ప్రభుత్వ రంగ మొబైల్ నెట్‌వర్క్ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ షాకింగ్ నిర్ణయాన్ని తీసుకుంది. సగటు స్థూల ఆదాయాన్ని పెంచుకునే చర్యలో భాగంగా పలు టెలికాం సంస్థలు మొబైల్ టారిఫ్‌లను రివైజ్ చేశాయి. ఇప్పటికే ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా మొబైల్ ప్రీపెయిడ్ ప్లాన్లను రివైజ్ చేశాయి. కాగా ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా టెలికాం సంస్థల అడుగుజాడల్లోనే బీఎన్‌ఎన్‌ఎల్ నడుస్తోంది. పలు మొబైల్ ప్రీపెయిడ్ ప్లాన్లను రివైజ్ చేస్తున్నట్లు బీఎస్‌ఎన్‌ఎల్ ప్రకటించింది.
రివీజన్‌లో భాగంగా ప్లాన్లను ధరలను మార్చకుండా ప్లాన్ల వ్యాలిడీటీ కుదించింది. బీఎస్‌ఎన్‌ఎల్ తన కస్టమర్లకు అందుబాటులో ఉన్న రూ. 49, రూ. 75, రూ. 94 ప్లాన్ల వ్యాలిడీటీను తగ్గించింది. అంతేకాకుండా రూ. 106, రూ.107, రూ.197, రూ. 397 ప్లాన్లను కూడా రివైజ్ చేసింది. బీఎస్‌ఎన్‌ఎల్ రూ.49 ప్లాన్ వ్యాలిడిటీని 24 రోజులుగా, రూ.75 ప్లాన్ వ్యాలిడిటీని 50 రోజులుగా, రూ. 94 ప్లాన్ వ్యాలిడిటీని 75 రోజులుగా నిర్ణయించింది. దాంతోపాటుగా రూ.106, రూ. 107, ప్లాన్లకు అందించే 100 రోజుల వ్యాలిడిటీని 84 రోజులకు కుదించింది. రూ. 197 ప్లాన్‌కు అందించే 180 రోజుల వ్యాలిడిటీని 150 రోజులకు కుదించింది. రూ. 397 ప్లాన్‌కు అందించే 365 రోజుల వ్యాలిడిటీని 300 రోజులకు కుదించింది.
బీఎస్‌ఎన్‌ఎల్ షాకింగ్ నిర్ణయం..!
Published Tue, Aug 10 2021 7:02 PM | Last Updated on Wed, Aug 11 2021 9:41 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment