Churches
-
నావల్నీ అంత్యక్రియలకు చర్చిలు నిరాకరించిన వేళ..
మాస్కో: ఇటీవల అనుమానాస్పదంగా జైలులో మరణించిన రష్యా విపక్ష నేత అలెక్సీ నావల్నీ అంత్యక్రియల నిర్వహణకు చర్చిలేవీ స్వచ్ఛందంగా ముందుకు రావడ లేదు. అధ్యక్షుడు పుతిన్ ఆగ్రహిస్తారన్న భయమే ఇందుకు కారణమని నావల్నీ సంస్థ అధికార ప్రతినిధి ఆరోపించారు. ‘‘నావల్నీ పేరు చెప్పగానే ఇప్పటికే బుకింగ్ అయిపోయాయంటూ చాలా చర్చిల నిర్వాహకులు తప్పించుకున్నారు. ఎట్టకేలకు మాస్కో శివార్లలోని మేరీనో పట్టణంలో ఉన్న మదర్ ఆఫ్ గాడ్ క్వెంచ్ మై సారోస్ చర్చి నావల్నీ అంత్యక్రియల నిర్వహణకు ముందుకొచ్చింది’’ అని ఆమె ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ‘వాస్తవానికి గురువారమే అంత్యక్రియలు పూర్తిచేద్దామనుకున్నాం. కానీ పార్లమెంట్‌ను ఉద్దేశిస్తూ పుతిన్ ప్రసంగం ఉండటంతో ఆ రోజు అంత్యక్రియలకు చర్చిలేవీ ముందుకు రాలేదు. అందుకే శుక్రవారం మధ్యాహ్నం ఖననం చేయనున్నాం’ అని చెప్పారు. -
దేశమంతటా క్రిస్మస్ వెలుగులు.. చర్చిలు శోభాయమానం!
దేశవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. క్రిస్మస్ సందర్భంగా దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లోని చర్చిల్లో ఆకర్షణీయమైన అలంకరణలు చేశారు. కోల్‌కతాలోని చర్చిలు రంగురంగుల దీపాలతో కళకళలాడాయి. క్రిస్మస్ పండుగ సందర్భంగా ఢిల్లీలో భద్రతా ఏర్పాట్లను మరింతగా పెంచారు. క్రిస్మస్తో పాటు రానున్న న్యూ ఇయర్ సందర్భంగా పర్యాటక ప్రదేశాల్లో జనం రద్దీ మరింతగా పెరిగింది. #WATCH | Kerala: Streets of Thiruvananthapuram all decked up with decorative lights on #Christmaseve pic.twitter.com/kn8jam5yqj — ANI (@ANI) December 24, 2023 క్రిస్మస్కు ముందుగానే హిమాచల్‌లోని పర్యాటక ప్రదేశాలకు పర్యాటకుల రాక మొదలయ్యింది. పెద్ద సంఖ్యలో పర్యాటకులు రావడంతో సోలాంగ్‌లో దాదాపు 4 నుంచి 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో వందలాది వాహనాలు జామ్‌లో చిక్కుకున్నాయి. ఆదివారం రాత్రి 10.30 గంటల వరకు జామ్ కొనసాగింది. #WATCH | Tamil Nadu: Lighting and decorations at different churches in Ooty on #Christmas Eve. pic.twitter.com/WmM4zsfEDU — ANI (@ANI) December 24, 2023 కోల్‌కతాలోని పార్క్ స్ట్రీట్.. క్రిస్మస్ ఈవ్ వేడుకలతో సందడి చేస్తోంది. భారీ సంఖ్యలో జనం రావడంతో పండుగ వాతావరణం నెలకొంది. ప్రత్యేక సామూహిక ప్రార్థనలకు చర్చిలు దీపాలతో ముస్తాబయ్యాయి. పార్క్ స్ట్రీట్‌తో పాటు, హరీష్ ముఖర్జీ రోడ్‌తో సహా కోల్‌కతాలోని ఇతర ప్రదేశాలలో క్రిస్మస్ పండుగ సందర్భంగా భారీ అలంకరణలు కనిపించాయి. సెయింట్ పాల్స్ కేథడ్రల్ చర్చితో పాటు పలు చర్చిలను రంగురంగుల లైట్లతో అలంకరించారు. Uttar Pradesh: Historic Roman Catholic Church in Meerut's Sardhana decked up ahead of Christmas Read @ANI Story | https://t.co/ZTzFuB3dqQ#UttarPradesh #Christmas #RomanCatholicChurch pic.twitter.com/S8hvA0Uch6 — ANI Digital (@ani_digital) December 24, 2023 ఉత్తరప్రదేశ్‌లోని చారిత్రాత్మక రోమన్ క్యాథలిక్ చర్చ్ క్రిస్మస్ కోసం ప్రత్యేకంగా అలంకరించారు. ఈ చారిత్రాత్మకమైన చర్చిని బసిలికా ఆఫ్ అవర్ లేడీ ఆఫ్ గ్రేస్ అని పిలుస్తారు. ఈ చర్చి ఉత్తర భారతదేశంలో అతిపెద్దది. యూరోపియన్ సైనికుడు వాల్టర్ రెయిన్హార్డ్ సోంబ్రేను వివాహం చేసుకున్న 14 ఏళ్ల ముస్లిం బాలిక బేగం సమ్రు ఈ చర్చిని నిర్మించారని చెబుతుంటారు. #WATCH | J&K: A church in Jammu lit up colourful lights and decorated on #ChristmasEve pic.twitter.com/6QAaKDt4Kr — ANI (@ANI) December 24, 2023 జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లోని చర్చిలలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నగరాన్ని రంగురంగుల దీపాలతో అలంకరించారు. చర్చిల్లో క్రిస్మస్ పాటలు వినిపిస్తున్నాయి. మిజోరంలోని అన్ని ప్రాంతాల్లో క్రిస్మస్ శోభ కనిపిస్తోంది. క్రిస్మస్.. ఏసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని చేసుకునే పండుగ. ప్రతీయేటా ఈ పండుగను డిసెంబర్ 25న జరుపుకుంటారు. ఇది కూడా చదవండి: చుక్కలు చూపించిన పప్పులు, కూరగాయలు! #WATCH | Sacred Heart Cathedral Catholic Church in Delhi lit up and decorated on #Christmas Eve. pic.twitter.com/6ijcMysVEA — ANI (@ANI) December 24, 2023 -
ప్రపంచంలోని 10 అత్యంత ప్రసిద్ధ చర్చిలు (ఫొటోలు)
-
స్వయంగా తీసుకెళ్లి సచివాలయమంతా చూపించి..
సాక్షి, హైదరాబాద్: నూతన సచివాలయంలో ఇటీవలే నిర్మాణం పూర్తి చేసుకున్న నల్ల పోచమ్మ ఆలయం, మసీదు, చర్చిలను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌తో కలసి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శుక్రవారం ప్రారంభించారు. ఆలయంలో జరిగిన తొలి పూజలు, మసీదు, చర్చిలలో నిర్వహించిన తొలి ప్రార్థనల్లో ఇరువురు కలసి పాల్గొన్నారు. గవర్నర్ సచివాలయానికి తొలిసారి వచ్చిన నేపథ్యంలో సీఎం కేసీఆర్ స్వయంగా దగ్గరుండి ప్రత్యేకతలను చూపించారు. కొత్త సచివాలయం నిర్మాణంలో భాగంగా నల్ల పోచమ్మ ఆలయం, మసీదులను తొలగించిన విషయం తెలిసిందే. ఇటీవల ఆ రెండింటితోపాటు చర్చిని కూడా కొత్తగా, విశాలంగా నిర్మించారు. శుక్రవారమే వాటిని ప్రారంభించి అందరినీ అనుమతిస్తున్నారు. చర్చిలో కేక్‌ను కట్ చేస్తున్న గవర్నర్ తమిళిసై. చిత్రంలో సీఎం కేసీఆర్, సీఎస్ శాంతి కుమారి, మంత్రులు జగదీశ్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, బాల్క సుమన్ తదితరులు గవర్నర్‌ను ఘనంగా స్వాగతించి.. శుక్రవారం మధ్యాహ్నం 12.10 గంటల సమయంలో సచివాలయానికి చేరుకున్న సీఎం కేసీఆర్.. ఆలయం, మసీదు, చర్చిల ప్రారంబోత్సవ ఏర్పాట్లు, సచివాలయ అంశాలపై ఉద్యోగ సంఘం నేతలతో కాసేపు మాట్లాడారు. కాసేపటికి అక్కడికి చేరుకున్న గవర్నర్ తమిళిసైకు మేళతాళాల మధ్య సీఎం, సీఎస్ శాంతికుమారి, ఇతర ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. ఆలయ ప్రాంగణంలో ఉదయం నుంచి జరుగుతున్న చండీయాగం పూర్ణాహుతిలో గవర్నర్, సీఎం పాల్గొన్నారు. తర్వాత ఆలయంలో నల్ల పోచమ్మ అమ్మవారికి తొలి పూజ నిర్వహించారు. దీనికి అనుబంధంగా నిర్మించిన శివాలయం, ఆంజనేయస్వామి ఆలయాలనూ దర్శించుకున్నారు. తర్వాత ఎలక్ట్రిక్ వాహనంలో వారు చర్చి వద్దకు చేరుకున్నారు. గవర్నర్ తమిళిసై రిబ్బన్ కట్ చేసి చర్చిని ప్రారంభించారు. కేక్ కట్ చేసి బిషప్ డానియేల్‌కు, సీఎంకు అందించారు. తర్వాత బిషప్ ఆధ్వర్యంలో తొలి ప్రార్థనలు నిర్వహించారు. తెలంగాణ క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండీ కాంతి వెస్లీ ముఖ్యమంత్రికి జ్ఞాపికను బహూకరించారు. తర్వాత వారంతా పక్కనే ఉన్న మసీదుకు చేరుకున్నారు. అక్కడ ఇమాం ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో ముస్లిం మతపెద్దలు, మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ, ఆ పార్టీ శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్‌లతో కలసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం ప్రసంగించాలని అసదుద్దీన్ కోరగా.. ‘‘రాష్ట్రంలో సోదరభావం ఇలాగే పరిఢవిల్లాలి. ఇందుకు ప్రభుత్వపరంగా మావంతు చొరవ చూపుతాం. కొత్త మసీదు అద్భుతంగా, నిజాం హయాంలో కట్టిన తరహాలో గొప్పగా రూపొందింది. ఇలా అన్ని మతాల ప్రార్థన మందిరాలు ఒక్కచోట ఏర్పాటైన తెలంగాణ సచివాలయం దేశవ్యాప్తంగా గుర్తింపు పొందుతుంది..’’అని కేసీఆర్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌తో కలసి మసీదును ప్రారంభిస్తున్న తమిళిసై. చిత్రంలో హోంమంత్రి మహమూద్ అలీ తదితరులు సచివాలయాన్ని గవర్నర్‌కు చూపిన కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో కొత్త సచివాలయాన్ని నిర్మించినా.. ఇప్పటివరకు గవర్నర్ అందులో అడుగుపెట్టలేదు. శుక్రవారమే తొలిసారిగా అక్కడికి వచ్చారు. ఈ నేపథ్యంలో ప్రార్థన మందిరాల్లో కార్యక్రమాలు ముగిశాక సీఎం కేసీఆర్.. సచివాలయాన్ని తిలకించాలంటూ గవర్నర్ తమిళిసైని ఆహ్వనించారు. స్వయంగా దగ్గరుండి మరీ కొత్త భవనం ప్రత్యేకతలు, నిర్మాణంలో తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ, ఇతర అంశాలను వివరించారు. తన చాంబర్‌కు తోడ్కొని వెళ్లి అక్కడ శాలువాతో సత్కరించారు. శుక్రవారం వరలక్ష్మీ వ్రతం కూడా కావటంతో.. గవర్నర్‌కు ప్రభుత్వ సీఎస్ శాంతికుమారి కుంకుమ దిద్ది సంప్రదాయ పద్ధతిలో సత్కరించారు. అనంతరం వారంతా తేనీటి విందులో పాల్గొన్నారు. -
100 ఎకరాల్లో ఆంగ్లేయులు నిర్మించిన చర్చీ.. తెలంగాణలో రెండో అతి పెద్దది
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని చర్చీలు క్రిస్మస్ వేడుకల కోసం ముస్తాబయ్యాయి. సంబరాలు అంగరంగ వైభవంగా జరిపేందుకు నిర్వాహకులు విద్యుత్ దీపాలతో అలంకరించారు. యేసు జన్మస్థలంగా భావించే పశువుల పాకలను ఆకట్టుకు నే విధంగా తీర్చిదిద్దారు. ప్రార్థనలు చేసేందుకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. మంచిర్యాల జిల్లాలోని ప్రాచీన లక్సెట్టిపేట సీఎస్ఐ చర్చికి భక్తుల తాకిడి అధికంగా ఉండనుంది. సాక్షి, లక్సెట్టిపేట(ఆదిలాబాద్): రాష్ట్రంలో మెదక్ తర్వాత అతిపెద్ద చర్చిగా చెప్పుకునే లక్సెట్టిపేట సీఎస్ఐ చర్చి 86 వసంతాలు పూర్తి చేసుకున్నా నేటికీ చెక్కుచెదరకుండా ఉంది. బ్రిటీష్ కాలంలో నిర్మించిన ఈ చర్చికి క్రిస్మస్కు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి ప్రార్థనలు చేస్తుంటారు. ఆదిలాబాద్‌లోని చర్చిలో.. బ్రిటీష్ కాలంలో నిర్మాణం.. లక్సెట్టిపేట పట్టణానికి సమీపంలో వందెకరాలకు పైగా పచ్చటి పొలాలు, టేకు వనంలో మిషన్ కాంపౌండ్ ప్రాంతంలో ఆంగ్లేయులు ఈ చర్చిని నిర్మించారు. 1920లో ఇంగ్లాండ్‌కు చెందిన రేవ ఈడబ్ల్యూ లాంట్ లక్సెట్టిపేట పట్టణానికి వచ్చి, ఇక్కడే పదేళ్లపాటు మిషనరీ సంస్థలో పనిచేశాడు. 1930లో చర్చి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 95 ఫీట్ల వైశాల్యంతో చర్చి నిర్మాణం, 70 ఫీట్ల వైశాల్యంతో ప్రాంగణం, 46 గొలుసులతో ఉన్న దిమ్మెలు, సుమారు 500 మందికి వసతి కల్పించేవిధంగా ఏర్పాట్లు చేశారు. దీని కోసం ఇంగ్లాండ్ నుంచి ప్లాన్ తెప్పించాడు. నిర్మాణ పనులు చూసే బాధ్యతను రెవ సీజీ అర్లికి అప్పగించారు. ఇంగ్లాండ్ నుంచి రంగురంగుల అద్దాలు, స్థానికంగా ఉన్న గూడెం గుట్ట, గువ్వల గుట్ట, చిన్నయ్య గుట్ల నుంచి రాళ్లు తెప్పించి, బొట్లకుంటలోని నీటిని చర్చి నిర్మాణానికి ఉపయోగించారు. ప్రత్యేకంగా మహారాష్ట్ర నుంచి శిల్పకళాకారులను రప్పించారు. 1935లో రెవ హెచ్ బర్డ్ చర్చి నిర్మాణం పూర్తి చేయించారు. అనంతరం మిషనరీగా వచ్చిన రేవ ఫాస్పూట్ సీఎస్ఐ చర్చిగా నామకరణం చేసి క్రిస్మస్ రోజున ప్రారంభించారు. అప్పటి నుంచి 1954 వరకు ఆంగ్లేయులే చర్చి ఫాదర్లుగా పనిచేశారు. ఫాదర్ నివాసం ఉండేందుకు రెండస్తుల విశాలమైన భవంతిని నిర్మించారు. ప్రస్తుతం పనిచేస్తున్న చర్చి ఫాదర్లు కూడా అందులోనే ఉంటారు. విద్యుత్‌కాంతుల్లో విజయనగరం చర్చి విజయనగరం చర్చికి 55 ఏళ్లు కౌటాల(సిర్పూర్): మండలంలోని విజయనగరం గ్రామంలోని కథోలిక చర్చికి ఘన చరిత్ర ఉంది. విజయనగరంలో 1966లో దీనిని స్థాపించారు. విశాలమైన ప్రాంతంలో చర్చితోపాటు ఎయిడైడ్ పాఠశాల, వసతి గృహం ఉన్నాయి. చర్చికి ప్రతి ఆదివారం 250 వరకు భక్తులు వచ్చి, ప్రార్థనలు నిర్వహిస్తారని ఫాదర్ మనోజ్ తెలిపారు. 30 ఏళ్ల క్రితం పాత భవనాన్ని తొలగించి, అదేస్థలంలో భారీ మందిరాన్ని నిర్మించారు. క్రిస్మస్ సందర్భంగా ప్రత్యేకంగా విద్యుత్‌కాంతులతో చర్చిని ముస్తాబు చేశారు. ఏర్పాట్లు చేస్తున్నాం క్రిస్మస్ రోజు లక్సెట్టిపేట సీఎస్ఐ చర్చికి భక్తులు అధికంగా వస్తుంటారు. పండుగ కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాం. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ క్రిస్మస్ వేడుకలు సంతోషంగా జరుపుకోవాలి. – కరుణాకర్‌రావు, సీఎస్ఐ చర్చి ఫాదర్, లక్సెట్టిపేట కలెక్టర్ చౌక్‌లో ఏర్పాటు చేసిన భారీ క్రిస్మస్ ట్రీ ముస్తాబైన యేసు మందిరాలు కైలాస్‌నగర్(ఆదిలాబాద్): జిల్లాకేంద్రంలోని కలెక్టర్ చౌక్ వద్ద గల హోలీ ఫ్యామిలీ కాథరల్ చర్చిలో యేసు జన్మస్థలం పశువుల పాకను అందంగా తీర్చిదిద్దారు. రాత్రి 12 గంటలకు యేసు జన్మను స్వాగతిస్తూ కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించేందుకు ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఖానపూర్లో గల ఇండియా మిషన్ చర్చి, రవీందర్‌నగర్‌లోని సీఎస్ఐ చర్చి, విద్యానగర్‌లోని బేస్ సేబా చర్చిలో వేడుకలకు ఏర్పాట్లు చేశారు. క్రిస్మస్ వేడుకల సందర్భంగా అలంకరణ వస్తువులు సాంటా క్లోస్ దుస్తులు, నక్షత్రాలు, రంగురంగుల వస్తువులు కొనుగోళ్లతో షాపింగ్ మాల్‌లు, జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడళ్లు రద్దీగా మారాయి. ఆనందంగా గడుపుతాం క్రిస్మస్ రోజు తప్పకుండా అమ్మనాన్నతో కలిసి అందరం చర్చికి వెళ్తాం. చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేసి, ఆనందంగా గడుపుతాం. కొత్త బట్టలు వేసుకుని, ఇంటిని కూడా అందంగా ముస్తాబు చేస్తాం. – డి.ప్రేక్ష, టీచర్స్‌కాలనీ -
క్రిస్మస్ 2021: ఇవెంతో ప్రత్యేకం
క్రిస్మస్ పండుగ వచ్చేసింది. సర్వాంగసుందరంగా చర్చిలు ముస్తాబు అయ్యాయి. డచ్, పోర్చుగీసు, ఫ్రెంచ్, బ్రిటీష్.. ఇలా ఎన్నో కమ్యూనిటీలు మన దేశాన్ని పాలించాయి. కాలనీ కల్చర్ కారణంగా ఎన్నో అద్భుతమైన కట్టడాల్ని చూడగలుగుతున్నాం ఇప్పుడు. ఇందులో కొన్ని చర్చిలు ఎంతో ప్రత్యేకతను సంతరించుకున్నాయి. వీటిలో కొన్నింటిని ప్రభుత్వాలే నిర్వహిస్తున్నాయి కూడా. బాసిలికా ఆఫ్ బోమ్ జీసస్ గోవాలో ఉంది ఈ చర్చి. 1594లో నిర్మాణం మొదలై.. దశాబ్దాలకు పూర్తి చేసుకుంది. యూరప్ బారోక్యూ ఆర్కిటెక్చర్ నిర్మాణం ఇది. యూనెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గుర్తింపు కూడా!. ఆల్ సెయింట్స్ చర్చ్ తమిళనాడు కున్నూర్‌లో ఉంది. 1854లో నిర్మించారు. అందమైన చెక్క ఇంటీరియర్‌తో ఆకట్టుకునేలా ఉంటుంది. అద్దాల కిటికీలు, పైన్ చెట్ల నడుమ.. ప్రశాంత వాతావరణం గల ప్రాంతంగా పేరు దక్కించుకుంది ఇది. శాంటా క్రూజ్ బాసిలికా కొచ్చి(కేరళ)లో ప్రధాన ఆకర్షణ ఈ చర్చి. నిర్మాణ కాలంపై స్పష్టత లేకున్నా.. పోర్చుగీస్ హయాంలో నిర్మించినట్లు తెలుస్తోంది. అందమైన చిత్రాలు ఈ చర్చికి ప్రధాన ఆకర్షణ. పరిమితమైన సమయాల్లో మాత్రమే ఈ చర్చిని సందర్శించేందుకు వీలుంటుంది. ఇమ్మాక్యూలేట్ కాన్సెప్షనల్ క్యాథెడ్రల్ పాండిచ్చేరి (పుదుచ్చేరి)లో ఉంది. 1686లో నిర్మించబడిన ఈ చర్చి.. పర్యాటకులను ప్రధానంగా ఆకర్షిస్తుంటోంది కూడా. సెయింట్ పీటర్స్‌కు అంకితమైన ఈ చర్చ్.. తొలినాళ్లలో ఛాపెల్(తక్కువ స్పేస్‌లో ప్రార్థనా స్థలం)గా ఉండేది. బ్రిటిష్ ఆక్రమణలో మిగిలింది ఈ చర్చి ఒక్కటే. వేలంకణ్ణి తమిళనాడులో ఉన్న సుందరమైన చర్చి ఇది. వేలంకణ్ణిలో ఉంది. బంగాళాఖాతం తీరంలో ఉన్న ఈ చర్చికి.. పోప్ ప్రకటన కూడా ఉంది. ప్రపంచం నలుమూలల నుంచి ఈ సుందర స్థలాన్ని చూడడానికి పర్యాటకులు తరలి వస్తుంటారు. -
ముస్తాబైన ఆంధ్ర రోమ్
గుంటూరు ఈస్ట్: మానవాళి ప్రేమ, శాంతి మార్గంలో పయనించాలని క్రీస్తు బోధిస్తే.. వాటిని ఆచరిస్తూ, ఆచరింపజేస్తూ గుంటూరు నగరంలోని అనేక క్రైస్తవ మందిరాలు సేవలందిస్తున్నాయి. ఏఈఎల్సీ ఆధ్వర్యంలో పలు చర్చిలు, విద్యాలయాలు, వైద్యశాలలు మానవ సేవలో వెలుగొందుతున్నాయి. గుంటూరు, నల్లగొండ, ప్రకాశం, కృష్ణా జిల్లాల పరిధిలోని చర్చిలన్నీ సెంట్రల్ సినడు పరిధిలోకి వస్తాయి. సీహెచ్ ఏలియా సెంట్రల్ సినడు బిషప్‌గా వ్యవహరిస్తున్నారు. 150 ఏళ్లకు పైగా చరిత్ర.. రెవరెండ్ డాక్టర్ జాన్క్రిస్టియన్ ఫెడరిక్ హయ్యర్ ఏఈఎల్సీ సంఘాన్ని స్థాపించి క్రీస్తు బోధనల ప్రచార వ్యాప్తికి కృషి చేశారు. గుంటూరు పాత బస్టాండ్ సెంటర్లో 1842వ సంవత్సరం జులై 31వ తేదీ సెయింట్ మ్యాథ్యూస్ ఈస్ట్ ప్యారిస్ చర్చిని నిర్మించారు. 150 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న ఈ చర్చి జిల్లాలోనే అతి పురాతనమైన చర్చిల్లో ఒకటి. వెస్ట్ప్యారిస్ చర్చికు దాదాపు వందేళ్ల చరిత్ర ఉంది. 1905లో స్థాపించిన ఈ చర్చికు రాక్ మెమోరియల్ చర్చి అనే మరో పేరు ఉంది. నార్త్ ప్యారిష్ చర్చి ఆధ్వర్యంలో 60 ఏళ్లుగా దైవ సందేశాన్ని అందించడంతో పాటు, సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం 1940లో గుంటూరు మేత్రాసనం స్థాపించారు. గుంటూరు రింగ్‌రోడ్డులోని బిషప్బంగ్లా కేంద్రంగా ప్రస్తుతం బిషప్ చిన్నాబత్తుని భాగ్యయ్య పరిరక్షణలో ప్రొక్రెటర్ ఫాదర్ ఏరువ బాలశౌరెడ్డి నిర్వహణలో పలు దేవాలయాలు, పాఠశాలలు, కళాశాలలు, వైద్యశాలలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో 90 విచారణలు, వాటికింద మిషన్స్ స్టేషన్లు ఉన్నాయి. ముస్తాబైన ఆంధ్ర రోమ్ పేరేచర్ల(ఫిరంగిపురం): తెలుగు రాష్ట్రాల్లోనే అద్భుత కట్టడంగా, లక్షలాది మంది భక్తులు వచ్చే ప్రాంతంగా పిలవబడే ఫిరంగిపురం బాలయేసు కథెడ్రల్ దేవాలయం క్రిస్మస్ మహోత్సవానికి ముస్తాబయ్యింది. వేడుకల్లో భాగంగా ఆలయాన్ని కనులు మిరుమిట్లు గొలిపేలా విద్యుత్ దీపాలతో ఆలంకరించారు. గతంలో కంటే భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న దృష్ట్యా వారికి ఆలయంలో విశ్రాంతి భవనాలు, దర్శనం ప్రశాంతంగా సాగేలా ఏర్పాట్లు చేశారు. రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి దేశ విదేశాల నుంచి రెండు లక్షల మందికిపైగా భక్తులు వస్తారని అంచనా. మహిళా భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. క్రీస్తువిశ్వాసులు ఎక్కువగా తరలివచ్చే మహిమాన్విత ఆలయంగా, ఆంధ్రా రోమ్‌గా కీర్తి పొందిన ఈ ఆలయానికి 128 సంవత్సరాల చరిత్ర ఉంది. లండన్‌లోని మిల్‌హిల్ సభకు చెందిన మతగురువు థియోడర్ డిక్మన్ స్వామి 1875లో బాలయేసు కథెడ్రల్ ఆలయానికి విచారణ గురువుగా వచ్చారు. ఆలయం శిథిలావస్థలో ఉండటం చూసిన ఆయన నిర్మాణానికి పూనుకున్నారు. 1888 డిసెంబర్ 15వ తేదీ బాలయేసు ఆలయం పునాది నిర్మాణం చేపట్టారు. పునాదులకు రెండేళ్ల కాలం పట్టింది. బుధవారం జరిగే క్రిస్మస్ వేడుకలకు శాంతి భద్రతలకు ఎటువంటి విఘాతం కలగకుండా 170 మందితో పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇందులో డీఎస్పీ, సీఐ, ఏడుగురు ఎస్ఐలు పర్యవేక్షించనున్నారు. సర్వ మతాల సంగమం విజయపురిసౌత్: సర్వ మతాల సంగమంగా ఆధ్యాత్మిక భావనకు ప్రతీకగా వెలుగొందుతున్న సాగర్మాత దేవాలయంలో క్రిస్మస్ వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్రంలోనే విశిష్టత కలిగిన ఆలయంగా, ప్రముఖ పుణ్యక్షేత్రంగా దీనికి పేరుంది. భక్తుల కోర్కెలు తీర్చే తల్లి సాగర్మాత ఆలయానికి నిత్యం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు వస్తుంటారు. భారతీయ సంప్రదాయాలకు అనుగుణంగా మందిర నిర్మాణం, గోపురంపై విగ్రహ సంపద రూపుదిద్దుకున్నాయి. భారతీయ చిత్ర కళానైపుణ్యం వీటిలో కనిపిస్తోంది. సాగర్ ఒడ్డున వెలిసిన మేరీమాత సాగర్మాత పేరుతో క్రైస్తవులతో పాటు హిందువులు, ముస్లింలు ఇలా అన్ని మతాల ప్రజల నీరాజనాలను అందుకుంటోంది. శతాబ్దాల చరిత్ర రెంటచింతల: రాష్ట్రంలో రెంటచింతల అనగానే అందరికీ రోళ్లుసైతం పగిలే ఎండలు గుర్తొస్తాయి. కానీ, ప్రేమను వర్షించే ఆధ్యాత్మిక కేంద్రం కూడా ఇక్కడే ఉంది. శతాబ్దంన్నరకు పైగా చరిత్ర కాలిగిన కానుకమాత దేవాలయం ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది. ఈ ఆలయంలోకి అడుగుపెట్టగానే చలువురాతి చల్లదనమే కాదు.. కానుకమాత కృపా కటాక్షాలు కూడా దక్కుతాయి. రెవరెండ్ ఫాదర్ జోసఫ్ గ్రాండ్, కెనడీల ఆధ్వర్యంలో 1850లో అద్భుతమైన ఆర్కిటెక్ పరిజ్ఞానంతో కానుకమాత దేవాలయాన్ని నిర్మించారు. ఈ ఆలయం క్రిస్మస్ వేడుకలకు ముస్తాబైంది. ఈ చర్చిలో ప్రతి ఏడాది క్రీస్తు జన్మదినోత్సవాన్ని వేడుకగా నిర్వహిస్తున్నారు. మంగళవారం అర్ధరాత్రి 11 గంటలకు చర్చి ఆవరణలో విచారణ గురువులు రెవరెండ్ ఫాదర్ గోపు రాయపరెడ్డి నేతృత్వంలో ప్రత్యేక సమష్టి దివ్యపూజాబలిని సమర్పించనున్నారు. మండలంలోని సుమారు మూడు వేల మందికి పైగా క్రైస్తవులు పాల్గొంటారు. రాత్రి 12 గంటలకు బాలయేసు జననాన్ని పురష్కరించుకుని ఆనందంతో భారీగా బాణసంచా కాలుస్తారు. -
దేవుడు దిగి వచ్చిన వేళ
ఒక ధ్రువతార నింగిలో నిండుగా ప్రకాశించింది. చీకట్లు నిండిన బతుకుల్లో వెలుగులు నింపుతూ, కన్నీరు నిండిన కళ్లకు ఆనందాన్ని పంచుతూ, ద్వేషం నిండిన లోకానికి శాంతి సందేశాన్ని అందిస్తూ ఇలకు చేరింది. ఆ తార రాకతో కాలంతో పాటు లోకం కూడా మారింది. శాంతి కోసం ఆ మహా పురుషుడు ఇచ్చిన పిలుపు శతాబ్దాలుగా అందరి గుండెల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంది. ప్రేమ కోసం క్రీస్తు చిందించిన రుధిరం వెచ్చటి అశ్రువుల రూపాల్లో ప్రతి చెంపను తడుముతూనే ఉంది. సిక్కోలులోనూ క్రైస్తవం అంతర్వాహినిగా నిశ్శబ్దంగా ప్రవహిస్తోంది. అందుకు ఈ మందిరాలే సాక్ష్యం. వందేళ్లకు పైబడి ఈ మందిరాల్లో ప్రార్థనలు జరుగుతున్నాయి. క్రిస్మస్ పర్వదినానికి ఈ ప్రార్థనాలయాలు సర్వాంగసుందరంగా ముస్తాబవుతున్నాయి. 123 ఏళ్లుగా.. టెక్కలి: టెక్కలిలో అంబేడ్కర్ కూడలిలో ఉన్న ఆంధ్రా బాప్టిస్టు చర్చిలో 123 ఏళ్లుగా ఏటా క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. 1905లో కెనడాకు చెందిన క్రిష్టియన్ మిషనరీష్ ఆధ్వర్యంలో సంఘ ప్రతినిధి ఆర్చి బాలుడు ఆధ్వర్యంలో ఫాస్టర్ డబ్ల్యూ.హేగెన్స్ పర్యవేక్షణలో ఈ చర్చిని నిర్మించారు. అప్పటి నుంచి ఏటా క్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తున్నారు. 2015 సంవత్సరానికి 120 ఏళ్లు పూర్తి కావడంతో ఈ చర్చిని పునర్నిర్మించారు. చర్చి సంఘం ప్రతినిధులు సుభాష్, సురేష్, వినోద్, జయకుమార్, నాగరాజు, భక్త విజయం ఆధ్వర్యంలో పునర్నిర్మాణం పనులు చేపట్టారు. విద్యుత్ కాంతులతో మెరిసిపోతున్న టెక్కలిలోని ఆంధ్రా బాప్టిస్టు చర్చి క్రైస్తవులకు ఆరాధ్య కేంద్రంగా.. గార: బ్రిటిష్ పరిపాలన సమయంలో కళింగపట్నంలో పోర్టు నిర్వహణ జరుగుతున్న సమయంలో పోర్టు కళింగపట్నంలో తెలుగు బాప్టిస్టు చర్చిని నిర్మించారు. 1934 సంవత్సరంలో అప్పటి మతపెద్దలు మైలపల్లి రామన్న, మీసాల సుమన్ మిషన్ ఆధ్వర్యంలో పులిపాక జగన్, గోర్డన్ దంపతులు ఈ ప్రార్థనా మందిరాన్ని స్థాపించారు. స్వాతంత్య్రం రావడానికి కొద్ది సంవత్సరాలు ముందు ఈ చర్చిలో సీబీఎం గర్ల్స్ స్కూల్ పేరుతో పాఠశాలను నడిపేవారు. వారానికి ఐదు రోజులు తరగతులు, ఆదివారం ప్రత్యేక ప్రార్థనలు జరిగేవని చర్చి ఫాస్టర్ రామారావు తెలిపారు. ప్రస్తుతం చర్చిలో నిర్వహణ కమిటీ పేరిట ప్రత్యేక ఆరాధనలు, అనాథలకు సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయని చర్చి ప్రతినిధి దేవదాసు మాస్టారు తెలిపారు. ఈస్ట్ ఇండియా కంపెనీ ఆనవాలు శ్రీకాకుళం కల్చరల్: జిల్లా కేంద్రంలో చిన్నబజారులో ఉన్న తెలుగు బాప్టిస్టు చర్చి క్రిస్మస్ వేడుకలకు సిద్ధమవుతోంది. ఈ మందిర నిర్మాణం 1846 సెప్టెంబర్ 12వ తేదీన జరిగింది. 1996వ సంవత్సరంలో 150 ఏళ్ల వేడుక ఘనంగా జరిగింది. 2003లో నూతన భవనాన్ని నిర్మించారు. 17వ శతాబ్దంలో జరిగిన కర్నాటక యుద్ధ సంధి ప్రకారం ఈ ప్రాంతం నార్తరన్ సర్కారు (ఇంగ్లీషు)వారికి అప్పగించినట్లు చరిత్ర చెబుతోంది. ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధ్వర్యంలో 41వ బెటాలియన్ ఇక్కడ ఉండేది. సైనికుల్లో చాలా మంది లండన్ మిషన్‌కు చెందిన భక్తి గల క్రైస్తవులు ఉండటం వల్ల మేజర్ బ్రెట్, కెప్టెన్ హెలెన్నాట్ అనేవారు జెమ్స్ డాసన్ వారి సహకారంతో ఈ ప్రాంతంలో సంఘాన్ని ప్రారంభించారు. ప్రార్థనల వేదిక రాజాం: రాజాంలో బొబ్బిలి రోడ్డులోని 90 ఏళ్ల చరిత్ర కలిగిన ఆర్సీఎం చర్చి క్రిస్మస్ వేడుకలకు సిద్ధమైంది. ఈ చర్చిని 1925–30 మధ్య కాలంలో ఇక్కడ ఏర్పాటు చేసినట్లు రాజాం ప్రాంత ప్రజలు చెబుతున్నారు. ఏటా క్రిస్మస్కు ఇక్కడకు 1500 మందికిపైగా భక్తులు వస్తుంటారు. రెవరెండ్ పాధర్ నున్నం ప్రసాద్, రెవరెండ్ పాధర్ జాన్ పీటర్లు ఇక్కడ ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ నిత్యం విద్యుత్ దీపాలంకరణ ఉంటుంది. ఈ చర్చి ఆధ్వర్యంలో స్కూల్ కూడా నడుస్తోంది. వేడుకలకు వేదిక సిద్ధం పాలకొండ రూరల్: నూట యాభై రెండేళ్లకు పైబడి చరి త్ర కలిగిన పాలకొండ లూర్దుమాత ఆలయం క్రిస్మస్ వేడుకలకు సిద్ధమవుతోంది. బ్రిటిష్ కాలం నాటి రాతి కట్టడంతో ఉన్న ఈ ఆలయం కాలక్రమేణా కొత్త సొబ గులు సంతరించుకుని ఈ ఏడాది క్రిస్మస్ వేడుకలకు సన్నద్ధమవుతోంది. బ్రిటిష్ పాలనలో అప్పట్లో విచారణకర్తలు పాలకొండ ప్రాంతంలో ఉన్న సైనికులకు సేవలందించే క్రమంలో ఇక్కడ లూర్దుమాత ఆలయం స్థాపించినట్టు చరిత్ర చెబుతోంది. నాడు వచ్చిన సేవకులు గుర్రాలపై పార్వతీపురం, బొబ్బిలి, సాలూరు, బత్తిలి ప్రాంతాల్లో సంచరిస్తూ సువార్త విస్తరింపజేసినట్టు విచారణకర్తలు పేర్కొంటున్నారు. పురాతన చర్చి సీతంపేట: సీతంపేట ఏజెన్సీలోని పత్తికగూడ సమిపంలో కొండపైన ఉన్న ఫాతిమా మాత పుణ్యక్షేత్రంగా పిలిచే చర్చి నిర్మించి 120 ఏళ్లు కావస్తోంది. 1900వ సంవత్సరంలో నిర్మించిన చర్చిని అగస్టన్, వర్గీస్, బాలస్వామి వంటి ఫాదర్లు అభివృద్ధి చేశారు. వారి తర్వాత దీన్ని ప్రస్తుతం అమర్‌రావు ఫాదర్ నిర్వహిస్తున్నారు. పురాతన చర్చి వేడుకకు సిద్ధం సోంపేట: సోంపేట పట్టణంలోని 109 ఏళ్ల చర్చి క్రిస్మస్కు సిద్ధమైంది. 1910వ సంవత్సరంలో కెనడా బా ప్టిస్టు చర్చి ఆధ్వర్యంలో ఈ చర్చిని ప్రారంభించారు. ఈ చర్చికి మొట్ట మొదటి పాస్టర్‌గా కర్మికోటి అబ్రహం వ్యవహరించారు. ప్రస్తుతం 18వ పాస్టర్‌గా కొత్తపల్లి అబ్రహం విధులు నిర్వహిస్తున్నారు. -
మెర్రి క్రిస్మస్
-
ఒక్కో చర్చి ఎంతో ఘన కీర్తి
రాష్ట్రంలోనే రెండో పెద్దది సీఎస్ఐ కొత్తగూడెంటౌన్: కొత్తగూడెం పట్టణంలోని సెయింట్ ఆండ్రూస్ సీఎస్ఐ చర్చి రాష్ట్రంలోనే రెండో పెద్ద చర్చిగా గుర్తింపు పొందింది. డోర్నకల్ డయాసిస్‌లో అతిపెద్దది. 1943లో బ్రిటిష్ కాలంలో కొత్తగూడెంలో 15 కుటుంబాలతో ఏర్పడిన సంఘం ఆధ్వర్యంలో పోస్టాఫీస్ సెంటర్లో నిర్మించారు. 2005లో రూ.1.60కోట్ల విరాళాలతో ఆధునిక పద్ధతిలో తిరిగి నిర్మించి పునఃప్రారంభించారు. జిల్లా కేంద్రంలో ప్రధానమైన కట్టడంగా గుర్తింపును సంతరించుకుంది. ఒకేసారి మూడువేల మంది ప్రార్థనలు చేయొచ్చు. ప్రతి ఆదివారం జన సందోహంగా మారుతుంది. రాష్ట్రంలోని వివిధ జిల్లాలు, విదేశాల నుంచి కూడా వచ్చి సందర్శిస్తుంటారు. వేడుకలకు సిద్ధం చేశాం.. ప్రతి ఏడాది ఇక్కడ క్రిస్మస్ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటాం. ఏసు జీవిత చరిత్రను భక్తులకు వివరించేందకు ప్రత్యేకంగా ఏర్పాట్లను చేశాం. ఈ చర్చికి ప్రతి ఆదివారం రాష్ట్ర నలుమూలల నుంచి క్రైస్తవ భక్తులు వస్తుంటారు. – టి.జాన్సన్, సీఎస్ఐ చర్చి చైర్మన్ కరుణగిరి.. ఖమ్మంరూరల్: మండలంలోని నాయుడపేట నుంచి మొదలై..అటు బైపాస్ రోడ్డుకు ఆనుకుని ఉన్న కరుణగిరి చర్చి ఎంతో ప్రఖ్యాతిగాంచింది. ఇక్కడ గత 20 ఏళ్ల నుంచి క్రైస్తవులు విశేష ప్రార్థనలు చేస్తున్నారు. ఆధునిక నిర్మాణ పద్ధతి ఆకట్టుకుంటుంది. ప్రతి ఆదివారం వందలాదిగా క్రైస్తవులు ఇక్కడికి వస్తుంటారు. విశాల ఆహ్లాద ప్రాంగణం దీని మరో ప్రత్యేకత. ఖమ్మంనగరంతో పాటు కూసుమంచి, తిరుమలాయపాలెం, ఖమ్మంరూరల్, మరిపెడ మండలాల నుంచి ఇక్కడికి తరలివస్తుండడం విశేషం. లివింగ్ గాస్పెల్ చర్చి.. పాల్వంచ: పట్టణంలోని కాంట్రాక్టర్స్ కాలనీలో ఉన్న లివింగ్ గాస్పెల్ చర్చ్ (ఎల్జీఎం) ఇండిపెండెంట్ చర్చిల్లోనే అతి పెద్దదిగా గుర్తింపుపొందింది. 1984లో సింగరేణి సంస్థలో ఉద్యోగాన్ని వదిలి పాస్టర్ లిటిల్ దేవసహాయం నలుగురైదుగురు భక్తులతో లివింగ్ గాస్పెల్ చర్చిని బాపూజీ నగర్లో ప్రారంభించారు. నేడు వేలాది మంది భక్తులు ఇక్కడికి వస్తున్నారు. లిటిల్ దేవసహాయం కుమారుడు సాధు టైటస్ లివింగ్ వాటర్ వివాహం చేసుకోకుండా దైవ సేవ చేయాలనే తలంపుతో పాస్టర్‌గా మారారు. ఆయన కాంట్రాక్టర్స్ కాలనీలో అధునిక పద్ధతుల్లో చర్చిని నిర్మింపజేసి 2016 జనవరి7వ తేదీన ప్రారంభించారు. ఉభయ జిల్లాల నుంచి ఇక్కడికి వేలాదిమంది వస్తుంటారు. ప్రతి మంగళ, శుక్ర, ఆదివారాల్లో ప్రత్యేక ప్రార్థనలు జరుగుతుంటాయి. టైటస్ లివింగ్ వాటర్ పేదలు, అనారోగ్యంతో ఉన్న వారికి, అనాథలకు తన వంతు సహకారం అందిస్తున్నారు. యేసు ప్రేమను చాటడమే లక్ష్యం యేసు క్రీస్తు చూపిన ప్రేమను చాటడమే నా లక్ష్యంగా భావిస్తున్నా. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ వంతు కృషి చేస్తున్నాం. అనుబంధంగా జిల్లాలో ఐదు చర్చిలు, చత్తీస్‌గఢ్ రాష్ట్రంలో నాలుగు చర్చిలు ఉన్నాయి. మాకు ఇతర ఏ సంస్థల నుంచి ఎలాంటి ప్రొత్సాహం లేదు. స్వతహాగా ఇక్కడి భక్తుల సహకారంతో ముందుకు సాగుతున్నాం. – సాధు టైటస్ లివింగ్ వాటర్, పాస్టర్ అద్భుతం..లూర్థుమాత ఆలయం తల్లాడ: రాష్ట్రీయ రహదారి పక్కనే తల్లాడలో ఉన్న జిల్లాలోనే అతి పెద్ద చర్చిల్లో ఒకటిగా లూర్థుమాత ఆలయం పేరెన్నికగన్నది. 21 సంవత్సరాల క్రితం రోమన్ కేథలిక్ మిషన్ ఆధ్వర్యంలో నిర్మించారు. ఒకేసారి మూడువేల మంది ప్రార్థనలు చేయొచ్చు. అద్భుతమైన కల్వరి కొండలు, ఏసుక్రీస్తు జీవితానికి సంబంధించిన విశేషాలు, లూర్థమాతా చిత్రపటాలు ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. చర్చిగోపురం 150 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఆలయం గంట మోగినప్పుడు కిలోమీటరుకుపైగా వినిపిస్తుంది. ప్రాంగణం ప్రశాంతంగా ఉంటుంది. క్రిస్మస్ అంటే క్రీస్తు ఆరాధనే.. బాల యేసు పశువుల పాకలో జన్మించడం ఒక అద్భుత కార్యం. అలాంటి రోజును అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకోవడమే కిస్మస్. క్రైస్తవులకు ఇదే పెద్ద పండుగ. కులమత బేధాలకు తావులేకుండా ఎంతో ఆనందంగా, సంతోషంగా జరుపుకోవాలి. – పుట్టి రాజేంద్రప్రసాద్, లూర్థుమాత ఆలయం విచారణ గురువు, తల్లాడ ఆకట్టుకునే ఆర్సీఎం పాల్వంచ: స్థానిక ఆర్సీఎం చర్చిని కేరళకు చెందిన గోర్తిక్ ఆర్ట్ విధానంలో కట్టారు. కేరళ రాష్ట్రానికి చెదిన ఆగస్టీన్ అనే ఆర్కిటెక్ట్ దీనికి రూపకల్పన చేయగా అప్పటి ఫాదర్ బెనడిక్ట్ ఆధ్వర్యంలో 2013 జూన్ 8న చర్చిని పునఃప్రారంభించారు. దేవ దూతల విగ్రహాలు, ఏసు ప్రతిమలు, ఆయన శిష్యుల విగ్రహాలు ఎంతో ఆకట్టుకుంటాయి. తెల్లవారేదాకా ప్రార్థనలు 24వ తేదీ రాత్రి 11 గంటల నుంచి 25వ తేదీ తె ల్లవారుజాముదాకా..క్రిస్మస్ ప్రార్థనలు ఉంటాయి. మళ్లీ 31వ తేదీ రాత్రి నుంచి ప్రేయర్ చేయిస్తాం. భక్తులకు సౌకర్యాలు ఏర్పాటు చేశాం. ఇంకా ప్రత్యేక సందర్భాలను కూడా నిర్వహిస్తుంటాం. – ఆంథోని కడే పరంబిల్, చర్చి ఓసీడీ -
ఏసు ప్రాణత్యాగానికి ప్రతీకగా..
ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులు ఎంతో సంబరంగా జరుపుకునే పండుగ క్రిస్మస్. ఏసుక్రీస్తు జన్మదినం (డిసెంబర్ 25) సందర్భంగా జరుపుకునే పండుగ ఇది. ఏసుక్రీస్తు పుట్టిన రోజు కాబట్టి క్రైస్తవులంతా చర్చిలకి వెళ్లి ఆయన జన్మదినాన్ని అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఈ క్రమంలో క్రైస్తవుల పవిత్ర ప్రార్థనా మందిరాలైన చర్చిలను ఆ రోజు రంగు రంగు లైట్లతో, క్రిస్మస్ ట్రీతో అలంకరిస్తారు. అలాగే ప్రముఖ దేశాలైన లండన్, యురప్లలోని చర్చిలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. భిన్నమైన రూపశైలిలో అద్బుత కట్టడాలుగా పేరున్న ఈ చర్చిలకు ఓ విశేషమైన ప్రత్యేకత ఉంది. వాటి నిర్మాణాల వెనుక ఎన్నో విషయాలు ఉన్నాయి. ఈ సుప్రసిద్ధ ప్రార్థనా మందిరాలు ప్రపంచ వ్యాప్తంగా పర్యటకులను ఆకట్టుకుంటున్నాయి. ఇందులోని కొన్ని చర్చిలు చాలా సినిమాలలో కూడా కనిపించాయి. బైబిల్లో పేర్కొన్న రాజుల పేర్లను, ఏసుక్రీస్తు తల్లి మరియా పవిత్రకు, ఏసు ప్రాణత్యాగానికి ప్రతీకగా బెత్లెహాంలో నిర్మించిన చర్చిలకు ప్రపంచ మందిరాలలో పవిత్రంగా చూస్తారు. అలాంటి చరిత్ర కలిగిన ఈ అద్బుత కట్టడాల గురించి ఓ సారి తెలుసుకుందాం రండి! సాగ్రడా ఫ్యామిలియా, బార్సిలోనా, స్పెయిన్ ఇది ప్రపంచ ప్రముఖ చర్చిల్లో ఒకటి. స్పెయిన్‌లోని బార్సినాలోని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంలోని నిర్మించిన రోమన్ కాథలిక్ ప్రార్థన మందిరం. దీనిని 1882లో ప్రముఖ అర్కిటెక్చర్ ఆంటోని గౌడే నిర్మించారు. ఈ చర్చి నిర్మాణం 1882 లో ప్రారంభమైనప్పటికి దీనిని నిర్మాణం ఇప్పటికీ పూర్తి కాలేదు. అసంపూర్తిగా ఉన్నప్పటికీ ప్రపంచంలోని ప్రముఖ చర్చిలలో ఇది ఒకటిగా ఉంది. ఓ అద్భుత కళాఖండంతో నిర్మించిన ఈ మందిరానికి పర్యాటకులు ఫిదా అవుతున్నారు. ఏటా ఈ చర్చిని సందర్శించే వారి సంఖ్య లక్షల్లో ఉంటుంది. ఈ చర్చిపై నిర్మించిన 18 స్తంభాలు మందిరానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. అప్పటి అర్కిటెక్ గౌడే రూపొందించిన ఈ చర్చి ప్రకృతిని తలపించేలా ఉంటుంది. చర్చి లోపల నిర్మించిన స్తంభాలు మెలితిప్పినట్లుగా ఉండి కొమ్మల్లాంటి చెట్ల ఆకృతిలో ఉంటాయి. ఇవి పర్యటకులను విపరీతంతగా ఆకట్టుకుంటాయి. అలాగే చర్చి ముందు భాగంలో బేస్ వద్ద పాలరాతితో చెక్కిన రెండు తాబేళ్లు మందిరానికి ప్రత్యేక ఆకర్షణ. అవి భూమి, సముద్రాన్ని సమతుల్యం చేస్తున్నాయని చెప్పడానికి ఉదాహరణగా వాటిని అక్కడ చెక్కారు. ఇక చర్చి పైకప్పుపై చెక్కిన మొజాయిక్ నుంచి రాత్రి వేళ చర్చి లోపలికి చంద్రకాంతి పడటం వల్ల ఆ దృశ్యాన్ని చూడటానికి పర్యాటకులు ఆసక్తి చూపుతారు. చంద్రుడి కాంతితోవచ్చే వెలుగు వల్ల చర్చి బయట నుంచి చూసే వారికి ఓ లైట్ హౌజ్లా మెరిసిపోతూ ఉంటుంది. అందువల్ల దీనిని ‘లైట్ హౌజ్’ అని కూడా పిలుస్తుంటారు. అలాగే మందిరంపై నిర్మించిన 18 టవర్లకు ఒక ప్రత్యేకత ఉంది. అందులో ఒక స్తంభం కన్య మరియ మేరి మాతకు చిహ్నంగా నిర్మించగా.. 12 టవర్లను బైబిల్లో పేర్కొన్న అపొస్తులులకు ప్రాతినిధ్యం వహిస్తాయి. మరో నాలుగు స్థంభాలు వారిలోని నలుగురు సువార్తికులకు ప్రాతినిధ్యం వహిస్తాయి. ఇక మందిరంపై మధ్యలో నిర్మించిన అతిపెద్ద టవర్ ఏసుక్రీస్తును సూచిస్తుంది. 170 మీటర్ల ఎత్తులో ఉండి బార్సిలోనాలోని మౌంట్‌జ్యూక్ పర్వతం కంటే ఒక మీటర్ తక్కువగా ఉంటుంది. ఈ మౌంట్‌జ్యూక్ పర్వతం స్పెయిన్‌లో ఎత్తైనా పర్వతం. ఇప్పటికీ అసంపూర్ణంగా ఉండిపోయిన ఈ చర్చిని పర్యటించడానికి కనీసం వారం రోజులైన పడుతుంది. అయితే దీనికి ఇప్పటికీ మర్మత్తులు చేస్తూనే ఉన్నారు. అక్కడికి వచ్చే పర్యాటకులు ఈ చర్చి నిర్మాణం కోసం విరాళాలు కూడా ఇస్తుంటారు. ఎప్పుడు మరమ్మత్తులు చేస్తూ ఉన్న ఈ మందిరం 2026 నాటికి పూర్తికావచ్చు. సెయింట్ బాసిల్ కేథడ్రల్ చర్చి అత్యంత ప్రసిద్ధ చర్చిలలో ఒకటైనా ఈ సెయింట్ బాసిల్ కేథడ్రల్ చర్చిని ఒకే పునాదిపై తొమ్మిది ప్రార్థనా మందిరాలుగా నిర్మించారు. రష్యా రాజధాని మాస్కో నగరంలో ఉన్న ఈ చర్చి నిర్మాణం క్రీ.శ. 1561లో ఇవాన్ ది టెర్రిబుల్ పాలనలో పూర్తయింది. ఈ చర్చి అసాధారణమైన వివిధ రంగుల నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. సాగ్రడా ఫ్యామిలియా మాదిరిగా, ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం. ఇది పలు సినిమాల్లో కూడా కనిపిస్తుండం విశేషం. దీని లోపలి భాగంలో చాపెల్ నుంచి ఇరుకైన మెట్లు ఉండి, తక్కువ తోరణాలు, గజిబీజీ చాపెల్లతో నిర్మించబడిన ఉండటమే ఈ మందిరం ప్రత్యేకత. ఒకదానిని ఒకటి అనుకుని ఉండే ఈ చాపెల్లలోని ఒక్కోదానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. అవి.. పైకప్పు మధ్యలో ఉన్న టవర్ ఏసుక్రీస్తు తల్లి మేరిమాతకు చిహ్నంగా నిర్మించి.. దీనికి చర్చి ఆప్ ది ఇంటర్సేషన్ అని పేరు పట్టారు. ఇక కనిపించే నాలుగు పెద్ద గోపురాలు అష్టభుజి ప్రార్థన మందిరాలు(చర్చ్ ఆఫ్ ది హోలీ ట్రినిటీ, చర్చ్ ఆఫ్ స్టీస్ సిప్రీయన్& జస్టీనా, చర్చ్ ఆఫ్ ది ఐకాన్ ఆఫ్ సెయింట్ నికోలాస్ ది మిరాకిల్ వర్కర్, చర్చ్ ఆఫ్ ది ఎంట్రీ ఆఫ్ ది లార్డ్ జెరుసలేం) అనే బైబిల్లోని కొన్ని పవిత్ర స్థలాలకు ప్రతికగా ఈ పేర్లన పెట్టారు. బయటి నుంచి చూస్తే చిక్కుముడిగా కనింపిచే ఈ టవర్ల మధ్యలో నాలుగు చిన్నప్రార్థన మందిరాలు ఉన్నాయి. ప్రతి ప్రార్థనా మందిరం కజాన్‌కు వ్యతిరేకంగా చేసిన పోరాటంలోని సంఘటనకు, యుద్ధానికి గౌరవసూచికగా నిర్మించారు. ఈ సెయింట్ బాసిల్ కేథడ్రల్ రంగుల నిర్మాణం నిజంగా ఓ అద్బుతంలా ఉంటుంది. ఈ చర్చి రూపకర్త సెయింట్ బాసిల్ బ్లెస్డ్ను చర్చి లోపలి ప్రార్థనా మందిరంలో సందర్శించవచ్చు. అక్కడ ఆయన విగ్రాహన్ని వెండి పేటికలో ఉంచారు. అయితే ఇలాంటి అద్బుత కట్టడం మరెక్కడా ఉండకూడదనే ఉద్దేశంతో కూలీల కళ్లు తీయించి వారిని అంధులుగా మార్చాడట. నోట్రే డామ్ డి పారిస్- ఫ్రాన్స్: నోట్రే-డామ్ డి పారిస్ అనగా ‘అవర్ లేడీ ఆఫ్ పారిస్. దీనిని సింపుల్‌గా నోట్రే-డామ్ అని కూడా పిలుస్తారు. పారిస్‌లోని అరోండిస్మెంట్లో ఓలే డి లా సిటిలో తూర్పు చివరలో ఈ చర్చిని నిర్మించారు. కన్య మరియ మేరి మాతకు పవిత్రమైన పత్రికగా దీన్ని ప్రకటించారు. ఈ కేథడ్రల్ చర్చి లోపలి విస్తీర్ణం 427-157 అడుగులు(130 నుంచి 48మీటర్లు) దీని పైకప్పు 115 అడుగుల(35 మీటర్ల) ఎత్తులో ఉంటుంది. రెండు పెద్ద గోతిక్ టవర్లు 50 అడుగు వెడల్పు, 1210 పొడవును కలిగి ఈ మందిరానికి పశ్చిమ ముఖానికి కిరీటంగా ఉంటాయి. ఇక చర్చి ముఖ ద్వారం ప్రవేశ ద్వారం తలుపులు గోతిక్ శిల్పాలతో చెక్కబడిన రాజుల విగ్రహాలు వరుసగా ఉంటాయి. ముందు భాగంలో ఉన్న రెండు పెద్ద టవర్లు 68 మీటర్ల ఎత్తులో కలిగి 223 అడుగులు పొడవు ఉంటాయి. రంగులతో మెరిసేటి అద్దాల కిటికిలు 1235-70 పొడవు- వెడల్పులో ఉంటాయి. ముందు భాగంలో ఉండే పొడవైన రెండు స్తంభాలు లేక్కలేనన్ని గంటలను కలిగి ఉంటాయి. ఫ్రెంచ్ గోతిక్ రూపశైలిలో ఉండే నోట్రే-డామ్ చర్చి ప్రపంచ ప్రముఖ చర్చిలలో ఒకటిగా ప్రసిద్ది పొందింది. 1163లో పోప్ అలెగ్జాండర్-3 ఈ చర్చికి పునాది రాళ్లు వేయగా 1250 నాటికి ఈ చర్చి పురైంది. చర్చి నిర్మించిన 100 సంవత్సరాలకు మందిరం ముందు భాగంలోని రెండు ఎత్తైనా చాపెల్‌లను, ఇతర స్థంభాలను, విగ్రహాలను నిర్మించి ఈ ప్రార్థన మందిరాన్ని పూర్తి చేశారు. అయితే ఈ మందిరాన్ని 19వ శతాబ్థంలో పూర్వపు రెండు పవిత్ర ప్రార్థన మందిరాల నిర్మించినట్లు సమాచారం. సెయింట్ పీటర్స్ బసిలికా: వాటికన్ సిటి ఇది వాటికన్ సిటిలో ఉంది. దీనిని న్యూ సెయింట్ పీటర్స్ బసిలికా అని కూడా పిలుస్తారు. ఇటలీలో రోమ్‌లోని వాటికన్ నగరంలోనే ఇది పెద్దది. దీన్ని క్రైస్తవుల మతపరమైన చర్చిలన్నింటీ కంటే గొప్ప మందిరం. వాటికన్ నగరంలో సెయింట్ పీటర్ ప్రస్తుత బాసిలికా నగరంలో(రోమ్‌లోని ఒక ఎన్క్లేవ్), 2వ జూలియస్1506 లో ఈ మందిరం నిర్మాణాన్ని ప్రారంభించాడు. అయితే అది 1615 పాల్.వీ రాజు కాలంలో పూర్తైంది. సెయింట్ పీటర్ అపొస్తల రాజు నిర్మించిన మూడు ఎత్తైన బలిపీఠాలపై నుంచి నేరుగా క్రాసింగ్ వద్ద ఉన్న పెద్ద గోపురాన్ని కలుపుతూ నిర్మించారు. ఈ మందిరం అక్కడి పోప్‌ల చర్చే కాకుండా వారి ప్రధాన తీర్థయాత్ర కూడా. కాథలిక్ సంప్రదాయంలో, యేసు పన్నెండు అపొస్తలులలో ఒకడైన సెయింట్ పీటర్ శ్మశానవాటికగా భావిస్తారు. ఆయన సెయింట్ పీటర్ రోమ్ యొక్క మొదటి బిషప్ అని, బైబిల్ ప్రకారం.. క్రీ.శ. 1వ శతాబ్దంలోని రోమన్ క్రైస్తవులు అపొస్తలుడైన పేతురు(సెయింట్ పీటర్) రోమ్కు వెళ్లాడని బైబిల్లో పేర్కొన్నారు. పీటర్ చనిపోయిన తరువాత ఆయన మృతదేహాన్ని బాసిలికాలోని స్మశానవాటికలో ఖననం చేశారని అక్కడి వారి నమ్మకం. వెస్ట్ మినిస్టర్ అబ్బే యూరప్ దేశాలలోని అత్యంత ప్రసిద్ద మత భవనాలలో ఇది ప్రముఖమైనది. ప్రపంచంలోనే అత్యంత ప్రాముఖ్యత కలిగిన ప్రార్థన మందిరంగా దీన్ని పిలుస్తారు. లండన్ బరలిలోని పార్లమెంటు భవనానికి పశ్చిమాన ఈ మందిరాన్ని నిర్మించారు. మాజీ బెనెడక్టిన్ ఆశ్రమంగా ఉన్న ఈ మందిరాన్ని క్వీన్ ఎలిబెత్2, 1560లో సెయింట్ పీటర్ కాలేజీయేట్ చర్చిగా మార్చారు. ఆ తర్వాత 1987లో దీనిని సెయింట్ మార్గరేట్ చర్చి, పార్లమెంటు గృహాల సమిష్టి యునెస్కోగా నియమించారు. ఇది కూడా ప్రపంచ వారసత్వ స్థలం. ఈ ప్రార్థన మందిరాన్ని 1300 లో హెన్రీ యెవెల్ అనే రాజు ఆధ్వర్యంలో నార్మన్-శైలిలో నిర్మించారు. ఇంగ్లీష్ గోతిక్ డిజైన్ శైలిలో దీనిని నిర్మించారు. ఈ మందిరానికి పశ్చిమాన ఉన్న రెండు పెద్ద టవర్లు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. వీటిని సర్ క్రిస్టోఫర్ రెన్ రూపొందించినట్లు చెబుతారు. కాని అవి వాస్తవానికి నికోలస్ హాక్స్మూర్, జాన్ జేమ్స్‌లు నిర్మించినట్లుగా సమాచారం. ఈ చాపెల్‌లను వారు 1745 లో పూర్తిచేశారు. 1847 లోపలి గాయక స్టాల్స్, ఎత్తైన బలిపీఠం, రేడోలను పునర్నిర్మించి 1867లో సర్ జార్జ్ గిల్బర్ట్ స్కాట్ పూర్తిచేశారంటా. స్కాట్, జెఎల్ పియర్సన్ కూడా 1880 లలో ఉత్తర ట్రాన్సప్ట్ ముఖభాగాన్ని పుననిర్మించారు. అయితే రెండవ ప్రపంచ యుద్ధంలో బాంబు దాడుల్లో అబ్బే భారీగా దెబ్బతింది, యుద్దం అనంతరం ఈ మందిరాన్ని వెంటనే పునర్మించారు. లండన్‌లోని సెయింట్ పాల్స్ కేథడ్రాల్ ప్రపంచ ప్రముఖ చర్చిలలో ఒకటి. దీన్ని లండన్ బిషప్, డయోసెస్ తల్లి చర్చిగా పిలుస్తుంటారు. ఈ ప్రార్థనా మందిరాన్ని లండన్‌లోని ఎత్తైన లుడ్గేట్ కోండపై నిర్మించారు. అత్యంత ప్రముఖ, చరిత్రాత్మకంగా పేరున్న మందిరం ఇది. దీనిని పాల్ అపోస్తులు రాజు క్రీ.శ. 604లో దీన్ని నిర్మించడం జరిగింది. ఈ కేథడ్రల్‌ను 17వ శతాబ్ధపు రాజైన సర్ క్రిస్టోఫర్ రెన్ చేత ఇంగ్లీష్ బరోక్ శైలిలో నిర్మించారు. సర్ రెన్ కాలంలోనే ఈ చర్చి నిర్మాణం పూర్తిగా జరిగింది. ఈ చర్చిలో పాల్ అపోస్తుల రాజు గుర్తులు ఉండటం వల్ల దీనిని ఒల్డ్ సెయింట్ పాల్ చర్చి అని కూడా పిలుస్తుంటారు. ఈ మందిరంలో విక్టోరియా రాణి జూబ్లీ వేడుకలను, రెండవ ప్రపంచ యుద్ధాల ముగింపును సూచించే శాంతి సేవలు ప్రిన్స్ చార్లెస్, లేడీ డయానా స్పెన్సర్ వివాహం ఫెస్టివల్ ఆఫ్ బ్రిటన్ ప్రారంభంతో పాటు సిల్వర్, గోల్డెన్, డైమండ్ జూబ్లీలకు క్వీన్ ఎలిజబెత్-2 80, 90వ పుట్టినరోజు వేడుకలు, థాంక్స్ గివింగ్ సేవలు ఈ చర్చిలోనే జరిపారు. సెయింట్ పాల్స్ కేథడ్రల్‌కు సంబంధించిన గుర్తులు ఈ చర్చిలోనే భద్రపరిచారు. చర్చ్ ఆఫ్ ది నేటివిటీ: బెత్లెహాం బసిలికా ఆఫ్ ది నేటివిటీ ఇది బెత్లెహాంలోని వెస్ట్ బ్యాంక్‌లో ఉన్న బాసిలికా. యేసు జన్మస్థలంగా చెప్పుకునే ప్రదేశంలోనే ఈ చర్చిని నిర్మించారు. ఈ ప్రదేశం క్రైస్తవులకు పవిత్రమైన స్థలం, పవిత్ర ప్రార్థనా మందిరం. ఏసుక్రీస్తు ఇక్కడే నిరంతరం ప్రార్థనలు చేసుకునేవారని, అది గ్రోట్టో స్థలమని బైబిల్లో పేర్కొన్నారు. దీంతో క్రైస్తవులు ఈ స్థలాన్ని పవిత్రం స్థలంగా భావిస్తారు. 325-326లో బసిలికా అతని తల్లి హెలెనా జెరూసలేం, బెత్లెహాములను సందర్శించిన కొద్దిరోజులకే ఈ చర్చిని కాన్స్టాంటైన్ ది గ్రేట్‌గా నిర్మించారు. సాంప్రదాయకంగా ఏసు జన్మస్థలం అని భావించి ఇక్కడ బాసిలికా 330-333 కాలంలో నిర్మించినట్లు చెప్పుకుంటారు. 6వ శతాబ్ధంలో సమారిటన్ తిరుగుబాటు సమయంలో 529లో ఈ చర్చిని చాలా భాగాన్ని మంటలతో కాల్చేశారు. అయితే చాలా ఏళ్లకు మళ్లీ దీనిని బైజాంటైన్ చక్రవర్తి క్రీ.శ. 527-565 కాలంలో బాసిలికాను పునర్మించారు. 12వ శతాబ్దంలో క్రూసేడర్స్ చిత్రీకరించిన సెయింట్స్, ఫ్రెస్కోలతో అలంకరించారు. చర్చిలోకి చిన్న ఒట్టోమన్ యుగం నాటి తలుపు ద్వారం ఉంటుంది. దీనికి డోర్ ఆఫ్ రెస్పెక్ట్ అని పేరు పిలుస్తారు. అయితే వాస్తవానికి ఈ ప్రవేశ ద్వారం చాలా పెద్దది, కాని క్రూసేడర్లు దాని పరిమాణాన్ని తగ్గించి గుర్రంపై దాడి చేసేందుకు లోనికి ప్రవేశించకుండా చేశారు. ఆ తరువాత క్రమంగా దానిని అతిచిన్న ముఖ ద్వారంగా మార్చేశారు. 6వ శతాబ్దం నాటి అసలైన ద్వారానికి సంబంధించిన గుర్తులు ఇప్పటికీ అక్కడ కనిపిస్తాయి. క్రూసేడర్ల యుగంనాటి నిర్మాణ శైలిలో ఈ మందిరాన్ని నిర్మించారు. కాగా ఈ మందిరంలోని ఓ రహష్య చికటి గది లాంతర్లు వెలిగించి, 14 వెండి లైట్లతో అలంకరించి ఉంటుంది. ఏసుక్రీస్తు జన్మించిన స్థలం అదే అని చెప్పడానికి గుర్తుగా దానిని వెండి దీపాలతో అలంకరించారు. గ్రోట్టోలోని ఈ మందిరానికి పై మధ్య భాగంలో ఒక చాపెల్‌ను నిర్మించారు. దానిని ‘చాపెల్ ఆఫ్ ది మాంగెర్ (ది క్రిబ్) అని కూడా పిలుస్తారు. ఈ మందిరానికి, అదే ప్రత్యేక ఆకర్షణ. చర్చ్ ఆఫ్ ది హోలీ సెపల్చర్ దీనిని హోలీ సెపల్చర్ అని కూడా పిలుస్తారు, ఇది ఏసుక్రీస్తు సిలువ, ఖననం చేసిన పవిత్ర స్థలంలో నిర్మించిన ప్రార్థనా మందిరం. బైబిల్ ప్రకారం, ఏసుక్రీస్తు సమాధికి, సిలువ వేయబడిన ప్రదేశానికి దగ్గరగా ఉంది (జాన్ 19: 41:42). సిలువ, సమాధులను రెండింటి చూట్టు ఈ ప్రార్థన మందిరాన్నినిర్మించారు. ఓల్డ్ సిటీ ఆఫ్ జెరూసలేలోని వాయువ్యంలో హోలీ సెపల్చర్ చర్చి ఉంది. చక్రవర్తి కాన్స్టాంటైన్ ది గ్రేట్ అనే రాజు క్రీ.శ. 336లో సైట్లో అనే ప్రదేశంలో మొదటగా నిర్మించాడు. ఆ తరువాత 614లో పర్షియన్లు దీనిని కుల్చివేసి మోడెస్టస్ (థియోడోసియస్ ఆశ్రమ మఠాధిపతి, 616-626) పునరుద్ధరించారు. ఖలీఫ్ అల్-అకిమ్ బా-అమర్ అల్లాహ్ 1009లో దీనిని కుల్చివేయడంతో మళ్లీ 12వ శతాబ్దంలో క్రూసేడర్లు పునర్నిర్మాణాన్ని చేపట్టి ప్రార్థనలు చేసుకునేవారు. అలా తరుచూ మరమ్మత్తులు చేపడుతూ 1810 నాటికి పూర్తి చేశారు.. సెయింట్ మార్క్స్ బసిలికా వాస్తవానికి ఇది డోగే ప్రార్థనా మందిరం. సెయింట్ మార్క్స్ బసిలికా (బసిలికా డి శాన్ మార్కో) 829లో ముఖ్యమైన చర్చి. సెయింట్ మార్క్ యొక్క అవశేషాలు అలెగ్జాండ్రియా నుంచి వెనిస్కు వచ్చి ఇక్కడ ఖననం చేసినట్లుగా చెబుతారు. 1063 నాటి కాన్స్టాంట్ నోబెల్ చర్చ్ ఆఫ్ అపోస్టల్స్ చర్చి నమునాలను తీసుకుని ఇప్పటి గౌడే-ప్లాన్ శైలిలో నిర్మించారు. ఈ చర్చి నిర్మాణానికి 1075లో, డోజ్ ఒక చట్టాన్ని ఆమోదించి మరియు టింటోరెట్టితో సహా కళాకారులు రూపొందించిన ‘ఆధునిక’ మొజాయిక్లతో భర్తీ చేశారు. మొజాయిక్లు, బంగారు బలిపీఠం, అందమైన ప్రార్థనా మందిరాలు మరియు ఖజానా ఇటలీకి బాగా నచ్చిన పర్యాటక ఆకర్షణలలో ఒకటిగా నిలిచాయి. క్రీ.శ.1075 లోడోజ్ ఒక చట్టాన్ని ఆమోదించాడు, ఈ చర్చిని బాసిలికాను అలంకరించడానికి విలువైన వస్తువులను, తూర్పు నుంచి అరుదైన పాలరాయి, పోర్ఫిరీ, అలబాస్టర్ మరియు జాస్పర్ 500లకు పైగా స్తంభాలను తెప్పించి నిర్మించాడు. దీని లోపలి భాగాన్ని 12, 13 శతాబ్ధాల కాలం నాటి 4,240 చదరపు మీటర్ల బంగారు మొజాయికులతో నిర్మించాడు. 1500, 1750 మధ్య,కొన్ని పాత విభాగాలను టిటియన్, టింటోరెట్టోతో సహా కళాకారులు రూపొందించిన ఆధునిక మొజాయికన్లతో నిర్మించారు. అలాగే దీని ముఖభాగం ముందు రెండు పాలరాయి పైలాస్టర్లు, పిలాస్త్రీ అక్రితాని, ఆరవ శతాబ్దపు అద్భుతమైన శిల్పాలతో కప్పబడి ఉంటాయి. సెయింట్ మార్క్ మాదిరిగానే, ఈజిప్టు 4వ శతాబ్దంలోని మూలలోని టెట్రార్చ్స్ శిల్పం పోర్ఫిరీ నుంచి తీసుకుని ఈ శిల్పాలను రూపొందించారు. మొజాయిన్ల, బంగారు బలిపీఠం, అందమైన ప్రార్థనా మందిరాలు, ఖజానాలు ఉండటంతో ఇది ఇటలీలో అందమైన పర్యాటక ఆకర్షణలలో ఒకటిగా నిలిచింది. హగియా సోఫియా, ఇస్తాంబుల్, టర్కీ.. హగియా సోఫియా అనగా ‘పవిత్ర జ్ఞానం’ అని అర్ధం. ఇది మాజీ గ్రీకు ఆర్థోడాక్స్ పితృస్వామ్య ప్రార్థన మందరం. క్రీ.శ. 537లో నిర్మిచిన ఈ మందిరం క్రీ.శ.1453 వరకు మ్యుజియంగా ఉండేది. లాటిన్ సామ్రాజ్యంలో ఈ మందిరాన్ని రోమన్ కాథలిక్ కేథడ్రాల్ మందిరంగా మార్చారు. రెండు అంతస్తులుగా నిర్మించిన ఈ మందిరాన్ని క్రీ.శ. 537లో పూర్తిచేశారు. దీనిని 6 సంత్సరాలలో పూర్తి చేశారు. 6వ శతాబ్దంలో కాన్స్టాంటినోపుల్ (ఇప్పుడు ఇస్తాంబుల్, టర్కీ)లోని కేథడ్రల్ స్మారక చిహ్నంగా నిర్మించారు. దీనిపై నిర్మించిన గోపురం కేథడ్రల్‌కు చిహ్నం. హెలెన్ గార్డనర్, ఫ్రెడ్ క్లీనర్లు రూపొందించిన ఈ కట్టడాడంలో అసలు ఉక్కు పరికరాలను వాడకపోవడం ఈ మందిరానికి ఉన్న ప్రత్యేకత. ఈ మందిరాన్ని 270 అడుగుల (82 మీటర్లు) పొడవు మరియు 240 అడుగుల (73 మీటర్లు) వెడల్పులో నిర్మించారు. అలాగే దీనిపైన నిర్మించిన ప్రధాన గోపురం 108 అడుగుల (33 మీటర్లు) చర్చికి కిరీటంగా వ్యవహరిస్తుంది. ఈ గోపురం 180 అడుగుల (55 మీటర్లు) పెండెంటివ్స్ రెండు సెమిడోమ్లకు ప్రాతినిధ్యం వహిస్తుంది. మందిరంపైన నిలువుగా నిర్మించిన గ్యాలరీలతో వేరు చేసి ఉంటుంది. అలాగే మూడు అంతస్తుల మేట్లకు, గోపురానికి మద్దుతుగా ఓ పాలరాయి పైర్లను నిర్మించారు. గ్యాలరీలకు పైన ఉన్న గోడలు,గోపురం బేస్‌లు వివిధ డిజైన్ల కిటికీలచే అమర్చబడి ఉంటుంది. ఈ కిటికీల నుంచి వచ్చే గాలికి ఆకాశంలో తేలుతున్నట్లుగా అనిపిస్తుందని అక్కడ పర్యటించినవారు అంటుంటారు. 1,400 సంవత్సరాల కేథడ్రల్, మసీదుగా ఉండేది ఆ తర్వాత దీనిని ఈ చర్చిగా మార్చారు. ప్రస్తుతం ఇది పర్యటకానికి వీలుగా పురాతన వస్తువులను ఉంచే మ్యూజియంగా మార్చారు. దీనిని మొదటిసారి నిర్మించినప్పుడు, కాన్స్టాంట్నోబుల్లో ఇని బైజాంటైన్ సామ్రాజ్యానికి రాజధానిగా ఉండేది. ఇది అధికారికంగా క్రిస్టియన్, రోమన్ సామ్రాజ్యం తూర్పు భాగంలో ఉంది. - స్నేహలత (వెబ్ డెస్క్) -
క్రిస్మస్ సంబరాలకు చారిత్రక చర్చిలు
డిసెంబర్ నెల అంటే టక్కున గుర్తొచ్చేది క్రిస్మస్ పండుగ. ప్రపంచవ్యాప్తంగా క్రిస్టియన్లు ఈ పండుగను తమదైన శైలిలో అంగరంగవైభవంగా పండుగను జరుపుకుంటారు. దాదాపు డిసెంబర్ నెల మొత్తం చర్చిలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటాయి. హైదరాబాద్ నగరంలో క్రిస్మస్ వేడుకలు కొంత ప్రత్యేకమేనని చెప్పొచ్చు. ఎందుకంటే కులమతాలతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రజలు క్రిస్మస్ వేడుకలను జరుపుకుంటారు. అంతేకాకుండా ఈ వేడుకల్లో వందేళ్లకుపైగా చరిత్ర కలిగిన చర్చిలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. నగరం నలుమూలలనుంచి ప్రజలు ఇక్కడకు చేరుకుని ప్రార్థనలు నిర్వహిస్తారు. ఆంగ్లేయుల ప్రార్థనల కోసం.. నిజాం పాలకులు బ్రిటిషర్లకు అప్పగించిన సికింద్రాబాద్‌ను ఆంగ్లేయులు మిలిటరీ స్థావరంతో (కంటోన్మెంట్) పాటు హైదరాబాద్‌కు సమాంతర నగరంగా తీర్చిదిద్దారు. ఓ వైపు మిలిటరీ శిక్షణ కేంద్రాలు, మిలిటరీ ఆంక్షల నడుమ వ్యాపార, వాణిజ్య కేంద్రాలు, సామాన్యుల జనావాసాలు అభివృద్ధి చెందుతూ వచ్చాయి. ఈ క్రమంలోనే బ్రిటిష్ పాలకులు తాము ప్రార్థనలు చేసుకునేందుకు వీలుగా నగరమంతటా చర్చిల నిర్మాణం ప్రారంభించారు. ప్రస్తుతం నగరంలో ఉన్న వందకుపైగా చర్చిలలో కొన్ని వందేళ్లకుపైగా చరిత్ర కలిగినవి ఉన్నాయి. సెయింట్ జాన్ ది బాప్టిస్ట్ చర్చి ఈ చర్చి సికింద్రాబాద్‌లోని ఈస్ట్ మారేడ్‌పల్లిలోని ప్రముఖమైన చర్చి. 1813లో నిర్మితమైన ఈ చర్చి జంటనగరాల్లోనే అత్యంత పురాతనమైంది. లాన్సర్స్ లైన్‌లోని బ్రిటిష్ కుటుంబాలు ప్రార్థన చేసుకునేందుకు వీలుగా దీనిని నిర్మించారు. 1998లో ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ అవార్డును దక్కించుకుంది. 111 ఏళ్ల నాటి ‘పైప్ ఆర్గాన్’ నేటికీ వినియోగంలో ఉండటం దీని ప్రత్యేకత. చర్చి ప్రారంభించిన మొదట్లో ఆంగ్లేయులే మాత్రమే వెళ్లేవారు. కానీ ప్రస్తుతం నగరంలోని క్రైస్తవులు పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారు సెయింట్ మేరీస్ చర్చి నగరంలోని అత్యంత ప్రముఖమైన చర్చిగా సెయింట్ మేరీస్ చర్చి ప్రాముఖ్యత సంతరించుకుంది. ఈ చర్చిని గోతిక్ శైలిలో నిర్మించారు. అత్యంత పురాతనమైన రోమన్ క్యాథలిక్ చర్చి ఇది. ఐరిష్ క్యాథలిక్స్‌తో కలిసి ఫాదర్ డేనియల్ మర్ఫీ 1840లో ఈ చర్చి నిర్మాణాన్ని ప్రారంభించగా, 1850లో పూర్తయింది. 1886 వరకు హైదరాబాద్ ఆర్చ్ డయాసిస్ ప్రధాన చర్చి (క్యాథెడ్రల్)గా కొనసాగింది. చాలాకాలం ఆర్చ్ డయోసిస్ ఆఫ్ హైదరాబాద్ ప్రధాన చర్చిగా కొనసాగింది. రోమన్ క్యాథలిక్ చర్చిలలో ప్రముఖమైన వాటికి దక్కే ‘బాసిలికా’ గుర్తింపును ఈ చర్చికి 2008లో ఇచ్చారు. ‘బాసిలికా ఆఫ్ అవర్ లేడీ ఆఫ్ ది అసెంప్షన్’గా కూడా వ్యవహరిస్తారు. కన్య మేరీ యేసు క్రీస్తును చేతుల్లో పట్టుకున్న దృష్యం భావోద్వేగ పూరితంగా ఉంటుంది. క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. సెయింట్ థామస్ ఎస్పీజీ చర్చి సికింద్రాబాద్‌లోని పురాతన చర్చిలలో అత్యంత ముఖ్యమైన చర్చ. ఒకటి. ఈ చర్చికి సంబంధించిన స్థలాల్లో చాలావరకు అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం తీసుకుంది. ప్రస్తుత సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ స్థలం ఒకప్పుడు ఈ చర్చి ఆధ్వర్యంలోనిదే. 1852లో నిర్మితమైంది. సెంటినరీ బాప్టిస్ట్ చర్చి ఈ చర్చి సికింద్రాబాద్‌లో అత్యంత ప్రాముఖ్యమైన చర్చి. బాప్టిస్ట్ చర్చిగా రెవరెండ్ డబ్ల్యూ.డబ్ల్యూ. క్యాంప్‌బెల్ ఆధ్వర్యంలో 1875లో ఏర్పాటైంది. 1975లో పునర్నిర్మాణం చేపట్టగా 1991లో పూర్తయింది. ఈ చర్చి ఆధ్వర్యంలో జంటనగరాల్లోని 35 చర్చిలు కొనసాగుతున్నాయి. నగరంలోని ప్రముఖ చర్చిలలో చాలా ముఖ్యమైనది. ఆల్ సెయింట్స్ చర్చి చర్చి ఆఫ్ ఇంగ్లండ్ ఆధ్వర్యంలో 1860లో తిరుమలగిరిలో నిర్మితమైన ఈ చర్చి నిర్వహణ ఆర్మీ ఆధ్వర్యంలోనే ఉండేది. స్వాతంత్య్రానంతరం ఆంగ్లికన్, ప్రొటెస్టెంట్ల సమ్మేళనంతో ఏర్పాటైన ‘చర్చి ఆఫ్ సౌత్ ఇండియా’ (సీఎస్ఐ) పరిధిలోకి వచ్చింది. క్వీన్ ఎలిజిబెత్– 2 భర్త ఫిలిప్‌తో పాటు 1983లో నగరాన్ని సందర్శించారు. వారి 36వ వివాహ వార్షికోత్సవాన్ని ఈ చర్చిలోనే జరుపుకొన్నారు. ప్రతి వారం ఇంగ్లీష్, తమిళ భాషలలో నిర్వాహకులు తమ సేవలను అందిస్తున్నారు. పెద్ద సంఖ్యలో ప్రజలు క్రిస్మస్ వేడుకలను జరుపుకుంటారు. హోలీ ట్రినిటీ చర్చి ఈ చర్చి సికింద్రాబాద్‌లో అత్యంత ప్రసిద్డి గాంచిన చర్చి. చర్చి ఆఫ్ సౌత్ ఇండియా (సీఎస్ఐ) ఆధ్వర్యంలో కొనసాగుతోంది. ఈ చర్చి విక్టోరియన్ గోతిక్ శైలిలో నిర్మించారు. 1847లో అప్పటి బ్రిటిష్ రాణి క్వీన్ విక్టోరియా తన సొంత డబ్బులతో బొల్లారంలో నిర్మించారు. ఈ చర్చిని క్వీన్ చర్చిగా పిలుస్తారు. క్రిస్మస్ వేడుకలకు ప్రజలు పెద్ద యెత్తున పాల్గొంటారు. గారిసన్ వెస్లీ చర్చి సికింద్రాబాద్‌లోని తిరుమలగిరిలో ఈ చర్చి ప్రాముఖ్యతను సంతరించుకుంది. 1853లో నిర్మాణం ప్రారంభించగా, 1883 నుంచి వినియోగంలోకి వచ్చింది. స్వాతంత్య్రానికి పూర్వం కేవలం ఆర్మీ అధికారుల కుటుంబాలు మాత్రమే ఈ చర్చిలో ప్రార్థనలు చేసేవారు. క్రిస్మస్, గుడ్ఫ్రైడ్డే వేడుకలు ఈ చర్చిలో ఘనంగా నిర్వహిస్తారు. మిలీనియం మెథడిస్ట్ చర్చి ఈ చర్చి సరోజిని దేవి రోడ్, సికింద్రాబాద్‌లోని చాలా ముఖ్యమైన చర్చి. మెథడిస్ట్ ఎపిస్కోపల్ చర్చికి చెందిన మిషనరీస్ ఆధ్వర్యంలో 1882లో నిర్మితమైంది. మెథడిస్ట్ చర్చిగా ప్రారంభమైన ఈ చర్చిని 2001లో పునర్నిర్మించాక మిలినియం మెథడిస్ట్ చర్చిగా నామకరణం చేశారు. ఈ చర్చిలో పెద్ద యెత్తున ప్రజలు క్రిస్మస్ పండుగను జరుపుకుంటారు. సెయింట్ జోసెఫ్ చర్చి ఇది నగరంలోని అత్యంత ప్రముఖమైన చర్చి. అబిడ్స్‌లోని ఈ చర్చిలో ప్రార్థనలు చేయడానికి అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొంటారు. ప్రజలు పెద్ద సంఖ్యలో క్రిస్మస్ వేడుకలను జరుపుకుంటారు. సంవత్సరం పొడువున పర్యాటకులు ఈ చర్చిని సందర్శిస్తుంటారు. సెయింట్ జార్జ్ చర్చి-కింగ్ కోఠి హైదరాబాద్- ఇది చాలా పురాతనమైన చర్చి, హైదరాబాద్ వారసత్వ సంపదలో ఈ చర్చికి చోటు కల్పించారు. చర్చ ఆఫ్ సౌత్ ఇండియా ఆధ్వర్యంలో ఈ చర్చి కొనసాగుతుంది. క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. నగరంలోని ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. గ్రాండ్ క్రిస్మస్ కార్నివాల్ నగరంలో క్రిస్మస్ వేడుకలలో కార్నివాల్ వేడుకలను ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ కార్యక్రమంలో సంగీతం, ఆహారం & షాపింగ్ సదుపాయం కల్పిస్తారు. లైవ్ బ్యాండ్ ప్రదర్శనలు, క్రిస్మస్ కరోల్స్, మీట్ అండ్ గ్రీట్ శాంతా క్లాజ్ వంటి కార్యకలాపాలతో ప్రత్యేక ఆకర్శనగా నిలుస్తాయి. ఓపెన్ మైక్, రాప్ ఛాలెంజ్, హిప్ హాప్ ఛాలెంజ్, కాస్ ప్లే పోటీలు, డ్రాయింగ్ పోటీలు, ఫ్యాన్సీ దుస్తులు, లిటిల్ శాంటా పోటీలు యువత ఉత్సాహంగా పాల్గొంటారు. వైవిధ్యమైన ఆటలతో కుటుంబాలకు వినోదం లభిస్తుంది. డిసెంబర్ 15 న ప్రారంభమైన కరోల్స్ ఆదివారం వివిధ చర్చిలలో ముగిసింది. క్రిస్మస్ రోజున మెథడిస్ట్ చర్చిలో పేదలు, వితంతువులకు ప్రత్యేక బహుమతులు, విద్యార్థులకు ఆర్థిక సహాయం అందజేస్తారు. క్రిస్మస్ వేడుకలకు తెలంగాణ ప్రభుత్వం 15కోట్లు విడుదల చేసింది. మైనారిటీ సంక్షేమ శాఖ ఈ నిధులను కేటాయించింది. ఇప్పటికే తెలంగాణలోని అన్ని జిల్లాలకు నిధులు పంపిణి జరిగిందని సంబంధిత అధికారులు తెలిపారు. - రవికాంత్ (వెబ్ డెస్క్) -
దేవుని ప్రేమను చర్చి ప్రత్యక్షంగా కనపర్చాలి
కాకులా? అరవడానికి తప్ప అవెందుకు పనికొస్తాయి? అంటుంది లోకం. కరువులో చిక్కుకున్న నా సేవకుడు ఏలియాను పోషించేందుకు కాకులు నాకు చాలా ఉపయోగకరమైనవి అంటాడు దేవుడు. మనిషి ఆలోచనలకు, దేవుని ఆలోచనలకూ మధ్య ఇంత తేడా ఉంటుంది. కరువులో, కారడవిలోని కెరీతు వాగు దగ్గరి ఒక గుహలో ప్రార్థనాదీక్షలో అజ్ఞాతంగా ఉన్న ఏలియాకు మరి ఆహారమెలా? అని ఆలోచించిన ప్రేమామయుడు దేవుడు. అందువల్ల ప్రవక్తకు దేవుడు ప్రతిరోజూ కాకులతోనే ఆహారం పంపి పోషించాడు ( 1 రాజులు 17:4–6). ఇలా పేదలు. ధనికులు, పండితులు, పామరులన్న వివక్షకు తావులేని సమదృష్టి, సమ న్యాయమున్న దేవుని అనంతమైన ప్రేమను అపొస్తలులు సరిగ్గా ఒడిసిపట్టుకున్నారు కాబట్టే వాళ్ళు స్థాపించిన ఆదిమ చర్చి పేదరికంలో కూడా అత్యంత ప్రభావంతో విస్తరించి దేవునికి మహిమ తెచ్చింది. ఆదిమ కాలంలో చర్చిలన్నీ పేదలు, శరణార్థులైన విశ్వాసుల ఇళ్లలోనే స్థాపించబడ్డాయి, అందువల్ల చర్చి అనేది ఒక అనువైన స్థలమే తప్ప, అందమైన మహా కట్టడం కాదు. అయితే దేవుని సహజ స్వభావమైన సార్వత్రిక ప్రేమ, సమన్యాయం, సమదృష్టికి దూరంగా, విరుద్ధంగా నడిచే ఏ చర్చి, పరిచర్య, విశ్వాస జీవితమైనా అది దైవవ్యతిరేకమైనదే. యేసు పరలోకారోహణ తర్వాత ఆనాడు మేడగదిలో వినూత్న విశ్వాసుల సమక్షంలో, వాళ్ళే సభ్యులుగా ఆవిర్భవించిన ‘చర్చి’ దేవుని అద్భుతమైన ప్రేమకు మరో సాదృశ్యం, సాధనం కూడా. అందుకే యేసుప్రభువు ప్రేమను భూదిగంతాలకు వెళ్లి ప్రకటించాలన్న దేవుని మహాభీష్టాన్ని నెరవేర్చే విశ్వాససమూహమైన చర్చికి యేసు ప్రభువే శిరస్సని పౌలు తన పత్రికల్లో వర్ణించాడు. చర్చికి దేవుడిచ్చిన విశిష్టమైన స్థానమిది. అయితే రాను రానూ బాహ్యసౌందర్యానికి, సంఖ్యాబలానికే ప్రాముఖ్యతనిచ్చిన కారణంగా కాపరులకు, చర్చి సభ్యులకు మధ్య అసలు సంబంధమే లేని మెగా చర్చిలు ఆవిర్భవించాయి. చర్చి కాపరి, చర్చిలో విశ్వాసులతోనే నివసిస్తూ ఒక తండ్రిగా, దేవుని ప్రేమ మూర్తీభవించిన ఒక నిస్వార్థ నాయకుడుగా, వారి కష్ట సుఖాల్లో పాలుపంచుకునే ఆప్తుడని అర్థం. ఆదిమ అపొస్తలులు అలాగే ఉన్నారు అందుకే చర్చి ద్వారా దేవుని ప్రేమ భూదిగంతాలకు పాకింది. అయితే చర్చి భవనాలు గొప్పగా నిర్మించి తాము కూడా చాలా గొప్పవాళ్లమనిపించుకోవాలన్న పరిచారకుల దురాశయం కారణంగా, మెగా చర్చిలు ఏర్పడ్డాయి.కానీ ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం, నిరాశ్రయులను, నిరుపేదలను ఆదరించడమే నిజమైన క్రైస్తవమనే సత్యం మాత్రం పూర్తిగా మరుగున పడింది (మత్తయి 25: 35,36). ధనార్జనే ధ్యేయం గా, చివరికి బైబిల్లోని దశమభాగం సూత్రాన్ని వక్రీకరించి, నిరుపేదల నుండి కూడా ముక్కుపిండి డబ్బు వసూలు చేసే సుంకరుల్లాంటి కాపరుల తరంలో చర్చి వ్యాపార కేంద్రంగా మారింది. ఒక్క చర్చి కోసం పడే శ్రమతోనే, వంద చర్చిల కానుకల్ని రాబట్టాలన్న వ్యాపారపు కాసుల గోలే తప్ప, విశ్వాసుల సంక్షేమమే పట్టని ఇలాంటి ‘చర్చి’కి యేసు శిరస్సు ఎలా అవుతాడు? దేవుడే విశ్వాసులతో పాటు ఉండాలనుకొని తనను తాను ‘ఇమ్మానుయేలు’ అంటే ‘దేవుడు మనకు తోడు’ అని పిలిపించుకోగా, విశ్వాసులకు దూరంగా ఉండాలనుకునే బోధకుడు ఆ దేవుని ప్రతినిధి ఎలా అవుతాడు? మంచి కాపరి తన గొర్రెల కోసం ప్రా ణం పెడతాడని యేసుప్రభువన్నాడు (యోహాను 10:11). అలాంటి ప్రభువు దృష్టి్టలో ఈ కాపరులు ఏమవుతారు? కాకులు కూడా నాకు కావాలనుకున్న దేవుని ప్రేమ ఎక్కడ? ఎంతటి విశ్వాసులైనా నాకు వాళ్ళఖ్ఖర్లేదు. వాళ్ళిచ్చే కాసులు, నాకొచ్చే పేరే నాకు ముఖ్యం అనుకునే ఈ చర్చిలు, కాపరులెక్కడ? –రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ సంపాదకులు, ఆకాశధాన్యం -
పాలరాతి శిథిలాలు కాకూడదు మన చర్చిలు
నీ క్రియలన్నీ, నీ కష్టాన్నంతా, నీ సహనాన్నంతా నేను యెరుగుదునంటూ ప్రకటన గ్రంథంలోని ఎఫెసు చర్చికి కితాబునిస్తున్నాడు పరిశుద్ధాత్ముడు. ప్రభువు కోసం పరిచర్య చెయ్యడంలో ఆ చర్చి ఎన్నడూ వెనకంజ వెయ్యలేదు. ఆ చర్చిలో తప్పుడు పనులున్నాయి, విచ్చలవిడిగా లైంగిక స్వేచ్ఛను ప్రోత్సహించే నీకొలాయితులనే వారి దుర్బోధలున్నాయి. అయితే వారి విషయం నాకెందుకులే అని ఊరుకోకుండా, ప్రభువు ద్వేషించే అలాంటి జుగుప్సాకరమైన విషయాలు, బోధలను ఎఫెసీ చర్చి కూడా వ్యతిరేకించి తన ప్రత్యకతను చాటుకుంది. ఒకప్పుడు యెరూషలేము చర్చికి చెందిన భక్తిపరులైన ఏడుగురు పెద్దలను అపొస్తలులు ఏర్పర్చి, ప్రార్థించి వారిని పరిచర్య కోసం ప్రతిష్టించారు (అపో.కా 6:5.6). వారిలో స్తెఫను ఆదిమ హతసాక్షి అయ్యాడు. కానీ నికోలాసు అనే మరో పెద్ద అభిషేకం పొంది కూడా లైంగిక విశృంఖలత్వాన్ని బోధిస్తూ విశ్వాసభ్రష్టుడయ్యాడు, చర్చిలో చాలామందిని ఆ బోధ దారి మళ్లిస్తుంటే ఎఫెసు చర్చి ఆ చాలా ఖచ్చితమైన వైఖరితో వారిని ఖండించి పారదోలింది.అది దేవునికి ఎంతో సంతోషాన్ని కలిగించింది (ప్రక 2:1–7). దేవుని నిర్మలమైన ప్రేమను ప్రకటించే చర్చిలోనే అవినీతి నిండితే, అరాచకాలు, అపవిత్రత, ఆశ్రిత పక్షపాతానికి అది నిలయమైతే, ఆ చర్చి లోకానికి వెలుగునేలా చూపిస్తుంది. ఒకప్పుడెంతో గొప్పపేరున్న ఓ చర్చిలో ఇప్పుడు అక్కడి బోధకులు ‘రూతు–బోయజు’ ఉదంతాన్ని ప్రసంగాంశంగా తీసుకొని వారికి సంబంధించి చేసిన అనుచితమైన వర్ణనలు, వ్యాఖ్యలు, వివరణలు వింటూ చర్చిలో ఆడాళ్ళంతా తల దించుకున్నారు, చాలా మంది లేచి వెళ్లి పోయారట. అంటే ఇది మీ చర్చి, మీ ప్రసంగాలు మీరు చేసుకోండంటూ చర్చిని వదిలేసి, వారిని ప్రోత్సహించేందుకు కొన్ని కానుకలేసి మరీ వెళ్లిపోయారట. ఇదీ ఆ సభ్యుల ఆత్మీయ అపరిపక్వత, నిర్వాకం, భ్రష్టత్వం, చేతకాని తనం. ఆ పాస్టర్ ఎలాగు శాపగ్రస్థుడే అన్నది అతని జీవితాన్ని, కుటుంబాన్ని చూస్తేనే తెలుస్తుంది. కానీ చర్చి సభ్యులు అతన్ని నిలదీయొద్దా? అంటే పాస్టర్ కన్నా భ్రష్టులు ఆ చర్చి పెద్దలు, సభ్యులని దేవుడే తేల్చి వారిని పక్కన బెట్టాడన్న మాట. ఎఫెసీ చర్చిలో మాత్రం అలాంటి పప్పులుడకవు. అందుకే ఆయన అంతగా ఆ చర్చిని శ్లాఘించాడు. అయితే నీ మొదటి ప్రేమను జ్ఞాపకం చేసుకో, ఎక్కడి నుండి ఆరంభించి ఎక్కడపడ్డావో గుర్తు చేసుకోమ్మన్నాడు దేవుడు. ఇది చాలా ప్రాముఖ్యమైన హెచ్చరిక. పెళ్లయిన మొదటి రోజున వధూవరుల మధ్య కనిపించే ప్రేమానుభూతులు జీవితమంతా కొనసాగితే అదెంత భాగ్యం కదూ!! కానీ కొన్నిసార్లు ఆ మొదటి ప్రేమ క్రమంగా చల్లారిపోతుంది. ఇద్దరూ విడిపోరు, కలిసే ఉంటారు. ఇంట్లో కార్యక్రమాలన్నీ యధావిధిగానే సాగుతుంటాయి. కాకపోతే ఆ కార్యాలు ప్రేమతో కాక ఒక తంతులాగా సాగుతాయి... అప్పటికి పిల్లలు పుడతారు, బాధ్యతలు పెరుగుతాయి. అయితే వాళ్ళిద్దరినీ ఒకటిగా పట్టి ఉంచేది వారి మధ్య ఒకప్పుడుండిన ప్రేమ కాదు, పిల్లల పట్ల బాధ్యతలే వారిని కలిపి నడుపుతుంటాయి. యేసును ఆరాధించే చర్చి యేసును ప్రేమించకుంటే ఎలా? యేసును ప్రేమించకుండానే చర్చిని నడుపుతామంటే ప్రేమ కరువైన ఆ దంపతుల కుటుంబం లాగే చర్చి నడుస్తుందేమో కానీ దేవుడందులో ఉండడు. నీ కొలాయితులను చర్చీ నుండి తరిమేయ్యడం ఎంత కష్టమో, పాత ప్రేమల్ని పునరుద్ధరించుకోవడం అంతకన్నా కష్టం. ఈ రెండూ జరగకుంటే ‘నీ దీపస్తంభాన్ని దాని చోటి నుండి తొలగించేస్తానని’ దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఇది చాలా తీవ్రమైన శిక్ష. దీపం ఆరిపోయిన చర్చి అంటే వైభవం, ప్రభావం కోల్పోయి విశ్వాసులైన జనం లేక శిథిలాలుగా మారడమన్న మాట. ఇప్పుడంతటా అవే కనిపిస్తున్నాయి. ఆరంభంలో పౌలు ఎఫెసు చర్చిలో మూడేళ్లు పరిచర్య చేశాడు. అయితే అది కనుమరుగయ్యింది. టర్కీ దేశంలో ఒకప్పుడా చర్చి ఉన్న ప్రదేశంలో ఇపుడు శిథిలాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా చాలా చోట్ల అవి చర్చిలన్న బోర్డులు కనిపిస్తాయి, కానీ వాస్తవానికవి శిథిలాలే!! ఆ చర్చి ఎంత అందమైన పాలరాతి భవనమైనా, అందులో అపవిత్రత ఉంటే అది యేసు లేని పాలరాతి శిథిలమే!! – రెవ. డా. టి.ఎ.ప్రభుకిరణ్ -
ఇండోనేసియాలో ఉగ్రదాడి
సురబయ: ఇండోనేసియాపై ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. దేశంలోని రెండో అతిపెద్ద నగరమైన సురబయలోని మూడు చర్చిలపై ఆత్మాహుతిదళ ఉగ్రవాదుల దాడిలో 13 మంది మృతిచెందగా.. 41 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ఓ మహిళ, ఓ చిన్నారి కూడా ఉన్నారు. ఇండోనేసియాలో మైనారిటీలైన క్రిస్టియన్లపై కొంతకాలంగా దాడులు జరుగుతున్నప్పటికీ.. 2000 తర్వాత వీరిపై ఉగ్రదాడి జరగటం ఇదే తొలిసారని స్థానిక పోలీసులు పేర్కొన్నారు. సురబయలోని సాంటామారియా రోమన్ కేథలిక్ చర్చిపై ఉదయం 7.30 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) తొలిదాడి జరిగింది. ఇద్దరు ఆత్మాహుతి దళ సభ్యులతోపాటు నలుగురు మృతిచెందారు. ఇది జరిగిన కొద్ది నిమిషాల్లోనే సమీపంలోని క్రిస్టియన్ చర్చ్ ఆఫ్ డిపొనెగొరోలో రెండో ఉగ్రదాడి జరిగింది. వెంటనే మాంగెరలోని పెంతెకోస్ట్ చర్చ్‌పై ఉగ్రవాదులు దాడిచేశారు. ఘటన గురించి తెలియగానే ఇండోనేసియా అధ్యక్షుడు జోకో విడోడో సురబయ చేరుకుని బాధితులకు అందుతున్న వైద్యసేవలను సమీక్షించారు. ఈ ఘటనకు తామే బాధ్యులమని ఐసిస్ పేర్కొంది. ఉగ్రవాదులంతా ఒకే కుటుంబం వారే ఈ మూడు దాడుల్లో ఆరుగురు ఆత్మాహుతి బాంబర్లు పాల్గొన్నారని పోలీసులు తెలిపారు. దాడులకు పాల్పడిన ఆరుగురు ఒకే కుటుంబానికి చెందిన వారని.. ఇందులో ఇద్దరు బాలికలు కూడా ఉన్నారని పోలీసులు వెల్లడించారు. తల్లిదండ్రులతోపాటు ఇద్దరు కూతుళ్లు (9, 12 ఏళ్లు), ఇద్దరు యువకులు ఈ దాడిలో పాల్గొన్నారని వెల్లడించారు. ఈ కుటుంబమంతా ఇటీవలే సిరియానుంచి తిరిగి వచ్చిందని స్థానిక మీడియా పేర్కొంది. నలుగురు ఉగ్రవాదుల కాల్చివేత ఆదివారం తెల్లవారుజామున వెస్ట్ జావా టౌన్స్‌లో నలుగురు అనుమానిత ఉగ్రవాదులను పోలీసులు కాల్చిచంపారు. మరో ఇద్దరిని అరెస్టు చేశారు. అయితే ఈ ఘటనకు నిరసనగానే దాడి జరిగి ఉంటుందా? అనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. అరెస్టయిన వారు ఇండోనేసియాలో దాడులకు పాల్పడుతున్న జేఏడీ సభ్యులని సమాచారం. -
చర్చిలపై కేంద్రమంత్రి వ్యాఖ్యలు
తిరువనంతపురం: చర్చిలు రాజకీయాలకు దూరంగా ఉండాలని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. ఆయన తిరువనంతపురంలో మీడియాతో మాట్లాడారు. క్రైస్తవ ప్రార్థనా మందిరాలు ఆధ్యాత్మిక కార్యకలాపాలపైనే దృష్టి పెట్టుకోవాలని, రాజకీయాల జోలికి రావద్దని కోరారు. కేరళలో బీజేపీ అభివృద్ధికి అక్కడి చర్చిలు ఆటంకంగా మారాయని భావిస్తున్నారా అని అడిగిన ప్రశ్నకు ఆయన ఈ విధంగా జవాబిచ్చారు. కాంగ్రెస్ ‘మునిగిపోయే పడవ’ లాంటిదని, తెలివైన వారెవరూ అందులో ఉండరని అన్నారు. కేరళ కాంగ్రెస్ నాయకులు తమ పార్టీలో చేరేలా ఎలాంటి ప్రయత్నాలు చేయటం లేదని అన్నారు. తమ పార్టీలతో చేరేందుకు పలువురు నాయకులు సంప్రదింపులు జరుపుతున్నారని అన్నారు. 2014 ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ఉన్న పార్లమెంటరీ నియోజకవర్గాల్లో బీజేపీ రెండో స్థానంలో నిలిచిన ప్రాంతాలపై తాము దృష్టిపెట్టామని చెప్పారు. ఇందులో భాగంగానే ప్రస్తుతం రాష్ట్రంలో పర్యటిస్తున్నానని తెలిపారు. కేరళ అసెంబ్లీలో 140 మంది సభ్యులుండగా బీజేపీకి కేవలం ఒకే ఒక్క సభ్యుడు ఉన్నారు. లోక్‌సభ, రాజ్యసభల్లో కేరళ రాష్ట్రం నుంచి బీజేపీకి ప్రాతినిధ్యం లేదు. -
హిందూ నాయకుల హత్యకు కుట్ర!
న్యూ ఢిల్లీ: దేశంలో కల్లోలం సృష్టించడానికి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్.. దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ పెద్ద స్కెచ్చే వేసిందని చెతుతోంది జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ). దేశంలోని ప్రముఖ హిందూ నాయకులు, చర్చిలను టార్గెట్ చేసి దాడులు జరపాలని దావూద్ 'ఢీ కంపెనీ' ప్రణాళికలు సిద్ధం చేసిందని.. గుజరాత్లో ఇద్దరు బీజేపీ నాయకుల హత్యకేసుకు సంబంధించిన చార్జ్‌షీట్‌లో ఎన్ఐఏ స్పష్టం చేసింది. 2002 గుజరాత్ అల్లర్లకు ప్రతీకారంగా ఈ దాడులు జరపాలని 'ఢీ కంపెనీ' యోచిస్తున్నట్లు ఎన్ఐఏ వెల్లడించింది. హిందూ నేతలు, చర్చిలపై దాడులు జరపడం ద్వారా దేశంలో కల్లోల పరిస్థితులు సృష్టించాలని భావిస్తున్నారని ఎన్ఐఏ పేర్కొంది. ఇందుకోసం యువతకు భారీ మొత్తంలో డబ్బును ఎరవేస్తూ ఆకర్షిస్తున్నారని ఎన్ఐఏ తెలిపింది. కరాచీ, దక్షిణాఫ్రికాల్లోని దావూద్ ముఠా కార్యకలాపాలు ఈ విషయాన్ని తెలుపుతున్నాయని ఎన్ఐఏ వెల్లడించింది. -
ప్రపంచంలో అందమైన చర్చీలు ఏవో తెలుసా..
ప్రపంచమంతటా క్రిస్మస్ పండుగ వాతావరణం నెలకొంది. క్రైస్తవులంతా ఈ పాటికే తమ ఆధ్యాత్మిక కేంద్రాలైన చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనల నిమిత్తం చేరి ఉన్నారు. భారత దేశంతోపాటు ముఖ్యంగా పాశ్చాత్య దేశాల్లో క్రైస్తవులు ఎక్కువగా ఉన్నందున అక్కడి చర్చీలన్నీ కూడా చక్కటి శోభతో అలరారుతున్నాయి. ప్రత్యేక విద్యుత్ కాంతుల మధ్యన, నక్షత్రాల అలంకరణలు, క్రిస్ మస్ ట్రీలతో పండుగ శోభను సంతరించుకున్నాయి. ఈ సందర్భంగా ఒక్కసారి ప్రపంచంలోనే అత్యంత అందమైన చర్చిలు, చాపెల్స్ ఏవో, అవి ఎక్కడ ఉన్నాయో పరిశీలిస్తే కన్నురెప్ప కూడా వేయనివ్వలేనంతగా ఆకర్షించే చర్చీలు ఉన్నాయంటే ఆశ్చర్యపోక తప్పదేమో.. ప్రపంచంలోనే అందమైన 23చర్చిలు ఇప్పుడు క్రిస్ మస్ వేడుకల కోసం ముస్తాబై ఉన్నాయి. ఇవి ఎక్కువగా లండన్, ఫ్రాన్స్, రష్యా, అమెరికాతోపాటు ఇతర దేశాల్లో ఉన్నాయి. అవేంటంటే.... (అందమైన చర్చిల ఫొటోలకు ఇక్కడ క్లిక్ చేయండి) -
ప్రపంచ వ్యాప్తంగా ముస్తాబైన చర్చిలు
ఏసు క్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని క్రైస్తవులు గురువారం రాత్రి నుంచే క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపు కుంటున్నారు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా సంబరాలు ప్రారంభమయ్యాయి. చర్చిల్లో క్రైస్తవ సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ సందర్భంగా ప్రధాన చర్చిలను సాంప్రదాయ పద్దతిలో ప్రత్యేకంగా అలంకరించారు. ఈ వేడుకలకు భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత అందమైన చర్చిల మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. -
ప్రపంచంలో అందమైన చర్చిలివే..
-
అద్భుత కట్టడాలకు.. దశదిశలా కీర్తి..
క్రిస్మస్ పండుగ వస్తుందంటే జంటనగరాలకు కొత్త కళ వస్తుంది. మినీ లండన్‌గా పేర్గాంచిన సికింద్రాబాద్‌లో అయితే విద్యుద్దీపాల వెలుగుల్లో కాంతులీనే చర్చిలు.. నిరంతరం జరిగే ప్రార్థనలతో కళకళలాడుతుంటాయి. ఇక్కడున్న ప్రతి చర్చికి వందల ఏళ్ల చరిత్ర ఉంది. బ్రిటిష్ పాలకులు నిర్మించిన కట్టడాల్లో ఎంతో అందం, గాంభీర్యం తొణికిసలాడుతుంటాయి. ఈ ప్రాంతంలో ఉన్న ప్రముఖమైన చర్చిల ప్రత్యేకత మీకోసం.. - కంటోన్మెంట్ సెయింట్ జాన్ ది బాప్టిస్ట్ చర్చి జంటనగరాల్లో అత్యంత పురాతమైన చర్చి ఇది. లాన్సర్స్ లైన్‌లోని బ్రిటిష్ కుటుంబాలు ప్రార్థన చేసుకునేందుకు వీలుగా 1813లో దీన్ని నిర్మించారు. 1998లో ‘ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ అవార్డు’ను దక్కించుకుంది. ఈ చర్చి ఆధీనంలో సుమారు 100 ఎకరాలు ఉండేవి. కాలక్రమేణా అభివృద్ధి కార్యక్రమాలు, ఆక్రమణలతోను కరిగిపోయింది. ప్రస్తుతం చర్చి ప్రధాన కట్టడం, దాన్ని ఆనుకుని ఉన్న స్థలంలో స్కూలు, కాలేజీ ఆవరణ మాత్రమే మిగిలాయి. సెయింట్ థామస్ ఎస్పీజీ చర్చి సికింద్రాబాద్‌లో పురాతన చర్చిల్లో సెయింట్ థామస్ ఎస్పీజీ చర్చి ఒకటి. 1852లో దీన్ని నిర్మించారు. ఈ చర్చికి కు సంబంధించిన స్థలాల్లో చాలావరకు అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం తీసుకుంది. ప్రస్తుత సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ స్థలం ఒకప్పుడు ఈ చర్చికి చెందినదే కావడం విశేషం. మిలీనియం మెథడిస్ట్ చర్చి మెథడిస్ట్ ఎపిస్కోపల్ చర్చికు చెందిన మిషనరీస్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ ప్రాంతంలో 1882లో ఈ చర్చిని నిర్మించారు. మెథడిస్ట్ చర్చిగా ప్రారంభమైన ఈ చర్చిని 2001లో పునర్నిర్మించాక మిలీనియం మెథడిస్ట్ చర్చిగా నామకరణం చేశారు. హోలీ ట్రినిటీ చర్చి బొల్లారంలో నిజాం స్థలాన్ని కేటాయించగా క్వీన్ విక్టోరియా 1847లో తన సొంత డబ్బుతో హోలీ ట్రినిటీ చర్చిని నిర్మించారు. ఆధునిక కాలంలో బ్రిటిష్ రాణి ఈ చర్చిని సందర్శించారు. తన 36వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకునేందుకు 1983 నగరానికి వచ్చిన క్వీన్ ఎలిజబెత్-2 భర్త ఫిలిప్‌తో కలిసి ఈ చర్చిలో ప్రార్థనలు చేశారు. చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా (సీఎస్ఐ) ఆధ్వర్యంలో కొనసాగుతోంది. సెయింట్ మేరీస్ చర్చి పురాతనమైన, తొలి రోమన్ క్యాథలిక్ చర్చిగా గుర్తింపు ఉంది. చాలాకాలం ఆర్చ్ డయోసిస్ ఆఫ్ హైదరాబాద్ ప్రధాన చర్చిగా కొనసాగింది. ఐరిష్ క్యాథలిక్స్‌తో కలిసి ఫాదర్ డేనియల్ మర్ఫీ 1840లో నిర్మాణాన్ని ప్రారంభించగా 1850లో పూర్తయింది. 1886 వరకు హైదరాబాద్ ఆర్చ్ డయాసిస్ ప్రధాన చర్చిగా కొనసాగింది. చర్చి ఆధ్వర్యంలో సెయింట్ ఆన్స్ హైస్కూలు నిర్వహిస్తున్నారు. దీన్ని ‘బాసిలికా ఆఫ్ అవర్ లేడీ ఆఫ్ ది అసెంప్షన్’గా వ్యవహరిస్తారు. రోమన్ క్యాథలిక్ చర్చిల్లో ప్రముఖమైన వాటికి దక్కే ‘బాసిలికా’ గుర్తింపును 2008లో ఇచ్చారు. ఆల్ సెయింట్స్ చర్చి తిరుమలగిరిలోని బ్రిటిష్ కంటోన్మెంట్లో 1860లో నిర్మాణం పూర్తి చేసుకుంది. తిరుమలగిరిలో ఏర్పాటైన తొలి శాశ్వత కట్టడం కూడా ఇదే. చర్చి ఆఫ్ ఇంగ్లండ్ ఆధ్వర్యంలో ఆర్మీ కోసం ఈ చర్చిని నిర్మించారు. తొలుత ఆర్మీ మతాధికారుల అధ్వర్యంలో ఈ చర్చి నిర్వహణ కొనసాగేది. స్వాతంత్య్రానంతరం అంగ్లికన్, ప్రొటస్టెంట్ సమ్మేళనంతో ఏర్పాటైన ‘చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా’ (సీఎస్ఐ) పరిధిలోకి వచ్చింది. గ్యారిసన్ వెస్లీ చర్చి తిరుమలగిరిలో 1853లో నిర్మాణం ప్రారంభించగా, 1883లో అందుబాటులోకి వచ్చింది. స్వాతంత్య్రానికి పూర్వం కేవలం ఆర్మీ అధికారుల కుటుంబాలు మాత్రమే ఈ చర్చిలో ప్రార్థనలు చేసేవారు. వెస్లీ చర్చి సికింద్రాబాద్‌లోని క్లాక్‌టవర్ సమీపంలో ఈ వెస్లీ చర్చి ఉంది. బ్రిటిష్ మిషనరీస్ రెవరెండ్ విలియం బర్గెస్, రెవరెండ్ బెంజిమన్ ఫ్రాట్ ఆధ్వర్యంలో 1916లో నిర్మితమైంది. చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియాకు అనుబంధంగా కొనసాగుతోంది. క్రిస్మస్ జోష్.. నగరంలో క్రిస్మస్ వేడుకలు మొదలయ్యాయి. బుధవారం వివిధ పాఠశాలలు, చర్చిల్లో చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలతో సందడి చేశారు. షాపింగ్‌మాల్స్ క్రిస్మస్ శోభతో కళకళలాడుతున్నాయి. అలంకరణ సామగ్రి దుకాణాలు సందర్శకులతో కిటకిటలాడుతున్నాయి. - సాక్షి, సిటీబ్యూరో -
చర్చిలు ఇక సేఫ్!
న్యూఢిల్లీ: నగరంలోని చర్చిలపై వరుసగా జరుగుతున్న దాడులతో మేల్కొన్న ఢిల్లీ పోలీసులు వాటి భద్రతకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేపట్టారు. నగరం మొత్తంలో ఉన్న 240 చర్చిలను గుర్తించి వాటి రక్షణకు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే 161 చర్చిలకు సీసీటీవీ కెమెరాలను అమర్చారు. మిగిలిన 54 చర్చ్‌లు పోలీసుల ఒత్తిడితో అంతకు ముందే వీటిని ఏర్పాటు చేసుకున్నాయి. నగరంలో 240 చర్చ్‌లు ఉండగా డీసీపీ, దగ్గర్లోని పోలీస్ స్టేషన్ సిబ్బంది తర చూ వాటిని సందర్శించనున్నారు. ‘చర్చీలు ఉన్న ప్రాంతాల్లో క్రమం తప్పకుండా పీసీఆర్ వ్యాన్లు, ఈఆర్వీలు, మోటార్‌సైకిల్ ద్వారా పెట్రోలింగ్ చేయాలని నగరంలోని స్టేషన్ హౌస్ ఆఫీసర్లందరికీ ఇప్పటికే ఆదేశాలు పంపించారు’ అని సంబంధితఅధికారి ఒకరు తెలిపారు. దాడి చేయడానికి అవకాశం ఉన్న అన్ని ప్రాంతాల్లో రాత్రి పూట ప్రత్యేక గస్తీ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఇదిలా ఉండగా ఇటీవలే క్రైస్తవ విద్యా సంస్థలు, చర్చ్‌లు తదితర సమస్యలు పరిష్యరించేందుకు ఓ నోడల్ అధికారి (జాయ్ టిర్కే)ని కూడా నియమించారు. అనునిత్యం క్రైస్తవ మత పెద్దలతో మాట్లాడుతూ, వారి సమస్యలను తెలుసుకోవాలని జాయ్ టిర్కేకి పోలీస్ కమిషనర్ బీఎస్ బస్సీ సూచించారు. వాటికి అనుగుణంగా భద్రతా చర్యలు చేపట్టాలని చెప్పారు. ఇటీవల ఓ మిషనరీ స్కూల్‌కి సంబంధించి కేసు రావడంతో క్రైస్తవుల భద్రత కోసం చర్యలు తీసుకోవాలని కమిషనర్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశించారు. దీంతో పోలీసులు ఆగమేఘాలపై చర్యలు చేపట్టారు. దీంట్లో భాగంగా ఇటీవలే ఓ ఫేస్బుక్ పేజీని కూడా ప్రారంభించారు. -
క్రిస్మస్ శోభ
క్రీస్తు జననం...లోకానికి శుభదినం. లోకరక్షకుడి పుట్టిన రోజైన క్రిస్మస్ పండగను దేశ, విదేశాల్లో ఘనంగా జరుపుకుంటారు. నగరంలోని చర్చిలు విద్యుద్దీపకాంతులతో మెరిశాయి. గురువారం ప్రత్యేక ప్రార్థనలకు సిద్ధమయ్యాయి. ఇళ్లనూ విద్యుద్దీపాలతో అలంకరించుకున్నారు. స్టార్లు, ట్రీలతో కళకళలాడుతున్నాయి. పాఠశాలల్లో బుధవారం క్రిస్మస్ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. మేరీమాత, జీసస్, శాంతాక్లాజ్ వేషధారణలతో పిల్లలు అలరించారు. - విశాఖపట్నం -
రాజధానిలో క్రిస్మస్ సందడి