న్యూఢిల్లీ: ఇప్పుడున్న రోజుల్లో రూపాయికి ఏమొస్తుందని ఎవరినైనా అడిగితే చాక్లెట్ కూడా కష్టమే అని అంటారు. అయితే జియో సంస్థ కేవలం రూపాయికి ఎంతో తేడా చూపింది. మరింత విలువను ఆపాదించింది. వినడానికి వింతగానే ఉన్నా దీని గురించి తెలుసుకుంటే ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. రిలయన్స్ జియో అందిస్తున్న రూ. 448, రూ. 449 ప్రీపెయిడ్ ప్లాన్‌లను పరిశీలిస్తే రూపాయి విలువెంతో అర్థం అవుతుంది. కేవలం రూపాయి తేడాతో జియో ఎంత మ్యాజిక్ చేసిందో ఇప్పుడు చూద్దాం.
రిలయన్స్ జియో తన ప్రీపెయిడ్ కస్టమర్లకు 28 రోజుల వ్యాలిడిటీ కలిగిన రెండు ప్లాన్‌లను అందిస్తోంది. వీటిలో ఒక ప్లాన్ ధర రూ.448 కాగా, మరొక ప్లాన్ ధర రూ.449. దీనిని వినగానే ఒక్క రూపాయి తేడాతో రెండు ప్లాన్‌లు ఎందుకని మనకు అనిపిస్తుంది. పైగా చూసేందుకు ఈ రెండు ప్లాన్‌లు ఒకే విధంగా కనిపిస్తాయి.
అయితే ఆ రెండు ప్లాన్‌ల వివరాలను చూస్తే ఎవరైనా సరే ఆశ్చర్యపోవాల్సిందే. రూ. 448 ప్రీపెయిడ్ ప్లాన్ తీసుకుంటే కంపెనీ 28 రోజుల పాటు అపరిమిత కాలింగ్ సౌకర్యాన్ని అందిస్తుంది. ప్రతిరోజూ 100 ఉచిత ఎస్‌ఎంఎస్‌లను అందిస్తుంది. అయితే డేటా విషయానికి వస్తే ఈ ప్లాన్‌లో 56 జీబీ డేటా ఉంటుంది. దీనిలో రోజుకు 2 జీబీ డేటా అందుతుంది. ఈ ప్లాన్‌లో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే జియో సినిమా ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను ఉంటుంది. అలాగే జియో టీవీ యాప్, సోని లివ్, జీ5, లైన్‌గాటా ప్లే, డిస్కవరీ ప్లస్, సన్ నెక్స్‌ట్, కన్చా లాంకా, ప్లానెట్ మరాఠీ, చౌపాల్, ఫన్ కోడ్, హోయ్‌చోయ్ మొదలైన వినోద వేదికల్లో సబ్‌స్క్రిప్షన్ జతచేరుతుంది.
ఇక రిలయన్స్ జియో రూ. 449 ప్లాన్ విషయానికొస్తే ఈ ప్లాన్ యొక్క వాలిడిటీ కేవలం 28 రోజులు. అయితే ఇందులో 84 జీబీ డేటా ఉంటుంది. ప్రతిరోజూ 3 జీబీ డేటా అందుతుంది. దీనిలో అపరిమిత కాలింగ్, 100 ఉచిత ఎస్‌ఎంఎస్ సౌకర్యం కూడా జతచేరుతుంది. అయితే ఈ ప్లాన్‌లో ఎలాంటి సబ్‌స్క్రిప్షన్ ఉండదు. ఇదంతా తెలుసుకున్నాక ఈ రెండు ప్లాన్‌ల మధ్య తేడా ఇంత ఉందా అని అనిపిస్తుంది.
ప్రతిరోజూ ఎక్కువ డేటా వినియోగం అవసరమయ్యే వారు రూ. 449 ప్లాన్ తీసుకోవచ్చు. దీనిలో ప్రతిరోజూ 3జీబీ డేటా లభిస్తుంది. ఫోనులో ఆటలు ఆడేవారికి ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. అయితే మరింత వినోదాన్ని కోరుకునేవారు రూ. 448 ప్లాన్ తీసుకోవడం ఉత్తమం. ఎందుకంటే దీనిలో వివిధ వినోద మాధ్యమాల సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. అయితే రోజుకు 2 జీబీ డేటా మాత్రమే లభిస్తుంది. ఇప్పుడు చెప్పండి... ఒక్క రూపాయిని జియో ఎంత పవర్‌ఫుల్‌గా మార్చిందో..
Comments
Please login to add a commentAdd a comment