Rogues harassment
-
పోకిరీల వేధింపులు.. బాలిక ఆత్మహత్య
సాక్షి, బెంగళూరు : పోకిరీల వేధింపులు తాళలేక బాలిక ఆత్మ హత్యకు పాల్పడిన సంఘటన నెలమంగల తాలూకా ఎడేహళ్లి గ్రా మంలో చోటుచేసుకుంది. ఎడేహళ్లిని చెంది న ధనలక్ష్మి (14)ని ఇదే గ్రామానికి చెందిన జగదీష్, రవికుమార్ అనే ఇద్దరు యువకులు నిత్యం వేధించేవారు, యువకుల వేధింపులు తాళలేని ధనలక్ష్మి శనివారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటిమీద కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యయత్నం చేసింది. తీవ్రంగా గాయపడిన బాలికను బెంగళూరు విక్టోరియా ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స ఫలించక ధనలక్ష్మి మృతి చెందింది. మరణానికి ముందు పోలీసులు బాలిక వద్ద తీసుకున్న మరణ వాగ్మూలం ఆధారంగా నిందితులను అరెస్టు చేశారు. -
చంపుతానన్న కొడుకునే చంపించింది
నిజామాబాద్ ,ఎల్లారెడ్డి: జులాయిగా తిరుగుతూ, ఇంట్లో వాళ్లను చంపుతానని బెదిరిస్తున్న కన్న కొడుకునే హత్య చేయించిన తల్లిని, హత్య చేసిన నిందితుడితో పాటు సహకరించిన చిన్నకొడుకును పోలీసులు గురువారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. గతేడాది అక్టోబర్ 12న ఎల్లారెడ్డి పీఎస్ పరిధిలోని మాచాపూర్ శివారులో ఓ వ్యక్తిని తలపై రాడ్డుతో కొట్టి హత్య చేశారు. ఒంటిపై దుస్తులు తొలగించి, ముఖంపై పెట్రోల్ పోసి తగులబెట్టి ఆధారాలు లేని ఈ కేసులో నాలుగు నెలలపాటు సాగిన పోలీసుల పరిశోధన కొలిక్కి వచ్చింది. డీఎస్పీ చంద్రశేఖర్‌గౌడ్ వివరాలు వెల్లడించారు. ఎల్లారెడ్డి పట్టణానికి చెందిన కటికె గోడెకర్ యాదిలాల్ అలియాస్ యాదుల్ మటన్‌షాప్ నిర్వహిస్తుండేవాడు. ఇక్కడ సరైన ఆదాయం రాక 2016లో హైదరాబాద్ జియాగూడకు వలస వెళ్లాడు. అక్కడ భార్య అశ్విని బంధువైన చంద్రకళతో పరిచయం ఏర్పడింది. చంద్రకళ పెద్ద కొడుకు మాల్తుకుకార్ ప్రవీణ్‌కుమార్(40) ఏ పని చేయకుండా జులాయ్‌గా తిరిగేవాడు. తనను, తన కూతురు, చిన్న కొడుకు సోను అలియాస్ మహావీర్ను డబ్బుల కోసం వేధిస్తూ చంపుతానని భయపెడుతున్నాడని తరుచూ చంద్రకళ యాదిలాల్కు చెప్పుకునేది. కొద్ది రోజులకు భార్యతో గొడవ పడి యాదిలాల్ ఎల్లారెడ్డికి వచ్చేశాడు. ఒకరోజు చంద్రకళ యాదిలాల్కు ఫోన్ చేసి తన పెద్ద కొడుకు వేధింపులు అధికమయ్యాయని అతడిని హత్య చేస్తే రూ.3 లక్షలు చెల్లిస్తానని బేరం కుదుర్చుకుంది. ఈ మేరకు ఆమె రూ.50 వేలను నిందితుడికి అందించింది. దీంతో నిందితుడు యాదిలాల్ ప్రవీణ్‌ను ఎల్లారెడ్డిలో పెళ్లి సంబంధం చూపెడతానని ఆశ చూపి 2017 అక్టోబర్ 12న పిలిచాడు. పథకం ప్రకారం హైదరాబాద్ నుంచి గోపాల్‌పేట్‌లో దిగాలని తాను అక్కడే కలుస్తానని ప్రవీణ్‌కు చెప్పాడు. ఇద్దరూ కలిసి మద్యం తీసుకుని మాచాపూర్ శివారులో తాగారు. మద్యం మత్తులో ఉన్న ప్రవీణ్‌ను పథకం ప్రకారం తెచ్చుకున్న ఇనుప రాడ్‌తో తలపై కొట్టగా అతడు అక్కడికక్కడే మృతి చెందాడు.. ప్రవీణ్‌ను హత్య చేసిన విషయం చంద్రకళకు తెలియజేయగా శవాన్ని గుర్తు పట్టరాకుండా మార్చేసి సాక్ష్యాలు లేకుండా చేయమని ఆమె సూచించింది. శవం ఒంటిపై దుస్తులన్నీ తొలగించి పెట్రోల్ పోసి తగలబెట్టాడు. అనంతరం మృతుడి దుస్తులు, సెల్‌ఫోన్, ఇనపరాడ్ను పట్టణ శివారులోని పెద్ద చెరువులో వేసి సాక్ష్యాలు లేకుండా చేశాడు. అనంతరం ఒప్పందం ప్రకారం మిగితా రూ.2.50 లక్షలు ఇవ్వాలని చంద్రకళపై ఒత్తిడి తెచ్చాడు. తన వద్ద ఇప్పుడు డబ్బులు లేవని కొద్ది రోజుల తర్వాత చెల్లిస్తానని ఆమె నిందితుడికి ప్రాంసరీ నోట్ రాసి ఇచ్చింది. తమ గ్రామ శివారులో శవం కనిపించిందంటూ మాచాపూర్వాసులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేసి పరిశోధించారు. ఎలాంటి ఆనవాళ్లు లేని మృతుడు ఎవరు, అతడిని ఎవరు హత్య చేశారో తెలుసుకోవడానికి పోలీసులకు చాలా కష్ట పడాల్సి వచ్చింది. మృతుడి ఫొటోను ఫ్లెక్సీ చేయించి జన సమ్మర్థం గల ప్రాంతాలు, జిల్లాల పోలీస్స్టేషన్లలో, పక్క రాష్ట్రాల వాహనాలకు అతికించి సమాచారం కోసం ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో జియాగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో వ్యక్తి కనిపించడం లేదంటూ వచ్చిన సమాచారంతో పరిశోధన ఆ వైపు సాగించారు. మృతుడి ఫోన్‌కాల్ రిజిష్టర్, ఇతర ఆధారాలతో నిందితుడు యాదిలాల్ను విచారించారు. మృతుడి తల్లి చంద్రకళ సూచనల మేరకే హత్య చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. నిందితులను పట్టుకున్న పోలీసులను డీఎస్పీ అభినందించారు. సీఐ సుధాకర్, ఎస్ఐ శ్రీకాంత్‌రెడ్డి ఉన్నారు. -
బాలికల హాస్టళ్ల వద్ద పోకిరీలు
ఇబ్బందులు పడుతున్న విద్యార్థినులు పట్టించుకోని అధికార యంత్రాంగం కరువైన పోలీసుల పర్యవేక్షణ వరంగల్ : వరంగల్ మహానగరంలో మహిళలకు ఇబ్బందులు తీవ్రమవుతున్నాయి. పోకిరీల బెడదతో మహిళలు, ప్రధానంగా విద్యార్థినులు అష్టకష్టాలు పడుతున్నారు. మహిళా హాస్టళ్లు ఏర్పాౖటెనా ప్రాంతాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది. ప్రభుత్వ వసతిగృహాల్లోని విద్యార్థినుల ఇబ్బందులైతే చెప్పుకునే స్థాయి దాటిపోయాయి. హన్మకొండలోని జులైవాడలో ఈ పోకరీల బెడద ఎక్కువగా ఉందని చెబుతున్నారు. ఈ ప్రాంతంలోని హాస్టళ్ల సముదాయంలో ఓ పాఠశాల, మూడు హాస్టళ్లు ఉన్నాయి. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రాథమిక ఆశ్రమ పాఠశాల, పోస్టు మెట్రిక్ హాస్టళ్లు రెండు, డీఏహెచ్(డిపార్ట్మెంట్ అటాచ్డ్ హాస్టల్) హాస్టళ్లు కొనసాగుతున్నాయి. ఆయా వసతి గృహాల్లో ప్రాథమిక విద్య నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు చదివేబాలికలు, విద్యార్థినులు ఉంటున్నారు. ప్రాథమిక ఆశ్రమ పాఠశాలలో 600 మంది, వరంగల్, హన్మకొండ పరిధిలోని పోస్ట్ మెట్రిక్ విద్యార్థులు 400 మంది, ఇంటర్మీడియట్, ఏఎన్ఎం, ఇతరత్రా కోర్సులు చేస్తున్న విద్యార్థినులు 200 మందికి డీఏహెచ్లో వసతి కల్పించారు. అయితే, హాస్టళ్లలో బస చేసే వారి సంఖ్య ఎక్కువ కావడంతో పర్యవేక్షణ కొరవడిందని తెలుస్తోంది. పోలీసు శాఖ పరంగా కూడా పర్యవేక్షణ లేకపోవడంతో పలువురు పోకిరీలు అడ్డాగా మార్చుకున్నారని విద్యార్థినులు వాపోతున్నారు. ఎప్పుడు పడితే అప్పుడు బయటి వ్యక్తులు సముదాయంలోకి వస్తుండడమే కాకుండా.. రాత్రివేళ ద్విచక్ర వాహనాలపై తిరుగుతూ ఇబ్బంది పడుతున్నారని చెబుతున్నారు. ఇకనైనా శాఖ పరంగా పర్యవేక్షణకు రాత్రివేళ వాచ్మెన్ల సంఖ్య పెంచడంతో పాటు పోలీసులు కూడా పెట్రోలింగ్ నిర్వహిం చాలని పలువురు కోరుతున్నారు. -
ప్రాణం తీసిన రాంగ్‌కాల్స్
మెదక్ (పాపన్నపేట): పోకిరీల వేధింపులు భరించలేక ఓ డిగ్రీ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. ఈ సంఘటన మెదక్ జిల్లా పాపన్నపేట మండలం కొత్తపల్లిలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. ఏఎస్ఐ విఠల్ వివరాల మేరకు.. గ్రామానికి చెందిన మెట్టు నారాయణ రెండో కుమార్తె మెదక్‌లోని శ్రీనివాస్ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ మొదటి సంవత్సరం చదువుతోంది. రెండు నెలలుగా ఆమె సెల్‌కు రాంగ్‌కాల్స్ వస్తున్నాయి. సిమ్ మార్చినా వాటి బెడద తగ్గలేదు. దీంతో కలత చెందిన రాధిక.. గురువారం రాత్రి ఇంట్లో ఎవరు లేని సమయంలో చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఉన్నత చదువులు చదివి కుటుంబానికి బాసటగా నిలుస్తుందనుకున్న కుమార్తె ఇలా అర్ధంతరంగా తనువు చాలిస్తుందనుకోలేదని తల్లిదండ్రులు విలపించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.