న్యూఢిల్లీ: టోల్‌ప్లాజాల వద్ద వాహన క్యూలను తగ్గించే ఫాస్‌ట్యాగ్‌లు ఇకపై పెట్రోల్ పంపుల్లోనూ అందుబాటులోకి రానున్నాయి. వాహనం విండ్ స్క్రీన్‌పై అతికించే ఈ ఫాస్‌ట్యాగ్స్ ద్వారా టోల్ ప్లాజాల వద్ద రుసుము ఆటోమేటిక్‌గా జమ అవుతుంది. రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్(ఆర్‌ఎఫ్‌ఐడీ) విధానం ద్వారా లింక్ అయి ఉన్న ప్రీపెయిడ్ లేదా సేవింగ్ అకౌంట్ నుంచి నేరుగా లావాదేవీ జరిగిపోతుంది. దీనివల్ల ప్లాజాల వద్ద వాహనాలు ఆపే అవసరం ఉండదు. ఈ ఫాస్ ట్యాగ్‌లను దేశవ్యాప్తంగా ఉన్న పెట్రోల్ పంపుల వద్ద త్వరలోనే అందుబాటులో ఉంచుతారు. వీటితో పార్కింగ్ ఫీజు చెల్లింపులు, పెట్రోల్ కొనుగోలు కూడా చేసుకోవచ్చు. ఫాస్‌ట్యాగ్‌ల విక్రయం, పంపిణీకి సంబంధించి పలు కంపెనీలతో ఒప్పందం కుదుర్చున్న అనంతరం రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ విషయం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment