ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో (Reliance Jio) నూతన సంవత్సరం సందర్భంగా కొత్త ఆఫర్‌ను ప్రకటించింది. ‘హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ 2024’ పేరిట రీచార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. దీని కింద ఇప్పటికే ఉన్న ఏడాది కాలపరిమితి రీఛార్జ్ ప్లాన్ రూ.2,999పై అదనపు వ్యాలిడిటీని అందిస్తోంది. దీనివల్ల లాంగ్‌టర్మ్ ప్లాన్ వినియోగించే వారికి ప్రయోజనం కలుగుతుంది.
ప్లాన్ ప్రయోజనాలు ఇవే..
జియో రూ.2,999 వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్‌పై 24 రోజుల అదనపు వ్యాలిడిటీ లభిస్తుంది. అంటే మొత్తం 389 రోజులు ఈ ప్లాన్‌ని వినియోగించుకోవచ్చు. దీని ప్రకారం.. రోజుకు రూ.8.21 పడే ప్లాన్ ధర రూ.7.70లకే తగ్గుతుంది. రోజుకు 2.5 జీబీ అపరిమిత 4జీ డేటా, అన్‌లిమిటెడ్ 5జీ డేటా, వాయిస్‌కాల్స్, 100 ఎస్సెమ్మెస్‌లు అందిస్తోంది. వీటితో పాటు జియో క్లౌడ్, జియో టీవీ, జియో సినిమా వంటి జియో యాప్‌లకు ఉచిత సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది.
అయితే ఈ ప్లాన్‌తో జియో సినిమా ప్రీమియం మెంబర్‌షిప్ ఉండదు. ఇది కావాలంటే విడిగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. జియో న్యూ ఇయర్ ప్లాన్ ప్రయోజనాలు డిసెంబర్ 20 తర్వాత రీచార్జ్ చేసుకున్నవారికి వర్తిస్తాయి. కాగా ఆఫర్‌ను పొందేందుకు చివరి తేదీ అంటూ కంపెనీ ప్రత్యేకంగా వెల్లడించలేదు.
Comments
Please login to add a commentAdd a comment