ఒట్టావా: కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో హత్యకు జరిగిన కుట్ర జరిగింది. ఈ హత్యకు పాల్పడాలని అనుకుంది ఎవరో కాదు.. యువ నటుడు ర్యాన్ గ్రాంథమ్(24). తల్లి హత్యకేసులో నిందితుడిగా కోర్టు విచారణ ఎదుర్కొంటున్న ర్యాన్ గ్రాంథమ్.. ఈ సంచలన వాంగ్మూలం ఇచ్చినట్లు తెలుస్తోంది.
నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్ ‘రివర్‌డేల్’, ‘డెయిరీ ఆఫ్ ఏ వింపీ కిడ్’ ఫేమ్ ర్యాన్ గ్రాంథమ్.. కెనడా ప్రధాని ట్రూడో హత్యకు కుట్ర పన్నినట్లు తేలింది. 2020 మార్చి 31వ తేదీన స్క్వామిష్ టౌన్‌హౌజ్‌లో తన ఇంట్లో తల్లి బార్బరాను తల వెనుక భాగంలో తుపాకీతో కాల్చి చంపాడు. ఈ కేసు బ్రిటిష్ కొలంబియా సుప్రీం కోర్టులో విచారణ జరుగుతోంది.
అయితే తల్లిని హత్య చేసిన తర్వాత.. తన కారులో ఆయుధాలను, మందు గుండును, మ్యాప్ సాయంతో కెనడా రిడ్యూ కాటేజ్ వైపు బయలుదేరాడు గ్రాంథమ్. అక్కడే ప్రధాని జస్టిన్ ట్రూడో తన కుటుంబంతో ఉంటున్నారు. ఈ విషయాన్ని పోలీసుల స్టేట్‌మెంట్‌లో గ్రాంథమ్ నిర్ధారించాడు కూడా.
ఇదిలా ఉంటే.. గ్రాంథమ్ మానసిక స్థితి బాగోలేదని, చాలా కాలంగా డిప్రెషనలో ఉన్నాడని, ప్రధాని నివాసంలో తాను సృష్టించాలనుకున్న నరమేధం తాలుకా ట్రయల్స్‌లో భాగంగానే.. తల్లిని హతమార్చి ఉంటాడని ప్రాసెక్యూటర్ డోన్నెల్లీ కోర్టుకు వెల్లడించారు. అయితే తాను వాన్‌కోవర్ పోలీసులకు లొంగిపోవాలనే వెళ్లినట్లు నిందితుడి తరపున ప్రాసిక్యూటర్ వాదించారు. రివర్‌డేల్‌లోనూ ర్యాన్ పాత్ర ‘కిల్లర్’ కావడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment