శిక్షణ విమానం క్రాష్‌ ల్యాండింగ్‌ | - | Sakshi
Sakshi News home page

శిక్షణ విమానం క్రాష్‌ ల్యాండింగ్‌

Published Wed, May 31 2023 6:26 AM | Last Updated on Wed, May 31 2023 6:48 AM

పొలంలో దిగి పాక్షికంగా ధ్వంసమైన విమానం - Sakshi

పొలంలో దిగి పాక్షికంగా ధ్వంసమైన విమానం

కర్ణాటక: సాంకేతిక లోపం కారణంగా శిక్షణ విమానం అత్యవసరంగా దిగింది. ఈ సంఘటన బెళగావిలో జరిగింది. ఇద్దరు పైలట్లతో కలిసి బెళగావి సాంబ్రా విమానాశ్రయం నుంచి రెడ్‌బర్డ్‌ ఫ్లయింగ్‌ అకాడమీకి చెందిన చిన్నపాటి శిక్షణ విమానం మంగళవారం ఉదయం 9:30 గంటలకు టేకాఫ్‌ అయ్యింది. 7 కిలోమీటర్ల దూరం ప్రయాణించాక మారిహళ సమీపంలో సాంకేతి లోపం తలెత్తింది.

వెంటనే హొన్నిహళ సమీపంలోని రోడ్డు పక్కనున్న పొలంలో క్రాష్‌ ల్యాండింగ్‌ చేశారు. విమానం వేగంగా నేలను తాకడం వల్ల ముందు చక్రాలు, రెక్కలు ధ్వంసమయ్యాయి. ఓ పైలట్‌కు మాత్రం చిన్న గాయాలయ్యాయి. పైలట్‌ను వాయుసేన ఆస్పత్రిలో చేర్చి చికిత్సలు అందిస్తున్నారు. మారిహళ పోలీసులు, పెద్దసంఖ్యలో జనం విమానం వద్దకు చేరుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement