Joint Collector Amrapali
-
సర్కారు స్థలాలను ఆక్రమిస్తే ఉపేక్షించం
- జాయింట్ కలెక్టర్ ఆమ్రపాలి పరిగి: ప్రభుత్వ భూముల్ని ఆక్రమిస్తే ఉపేక్షించేది లేదని జాయింట్ కలెక్టర్ ఆమ్రపాలి తేల్చిచెప్పారు. గురువారం ఆమె పరిగి తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించారు. ఆహారభద్రత కార్డులు, రుణమాఫీ పత్రాలు, ఆధార్‌సీడింగ్ తదితర అంశాలపై రెవెన్యూ అధికారులు, సిబ్బందితో చర్చించారు. పరిగిలో వ్యవసాయశాఖకు సంబంధించి ఒకటి, సివిల్సప్లైకి సంబంధించి మరొక గోదాంను ప్రభుత్వం నిర్మించాలనుకుంటోందని, వీటికోసం ప్రభుత్వ భూమిని పరిశీలించాలని తహసీల్దార్‌కు సూచించారు. వాటర్ గ్రిడ్ కోసం.. జాపర్‌పల్లి సమీపంలోని సర్వేనంబర్ 8లో ప్రభుత్వ భూమిని పరిశీలించారు. వాటర్‌గ్రిడ్ కోసం 25 ఎకరాల భూమి అవసరమున్నందున ఆ భూమి కేటాయింపు సాధ్యాసాధ్యాలపై రెవెన్యూ అధికారులతో ఆమె చర్చించారు. అనంతరం జేసీ పరిగి ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించారు. ఆస్పత్రి వెనకాల పెండింగులో ఉన్న ప్రహరీ నిర్మాణం, మార్చురీ గది అభివృద్ధికి సంబంధించి ప్రతిపాదనలు పంపించాలని అధికారులను ఆదేశించారు. కొండాపూర్ శివారులోని సోలార్ పవర్‌ప్రాజెక్టులో ప్రభుత్వ భూములు ఆక్రమించుకుని కలుపుకొన్నారనే ఆరోపణపై ఆమె నివేదిక కోరారు. ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురైతే వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. పై రెండు అంశాలకు సంబంధించి సీపీఎం డివిజన్ కార్యదర్శి వెంకటయ్య జేసీకి ఫిర్యాదు చేశారు. జేసీ వెంట తహసీల్దార్ విజయ్‌కుమార్‌రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ కృష్ణ, ఆర్ఐ మహేష్, వీఆర్ఓలు జహంగీర్, నారాయణ, పాపయ్య తదితరులున్నారు. -
‘హరితహారం’లో భాగస్వాములు కండి
- కలెక్టర్ రఘునందన్‌రావు మొయినాబాద్ రూరల్: హరితహారం పథకాన్ని మొయినాబాద్ మండలాన్ని మొదటిస్థానంలో నిలపాలని కలెక్టర్ రఘునందన్‌రావు అధికారులకు సూచించారు. మొయినాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో అన్నిశాఖల అధికారులతో మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశానికి జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావు, జాయింట్ కలెక్టర్ ఆమ్రపాలి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మండలంలోని అధికారులందరు ప్రణాళిక ప్రకారం మండలాన్ని మూడు భాగాలుగా విభజించుకొని ఆ గ్రామాల్లో ఉన్న పాఠశాలలు, దేవాలయాలు, చర్చిల వంటి ప్రదేశాల్లో మొక్కలను నాటాలన్నారు. 2014 అక్టోబర్ 2 నుంచి 30 జూన్ 2015 వరకు పెళ్లిళ్లు చేసుకునే ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల పూర్తి వివరాలను సేకరించి వారికి కళ్యాణలక్ష్మి పథకం వర్తించేలా చూడాలన్నారు. ఈనెల 14న చేవెళ్లలో తెలంగాణ ఫెస్టివల్ నిర్వహించనున్నామన్నారు. ఈ ఫెస్టివల్లో ఒక్కో గ్రామం నుంచి ముగ్గురు యువకులను గతం లో ఎలాంటి బహుమతులు పొందని వారిని ఎంపిక చేసి ఈ పోటీలకు పంపించాలని సూ చించారు. మండలంలోని ఎంపీడీఓలు, తహసీల్దార్లు యువకులను పంపించేందుకు కృషిచేయాలన్నారు. జేసీ ఆమ్రపాలి మాట్లాడుతూ మండలంలో రేషన్‌కార్డులకు ఆధార్‌కార్డుల అనుసంధానం ఇంకా కావాల్సి ఉందన్నారు. ఓటర్ ఐడీ కార్డులకు ఆధార్‌కార్డు అనుసంధా నం జూన్ 2వ తేదీ వరకు పూర్తిచేయాలని ఆదేశించారు. గ్రామాల్లోని పౌష్టికాహరం పంపిణీ తీరు ఎలా ఉందని సూపర్వైజర్ సరోజినిబాయిని అడిగారు. కార్యక్రమంలో సమీక్ష సమావేశ ప్రత్యేకాధికారి బలరాం, తహసీల్దార్ గంగాధర్, ఎంపీడీఓ సుభాషిణి, ఏఈలు బల్వంత్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, ఈఓపీఆర్డీ సునంద, ఆర్ఐ విజయ్‌కుమార్, వీఆర్ఓలు, కార్యదర్శులు, అధికారులు పాల్గొన్నారు. భాగస్వాములు కండి.. మణికొండ: ‘హరితహారం’ పథకంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ రఘునందన్‌రావు అధికారులను ఆదేశించారు. మండల స్థాయి అధికారులతో ప్రభుత్వ పథకాలపై స్థానిక మండల పరిషత్ కార్యాల యంలో మంగళవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మొక్కలు నాటేందుకు ఎంపిక చేయాల్సిన స్థలాలు, ఓటరు కార్డుతో ఆధార్ అనుసంధానం, వాటర్‌గ్రిడ్, పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్, సంక్షేమ పథకాలు, మహిళా భద్రత, ఆరోగ్యలక్ష్మి, మిషన్‌కాకతీయ, స్వచ్ఛభారత్, విద్య, వ్యవసాయం తదితర పథకాల అమలుపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమం లో మండల పరిషత్ అధ్యక్షుడు తలారి మల్లేశ్, మండల ప్రత్యేకాధికారి చంద్రారెడ్డి, తహసీల్దార్ చంద్రశేఖర్, వైస్ ఎంపీపీ, పాపిరెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ డీఈ బాబు శ్రీనివాస్, ఈఓపీఆర్డీ చంద్రకుమార్, ఏఈలు హన్మంత్‌రెడ్డి, లిఖిత, గీత, ఆర్ఐలు ప్రసాద్, ఆనంద్‌సింగ్, వీఆర్ఓలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. -
టెన్త్ పరీక్షల కోసం కంట్రోల్‌రూం
- సమస్యలుంటే 040- 23231858 నంబర్‌కు ఫోన్ చేయండి - జాయింట్ కలెక్టర్ ఆమ్రపాలి సాక్షి, రంగారెడ్డి జిల్లా: మార్చి 25 నుంచి నిర్వహించే పదో తరగతి పరీక్షలకు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్ ఆమ్రపాలి విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో పదో తరగతి పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో 427 పరీక్షా కేంద్రాలున్నందున ప్రతి కేంద్రం వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. జిల్లా వ్యాప్తంగా పరీక్షలకు 94,181 మంది విద్యార్థులు హాజరవుతున్నారని, విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి కేంద్రంలో నిరంతరంగా విద్యుత్తు సరఫరా చేయడంతోపాటు మౌలికవసతులు కల్పించాలన్నారు. ప్రత్యేక బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. పరీక్షల నిర్వహణపై జిల్లా విద్యాశాఖలో ప్రత్యేకంగా కంట్రోల్ రూం ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె చెప్పారు. సమస్యలుంటే 040- 23231858 నంబర్‌కు ఫోన్ చేయాలన్నారు. పరీక్ష నిర్వహణకు 4,710 మంది ఇన్విజిలేటర్లను నియమిస్తున్నామని, 45 రూట్ అధికారులు, 427 ఛీఫ్ సూపరింటెం డెంట్లు, 20 ఫ్లయింగ్ స్క్వాడ్లను నియమించి పరీక్షలు పక్కాగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అనంతరం డీఈఓ రమేష్ మాట్లాడుతూ ఉదయం 9.30నుంచి మధ్యాహ్నం 12.15వరకు పరీక్ష జరుగుతుందని, కొత్త పద్ధతిలో పరీక్ష నిర్వహిస్తున్నందున విద్యార్థులు ప్రశ్నాపత్రాన్ని చదువుకునేందుకు వీలుగా 15 నిమిషాల సమయం అదనంగా ఇస్తున్నామన్నారు. సమావేశంలో డీఎంహెచ్ఓ సుభాష్‌చంద్రబోస్, ఆర్టీఓ దుర్గాదాస్ తదితరులు పాల్గొన్నారు.