సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ వినియోగదారుల ఆంక్షలకనుగుణంగా తారిఫ్‌లో మార్పులు చేసింది. ముఖ్యంగా ఇటీవల జియో ఎయిర్‌టెల్ లాంటి ఇతర మేజర్ సంస్థలు పోటా పోటీగా సరికొత్త ప్లాన్‌లను తీసుకు రావడంతో పాటు బీఎస్‌ఎన్‌ఎల్ కూడా తన ప్లాన్లను సమీక్షించింది.
దాదాపు నెల రోజుల క్రితం లాంచ్ చేసిన రూ.187ల ప్లాన్‌లో సరికొత్త మార్పుతీసుకొచ్చింది. 28 రోజుల వాలిడిటీ ఉన్న ఈప్లాన్‌లో 1 జీబీ డేటాతోపాటు అన్‌లిమిటెడ్ (నేషనల్ రోమింగ్) కాలింగ్‌ను అందిస్తోంది. ఇప్పటివరకు ఈ ప్లాన్‌లో 1 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ (హోమ్ సర్కిల్‌లో)లోక్‌ల్ కాలింగ్‌మాత్రమే. అయితే ఢిల్లీ, ముంబాయి నగరాలు తప్ప దేశ వ్యాప్తంగా మిగిలిన అన్ని ప్రదేశాలకు ఈ ప్లాన్ వర్తిస్తుంది.
బీఎస్‌ఎన్‌ఎల్ మరో ప్లాన్ రూ. 186లో అన్‌లిమిటెడ్ లోకల్ అండ్ ఎస్టీడీ వాయిస్ కాల్స్ , 1 జీబీ డేటా అందిస్తోంది. ఈ ప్లాన్180 రోజులు చెల్లుతుంది. కానీ డేటా మొదటి 28 రోజుల్లో మాత్రమే ఇవ్వబడుతుంది. అలాగే, అపరిమిత వాయిస్ కాల్స్ ఆన్-నెట్ , ఆఫ్-నెట్ వాయిస్ కాల్స్ కూడా.
Comments
Please login to add a commentAdd a comment