ప్రైవేట్ టెలికాం కంపెనీలు రీఛార్జ్ ధరల పెంచడంతో చాలా మంది యూజర్లు ప్రభుత్వ టెలికాం ఆపరేటర్ బీఎస్‌ఎన్‌ఎల్ (BSNL)కు మారుతున్నారు. దీంతోపాటు 4జీ సేవలు పెరగడం, 5జీ నెట్ వర్క్ కూడా అందుబాటులోకి రానుండటం, అందుబాటు ధరల్లో రీచార్జ్ ప్లాన్లు అందించడంతో బీఎస్‌ఎన్‌ఎల్ వైపు మొగ్గు చూపుతున్నారు.
ప్రస్తుతం బీఎస్‌ఎన్‌ఎల్ అనేక ఆకర్షణీయ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ లను అందిస్తోంది. ఇతర ప్రైవేటు టెలికాం సంస్థల ప్లాన్ లతో పోలిస్తే తక్కువ ధరకే సేవలు అందిస్తోంది. ఇటీవల 30 రోజుల వ్యాలిడిటీతో రూ.229 రీఛార్జ్ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
బీఎస్‌ఎన్‌ఎల్ రూ.229 ప్లాన్ అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజువారీ 100 SMSలు అందిస్తోంది. ఈ ప్లాన్ లో భాగంగా రోజుకు 2GB డేటాను వినియోగించుకోవచ్చు. అంటే ప్లాన్ వ్యాలిడిటీలో 60GB డేటాను పొందవచ్చు. 2GB డేటాతో, 30 రోజుల వ్యాలిడిటీని కేవలం తక్కువ ధరకే BSNL అందిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment