
జైపూర్: సెల్‌ఫోన్ బాగు చేయించమని తల్లిదండ్రులను అడిగితే నిరాకరించారని ఓ యువతి ఆత్మహత్య చేసు కుంది. ఈ సంఘటన మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం వేలాల గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వేలాల గ్రామానికి చెందిన ప్యాగ సారక్క, స్వామి దంపతులకు ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు.
కూతురు సాయిషుమా (19) మంచిర్యాలలో డిగ్రీ ప్రథమ సంవత్సరం చదువుతోంది. ఇంట్లో ఉన్న సెల్‌ఫోన్ పాడైపోవడంతో బాగు చేయించమని అడిగింది. దీంతో తరచూ సెల్‌ఫోన్ పాడు చేస్తున్నా వని తల్లి మందలించింది. ప్రస్తుతం ఆర్థిక పరిస్థితులు బాగాలేవని, కొద్ది రోజుల తర్వాత బాగు చేయిస్తామని చెప్పింది. ‘అన్న అడిగితే బాగు చేయిస్తారు కానీ తాను అడిగితే మాత్రం ఏమీ చెయ్యరు’ అంటూ సాయిషుమా మనస్తాపం చెందింది.
తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లిన తర్వాత ఇంట్లోనే ఉరేసుకుంది. కాసేపటి తర్వాత గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన కిందికి దించినా అప్పటికే మృతిచెందింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై నాగరాజు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment