ఏసు ప్రాణత్యాగానికి ప్రతీకగా.. | World Top Famous Churches And History Architecture | Sakshi
Sakshi News home page

వరల్డ్‌ ఫేమస్‌ క్రైస్తవ ప్రార్థనా మందిరాలు

Published Mon, Dec 23 2019 3:57 PM | Last Updated on Wed, Dec 25 2019 9:57 AM

World Top Famous Churches And History Architecture - Sakshi

ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులు ఎంతో సంబరంగా జరుపుకునే పండుగ క్రిస్మస్‌.  ఏసుక్రీస్తు జన్మదినం (డిసెంబర్‌ 25) సందర్భంగా జరుపుకునే పండుగ ఇది. ఏసుక్రీస్తు పుట్టిన రోజు కాబట్టి క్రైస్తవులంతా చర్చిలకి వెళ్లి ఆయన జన్మదినాన్ని అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఈ క్రమంలో క్రైస్తవుల పవిత్ర  ప్రార్థనా మందిరాలైన చర్చిలను ఆ రోజు రంగు రంగు లైట్లతో, క్రిస్మస్‌ ట్రీతో అలంకరిస్తారు. అలాగే ప్రముఖ దేశాలైన లండన్‌, యురప్‌లలోని చర్చిలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. భిన్నమైన రూపశైలిలో అద్బుత కట్టడాలుగా పేరున్న ఈ చర్చిలకు ఓ  విశేషమైన ప్రత్యేకత ఉంది. వాటి నిర్మాణాల వెనుక ఎన్నో విషయాలు ఉన్నాయి.

ఈ సుప్రసిద్ధ ప్రార్థనా మందిరాలు ప్రపంచ వ్యాప్తంగా పర్యటకులను ఆకట్టుకుంటున్నాయి. ఇందులోని కొన్ని చర్చిలు చాలా సినిమాలలో కూడా కనిపించాయి. బైబిల్‌లో పేర్కొన్న రాజుల పేర్లను, ఏసుక్రీస్తు తల్లి మరియా పవిత్రకు, ఏసు ప్రాణత్యాగానికి ప్రతీకగా బెత్లెహాంలో నిర్మించిన చర్చిలకు ప్రపంచ మందిరాలలో పవిత్రంగా చూస్తారు. అలాంటి చరిత్ర కలిగిన ఈ అద్బుత కట్టడాల గురించి ఓ సారి తెలుసుకుందాం రండి! 

సాగ్రడా ఫ్యామిలియా, బార్సిలోనా, స్పెయిన్
ఇది ప్రపంచ ప్రముఖ చర్చిల్లో ఒకటి. స్పెయిన్‌లోని బార్సినాలోని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంలోని నిర్మించిన రోమన్ కాథలిక్ ప్రార్థన మందిరం. దీనిని 1882లో ప్రముఖ అర్కిటెక్చర్‌ ఆంటోని గౌడే నిర్మించారు. ఈ చర్చి నిర్మాణం 1882 లో ప్రారంభమైనప్పటికి దీనిని నిర్మాణం ఇప్పటికీ పూర్తి కాలేదు. అసంపూర్తిగా ఉన్నప్పటికీ ప్రపంచంలోని ప్రముఖ చర్చిలలో ఇది ఒకటిగా ఉంది. ఓ అద్భుత కళాఖండంతో నిర్మించిన ఈ మందిరానికి పర్యాటకులు ఫిదా అవుతున్నారు. ఏటా ఈ చర్చిని సందర్శించే వారి సంఖ్య లక్షల్లో ఉంటుంది. ఈ చర్చిపై నిర్మించిన 18 స్తంభాలు మందిరానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. అప్పటి అర్కిటెక్‌ గౌడే రూపొందించిన ఈ చర్చి  ప్రకృతిని తలపించేలా ఉంటుంది.  చర్చి లోపల నిర్మించిన స్తంభాలు మెలితిప్పినట్లుగా ఉండి కొమ్మల్లాంటి చెట్ల ఆకృతిలో ఉంటాయి. ఇవి పర్యటకులను విపరీతంతగా ఆకట్టుకుంటాయి. అలాగే చర్చి ముందు భాగంలో బేస్‌ వద్ద పాలరాతితో చెక్కిన రెండు తాబేళ్లు మందిరానికి ప్రత్యేక ఆకర్షణ. అవి భూమి, సముద్రాన్ని సమతుల్యం చేస్తున్నాయని చెప్పడానికి ఉదాహరణగా వాటిని అక్కడ చెక్కారు. 

ఇక చర్చి పైకప్పుపై చెక్కిన మొజాయిక్‌ నుంచి రాత్రి వేళ చర్చి లోపలికి చంద్రకాంతి పడటం వల్ల ఆ దృశ్యాన్ని చూడటానికి పర్యాటకులు ఆసక్తి చూపుతారు. చంద్రుడి కాంతితోవచ్చే వెలుగు వల్ల చర్చి బయట నుంచి చూసే వారికి ఓ లైట్‌ హౌజ్‌లా మెరిసిపోతూ ఉంటుంది. అందువల్ల దీనిని ‘లైట్‌ హౌజ్‌’ అని కూడా పిలుస్తుంటారు. అలాగే మందిరంపై నిర్మించిన 18 టవర్లకు ఒక ప్రత్యేకత ఉంది. అందులో ఒక స్తంభం కన్య మరియ మేరి మాతకు చిహ్నంగా నిర్మించగా.. 12 టవర్లను బైబిల్‌లో పేర్కొన్న అపొస్తులులకు ప్రాతినిధ్యం వహిస్తాయి. మరో నాలుగు స్థంభాలు వారిలోని నలుగురు సువార్తికులకు ప్రాతినిధ్యం వహిస్తాయి. ఇక మందిరంపై మధ్యలో నిర్మించిన అతిపెద్ద టవర్‌ ఏసుక్రీస్తును సూచిస్తుంది. 170 మీటర్ల ఎత్తులో ఉండి బార్సిలోనాలోని మౌంట్‌జ్యూక్‌ పర్వతం కంటే ఒక మీటర్‌ తక్కువగా ఉంటుంది. ఈ మౌంట్‌జ్యూక్‌ పర్వతం స్పెయిన్‌లో ఎత్తైనా పర్వతం. ఇప్పటికీ అసంపూర్ణంగా ఉండిపోయిన ఈ చర్చిని పర్యటించడానికి కనీసం వారం రోజులైన పడుతుంది. అయితే దీనికి ఇప్పటికీ మర్మత్తులు చేస్తూనే ఉన్నారు. అక్కడికి వచ్చే పర్యాటకులు ఈ చర్చి నిర్మాణం కోసం విరాళాలు కూడా ఇస్తుంటారు. ఎప్పుడు మరమ్మత్తులు చేస్తూ ఉన్న ఈ మందిరం 2026 నాటికి పూర్తికావచ్చు.

సెయింట్ బాసిల్ కేథడ్రల్ చర్చి
అత్యంత ప్రసిద్ధ చర్చిలలో ఒకటైనా ఈ సెయింట్ బాసిల్ కేథడ్రల్ చర్చిని ఒకే పునాదిపై తొమ్మిది ప్రార్థనా మందిరాలుగా నిర్మించారు. రష్యా రాజధాని మాస్కో నగరంలో ఉన్న ఈ చర్చి నిర్మాణం క్రీ.శ. 1561లో ఇవాన్ ది టెర్రిబుల్ పాలనలో పూర్తయింది. ఈ చర్చి అసాధారణమైన వివిధ రంగుల నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. సాగ్రడా ఫ్యామిలియా మాదిరిగా, ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం. ఇది పలు సినిమాల్లో కూడా కనిపిస్తుండం విశేషం. దీని లోపలి భాగంలో చాపెల్ నుంచి ఇరుకైన మెట్లు ఉండి, తక్కువ తోరణాలు, గజిబీజీ చాపెల్‌లతో నిర్మించబడిన ఉండటమే ఈ మందిరం ప్రత్యేకత. ఒకదానిని ఒకటి అనుకుని ఉండే ఈ చాపెల్‌లలోని ఒక్కోదానికి ఒక్కో ప్రత్యేకత ఉంది.

అవి.. పైకప్పు మధ్యలో ఉన్న టవర్‌ ఏసుక్రీస్తు తల్లి మేరిమాతకు చిహ్నంగా నిర్మించి.. దీనికి చర్చి ఆప్‌ ది ఇంటర్సేషన్‌ అని పేరు పట్టారు. ఇక కనిపించే నాలుగు పెద్ద గోపురాలు అష్టభుజి ప్రార్థన మందిరాలు(చర్చ్‌ ఆఫ్‌ ది హోలీ ట్రినిటీ, చర్చ్‌ ఆఫ్‌ స్టీస్‌ సిప్రీయన్‌& జస్టీనా, చర్చ్‌ ఆఫ్‌ ది ఐకాన్‌ ఆఫ్‌ సెయింట్‌ నికోలాస్‌ ది మిరాకిల్‌ వర్కర్‌, చర్చ్‌ ఆఫ్‌ ది ఎంట్రీ ఆఫ్‌ ది లార్డ్‌ జెరుసలేం) అనే బైబిల్‌లోని కొన్ని పవిత్ర స్థలాలకు ప్రతికగా ఈ పేర్లన పెట్టారు. బయటి నుంచి చూస్తే చిక్కుముడిగా కనింపిచే ఈ టవర్‌ల మధ్యలో నాలుగు చిన్నప్రార్థన మందిరాలు ఉన్నాయి. ప్రతి ప్రార్థనా మందిరం కజాన్‌కు వ్యతిరేకంగా చేసిన పోరాటంలోని సంఘటనకు, యుద్ధానికి గౌరవసూచికగా నిర్మించారు. ఈ సెయింట్ బాసిల్ కేథడ్రల్ రంగుల నిర్మాణం నిజంగా ఓ అద్బుతంలా ఉంటుంది. ఈ చర్చి రూపకర్త సెయింట్ బాసిల్ బ్లెస్డ్‌ను చర్చి లోపలి ప్రార్థనా మందిరంలో సందర్శించవచ్చు. అక్కడ ఆయన విగ్రాహన్ని వెండి పేటికలో ఉంచారు. అయితే ఇలాంటి అద్బుత కట్టడం మరెక్కడా ఉండకూడదనే ఉద్దేశంతో కూలీల కళ్లు తీయించి వారిని అంధులుగా మార్చాడట.


నోట్రే డామ్‌ డి పారిస్‌- ఫ్రాన్స్‌: 
నోట్రే-డామ్‌ డి పారిస్‌ అనగా ‘అవర్‌ లేడీ ఆఫ్‌ పారిస్‌. దీనిని సింపుల్‌గా నోట్రే-డామ్‌ అని కూడా పిలుస్తారు. పారిస్‌లోని అరోండిస్మెంట్లో ఓలే డి లా సిటిలో తూర్పు చివరలో ఈ చర్చిని నిర్మించారు. కన్య మరియ మేరి మాతకు పవిత్రమైన పత్రికగా దీన్ని ప్రకటించారు. ఈ కేథడ్రల్‌ చర్చి లోపలి విస్తీర్ణం 427-157 అడుగులు(130 నుంచి 48మీటర్లు) దీని పైకప్పు 115 అడుగుల(35 మీటర్ల) ఎత్తులో ఉంటుంది. రెండు పెద్ద గోతిక్‌ టవర్లు 50 అడుగు వెడల్పు, 1210 పొడవును కలిగి ఈ మందిరానికి పశ్చిమ ముఖానికి కిరీటంగా ఉంటాయి. ఇక చర్చి ముఖ ద్వారం ప్రవేశ ద్వారం తలుపులు గోతిక్‌ శిల్పాలతో చెక్కబడిన రాజుల విగ్రహాలు వరుసగా ఉంటాయి. ముందు భాగంలో ఉన్న రెండు పెద్ద టవర్‌లు 68 మీటర్ల ఎత్తులో కలిగి 223 అడుగులు పొడవు ఉంటాయి.  

రంగులతో మెరిసేటి అద్దాల కిటికిలు 1235-70 పొడవు- వెడల్పులో ఉంటాయి. ముందు భాగంలో ఉండే పొడవైన రెండు స్తంభాలు లేక్కలేనన్ని గంటలను కలిగి ఉంటాయి. ఫ్రెంచ్‌ గోతిక్‌ రూపశైలిలో ఉండే నోట్రే-డామ్‌ చర్చి ప్రపంచ ప్రముఖ చర్చిలలో ఒకటిగా ప్రసిద్ది పొందింది. 1163లో పోప్‌ అలెగ్జాండర్‌-3 ఈ చర్చికి పునాది రాళ్లు వేయగా 1250 నాటికి ఈ చర్చి పురైంది. చర్చి నిర్మించిన 100 సంవత్సరాలకు మందిరం ముందు భాగంలోని రెండు ఎత్తైనా చాపెల్‌లను, ఇతర స్థంభాలను, విగ్రహాలను నిర్మించి ఈ ప్రార్థన మందిరాన్ని పూర్తి చేశారు. అయితే ఈ మందిరాన్ని 19వ శతాబ్థంలో పూర్వపు రెండు పవిత్ర ప్రార్థన మందిరాల నిర్మించినట్లు సమాచారం.

సెయింట్ పీటర్స్ బసిలికా: వాటికన్‌ సిటి 
ఇది వాటికన్‌ సిటిలో ఉంది. దీనిని న్యూ సెయింట్ పీటర్స్ బసిలికా అని కూడా పిలుస్తారు. ఇటలీలో రోమ్‌లోని వాటికన్ నగరంలోనే ఇది పెద్దది. దీన్ని  క్రైస్తవుల మతపరమైన చర్చిలన్నింటీ కంటే గొప్ప మందిరం. వాటికన్ నగరంలో సెయింట్ పీటర్ ప్రస్తుత బాసిలికా నగరంలో(రోమ్‌లోని ఒక ఎన్క్లేవ్), 2వ జూలియస్‌1506 లో ఈ మందిరం నిర్మాణాన్ని ప్రారంభించాడు. అయితే అది 1615 పాల్‌.వీ రాజు కాలంలో పూర్తైంది. సెయింట్ పీటర్ అపొస్తల రాజు నిర్మించిన మూడు ఎత్తైన బలిపీఠాలపై నుంచి నేరుగా క్రాసింగ్ వద్ద ఉన్న పెద్ద గోపురాన్ని కలుపుతూ నిర్మించారు. ఈ మందిరం అక్కడి పోప్‌ల చర్చే కాకుండా వారి ప్రధాన తీర్థయాత్ర కూడా.  

కాథలిక్ సంప్రదాయంలో, యేసు పన్నెండు అపొస్తలులలో ఒకడైన సెయింట్‌ పీటర్ శ్మశానవాటికగా భావిస్తారు. ఆయన సెయింట్ పీటర్ రోమ్ యొక్క మొదటి బిషప్ అని, బైబిల్‌ ప్రకారం.. క్రీ.శ. 1వ శతాబ్దంలోని రోమన్‌ క్రైస్తవులు అపొస్తలుడైన పేతురు(సెయింట్‌ పీటర్‌) రోమ్‌కు వెళ్లాడని బైబిల్‌లో పేర్కొన్నారు. పీటర్ చనిపోయిన తరువాత ఆయన మృతదేహాన్ని బాసిలికాలోని స్మశానవాటికలో ఖననం చేశారని అక్కడి వారి నమ్మకం.

వెస్ట్‌ మినిస్టర్‌ అబ్బే  
యూరప్‌ దేశాలలోని అత్యంత ప్రసిద్ద మత భవనాలలో ఇది ప్రముఖమైనది. ప్రపంచంలోనే అత్యంత ప్రాముఖ్యత కలిగిన ప్రార్థన మందిరంగా దీన్ని పిలుస్తారు. లండన్‌ బరలిలోని పార్లమెంటు భవనానికి పశ్చిమాన ఈ మందిరాన్ని నిర్మించారు. మాజీ బెనెడక్టిన్‌ ఆశ్రమంగా ఉన్న ఈ మందిరాన్ని క్వీన్‌ ఎలిబెత్‌2, 1560లో సెయింట్‌ పీటర్‌ కాలేజీయేట్‌ చర్చిగా మార్చారు. ఆ తర్వాత 1987లో దీనిని సెయింట్‌ మార్గరేట్‌ చర్చి, పార్లమెంటు గృహాల సమిష్టి యునెస్కోగా నియమించారు. ఇది కూడా ప్రపంచ వారసత్వ స్థలం. 

ఈ ప్రార్థన మందిరాన్ని 1300 లో హెన్రీ యెవెల్‌ అనే రాజు ఆధ్వర్యంలో నార్మన్‌-శైలిలో నిర్మించారు. ఇంగ్లీష్‌ గోతిక్‌ డిజైన్‌ శైలిలో దీనిని నిర్మించారు. ఈ మందిరానికి పశ్చిమాన ఉన్న రెండు పెద్ద టవర్లు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. వీటిని సర్ క్రిస్టోఫర్ రెన్ రూపొందించినట్లు చెబుతారు. కాని అవి వాస్తవానికి నికోలస్ హాక్స్మూర్, జాన్ జేమ్స్‌లు నిర్మించినట్లుగా సమాచారం. ఈ చాపెల్‌లను వారు 1745 లో పూర్తిచేశారు. 1847 లోపలి గాయక స్టాల్స్, ఎత్తైన బలిపీఠం, రేడోలను పునర్నిర్మించి 1867లో సర్ జార్జ్ గిల్బర్ట్ స్కాట్ పూర్తిచేశారంటా. స్కాట్, జెఎల్ పియర్సన్ కూడా 1880 లలో ఉత్తర ట్రాన్సప్ట్ ముఖభాగాన్ని పుననిర్మించారు. అయితే  రెండవ ప్రపంచ యుద్ధంలో బాంబు దాడుల్లో అబ్బే భారీగా దెబ్బతింది, యుద్దం అనంతరం ఈ మందిరాన్ని వెంటనే పునర్మించారు.

లండన్‌లోని సెయింట్‌ పాల్స్‌ కేథడ్రాల్‌
ప్రపంచ ప్రముఖ చర్చిలలో ఒకటి. దీన్ని లండన్‌ బిషప్, డయోసెస్‌ తల్లి చర్చిగా పిలుస్తుంటారు. ఈ ప్రార్థనా మందిరాన్ని లండన్‌లోని ఎత్తైన లుడ్గేట్‌ కోండపై నిర్మించారు. అత్యంత ప్రముఖ, చరిత్రాత్మకంగా పేరున్న మందిరం ఇది. దీనిని పాల్‌ అపోస్తులు రాజు  క్రీ.శ. 604లో దీన్ని నిర్మించడం జరిగింది. ఈ కేథడ్రల్‌ను 17వ శతాబ్ధపు రాజైన సర్‌ క్రిస్టోఫర్‌ రెన్‌ చేత ఇంగ్లీష్‌ బరోక్‌ శైలిలో నిర్మించారు. సర్‌ రెన్‌ కాలంలోనే ఈ చర్చి నిర్మాణం పూర్తిగా జరిగింది. ఈ చర్చిలో పాల్‌ అపోస్తుల రాజు గుర్తులు ఉండటం వల్ల దీనిని ఒల్డ్‌ సెయింట్‌ పాల్‌ చర్చి అని కూడా పిలుస్తుంటారు.

ఈ మందిరంలో విక్టోరియా రాణి జూబ్లీ వేడుకలను, రెండవ ప్రపంచ యుద్ధాల ముగింపును సూచించే శాంతి సేవలు ప్రిన్స్ చార్లెస్, లేడీ డయానా స్పెన్సర్ వివాహం ఫెస్టివల్ ఆఫ్ బ్రిటన్ ప్రారంభంతో పాటు సిల్వర్, గోల్డెన్,  డైమండ్ జూబ్లీలకు  క్వీన్ ఎలిజబెత్-2  80, 90వ పుట్టినరోజు వేడుకలు, థాంక్స్ గివింగ్ సేవలు ఈ చర్చిలోనే జరిపారు. సెయింట్ పాల్స్ కేథడ్రల్‌కు  సంబంధించిన గుర్తులు ఈ చర్చిలోనే భద్రపరిచారు. 

చర్చ్ ఆఫ్ ది నేటివిటీ: బెత్లెహాం
బసిలికా ఆఫ్ ది నేటివిటీ ఇది బెత్లెహాంలోని వెస్ట్ బ్యాంక్‌లో ఉన్న బాసిలికా. యేసు జన్మస్థలంగా చెప్పుకునే ప్రదేశంలోనే ఈ చర్చిని  నిర్మించారు. ఈ ప్రదేశం క్రైస్తవులకు  పవిత్రమైన స్థలం, పవిత్ర ప్రార్థనా మందిరం. ఏసుక్రీస్తు ఇక్కడే నిరంతరం ప్రార్థనలు చేసుకునేవారని, అది గ్రోట్టో స్థలమని బైబిల్‌లో పేర్కొన్నారు. దీంతో క్రైస్తవులు ఈ స్థలాన్ని పవిత్రం స్థలంగా భావిస్తారు. 325-326లో బసిలికా అతని తల్లి హెలెనా జెరూసలేం, బెత్లెహాములను సందర్శించిన కొద్దిరోజులకే ఈ చర్చిని కాన్స్టాంటైన్ ది గ్రేట్‌గా నిర్మించారు. సాంప్రదాయకంగా ఏసు జన్మస్థలం అని భావించి ఇక్కడ బాసిలికా 330-333 కాలంలో నిర్మించినట్లు చెప్పుకుంటారు. 6వ శతాబ్ధంలో సమారిటన్ తిరుగుబాటు సమయంలో 529లో ఈ చర్చిని చాలా భాగాన్ని మంటలతో కాల్చేశారు. అయితే చాలా ఏళ్లకు మళ్లీ దీనిని బైజాంటైన్ చక్రవర్తి క్రీ.శ. 527-565 కాలంలో బాసిలికాను పునర్మించారు. 12వ శతాబ్దంలో క్రూసేడర్స్ చిత్రీకరించిన సెయింట్స్‌, ఫ్రెస్కోలతో అలంకరించారు. 

చర్చిలోకి చిన్న ఒట్టోమన్‌ యుగం నాటి తలుపు ద్వారం ఉంటుంది. దీనికి డోర్ ఆఫ్ రెస్పెక్ట్‌ అని పేరు పిలుస్తారు. అయితే వాస్తవానికి ఈ ప్రవేశ ద్వారం చాలా పెద్దది, కాని క్రూసేడర్లు దాని పరిమాణాన్ని తగ్గించి గుర్రంపై దాడి చేసేందుకు లోనికి ప్రవేశించకుండా చేశారు. ఆ  తరువాత క్రమంగా దానిని అతిచిన్న ముఖ ద్వారంగా మార్చేశారు. 6వ శతాబ్దం నాటి అసలైన ద్వారానికి సంబంధించిన గుర్తులు ఇప్పటికీ అక్కడ కనిపిస్తాయి. క్రూసేడర్‌ల యుగంనాటి నిర్మాణ శైలిలో ఈ మందిరాన్ని నిర్మించారు. కాగా ఈ మందిరంలోని ఓ రహష్య చికటి గది లాంతర్లు వెలిగించి, 14 వెండి లైట్లతో అలంకరించి ఉంటుంది. ఏసుక్రీస్తు జన్మించిన స్థలం అదే అని చెప్పడానికి గుర్తుగా దానిని వెండి దీపాలతో అలంకరించారు. గ్రోట్టోలోని ఈ మందిరానికి పై మధ్య భాగంలో ఒక చాపెల్‌ను నిర్మించారు. దానిని ‘చాపెల్‌ ఆఫ్ ది మాంగెర్ (ది క్రిబ్) అని కూడా పిలుస్తారు. ఈ మందిరానికి, అదే ప్రత్యేక ఆకర్షణ. 

చర్చ్ ఆఫ్ ది హోలీ సెపల్చర్
దీనిని హోలీ సెపల్చర్ అని కూడా పిలుస్తారు, ఇది ఏసుక్రీస్తు సిలువ, ఖననం చేసిన పవిత్ర స్థలంలో నిర్మించిన ప్రార్థనా మందిరం. బైబిల్ ప్రకారం, ఏసుక్రీస్తు సమాధికి, సిలువ వేయబడిన ప్రదేశానికి దగ్గరగా ఉంది (జాన్ 19: 41:42). సిలువ, సమాధులను రెండింటి చూట్టు ఈ ప్రార్థన మందిరాన్నినిర్మించారు. 

ఓల్డ్ సిటీ ఆఫ్ జెరూసలేలోని వాయువ్యంలో హోలీ సెపల్చర్ చర్చి ఉంది. చక్రవర్తి  కాన్స్టాంటైన్ ది గ్రేట్ అనే రాజు  క్రీ.శ. 336లో సైట్లో అనే ప్రదేశంలో మొదటగా  నిర్మించాడు. ఆ తరువాత 614లో పర్షియన్లు దీనిని కుల్చివేసి మోడెస్టస్ (థియోడోసియస్ ఆశ్రమ మఠాధిపతి, 616-626) పునరుద్ధరించారు. ఖలీఫ్ అల్-అకిమ్ బా-అమర్ అల్లాహ్ 1009లో దీనిని కుల్చివేయడంతో మళ్లీ 12వ శతాబ్దంలో క్రూసేడర్‌లు  పునర్నిర్మాణాన్ని చేపట్టి ప్రార్థనలు చేసుకునేవారు. అలా తరుచూ మరమ్మత్తులు చేపడుతూ 1810 నాటికి పూర్తి చేశారు..

సెయింట్ మార్క్స్ బసిలికా
వాస్తవానికి ఇది డోగే ప్రార్థనా మందిరం. సెయింట్ మార్క్స్ బసిలికా (బసిలికా డి శాన్ మార్కో) 829లో ముఖ్యమైన చర్చి. సెయింట్ మార్క్ యొక్క అవశేషాలు అలెగ్జాండ్రియా నుంచి వెనిస్కు వచ్చి ఇక్కడ ఖననం చేసినట్లుగా చెబుతారు. 1063 నాటి కాన్‌స్టాంట్‌ నోబెల్‌ చర్చ్ ఆఫ్ అపోస్టల్స్ చర్చి నమునాలను తీసుకుని ఇప్పటి గౌడే-ప్లాన్‌ శైలిలో నిర్మించారు. ఈ చర్చి నిర్మాణానికి  1075లో, డోజ్ ఒక చట్టాన్ని ఆమోదించి  మరియు టింటోరెట్టితో సహా కళాకారులు రూపొందించిన ‘ఆధునిక’ మొజాయిక్లతో భర్తీ చేశారు. మొజాయిక్లు, బంగారు బలిపీఠం, అందమైన ప్రార్థనా మందిరాలు మరియు ఖజానా ఇటలీకి బాగా నచ్చిన పర్యాటక ఆకర్షణలలో ఒకటిగా నిలిచాయి.

క్రీ.శ.1075 లోడోజ్ ఒక చట్టాన్ని ఆమోదించాడు, ఈ చర్చిని బాసిలికాను అలంకరించడానికి విలువైన వస్తువులను, తూర్పు నుంచి అరుదైన పాలరాయి, పోర్ఫిరీ, అలబాస్టర్ మరియు జాస్పర్ 500లకు పైగా స్తంభాలను తెప్పించి నిర్మించాడు. దీని లోపలి భాగాన్ని 12, 13 శతాబ్ధాల కాలం నాటి 4,240 చదరపు మీటర్ల బంగారు మొజాయికులతో నిర్మించాడు. 1500, 1750 మధ్య,కొన్ని పాత విభాగాలను టిటియన్, టింటోరెట్టోతో సహా కళాకారులు రూపొందించిన ఆధునిక మొజాయికన్లతో నిర్మించారు. అలాగే దీని ముఖభాగం ముందు రెండు పాలరాయి పైలాస్టర్లు, పిలాస్త్రీ అక్రితాని, ఆరవ శతాబ్దపు అద్భుతమైన శిల్పాలతో కప్పబడి ఉంటాయి. సెయింట్ మార్క్ మాదిరిగానే,  ఈజిప్టు 4వ శతాబ్దంలోని  మూలలోని టెట్రార్చ్స్  శిల్పం పోర్ఫిరీ నుంచి తీసుకుని ఈ శిల్పాలను రూపొందించారు. మొజాయిన్ల, బంగారు బలిపీఠం, అందమైన ప్రార్థనా మందిరాలు, ఖజానాలు ఉండటంతో ఇది ఇటలీలో అందమైన పర్యాటక ఆకర్షణలలో ఒకటిగా నిలిచింది.

హగియా సోఫియా, ఇస్తాంబుల్, టర్కీ..
హగియా సోఫియా అనగా ‘పవిత్ర జ్ఞానం’ అని అర్ధం. ఇది మాజీ గ్రీకు ఆర్థోడాక్స్ పితృస్వామ్య ప్రార్థన మందరం. క్రీ.శ. 537లో నిర్మిచిన ఈ మందిరం క్రీ.శ.1453 వరకు మ్యుజియంగా ఉండేది. లాటిన్‌ సామ్రాజ్యంలో ఈ మందిరాన్ని రోమన్‌ కాథలిక్‌ కేథడ్రాల్‌ మందిరంగా మార్చారు. రెండు అంతస్తులుగా నిర్మించిన ఈ మందిరాన్ని క్రీ.శ. 537లో పూర్తిచేశారు. దీనిని 6 సంత్సరాలలో పూర్తి చేశారు. 6వ శతాబ్దంలో కాన్స్టాంటినోపుల్ (ఇప్పుడు ఇస్తాంబుల్, టర్కీ)లోని కేథడ్రల్‌ స్మారక చిహ్నంగా నిర్మించారు. దీనిపై నిర్మించిన గోపురం కేథడ్రల్‌కు చిహ్నం.  హెలెన్ గార్డనర్, ఫ్రెడ్‌ క్లీనర్‌లు రూపొందించిన ఈ కట్టడాడంలో అసలు ఉక్కు పరికరాలను వాడకపోవడం ఈ మందిరానికి ఉన్న ప్రత్యేకత. ఈ మందిరాన్ని 270 అడుగుల (82 మీటర్లు) పొడవు మరియు 240 అడుగుల (73 మీటర్లు) వెడల్పులో నిర్మించారు. అలాగే దీనిపైన నిర్మించిన ప్రధాన గోపురం 108 అడుగుల (33 మీటర్లు) చర్చికి కిరీటంగా వ్యవహరిస్తుంది.

ఈ గోపురం 180 అడుగుల (55 మీటర్లు) పెండెంటివ్స్ రెండు సెమిడోమ్‌లకు ప్రాతినిధ్యం వహిస్తుంది. మందిరంపైన నిలువుగా నిర్మించిన గ్యాలరీలతో వేరు చేసి ఉంటుంది. అలాగే మూడు అంతస్తుల మేట్లకు, గోపురానికి మద్దుతుగా ఓ పాలరాయి పైర్లను నిర్మించారు. గ్యాలరీలకు పైన ఉన్న గోడలు,గోపురం బేస్‌లు వివిధ డిజైన్‌ల కిటికీలచే అమర్చబడి ఉంటుంది. ఈ కిటికీల నుంచి వచ్చే గాలికి ఆకాశంలో తేలుతున్నట్లుగా అనిపిస్తుందని అక్కడ పర్యటించినవారు అంటుంటారు. 1,400 సంవత్సరాల  కేథడ్రల్, మసీదుగా ఉండేది ఆ తర్వాత దీనిని ఈ చర్చిగా మార్చారు.  ప్రస్తుతం ఇది పర్యటకానికి వీలుగా పురాతన వస్తువులను ఉంచే మ్యూజియంగా మార్చారు. దీనిని మొదటిసారి నిర్మించినప్పుడు, కాన్‌స్టాంట్‌నోబుల్‌లో ఇని బైజాంటైన్ సామ్రాజ్యానికి రాజధానిగా ఉండేది. ఇది అధికారికంగా క్రిస్టియన్, రోమన్ సామ్రాజ్యం తూర్పు భాగంలో ఉంది.

- స్నేహలత (వెబ్ డెస్క్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement