Hindu leaders
-
బంగ్లా హిందూ నేతపై దేశ ద్రోహం కేసు
ఢాకా: బంగ్లాదేశ్‌లో దేశ ద్రోహం ఆరోపణలపై అరెస్టయిన హిందూ నేత చిన్మయ్ కృష్ణ దాస్ బ్రహ్మచారికి అక్కడి న్యాయస్థానం బెయిల్ నిరాకరించింది. దాస్ అరెస్ట్‌ను నిరసిస్తూ రాజధాని ఢాకా, చిట్టోగ్రామ్ తదితర ప్రాంతాల్లో హిందువులు నిరసన ప్రదర్శనలు జరిపారు. ఈ పరిణామాలపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఆయన అరెస్ట్ తర్వాత బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు పెరిగిపోయాయని తెలిపింది. ఇస్కాన్ మాజీ సభ్యుడు, సమ్మిళిత సనాతని జోత్ అనే హిందూ సంఘం నేత చిన్మయ్ కృష్ణ దాస్ బ్రహ్మచారి సోమవారం చిట్టోగ్రామ్కు వెళ్లేందుకు ఢాకా విమానాశ్రయానికి రాగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం చిట్టోగ్రామ్కు తరలించారు.చిట్టోగ్రామ్‌లోని లాల్డిగి మైదాన్‌లో అక్టోబర్ 25న హిందువులు నిర్వహించిన ర్యాలీ సందర్భంగా జాతీయ పతాకాన్ని అవమానపరిచారంటూ దాస్, మరో 18 మందిపై మాజీ ప్రధాని ఖలేదా జియాకు చెందిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పారీ్ట(బీఎన్పీ)నేత ఒకరు ఫిర్యాదు చేయడంతో చిట్టోగ్రామ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో దాస్‌ను పోలీసులు మంగళవారం ఆరో మెట్రోపాలిటన్ మేజి్రస్టేట్ కాజీ షరీఫుల్ ఇస్లాం ఎదుట హాజరు పరిచారు. దాస్ బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించిన మేజి్రస్టేట్..చిట్టోగ్రామ్ వెలుపల ఈ అరెస్ట్ జరిగినందున నిబంధనల మేరకు 24 గంటలపాటు జ్యుడీíÙయల్ కస్టడీలో ఉండాల్సిందేనని ఆదేశించారు. దీంతో పోలీసులు ఆయన్ను జైలుకు తరలించారు.నిబంధనలకు లోబడి జైలులో మతాచారం ప్రకారం పూజాకార్యక్రమాలు జరుపుకోవచ్చన్నారు. దాస్‌ను జైలుకు తరలిస్తుండగా పెద్ద సంఖ్యలో మద్దతుదారులు నినాదాలు చేశారు. దాస్‌ను తరలిస్తున్న వ్యాన్‌ను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా జైలు వ్యానులో నుంచి విక్టరీ సింబల్ చూపుతూ దాస్ ప్రసంగించారు. తాము సమైక్య బంగ్లాదేశ్‌ను కోరుకుంటున్నామని చెప్పారు. దేశంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించవద్దని, డిమాండ్లు నెరవేరాదాకా శాంతియుత పోరాటం సాగించాలని మద్దతుదారులను దాస్ కోరారు. ఈ మేరకు ఒక వీడియో ఆన్లైన్లో వైరలవుతోంది. పోలీసులు లాఠీచార్జీ జరిపి ఆందోళనకారులను చెదరగొట్టారు. దాస్ అరెస్ట్‌పై నిరసనలు దాస్ అరెస్ట్‌ను నిరసిస్తూ ఢాకా, చిట్టోగ్రామ్, ఖుల్నా, దినాజ్‌పూర్, కాక్స్ బజార్ కుమిల్లా తదితర చోట్ల హిందువులు ర్యాలీలు చేపట్టారు. బంగ్లాదేశ్ హిందూ బుద్ధిస్ట్ క్రిస్టియన్ యూనిటీ కౌన్సిల్ దాస్ అరెస్ట్‌ను ఖండించింది. దాస్ అరెస్ట్‌పై భారత్ ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. హిందువులు ఇతర మైనారిటీల భద్రతకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని బంగ్లా అధికారులను కోరింది. దాస్ అరెస్ట్‌ను ఇస్కాన్ ఉపాధ్యక్షుడు రాధా రామణ్ దాస్ ఖండించారు. బంగ్లాదేశ్ జాతీయ జెండా కంటే ఎత్తుగా మరో జెండాను ఎగరేయడాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారని, అంతే తప్ప అగౌరపర్చలేదని ఆయన పేర్కొన్నారు. -
అప్పుడు అమెరికాకు ఒబామా.. ఇప్పుడు బ్రిటన్‌కు సునాక్..!
లండన్: బ్రిటన్ రాజకీయ చరిత్రను తిరగరాస్తూ.. మొట్టమొదటి భారత సంతతి, హిందూ ప్రధాని పీఠం అధిరోహించారు రిషి సునాక్. ఈ సందర్భంగా.. ఆయనపై ప్రపంచ నేతలతో పాటు బ్రిటన్ వాసులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇది తమకు ‘ఒబామా మూమెంట్’ అని అక్కడి హిందూ దేవాలయ కమిటీ హర్షం వ్యక్తం చేసింది. బ్రిటన్ రాజధాని లండన్‌కు 110 కిలోమీటర్ల దూరంలోని సౌతాంప్టన్‌లో వేదిక్ సొసైటీ హిందూ దేవాలయం ఉంది. దీనిని రిషి తాత రామ్‌దాస్ సునాక్ 1971లో నిర్మించారు. ఆ తర్వాత ఆయన తండ్రి యాష్ సునాక్.. 1980 నుంచి ట్రస్టీగా కొనసాగారు. ఇప్పటికీ రిషి కుటుంబం ఆ ఆలయంతో అనుబంధం కొనసాగిస్తోంది. హాంప్‌షైర్ నగర్‌లోని ఆలయాన్ని రిషి సునాక్.. తరుచుగా సందర్శిస్తుంటారు. ఈ జులైలో కూడా అక్కడకు వెళ్లారు. ప్రతి ఏడాది అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తుంటారు. ‘ఇది గర్వించదగ్గ క్షణం. రిషి సునాక్ విజయంతో ఈ గుడి ఆవరణలో సందడి నెలకొంది. ఇక్కడున్న సుమారు 300 మంది ఆయనతో దిగిన చిత్రాలను చూపించి, ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇది బ్రిటన్‌కు బరాక్ ఒబామా మూమెంట్. మొదటిసారి శ్వేత జాతియేతర వ్యక్తి ప్రధాని అయ్యారు. ఆయన ప్రధాని అవబోతున్నారనే వార్త వినగానే వెంటనే ప్రత్యేక పూజలు నిర్వహించాం’ అని ఆలయ కమిటీ నేత సంజయ్ చందరాణా పేర్కొన్నారు. బ్రిటన్‌కు రిషి సునాక్ ప్రధానికావటం అనేది దేశాన్ని ఏకం చేయటమేనన్నారు. బరాక్ ఒబామా 2009లో అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అగ్రదేశపు అత్యున్నత స్థానంలో కూర్చొన్న తొలి ఆఫ్రికన్ అమెరికన్‌గా ఆయన ఖ్యాతి గడించారు. బరాక్ ఒబామా పాలనా కాలాన్ని సూచిస్తూ రిషి సునాక్‌పై ప్రశంసలు కురిపించారు ఆలయ కమిటీ నేత సంజయ్ చందరాణా. ఇదీ చదవండి: రిషి సునాక్ ప్రసంగం: ఐదు ప్రధానాంశాలు -
కుల చిచ్చు రేపాల్సిన అవసరమేంటి?
సాక్షి, ముంబై : కుల చిచ్చు కారణంగా చెలరేగిన అల్లర్ల తర్వాత పరిస్థితులు దాదాపుగా చక్కబడటంతో మహారాష్ట్ర పోలీసు శాఖ రంగంలోకి దిగింది. సీసీపుటేజీలు, సాక్ష్యాల ఆధారంగా నిందితులను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా భీమ-కోరేగావ్ వద్ద చెలరేగిన హింసకు సంబంధించి సంభాజీ భిడే, మిలింద్ ఎక్‌బోతే పేర్లను ఎఫ్ఐఆర్లో ప్రధానంగా చేర్చింది. అయితే వారు మాత్రం తమకు ఈ అల్లర్లతో సంబంధం లేదని చెబుతుండటం విశేషం. సంభాజీ భిడే(85) హిందూ అతివాది. శివ్ రాజ్ ప్రతిస్థాన్ అనే సంస్థ ప్రధాన ప్రతినిధి అయిన భిడే సరిగ్గా అల్లర్లు చెలరేగటానికి ముందు తన అనుచరులతో భేటీ అయ్యారు. కవ్వింపు చర్యల గురించి ఆయన వారితో చర్చించారు. అదే సమయంలో కొన్ని ప్రాంతాల్లో ముందుగానే వారిని మోహరించి అల్లర్లకు పురిగొల్పినట్లు పోలీసులు పేర్కొన్నారు. మరో నిందితుడు మిలింద్ రెచ్చగొట్టే ప్రసంగాల ద్వారా తన అనుచరుల్ని ఉసిగొల్పాడు అని పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు జనవరి 2న ఓ ఫిర్యాదు అందటంతో పింప్రి పోలీసులు ఆ రెండు సంస్థల ప్రతినిధులపై ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఇక భరిప బహుజన్ మహాసంగ్(బీబీఎం) నేత ప్రకాశ్ అంబేద్కర్ మాట్లాడుతూ.. అల్లర్లకు హిందూ ఎక్తా అగాది, శివ్‌రాజ్ ప్రతిస్థాన్ సంస్థలే కారణమని ఆరోపిస్తున్నారు. భిడే వివరణ... కాగా తనపై ఆరోపణలను భిడే తీవ్రంగా ఖండించారు. ‘‘కుల చిచ్చు రేపాల్సిన అవసరం నాకేంటి? దానివల్ల నాకేం ఒరుగుతుంది? నా పేరును ఇందులోకి లాగి కొందరు రాజకీయం చేస్తున్నారు. దీని వెనుక పెద్ద కుట్ర దాగి ఉంది’’ అని భిడే పేర్కొన్నారు. గురువారం వేలాది మంది అనుచరులతో ఆయన సంగలి జిల్లా కలెక్టర్‌ను కలిసి తనపై నమోదైన అభియోగాలను కొట్టివేయాలని డిమాండ్ చేశారు. మిలింద్ కూడా దాదాపు ఇలాంటి వాదననే వినిపిస్తున్నారు. ఇంకోపక్క వారిపై కేసుల విషయంలో వెనక్కి తగ్గితే మాత్రం పరిణామాలు తీవ్రంగా ఉంటాయని దళిత సంఘాలు హెచ్చరిస్తున్నాయి. భీమ-కోరేగావ్ పోరాటానికి 200 ఏండ్లు పూర్తయిన సందర్భంగా దళితులు నిర్వహించిన కార్యక్రమంలో హింస చెలరేగగా.. బీజేపీ, ఆర్ఎస్ఎస్ నాయకగణం వెనకుండి హింసకు ప్రేరేపించాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
హిందూ నాయకుల హత్యకు కుట్ర!
న్యూ ఢిల్లీ: దేశంలో కల్లోలం సృష్టించడానికి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్.. దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ పెద్ద స్కెచ్చే వేసిందని చెతుతోంది జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ). దేశంలోని ప్రముఖ హిందూ నాయకులు, చర్చిలను టార్గెట్ చేసి దాడులు జరపాలని దావూద్ 'ఢీ కంపెనీ' ప్రణాళికలు సిద్ధం చేసిందని.. గుజరాత్లో ఇద్దరు బీజేపీ నాయకుల హత్యకేసుకు సంబంధించిన చార్జ్‌షీట్‌లో ఎన్ఐఏ స్పష్టం చేసింది. 2002 గుజరాత్ అల్లర్లకు ప్రతీకారంగా ఈ దాడులు జరపాలని 'ఢీ కంపెనీ' యోచిస్తున్నట్లు ఎన్ఐఏ వెల్లడించింది. హిందూ నేతలు, చర్చిలపై దాడులు జరపడం ద్వారా దేశంలో కల్లోల పరిస్థితులు సృష్టించాలని భావిస్తున్నారని ఎన్ఐఏ పేర్కొంది. ఇందుకోసం యువతకు భారీ మొత్తంలో డబ్బును ఎరవేస్తూ ఆకర్షిస్తున్నారని ఎన్ఐఏ తెలిపింది. కరాచీ, దక్షిణాఫ్రికాల్లోని దావూద్ ముఠా కార్యకలాపాలు ఈ విషయాన్ని తెలుపుతున్నాయని ఎన్ఐఏ వెల్లడించింది. -
హతమారుస్తాం
చెన్నై, సాక్షి ప్రతినిధి:తీవ్రవాదుల తాకిడితో రాష్ట్రంలోని భారతీయ జనతా పార్టీ, హిందూ మున్నని నేతలు హడలిపోతుండగా తాజాగా మరో బెదిరింపులేఖ వారిని భయపెడుతోంది. రాష్ట్రానికి చెందిన హిందూ, బీజేపీ నేతలపై తీవ్రవాదులు గురిపెట్టి ఉన్నట్లుగా ఇటీవల ప్రచారం జరుగుతోంది. అయితే ఇవన్నీ వట్టి వదంతులేనని పోలీస్‌శాఖ తేలిగ్గా తీసిపారే సింది. అయితే తీవ్రవాదులు అన్నంత పనీ చేశారు. వేలూరు జిల్లా హిందూ మున్నని అధ్యక్షుడు వెల్లయప్పన్, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ (ఆడిటర్)ను గతేడాది హతమార్చారు. ఆ తరువాత కూడా ఇలాంటి బెదిరింపులే వచ్చాయి. పోలీసులు మొక్కుబడిగా బాధితుల నుంచి ఫిర్యాదులను తీసుకున్నారు. అంతే మరో ఘోరం జరిగిపోయింది. అంబత్తూరు వద్ద హిందూ మున్నని నేత సురేష్‌కుమార్‌ను ఆయన కార్యాలయం సమీపంలోనే జూన్ 18వ తేదీన హత్యచేశారు. ఆయా కేసులో అల్-ఉమా తీవ్రవాదులు, ఇదే తీవ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్న ఇద్దరు నిందితులు పట్టుపడ్డారు. ఈనెల 28న మధ్యాహ్నం చెన్నై చింతాద్రిపేటలోని హిందూ మున్నని కార్యాలయానికి బెదిరింపులేఖ అందింది. హిందూనేతలను హతమార్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామంటూ అందులో పేర్కొన్నారు. తంజావూరు, శివగంగై, కోయంబత్తూరు, విరుదునగర్, తిరుచ్చిరాపల్లి, తిరునెల్వేలి, చెన్నై నగరాల్లోని హిందూనేతలను హతమారుస్తామని ఆయా జిల్లాల్లోని ఒక అక్షరాన్ని ఆ లేఖలో కోడ్‌గా పొందుపరిచారు. తమిళభాషలో రాసిన ఆ లేఖ చివరన ఇట్లు ఇమామలై సోదరులు అంటూ పేర్కొన్నారు. కేరళ రాష్ట్రం పాలక్కాడు నుంచి ఆ లేఖ వచ్చినట్లు తెలుసుకున్నారు. ఈ ఉత్తరాన్ని అందుకున్న నేతలు ఆందోళన చెందారు. హిందూ మున్నని నేతలు మనోహరన్, పరమేశ్వరన్, మురుగేశన్, ఇళంగోవన్, కృష్ణమూర్తి మంగళవారం నగర పోలీస్ కమిషనర్ జార్జ్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. వీరిచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో హిందూ మున్నని కార్యాలయానికి పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. -
హిందూనేతలపైనే
చెన్నై, సాక్షి ప్రతినిధి :రాష్ట్రంలో మూడేళ్లుగా తీవ్రవాదుల కదలికలు ఎక్కువయ్యూయి. ప్రముఖ హిందూ నేతలు ఎందరో వారి దాడులకు బలయ్యూరు. ఆయా కేసుల్లో కొందరు పట్టుబడి జైళ్లలో ఉండగా, మరి కొందరు అజ్ఞాతంలో ఉంటూ కార్యకలాపాలు సాగిస్తున్నారు. బస్సు, రైలు, విమాన ప్రయాణాల కంటే రాష్ట్రం వెంబడి ఉన్న సముద్ర మార్గం సురక్షితమని తీవ్రవాదులు భావిస్తున్నారు. దీంతో కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు తరచూ రాష్ట్ర పోలీసులను అప్రమత్తం చేస్తున్నాయి. మత్స్యకార గ్రామాలపై పోలీసులు నిఘా పెడుతూనే ఉన్నారు. రాష్ట్రంలో ఏమూల ఎక్కడ ఏమి జరుగుతుందోననే ఆందోళన పోలీసు యంత్రాంగాన్ని వెంటాడుతోంది. ఈ దశలో అల్-ఉమాకు చెందిన ముగ్గురు మాజీ తీవ్రవాదులు రెండు రోజుల క్రితం చెన్నై పోలీసులకు పట్టుబడ్డారు. కాశీమేడు ఫిషింగ్ హార్బర్ నుంచి సముద్రమార్గంలో పరారయ్యేం దుకు ప్రయత్నిస్తున్న మరో అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఏడాది జూన్ 18న తిరువళ్లూరు హిందూ మున్నని నేత సురేష్‌కుమార్‌ను హత్యచేసింది తామేనని పట్టుబడిన అంబత్తూరు పాడికి చెందిన నజీర్ (28), కడలూరుకు చెందిన ఖాజా మొహిద్దీన్ (32), కుతుబుద్దీన్ (30) అంగీకరించారు. అంతేగాక మరికొందరిపై తాము గురిపెట్టినట్లు వాంగ్మూలం ఇవ్వడం పోలీసులను కలవరపెట్టింది. పోలీసుల కథనం ప్రకారం, నిందితులు గతంలో నగరంలోని దుకాణాల్లో గుమాస్తాలుగా పనిచేస్తూ జీవించేవారు. వీరిని కొందరు తీవ్రవాదులు తీసుకెళ్లి బ్రెయిన్‌వాష్ చేసి తీవ్రవాదులుగా మార్చినట్లు విచారణలో తేలింది. తీవ్రవాదులుగా ఉంటే ఎక్కువ మొత్తం ముట్టుతుందనే ఆశను వారికి కల్పించారు. హిందూ నేతల కదలికలు చేరవేస్తే చాలని అగ్రనేతలు వీరిని ఆదేశించారు. ఈ పథకం ప్రకారమే సురేష్‌కుమార్ హత్య జరిగింది. హత్యల వెనుక అసలు సూత్రధారి ఖాజామొహిద్దీన్ వంటి తీవ్రవాదులు ఇంతవరకు పట్టుబడలేదు. ఇంకా కొందరు హిందూ నేతలను హతమార్చడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తేలగా, అజ్ఞాతంలో ఉన్న తీవ్రవాదులు దొరికితేగానీ వారి చిట్టాలో ఎవరెవరి పేర్లు ఉన్నాయో తెలుస్తుంది. ఇప్పటికే తిరువళ్లూరులో హిందూ మున్నని నేత సురేష్‌కుమార్, సేలంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆడిటర్ రమేష్ హత్యకు గురయ్యూరు. వీరి హత్యల్లో ఇప్పటికే గతంలో ముగ్గురు, తాజాగా మరో ముగ్గురు అరెస్టయ్యూరు. అజ్ఞాతంలో ఉన్న తీవ్రవాదుల వల్ల ముప్పు ఏర్పడకుండా హిందూనేతలకు ఇప్పటికే ఉన్న పోలీసు బందోబస్తును మరింత పెంచారు. -
రాష్ట్రపతికి 'బ్లాక్' నేతల వివరాలు
న్యూఢిల్లీ: బీజేపీ నాయకుడు సుబ్రమణ్యస్వామి గురువారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు. విదేశాల్లో నల్లధనం దాచుకున్న రాజకీయ నాయకుల వివరాలను ఆయన రాష్ట్రపతికి తెలిపారు. తనకు తెలిసిన 'బ్లాక్ మనీ' నేతల పేర్లను రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లానని సుబ్రమణ్యస్వామి ఒక ప్రకటనలో తెలిపారు. తమిళనాడులో గత రెండు నెలల కాలంలో హత్యకు గురైన హిందూ నాయకుల గురించి కూడా రాష్ట్రపతి వద్ద ప్రస్తావించారు. ఐఎస్ఐ శిక్షణ పొందిన శ్రీలంక తమిళులు తమిళనాడులోకి ప్రవేశించి విధ్వంసాలకు పాల్పడుతున్నారని వివరించారు. వీరి ఆట కట్టించేందుకు చర్యలు చేపట్టాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించాలని రాష్ట్రపతిని సుబ్రమణ్యస్వామి కోరారు.