- కలెక్టర్ రఘునందన్‌రావు
మొయినాబాద్ రూరల్: హరితహారం పథకాన్ని మొయినాబాద్ మండలాన్ని మొదటిస్థానంలో నిలపాలని కలెక్టర్ రఘునందన్‌రావు అధికారులకు సూచించారు. మొయినాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో అన్నిశాఖల అధికారులతో మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశానికి జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావు, జాయింట్ కలెక్టర్ ఆమ్రపాలి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మండలంలోని అధికారులందరు ప్రణాళిక ప్రకారం మండలాన్ని మూడు భాగాలుగా విభజించుకొని ఆ గ్రామాల్లో ఉన్న పాఠశాలలు, దేవాలయాలు, చర్చిల వంటి ప్రదేశాల్లో మొక్కలను నాటాలన్నారు. 2014 అక్టోబర్ 2 నుంచి 30 జూన్ 2015 వరకు పెళ్లిళ్లు చేసుకునే ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల పూర్తి వివరాలను సేకరించి వారికి కళ్యాణలక్ష్మి పథకం వర్తించేలా చూడాలన్నారు.
ఈనెల 14న చేవెళ్లలో తెలంగాణ ఫెస్టివల్ నిర్వహించనున్నామన్నారు. ఈ ఫెస్టివల్‌లో ఒక్కో గ్రామం నుంచి ముగ్గురు యువకులను గతం లో ఎలాంటి బహుమతులు పొందని వారిని ఎంపిక చేసి ఈ పోటీలకు పంపించాలని సూ చించారు. మండలంలోని ఎంపీడీఓలు, తహసీల్దార్లు యువకులను పంపించేందుకు కృషిచేయాలన్నారు. జేసీ ఆమ్రపాలి మాట్లాడుతూ మండలంలో రేషన్‌కార్డులకు ఆధార్‌కార్డుల అనుసంధానం ఇంకా కావాల్సి ఉందన్నారు.
ఓటర్ ఐడీ కార్డులకు ఆధార్‌కార్డు అనుసంధా నం జూన్ 2వ తేదీ వరకు పూర్తిచేయాలని ఆదేశించారు. గ్రామాల్లోని పౌష్టికాహరం పంపిణీ తీరు ఎలా ఉందని సూపర్‌వైజర్ సరోజినిబాయిని అడిగారు. కార్యక్రమంలో సమీక్ష సమావేశ ప్రత్యేకాధికారి బలరాం, తహసీల్దార్ గంగాధర్, ఎంపీడీఓ సుభాషిణి, ఏఈలు బల్వంత్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, ఈఓపీఆర్‌డీ సునంద, ఆర్‌ఐ విజయ్‌కుమార్, వీఆర్‌ఓలు, కార్యదర్శులు, అధికారులు పాల్గొన్నారు.
భాగస్వాములు కండి..
మణికొండ: ‘హరితహారం’ పథకంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ రఘునందన్‌రావు అధికారులను ఆదేశించారు. మండల స్థాయి అధికారులతో ప్రభుత్వ పథకాలపై స్థానిక మండల పరిషత్ కార్యాల యంలో మంగళవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మొక్కలు నాటేందుకు ఎంపిక చేయాల్సిన స్థలాలు, ఓటరు కార్డుతో ఆధార్ అనుసంధానం, వాటర్‌గ్రిడ్, పంచాయతీరాజ్ రూరల్ డెవలప్‌మెంట్, సంక్షేమ పథకాలు, మహిళా భద్రత, ఆరోగ్యలక్ష్మి, మిషన్‌కాకతీయ, స్వచ్ఛభారత్, విద్య, వ్యవసాయం తదితర పథకాల అమలుపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమం లో మండల పరిషత్ అధ్యక్షుడు తలారి మల్లేశ్, మండల ప్రత్యేకాధికారి చంద్రారెడ్డి, తహసీల్దార్ చంద్రశేఖర్, వైస్ ఎంపీపీ, పాపిరెడ్డి, ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ బాబు శ్రీనివాస్, ఈఓపీఆర్‌డీ చంద్రకుమార్, ఏఈలు హన్మంత్‌రెడ్డి, లిఖిత, గీత, ఆర్‌ఐలు ప్రసాద్, ఆనంద్‌సింగ్, వీఆర్‌ఓలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
‘హరితహారం’లో భాగస్వాములు కండి
Published Wed, May 6 2015 1:08 AM | Last Updated on Thu, Mar 21 2019 8:18 PM
Advertisement