నేరాల నియంత్రణకు ప్రణాళిక
నేరాల నియంత్రణకు ప్రణాళిక
Published Fri, Sep 16 2016 9:50 PM | Last Updated on Sat, Aug 11 2018 8:48 PM
– సబ్ డివిజన్ అధికారులకు ఎస్పీ ఆదేశం
కర్నూలు: డీజీపీ ఆదేశాల మేరకు జిల్లాలో నేరాలను తగ్గించేందుకు ప్రణాళికను సిద్ధం చేయాలని ఎస్పీ ఆకే రవికృష్ణ సబ్ డివిజన్ పోలీసు అధికారులను ఆదేశించారు. శుక్రవారం మధ్యాహ్నం కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో డీఎస్పీలతో ఎస్పీ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నేరాల నియంత్రణకు కళాశాలలు, పాఠశాలలు, హాస్టళ్ల వద్ద బయట రోడ్డు కనిపించేలా సీసీ టీవీలు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. దీని వల్ల విద్యార్థినీ, విద్యార్థులు ఏ నెంబర్ ఆటోల్లో, వాహనాల్లో వస్తున్నారో, వెళ్తున్నారో తెలుసుకోవచ్చునన్నారు. ఏదైనా నేరం జరిగినప్పుడు తక్షణమే గుర్తించడానికి సీసీ టీవీల ఫుటేజి ఉపయోగపడుతుందన్నారు. రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు జిల్లాలో తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. సబ్ డివిజన్‌ల పరిధిలో బడేఖానాలు ఏర్పాటు చేసి కిందిస్థాయి సిబ్బంది సమస్యలను తెలుసుకుని వారి బాగోగులు చూడాలన్నారు. బాగా పనిచేసేవారిని గుర్తించి ప్రోత్సహించాలని ఆదేశించారు. సబ్ డివిజన్లకు తాను స్వయంగా వచ్చి అందరి కుటుంబాలతో కలసి మాట్లాడేలా బడేఖానాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పుష్కరాలు, గణేష్ నిమజ్జనం, బక్రీదు వేడుకల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విధులు నిర్వహించిన జిల్లా పోలీసు యంత్రాంగానికి ఆయన కతజ్ఞతలు తెలిపారు. బదిలీ అయిన ఎస్‌ఐలను తక్షణమే రిలీవ్ చేయాలని డీఎస్పీలను ఆదేశించారు. సమీక్షా సమావేశంలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ వెంకటేష్‌తో పాటు డీఎస్పీలు రమణమూర్తి, బాబుప్రసాద్, ఏజీ కృష్ణమూర్తి, హుసేన్ పీరా, మురళీధర్, వినోద్‌కుమార్, రాజశేఖర్‌రాజు, ఈశ్వర్‌రెడ్డి, హరినాథరెడ్డి, బాబా ఫకద్దీన్, కొల్లి శ్రీనివాసరావు, వెంకటాద్రి, సుప్రజ, సీఐలు పార్థసారధి, శ్రీనివాసులు, ఆదిలక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు.
Advertisement