ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, చెన్నై: మదురవాయిల్‌కు చెందిన 15 ఏళ్ల బాలిక కోయంబేడులోని ఓ ప్రైవేటు పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది. ఈమె శనివారం రాత్రి ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న మదురవాయిల్ పోలీసులు విద్యార్థి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవపరీక్ష కోసం కీల్పాక్కం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
బాలికకు చెందిన నోటు పుస్తకాలను పరిశీలించగా.. అందులో తాను ఒక యువకుడిని ప్రేమిస్తున్నానని.. కానీ ఆ యువకుడు మరొకరిని ప్రేమిస్తున్నట్లు తెలిసింది. తనను మోసం చేశాడని ఆత్మహత్య చేసుకుంటున్నట్టు పేర్కొంది. దీంతో ప్రేమించిన యువకుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
మోకాళ్ల నొప్పులు తట్టుకోలేక..
చెన్నై పెరంబూరు దామోదరం వీధి ప్రాంతానికి చెందిన శశికళ (58). భర్త పళనిస్వామి మృతి చెందారు. ఈమె ఇద్దరి కుమార్తెలకూ వివాహమైంది. ఈనేపథ్యంలో మూడేళ్లుగా శశికళ మోకాలు నొప్పితో బాధపడుతున్నట్లు తెలిసినది.
వైద్యం చేయించినప్పటికీ ఫలితం లేకపోవడంతో జీవితంపై విరక్తి చెందిన శనివారం ఇంటిలో కిరోసిన్ పోసుకుని నిప్పు అంటించుకుంది. ఇరుగుపొరుగు వారు అక్కడికి వెళ్లి చూడగా అప్పటికే ఆమె మృతి చెందింది. తిరువిక నగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఉపాధ్యాయుడు మందలించడంతో..
తిరువొత్తియూరు: తంజై జిల్లాలో ప్లస్‌టూ విద్యార్థిని, చెన్నై మదురవాయిల్ సమీపంలో పదవ తరగతి విద్యార్థిని, పెరంబూరులో ఓ వృద్ధురాలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివరాలు.. తంజావూరు జిల్లా వరత్తనాడుకు చెందిన కరుణానిధి కుమార్తె విద్య (17). ఈమె వరత్తనాడులోని ఓ ప్రైవేటు పాఠశాలలో ప్లస్–2 చదువుతోంది. విద్య శనివారం తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
తరగతి గదిలో గణిత ఉపాధ్యాయుడు శశికుమార్ (30) తీవ్రంగా మందలించడంతో ఆవేదనకు గురై విద్య ఆత్మహత్య చేసుకున్నట్లు దర్యాప్తులో తెలిసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి గణిత ఉపాధ్యాయుడు శశికుమార్‌ను అరెస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment