ప్రీపెయిడ్ కార్డ్‌తో రూ. 1,000 నగదు పొందొచ్చు
ముంబై: బ్యాంకుల నుంచి పొందే ప్రీపెయిడ్, గిఫ్ట్ కార్డ్‌లను కలిగిన వినియోగదారులు ఇకనుంచీ దుకాణదారుల(పీవోఎస్) వద్దనుంచి రోజుకి రూ. 1,000 వరకూ నగదు తీసుకోవచ్చు. ఇందుకు అనుమతిస్తూ రిజర్వ్ బ్యాంకు గురువారం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ప్లాస్టిక్ మనీ వినియోగంలో కస్టమర్లకు మరింత వెసులుబాటును కల్పించే బాటలో ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ప్రస్తుతం ఇందుకు డెబిట్ కార్డ్‌లను మాత్రమే అనుమతిస్తున్న సంగతి తెలిసిందే.
ఎన్‌ఆర్‌ఐ పెట్టుబడులకు గ్యారంటీ
కాగా ప్రవాస భారతీయులు(ఎన్‌ఆర్‌ఐలు) తరఫున దేశీయ కంపెనీల ఈక్విటీలు, డిబెంచర్లలో పెట్టుబడులకు గ్యారంటీ ఇచ్చేందుకు బ్యాంకులను అనుమతిస్తూ రిజర్వ్ బ్యాంకు నిర్ణయం తీసుకుంది.