కర్ణాటకలో కాంగ్రెస్ భారీ విజయాన్ని కైవసం చేసుకోవడంతో ఒక్కసారిగా విపక్షాలన్ని ఏకతాటి పైకి వచ్చి బీజేపీని ఎదుర్కొనేలా పావులు కదిపేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఈ పాటికే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తాను ముందుగానే కాంగ్రెస్‌కి మద్దతిస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఐతే ఆ అనూహ్యమైన యూటర్న్ బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌తో జరిగిన సమావేశం అనంతరమే దీదీ(మమతా) ఈ నిర్ణయం తీసుకున్నట్లు జనతాదళ్ పార్టీ సీనియర్‌నాయకుడు కేసీ త్యాగి చెప్పారు.
ఆయన మమతకు విపక్షాల మధ్య సమస్యలు పరిష్కారమయ్యేలా ఐక్య సూత్రం 'వన్ ఆన్ వన్' వ్యూహం గురించి తెలియజేసిన తర్వాతే ఆమె ఇలా నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. నిజానికి మమత 2024 ఎన్నికలకు ముందు కాంగ్రెసేతర థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలని అనుకున్నారని చెప్పారు. నితీష్‌తో జరిగిన సమావేశం అనతరం ఈ వ్యూహానికి సానుకూలంగా స్పందించినట్లు త్యాగి తెలిపారు. ఈ మేరకు మమతా బలమైన పార్టీలన్నీ 2024 ఎన్నికలకు బీజేపీని తమ సొంత గడ్డపై ఎదుర్కొవడం కోసం ఒంటిరి ఉండాలని అన్నారు. నితీష్ కుమార్ వ్యహాన్ని అంగీకరిస్తూ ప్రతిపక్ష పార్టీలన్నీ బీజేపీకి వ్యతిరేకంగా ఒకరిపై ఒకరు అభ్యర్థులను నిలబెట్టాలనే నిర్ణయానికి వచ్చారు. ప్రతిగా ప్రతిక్ష పోటీలో ఉన్న జాతీయ పార్టీల్లో 200 స్థానాలను కైవసం చేసుకున్న కాంగ్రెస్ మదతివ్వాలని చెప్పారు
అలాగే ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న చోట బీజేపీ పోరాడదు. అందుకు ఉదహారణ కర్ణాటకలో కాంగ్రెస్ విజయమే. ప్రజలు దౌర్జన్యాలను వ్యతిరేకిస్తున్నారు, ప్రజాస్వామ్య హక్కులు బుల్డోజర్ చేయబడుతున్నాయి. అని బెనర్జీ అన్నారు. ఎక్కడైన బలంగా ఉన్నవారి ప్రాంతంలో వారి కలిసి పోరాడాలి. ఉదహారణకు పశ్చిమ బెంగాల్లో తృణమూల్, ఢిల్లీలో ఆప్, బిహార్‌లో నితీష్ కుమార్, తేజస్వీయ యాదవ్ వాళ్లు పోరాడలి, అలాగే తమిళనాడుతలో ఎంకే స్టాలిన్ పోరాడాలన్నారు. బలమైన పార్టీకీ మన ప్రాధాన్యత ఇవ్వాలి. కాంగ్రెస్‌కు 200 సీట్లు వచ్చి బలంగా ఉంటే పోరాడనివ్వండని, అందుకు మద్దతిస్తాం అని మమతా చెప్పారు. అంతేగాదు మనం బీజేపిని ఓడించిలే మంచి జరగాలంటే కొన్ని ప్రాంతాలలో మనల్ని మనం త్యాగం చేసుకోక తప్పదని బెనర్జీ అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment