
మైసూరు: ప్రేమించాలంటూ యువకుడు వేధింపులు తాళలేక ఆత్మహత్య కు యత్నించిన బాలిక చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. దక్షిణ గ్రామీణ పోలీసుల కథనం మేరకు... మైసూరు తాలూకాలోని రమ్మనహళ్లి గ్రామానికి చెందిన రజని(16)పీయూసీ చదువుతుండేది. అదే కాలేజీకి చెందిన ఇంటి పక్కనే ఉంటున్న దొడ్డస్వామి అనే యువకుడు తనను ప్రేమించాలంటూ బాలికను వేధించేవాడు. తనకు ఇష్టం లేదని తిరస్కరించినా వెంటపడి వేధించేవాడు.
ప్రేమించకపోతే తనతో కలసి దిగిన ఫోటోలను ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేస్తానని బెదిరంచేవాడు. దీంతో మనస్థాపం చెందిన రజనీ ఆరు నెలల క్రితం ఉరేసుకొని ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన తల్లితండ్రులు రజనీని కే.ఆర్.ఆసుపత్రికి తరలించగా కోమాలోకి వెళ్లింది. ఈక్రమంలో రజనీ బుధవారం మృతి చెందింది. ఇదిలా ఉండగా ఘటనపై దొడ్డస్వామిని పోలీసులు అరెస్ట్ చేయగా ఇటీవల బెయిల్‌పై బయటకు వచ్చి అప్పటి నుంచి పరారీలో ఉన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment