్థల ప్రతినిధులు హోంశాఖ మంత్రి నిస్సార్ అలీఖాన్‌తో భేటీకానున్నారు. అప్పుడు దీనికో పరిష్కారం దొరుకుతుందని భావిస్తున్నారు. -
ఇక డీడీలకు చెల్లు..
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : ప్రజా పంపిణీ వ్యవస్థలో ప్రతినెలా రేషన్ డీలర్లకు డీడీలు తీయడానికి *400నుంచి *500 వరకు ఖర్చవుతోంది. దీంతో రేషన్‌డీలర్లపై అదనపు భారం పడుతోంది. దీనిని పౌరసరఫరాల శాఖే భరించాలని కొంతకాలంగా డీలర్లు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. కాగా, ఐసీఐసీఐ బ్యాంక్ *5కే రేషన్ డీలర్లకు ప్రీపెయిడ్ కార్డులు ఇవ్వడానికి ముందుకొచ్చింది. ఈ కార్డు నంబర్ ఆధారంగా బ్యాంక్ అకౌంట్లో డ బ్బులు జమచేస్తే ఇవి సివిల్ సప్లయి ఖాతాలోకి వెళ్తాయి. దీన్ని ప్రయోగాత్మకంగా రాష్ట్రంలోనే నల్లగొండ మండలంలో అమలు చేయడానికి అధికారులు ప్రణాళిక రూపొందించారు. వచ్చేనెల నుంచి ఈ పద్ధతిని అమలు పరచడానికి కార్డుల్ని ఐసీఐసీఐ బ్యాంకువారు తయారు చేశారు. తగ్గనున్న శ్రమ.... ప్రీపెయిడ్ విధానం ద్వారా డీలర్లుకు శ్రమతోపాటు సమయం కూడా మిగులుతుంది. డీడీకి అయ్యే సర్వీస్ చార్జ్ కూడా ఆదా కానుంది. ప్రతినెలా వేల రూపాయల డీడీ తీయడానికి బ్యాంకుల్లో బారులుదీరుతున్నారు. డబ్బులు పౌర సరఫరాల శాఖ ఖాతాల్లో జమచేసినా మళ్లీ డీడీకోసం బ్యాంకుల్లో నిరీక్షించాల్సి వచ్చేది. ఇకపై ఇటువంటి శ్రమ ఉండదు. అంతేగాక డీడీకి అవసరమైన సర్వీసు చార్జీలు చెల్లించాల్సిన పనిలేదు. తద్వారా డీలర్లపై ఆర్థికభారం తగ్గినట్లే. ప్రీపెయిడ్ విధానం నల్లగొండ మండలంలో విజయవంతమైతే మొదటగా జిల్లావ్యాప్తంగా అమలు చేయడానికి అధికారులు సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాకుండా సఫలమైతే రాష్ట్రవ్యాప్తంగా ఈ పద్ధతి అమల్లోకి తెచ్చే యోచనలో ప్రభుత్వం ఉంది. కలెక్టరేట్లో నల్లగొండ మండలంలోని 70 మంది రేషన్ డీలర్లకు ప్రీపెయిడ్ విధానంపై డీఎస్ఓ నాగేశ్వరరావు, ఏఎస్ఓ వెంకటేశ్వర్లు అవగాహన కల్పించి ప్రీపెయిడ్ కార్డులు అందజేశారు. -
ప్రీపెయిడ్ కార్డ్‌తో రూ. 1,000 నగదు పొందొచ్చు
ముంబై: బ్యాంకుల నుంచి పొందే ప్రీపెయిడ్, గిఫ్ట్ కార్డ్‌లను కలిగిన వినియోగదారులు ఇకనుంచీ దుకాణదారుల(పీవోఎస్) వద్దనుంచి రోజుకి రూ. 1,000 వరకూ నగదు తీసుకోవచ్చు. ఇందుకు అనుమతిస్తూ రిజర్వ్ బ్యాంకు గురువారం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ప్లాస్టిక్ మనీ వినియోగంలో కస్టమర్లకు మరింత వెసులుబాటును కల్పించే బాటలో ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ప్రస్తుతం ఇందుకు డెబిట్ కార్డ్‌లను మాత్రమే అనుమతిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్ఆర్ఐ పెట్టుబడులకు గ్యారంటీ కాగా ప్రవాస భారతీయులు(ఎన్ఆర్ఐలు) తరఫున దేశీయ కంపెనీల ఈక్విటీలు, డిబెంచర్లలో పెట్టుబడులకు గ్యారంటీ ఇచ్చేందుకు బ్యాంకులను అనుమతిస్తూ రిజర్వ్ బ్యాంకు నిర్ణయం తీసుకుంది.