నగరంలోని చర్చిలపై వరుసగా జరుగుతున్న దాడులతో మేల్కొన్న ఢిల్లీ పోలీసులు వాటి భద్రతకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేపట్టారు. నగరం
న్యూఢిల్లీ: నగరంలోని చర్చిలపై వరుసగా జరుగుతున్న దాడులతో మేల్కొన్న ఢిల్లీ పోలీసులు వాటి భద్రతకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేపట్టారు. నగరం మొత్తంలో ఉన్న 240 చర్చిలను గుర్తించి వాటి రక్షణకు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే 161 చర్చిలకు సీసీటీవీ కెమెరాలను అమర్చారు. మిగిలిన 54 చర్చ్‌లు పోలీసుల ఒత్తిడితో అంతకు ముందే వీటిని ఏర్పాటు చేసుకున్నాయి. నగరంలో 240 చర్చ్‌లు ఉండగా డీసీపీ, దగ్గర్లోని పోలీస్ స్టేషన్ సిబ్బంది తర చూ వాటిని సందర్శించనున్నారు. ‘చర్చీలు ఉన్న ప్రాంతాల్లో క్రమం తప్పకుండా పీసీఆర్ వ్యాన్లు, ఈఆర్‌వీలు, మోటార్‌సైకిల్ ద్వారా పెట్రోలింగ్ చేయాలని నగరంలోని స్టేషన్ హౌస్ ఆఫీసర్లందరికీ ఇప్పటికే ఆదేశాలు పంపించారు’ అని సంబంధితఅధికారి ఒకరు తెలిపారు.
దాడి చేయడానికి అవకాశం ఉన్న అన్ని ప్రాంతాల్లో రాత్రి పూట ప్రత్యేక గస్తీ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఇదిలా ఉండగా ఇటీవలే క్రైస్తవ విద్యా సంస్థలు, చర్చ్‌లు తదితర సమస్యలు పరిష్యరించేందుకు ఓ నోడల్ అధికారి (జాయ్ టిర్కే)ని కూడా నియమించారు. అనునిత్యం క్రైస్తవ మత పెద్దలతో మాట్లాడుతూ, వారి సమస్యలను తెలుసుకోవాలని జాయ్ టిర్కేకి పోలీస్ కమిషనర్ బీఎస్ బస్సీ సూచించారు. వాటికి అనుగుణంగా భద్రతా చర్యలు చేపట్టాలని చెప్పారు. ఇటీవల ఓ మిషనరీ స్కూల్‌కి సంబంధించి కేసు రావడంతో క్రైస్తవుల భద్రత కోసం చర్యలు తీసుకోవాలని కమిషనర్‌ని ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశించారు. దీంతో పోలీసులు ఆగమేఘాలపై చర్యలు చేపట్టారు. దీంట్లో భాగంగా ఇటీవలే ఓ ఫేస్‌బుక్ పేజీని కూడా ప్రారంభించారు.