వివరాలు వెల్లడిస్తున్న షాద్‌నగర్ ఏసీపీ సురేందర్ (రాములు )
షాద్‌నగర్‌రూరల్: ఒక్కరు కాదు... ఇద్దరు కాదు ఏకంగా ఐదు మందిని హతమార్చాడు.. బంధాల ను, బంధుత్వాలను పక్కన పెట్టి కిరాతకంగా వ్యవహరించాడు.. చిన్న చిన్న సంఘటన మనస్సులో పెట్టుకుని రాములు మానవ మృగంలా మారాడు. కన్న తండ్రిని, కట్టుకున్న భార్యలను, ప్రియురాలిని కర్కషంగా హతమార్చాడు. తాజాగా ప్రియురాలిని దారుణంగా హత్య చేసి మళ్లీ పోలీసులకు చిక్కాడు. కిరాతకుడి అరెస్టుకు సంబంధించిన వివరాలను శుక్రవారం సా యంత్రం షాద్‌నగర్ ఏసీపీ సురేందర్ వెల్లడించారు.
కోరిక తీర్చలేదని ప్రియురాలి హత్య....
ఫరూఖ్‌నగర్ మండలం మహల్ ఎలికట్ట గ్రామా నికి చెందిన రాములు కొంత కాలంగా అదే గ్రామానికి చెందిన జంగం మంగమ్మతో పరిచయం ఏర్పడింది. దీంతో తన కోరిక తీర్చాలని రాములు మం గమ్మను వేధించాడు. అందుకు ఆమె నిరాకరిం చింది. అయితే తన కోరిక తీర్చలేదని ఎలాగైనా ఆ మెను అంతమొందించాలని రాములు కుట్రపన్నా డు. ఈ నేపథ్యంలో ఈనెల 26న సాయంత్రం జం గం మంగమ్మ కూలీ పనులు చేసి ఒంటరిగా ఇం టికి వెలుతున్న సమయంలో మహల్ ఎలికట్ట గ్రా మ శివారులో రాములు ఆమె ఒంటిపై కిరోసిన్ పో సి నిప్పటించాడు. ఈ విషయాన్ని గమనించిన సా ్థనికులు 108 సహాయంతో మంగమ్మను చికిత్స ని మిత్తం షాద్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స ని మిత్తం ఆమెను ఉస్మాని యా ఆసుపత్రికి తరలించ గా చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి మృతి చెందింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి రాములును శుక్రవారం అరెస్టు చేసి రిమాం డ్‌కు తరలించినట్లు ఏసీపీ సురేందర్ తెలిపారు.
ఇప్పటికే నలుగురి హత్య...
రాములుకు 24ఏళ్ళ కిందట మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలం రంగారెడ్డిగూడ గ్రామానికి చెందిన పార్వతమ్మతో మొదటి వివాహమయింది. కొంత కాలం రాములు పార్వతమ్మల కాపురం సజావుగా సాగింది. ఆతర్వాత వారిద్దరి మధ్య గొడవలు చోటు చేసుకోవడంతో రాములు మొదటి భార్య పార్వతమ్మ ఒంటి పై కిరోసిన్ పోసి హత్య చేశాడు. తర్వాత కొందుర్గుకు చెందిన స్వప్నతో రెండో వివాహం చేసుకున్నాడు. ఆమెపై అనుమానం పెంచుకుని తండ్రి జంగం అలియాస్ పులాయిల అడివయ్యతో పాటుగా భార్య స్వప్నలను గొడ్డలితో నరికి హత్య చేశాడు. ఈ కేసులో రాములు జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత కిషన్‌నగర్ గ్రామానికి చెందిన మంజులను మూడో వివాహం చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. రాములు నేర చరిత్ర తెలుసుకున్న మంజుల బంధువులు పెళ్లికి ఒప్పుకోకపోవడంతో ఎలికట్ట గ్రామంలో ఉన్న 20గుంటల పొలాన్ని మంజుల పేరిట రిజిస్ట్రేషన్ చేసి ఆమెను వివాహమాడాడు.
ఈ నేపథ్యంలో మూడో భార్య మంజులను మభ్యపెట్టి ఆమె పేరు న ఉన్న భూమిని విక్రయించాడు. ఈ విషయంలో మూడో భార్య మంజుల కుటుంబ సభ్యులకు, రాములుకు మధ్య గొడవలు జరిగాయి. దీంతో కొంత కాలం పాటు మంజుల తన పుట్టింటికి వెళ్లింది. దీంతో భూ విక్రయ డబ్బులు ఇస్తానని మంజు ల కుటుంబ సభ్యులను ఒప్పించి భార్యను కాపురానికి తెచ్చుకున్నాడు. ఈ నేపథ్యం 2016లో డిసెంబర్‌లో మూడో భార్య మంజుల తండ్రి పోచయ్య మహల్ ఎలికట్ట గ్రామానికి వచ్చాడు. అప్పటికే మామ పోచయ్య పై పగపెంచుకున్న రాములు అతడిని మద్యం సేవించేందుకు మహల్ ఎలికట్ట గ్రామ శివారులోకి తీసుకెళ్లి బండరాళ్లతో దారుణంగా హతమార్చాడు. కన్న తండ్రిని, కట్టుకున్న వాడే అతికిరాతకంగా హతమార్చాడని తెలియడంతో మూడో భార్య మంజుల రాములును వదిలిపెట్టి పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో ఒంటిరిగా ఉన్న రాములు తాజాగా అదే గ్రామానికి చెందిన మంగమ్మ లోబర్చుకునేందుకు ఆమె వెంట పడ్డాడు. అందుకు ఆమె నిరాకరించడంతో ఆమెపై కోపం పెంచుకున్న రాములు మంగమ్మను హతమర్చాడు. ఇప్పటికే ఐదు హత్యలు చేసిన రాములు నరహంతకుడిగా మారాడు.
జైలుకు వెళ్లినా మారని తీరు...
నాలుగు హత్యలు చేసిన రాములు అన్ని కేసుల్లో జైలు శిక్షలు అనుభవించాడు. అయినా రాములు వ్యవహార శైలి మార్చకోలేదు. కన్న తండ్రిని, కట్టుకున్న భార్యను హతమార్చిన కేసులను కోర్టులో కొట్టేసినట్లు, 2016లో మామను హత్య చేసిన కేసు మహబూబ్‌నగర్ కోర్టులో నడుస్తున్నట్లు ఏసీపీ సురేందర్ తెలిపారు. ఐదు హత్యలకు పాల్పడిన రాములుపై పీడీ యాక్టు నమోదు చేయనున్నట్లు ఏసీపీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment