నిందితులు పర్వీన్‌బేగం, ఆసిఫ్ ఖురేషీ
శంషాబాద్: షాద్‌నగర్‌లో సంచలనం రేపిన యువకుడి హత్య కేసులో ప్రియురాలే నిందితురాలని పోలీసులు తేల్చారు. ఆమెతో పాటు మరో యువకుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. కేసు వివరాలను బుధవారం శంషాబాద్ డీసీపీ ప్రకాష్‌రెడ్డి తన కార్యాలయంలో వెల్లడించారు. ఫరూఖ్‌నగర్‌లో నివాసముండే ఎండీ పర్వీన్‌బేగం, అదే ప్రాంతంలో నివాసముంటున్న ఈరమోని శేఖర్(24) మూడు సంవత్సరాలుగా ప్రేమించుకున్నారు. అయితే, ఎనిమిది నెలలుగా పర్వీన్‌బేగంకు జానంపేటలో నివాసముంటున్న ఆసిఫ్‌ఖురేషితో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఈ క్రమంలో శేఖర్‌తో పర్వీన్ మాట్లాడుతున్న సమయంలో ఆసిఫ్ గమనించి ప్రశ్నించగా.. గతంలో అతడిని ప్రేమించానని, తన వద్ద కొంత డబ్బు కూడా అప్పుగా తీసుకుని శేఖర్ ఇవ్వడం లేదని తెలిపింది. దీంతో ఆసిఫ్‌కు శేఖర్‌పై కోపం పెరిగింది. ఈ క్రమంలో శేఖర్‌ను హత్య చేయాలని ఆసిఫ్, పర్వీన్‌లు పథకం వేశారు.
ఈ నెల 20న పర్వీన్ శేఖర్‌ను తన ఇంటికి పిలిచింది. అక్కడి వచ్చిన తర్వాత బీరులో మాత్రం కలిపి ఇచ్చింది. మొత్తం మూడు బీర్లు తాగిన తర్వాత శేఖర్‌ను అక్కడే కాపు కాసి ఉన్న ఆసిఫ్ కత్తితో కడుపులో విచక్షణారహితంగా పొడిచాడు. చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత అతడి శవాన్ని మూటగట్టి బయటపారేసి పరారయ్యారు. ఈ హత్య వెలుగులోకి రావడంతో డీసీపీ ప్రకాష్‌రెడ్డి సూచనల మేరకు బృందాలుగా ఏర్పడిన షాద్‌నగర్ పోలీసులు నగరం నుంచి తిరిగి వస్తున్న ఇద్దరు నిందితులను షాద్‌నగర్‌లో అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి సెల్‌ఫోన్లు, కత్తులు స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment