![చంద్రవేణి మృతదేహం](/styles/webp/s3/article_images/2017/09/4/71476120585_625x300.jpg.webp?itok=i3_mL6lL)
చంద్రవేణి మృతదేహం
యాకుత్‌పురా: ఇంజినీరింగ్ చదివిని ఓ యువతి ఉద్యోగం రావడంలేదని ఆత్మహత్య చేసుకుంది. మీర్‌చౌక్ ఎస్‌ఐ అంజిరెడ్డి కథనం ప్రకారం... మీరాలంమండి జేజేనగర్ ప్రాంతానికి చెందిన శ్రీహరి, అరుణ దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కుమారులు సంతానం. పెద్ద కూతురు చంద్రవేణి (23) బీటెక్ పూర్తి చేసి ఉద్యోగ అన్వేషణలో ఉంది.
ఇటీవల కానిస్టేబుల్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకొని విఫలమైంది. బీటెక్ చదివినా ఉద్యోగం రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన చంద్రవేణి ఆదివారం రాత్రి ఫ్యాన్ కు చున్నీతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబసభ్యుల సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.