
పట్టుబడ్డ నిందితులు
సాక్షి, బెంగళూరు : పోకిరీల వేధింపులు తాళలేక బాలిక ఆత్మ హత్యకు పాల్పడిన సంఘటన నెలమంగల తాలూకా ఎడేహళ్లి గ్రా మంలో చోటుచేసుకుంది. ఎడేహళ్లిని చెంది న ధనలక్ష్మి (14)ని ఇదే గ్రామానికి చెందిన జగదీష్, రవికుమార్ అనే ఇద్దరు యువకులు నిత్యం వేధించేవారు, యువకుల వేధింపులు తాళలేని ధనలక్ష్మి శనివారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటిమీద కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యయత్నం చేసింది. తీవ్రంగా గాయపడిన బాలికను బెంగళూరు విక్టోరియా ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స ఫలించక ధనలక్ష్మి మృతి చెందింది. మరణానికి ముందు పోలీసులు బాలిక వద్ద తీసుకున్న మరణ వాగ్మూలం ఆధారంగా నిందితులను అరెస్టు చేశారు.