హిందూ నాయకుల హత్యకు కుట్ర! | Dawood Ibrahim planned to kill Hindu leaders, attack churches: NIA | Sakshi
Sakshi News home page

హిందూ నాయకుల హత్యకు కుట్ర!

Published Mon, Aug 8 2016 1:05 PM | Last Updated on Mon, Sep 4 2017 8:25 AM

హిందూ నాయకుల హత్యకు కుట్ర!

హిందూ నాయకుల హత్యకు కుట్ర!

న్యూ ఢిల్లీ: దేశంలో కల్లోలం సృష్టించడానికి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్.. దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ పెద్ద స్కెచ్చే వేసిందని చెతుతోంది జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ). దేశంలోని ప్రముఖ హిందూ నాయకులు, చర్చిలను టార్గెట్ చేసి దాడులు జరపాలని దావూద్ 'ఢీ కంపెనీ' ప్రణాళికలు సిద్ధం చేసిందని.. గుజరాత్లో ఇద్దరు బీజేపీ నాయకుల హత్యకేసుకు సంబంధించిన చార్జ్షీట్లో ఎన్ఐఏ స్పష్టం చేసింది.

2002 గుజరాత్ అల్లర్లకు ప్రతీకారంగా ఈ దాడులు జరపాలని 'ఢీ కంపెనీ' యోచిస్తున్నట్లు ఎన్ఐఏ వెల్లడించింది. హిందూ నేతలు, చర్చిలపై దాడులు జరపడం ద్వారా దేశంలో కల్లోల పరిస్థితులు సృష్టించాలని భావిస్తున్నారని ఎన్ఐఏ పేర్కొంది. ఇందుకోసం యువతకు భారీ మొత్తంలో డబ్బును ఎరవేస్తూ ఆకర్షిస్తున్నారని ఎన్ఐఏ తెలిపింది. కరాచీ, దక్షిణాఫ్రికాల్లోని దావూద్ ముఠా కార్యకలాపాలు ఈ విషయాన్ని తెలుపుతున్నాయని ఎన్ఐఏ వెల్లడించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement