పుట్టినరోజు నాడే కానరానిలోకాలకు.. | Girl Suicide In Yadadri | Sakshi
Sakshi News home page

పుట్టినరోజు నాడే కానరానిలోకాలకు..

Published Sat, Jul 21 2018 12:58 PM | Last Updated on Sat, Jul 21 2018 12:58 PM

Girl Suicide In Yadadri - Sakshi

మాధవి ఇంటి వద్ద రోదిస్తున్న బంధువులు, పక్కన మాధవి(ఫైల్‌)  

భువనగిరి క్రైం : ప్రేమపేరుతో వేధింపులకు ఓ బాలిక బలైంది. కళాశాలకు వెళ్లి చదువుకునే విద్యార్థినిని నిత్యం వేధిస్తుండడంతో తీవ్ర మనస్తాపానికి గురై పుట్టిన రోజు నాడే ఆయువు తీసుకుంది. ఈ విషాద సంఘటన శుక్రవారం భువనగిరి పట్టణంలోని సింగన్నగూడెంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భువనగిరి పట్టణంలోని సింగన్నగూడెంకు చెందిన పెద్దపొల్ల నర్సింహ, స్వప్నలకు ముగ్గురు పిల్లలు.

తల్లి పట్ట ణ పరిధిలోని ఓ దాబాలో పనిచేస్తుండగా, తండ్రి రోజూవారీ కూలి పనులు చేసుకుంటాడు. వీరి రెండో కూతురు మాధవి(16) భువనగిరిలోనే ఇం టర్‌ ప్రథమ సంవత్సరం చదువుతోంది. మాధవిని కొన్ని రోజులుగా భువనగిరి పట్టణంలోని ఎల్బీనగర్‌కు చెందిన శ్రీకాంత్, సింగన్నగూడేనికి చెందిన అన్నదమ్ములు బొంతల కిరణ్, తేజాలు ప్రేమపేరుతో వేధిస్తున్నారు. ఈ విషయం మా ధవి తన తల్లిదండ్రులకు చెప్పడంతో వారు యు వకులను మందలించారు.

అయిన వారిలో మా ర్పు రాలేదు. గురువారం(ఈనెల19న) మాధవి పుట్టిన రోజు అవడంతో వేధింపుల భయంతో కళాశాలకు వెళ్లకుండా ఇంటి వద్దే ఉంది. మనస్తాపంతో దిగులు చెందిన మాధవి తలకు రాసుకునే నూనె(సూపర్‌ వేస్మాల్‌) డబ్బా తీసుకుని ఇంటి దగ్గరలోనే ఉన్న న్యూరవీంద్ర నగర్‌ వద్ద ఉన్న పో చమ్మ గుడి వద్దకు వెళ్లింది.

ఈ విషయం నిం దితుల ద్వారానే తెలుసుకున్న మాధవి తల్లి అక్కడికి వెళ్లేలోపే అపస్మారక స్థితిలో ఉంది. దీంతో అప్రమత్తమైన తల్లి మాధవిని వెంటనే భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించింది. భువనగిరి ఏరి యా ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా పరిస్థితి మరింత విషమించడంతో హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సాయంత్రం మృతి చెందింది. 

నిందితులపై కేసు నమోదు చేశాం : సీఐ 

మాధవి మృతికి కారణమైన ముగ్గురు నిందితుల ను అదుపులోకి తీసుకున్నామని భువనగిరి పట్టణ సీఐ వెంకన్న తెలిపారు. ఈ ముగ్గురు కొంతకాలంగా మాధవిని ప్రేమపేరుతో వేధిస్తున్నారని చెప్పారు. వీరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, ఫోక్సో యాక్టు, ప్రేమపేరుతో వేధింపులతో వేధించినందుకు కేసు నమోదు చేశామని చెప్పారు.

మా కూతురిని వాళ్లే పొట్టనబెట్టుకున్నారు : మాధవి తల్లిదండ్రులు

తమ కూతురుని ఆ ముగ్గురు యువకులే పొట్టన పెట్టుకున్నారని మాధవి తల్లిదండ్రులు నర్సింహ, స్వప్నలు ఆరోపించారు. కొంతకాలంగా వీళ్లు మాధవిని వేధిస్తున్నారని చెప్పారు. పుట్టిన రోజు నాడు మాధవి గుడికి వెళ్తున్నానని చెప్పి  ఇంటి నుంచి వెళ్లిందన్నారు. విషయం తెలుసుకున్న శ్రీ కాంత్, తేజ,  కిరణ్‌లు గుడి వద్దకు వెళ్లి బలవంతంగా సుపర్‌ వేస్మాల్‌ ఆయిల్‌ను తాగించారని ఆరోపించారు.

మళ్లీ ఆ విషయాన్ని వాళ్లే తనకు వచ్చి చెప్పారని, తాము వెంటనే అక్కడికి వెళ్లి చూడగా తన కూతురు అపస్మారక స్థితికి చేరుకుం దని, వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లినట్టు చెప్పింది. ఆస్పత్రికి తీసుకువెళ్లే మార్గమధ్యలో ‘అమ్మ నాన్న నేను వెళ్లిపోతున్నాను.. అక్క జాగ్రత్త’ అని చెప్పిం దని తల్లి రోదించింది.

తన కూతురు చావుకు కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలని కోరిం ది. ఇలాంటి పరిస్థితి ఎవరి తల్లిదండ్రులకు రావద్దని రోదిస్తూ చెప్పింది. మాధవి ఇంటి వద్ద బంధువుల రోదనలు మిన్నంటాయి.

శ్రీకాంత్‌ ఆత్మహత్యాయత్నం

ఈ కేసులో నిందితుడిగా ఉన్న శ్రీకాంత్‌ ఆ త్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని సీఐ వెం కన్న తెలిపారు. శ్రీకాంత్‌ను సికింద్రాబాద్‌ లోని గాంధీ ఆస్పత్రికి తరలించినట్లు, ప్రస్తు తం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉం దని ఆయన తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement