మాస్కో: ఇటీవల అనుమానాస్పదంగా జైలులో మరణించిన రష్యా విపక్ష నేత అలెక్సీ నావల్నీ అంత్యక్రియల నిర్వహణకు చర్చిలేవీ స్వచ్ఛందంగా ముందుకు రావడ లేదు. అధ్యక్షుడు పుతిన్ ఆగ్రహిస్తారన్న భయమే ఇందుకు కారణమని నావల్నీ సంస్థ అధికార ప్రతినిధి ఆరోపించారు. ‘‘నావల్నీ పేరు చెప్పగానే ఇప్పటికే బుకింగ్ అయిపోయాయంటూ చాలా చర్చిల నిర్వాహకులు తప్పించుకున్నారు.
ఎట్టకేలకు మాస్కో శివార్లలోని మేరీనో పట్టణంలో ఉన్న మదర్ ఆఫ్ గాడ్ క్వెంచ్ మై సారోస్ చర్చి నావల్నీ అంత్యక్రియల నిర్వహణకు ముందుకొచ్చింది’’ అని ఆమె ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ‘వాస్తవానికి గురువారమే అంత్యక్రియలు పూర్తిచేద్దామనుకున్నాం. కానీ పార్లమెంట్‌ను ఉద్దేశిస్తూ పుతిన్ ప్రసంగం ఉండటంతో ఆ రోజు అంత్యక్రియలకు చర్చిలేవీ ముందుకు రాలేదు. అందుకే శుక్రవారం మధ్యాహ్నం ఖననం చేయనున్నాం’ అని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment