
దీర్ఘకాలం వ్యాలిడిటీతో రోజూ ఎక్కువ డేటా కావాలనుకునేవారికి ప్రభుత్వ టెలికం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ అద్భుతమైన ప్లాన్ అందిస్తోంది. ఈ ప్లాన్‌తో తక్కువ ధరకే డైలీ 3జీబీ డేటాను ఆస్వాదించవచ్చు. ఇలాంటి ప్లాన్లు ఇతర ప్రైవేటు టెలికం కంపెనీల్లో లేకపోవడం గమనార్హం.
365 రోజులు వ్యాలిడిటీ
365 రోజులు వ్యాలిడిటీతో బీఎస్‌ఎన్‌ఎల్ అందిస్తున్న ఈ ప్లాన్ ధర రూ. 2,999. ఒకసారి రీఛార్జ్ చేసుకుంటే ఏడాదంతా అపరిమిత లోకల్, ఎస్‌టీడీ, రోమింగ్ కాల్స్ ఆనందించవచ్చు. ప్రతిరోజూ 3జీబీ హై స్పీడ్ డేటా పొందవచ్చు. ఈ వార్షిక ప్లాన్‌లో కస్టమర్‌లకు ప్రతిరోజూ 100 ఉచిత ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి.
సినిమాల స్ట్రీమింగ్, గేమింగ్ కోసం ఎక్కువ డేటా అవసరమయ్యే వినియోగదారులకు ఈ బీఎస్‌ఎన్‌ఎల్ ప్లాన్ ఉపయోగకరంగా ఉంటుంది. ఏడాదిపాటు ప్రతిరోజూ 3జీబీ డేటా అందించే ప్లాన్‌లు ఇతర ప్రైవేట్ టెలికం కంపెనీల్లో లేవు. గరిష్టంగా 84 రోజుల వ్యాలిడిటీతో ఇలాంటి ప్లాన్ జియోలో రూ.1799లకు, ఎయిర్‌టెల్‌లో రూ.1798లకు అందుబాటులో ఉంది.