పశ్చిమగోదావరి (పెదపాడు): పదో తరగతి చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ప్రిన్సిపలేనంటూ బాలిక కుటుంబ సభ్యులు ధర్నా నిర్వహించారు. ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లా పెదపాడు మండలం వడ్లూరు గురుకుల పాఠశాల ఎదుట గల జాతీయ రహదారిపై జరిగింది. బుధవారం ఉదయం సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఆర్డీవో.. ఆ స్కూలు ప్రిన్సిపల్ నంబూరి భారతిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. యాజమాన్యం వేధింపుల వల్ల బాలిక ఆత్మహత్య చేసుకుందని ఆగ్రహించిన విద్యార్థిని బంధువులు పాఠశాలపై దాడి చేసి ఫర్నిచర్, ల్యాప్‌టాప్‌లు ధ్వంసం చేశారు.