దేశంలో నదుల అనుసంధానం వివిధ ప్రాంతాలు తాగు,సాగునీటి అవసరాలను తీరుస్తుందనే మాట మనం ఎప్పటి నుంచో వింటున్నాం. దీనిని రాజస్థాన్‌లో సాకారం చేసేందుకు మోదీ సర్కారు ముందుకొచ్చింది.
రాజస్థాన్‌లోని 11 నదులను అనుసంధానం చేసేందుకు దాదాపు రూ.40 వేల కోట్ల విలువైన ప్రాజెక్టును ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో ప్రారంభించనున్నారని, కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా రాజస్థాన్‌ను నీటి మిగులు రాష్ట్రంగా మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గుజరాత్‌లో జరిగిన సుచి సెమికాన్ సెమీకండక్టర్ ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాటిల్ మాట్లాడుతూ, భవిష్యత్తులో నీటి సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు వాటర్ హార్వెస్టింగ్‌పై కృషి చేయాలని ఆయన వివిధ కంపెనీలకు విజ్ఞప్తి చేశారు.
రాజస్థాన్‌లో తీవ్రమైన నీటి సంక్షోభం ఉందని, నరేంద్ర మోదీ ప్రారంభించనున్న 11 నదులను అనుసంధానించే ప్రాజెక్టుతో రాష్టంలో తలెత్తుతున్న నీటి సమస్యకు పరిష్కారం దొరుకుతుందన్నారు. రాజస్థాన్-మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు చేపట్టిన తాగునీటి ప్రాజెక్టు ద్వారా ఆయా రాష్ట్రాలలో నీటి ఎద్దడి తగ్గుతుందన్నారు. నూతనంగా చంబల్, దాని ఉపనదులైన పార్వతి, కలిసింద్, కునో, బనాస్, బంగంగా, రూపారెల్, గంభీరి, మేజ్ తదిర ప్రధాన నదులను అనుసంధానం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఫలితంగా ఝలావర్, కోట, బుండి, టోంక్, సవాయి మాధోపూర్, గంగాపూర్, దౌసా, కరౌలి, భరత్‌పూర్, రాజస్థాన్‌లోని అల్వార్ మధ్యప్రదేశ్‌లోని గుణ, శివపురి, షియోపూర్, సెహోర్‌లతో సహా కొత్తగా ఏర్పడిన 21 జిల్లాలకు ప్రయోజనం చేకూరనుందని తెలిపారు.
ఇది కూడా చదవండి: Year Ender 2024: ప్రధాని మోదీ పర్యటించిన దేశాలివే.. మీరూ ట్రిప్‌కు ప్లాన్ చేసుకోవచ్చు
Comments
Please login to add a commentAdd a comment