ఓ బాలిక ఉరివేసుకుని బాలిక ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ సమీపాన కొత్వాలి ప్రాంతంలో బుధవారం వెలుగులోకి వచ్చింది.
కాన్పూర్: ఓ బాలిక ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ సమీపాన కొత్వాలి ప్రాంతంలో చోటుచేసుకుంది. తల్లిదండ్రులతో గొడవపడిన అనంతరం మనస్తాపానికి గురై ఆ బాలిక తన ఇంటిలో ఉరివేసుకుని ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టు పోలీసులు పేర్కొన్నారు. ఓ డిగ్నీ కళాశాలలో బిఎ చదువుతున్న ఆ బాలిక సుధీర్ శుక్లా కుమారై పరూల్ (18) గా పోలీసులు గుర్తించారు. పరూల్ తల్లి రాధ తమ ఇంటికి వచ్చిన బంధువులను కలవడానికి వెళ్లిన సమయంలో ఆమె ఒక్కదే ఇంట్లో ఉన్నట్టు తెలుస్తోంది.
ఆ సమయంలో ఓ చిన్ని గుడ్డతో ఉరేసుకుని బాలిక ఆత్మహత్య చేసుకున్నట్టు ఓ పోలీస్ అధికారి చెప్పారు. బాలిక మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చూరీకి తరలించారు. ప్రాథమిక నివేధిక ప్రకారం... ఆ బాలిక తమ కుటుంబ గొడవలతోనే మనస్తాపానికి గురైనట్టు వెల్లడైంది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు.