love harassments
-
ప్రేమించాలంటూ వేధింపులు..
ఘట్కేసర్: తనను ప్రేమించాలని వేధించిన యువకుడిని ఘట్కేసర్ పోలీసులు రిమాండ్‌కు తరలించారు. సీఐ కథనం ప్రకారం.. పెద్దపల్లి సాగర్ రోడ్డుకు చెందిన ఎండీ ఇంతియాజ్ నగరంలోని తార్నాకలో నివాసం ఉంటూ ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్న పెద్దపల్లికి చెందిన ఓ విద్యార్థినిని ప్రేమించాలని ఏడాదిగా వేధిస్తున్నాడు. వేధింపుల విషయమై అతడిపై పెద్దపల్లి పోలీస్‌స్టేషన్‌లో గతంలో రెండు కేసులు నమోదయ్యాయి. విద్యాభ్యాసం కోసం ఈ నెల 8న మండలంలోని చౌదరిగూడలోని కాలేజీకి రోడ్డుపై వెళ్తుండగా నిందితుడు బైక్‌పై వచ్చి తార్నాకలోని అతడి స్నేహితుడి గదికి తీసుకెళ్లాడు. తనను ప్రేమించని పక్షంలో అంతు చూస్తానని బెదిరించాడు. ఆమె గట్టిగా అరవడంతో తిరిగి ఆమెను కాలేజీ సమీపంలో వదిలివెళ్లాడు. ఈ విషయమై నిందితుడిపై చర్యలు తీసుకోవాలని విద్యార్ధిని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. -
ప్రేమ పేరుతో వేధింపులు.. యువతి ఆత్మహత్య
సాక్షి, పాల్వంచ(ఖమ్మం) : ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రైనీ నర్సుగా పనిచేస్తున్న విద్యార్థిని ప్రేమ పేరుతో వేధింపులకు గురై, పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. టేకులపల్లి మండలం కోయగూడెం గ్రామానికి చెందిన పూనెం వాసవి(17) అనే విద్యార్థిని పాల్వంచలోని సిద్ధార్థ ఒకేషనల్ నర్సింగ్ కళాశాలలో చదువుతుంది. టీచర్స్ కాలనీలో వరుసకు అన్న అయిన మాచర్ల గోపి ఇంట్లో రెండు నెలలుగా అద్దెకు ఉంటూ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ట్రైనీ నర్సుగా చేరింది. గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగింది. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను గుర్తించిన బంధువులు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం కొత్తగూడెం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ అక్కడ మృతి చెందింది. అయితే కోయగూడెంకు చెందిన వరుసకు బంధువైన గీతారత్నం అనే యువకుడు ప్రేమ పేరుతో కొన్ని రోజులుగా వేధింపులకు దిగడం వల్లే తన కూతురు ఆత్మహత్య చేసుకుందని బాలిక తండ్రి శ్రీధర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెండు రోజుల క్రితం గీతారత్నం, అతని స్నేహితుడితో కలిసి వాసవి ఉంటున్న ఇంటి వద్దకు వెళ్లి పెళ్లి చేసుకోవాలని బెదిరింపులకు దిగడంతో మనస్థాపం చెందిందని, ఈ విషయాన్ని తనకు ఫోన్లో కూడా చెప్పిందని పేర్కొన్నారు. ఈ మేరకు ఎస్ఐ ప్రవీణ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వాసవి మృతితో కోయగూడెంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆస్పతి వద్ద విద్యార్థిని స్నేహితులు విలపించిన తీరు అక్కడున్న వారిని కలిచివేసింది. -
ప్రేమ వేధింపులతో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
పెనగలూరు: మండలంలోని కొండూరు పంచాయతీ గట్టువారిపల్లెకు చెందిన ఉప్పు హరిత (18) ప్రేమ వేధింపులతో ఆదివారం సాయంత్రం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. వివరాలిలావున్నాయి. హరిత రాజంపేటలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. అదే పంచాయతీ సిరివరం గ్రామానికి చెందిన ఓ యువకుడు రాజంపేటలోనే డిగ్రీ చదువుతున్నాడు. ఈనేపథ్యంలో ఇద్దరూ ఒకే బస్సులో కళాశాలలకు వెళ్లి వచ్చేవారు. ఆ యువకుడు ప్రతి రోజూ హరితను నిన్ను ప్రేమిస్తున్నాను, పెళ్ళి చేసుకుంటానని వెంటపడేవాడు. విషయం విద్యార్థిని బంధువులకు తెలిసి తమ అమ్మాయిని వేధించవద్దని హెచ్చరించారు. అయినా అతడు వెంటపడుతుండటంతో వేధింపులు తాళలేక ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్ఐ తెలిపారు. మృతురాలి తల్లిదండ్రులు ఈశ్వరయ్య, లక్ష్మీదేవిలు జీవనోపాధికోసం గల్ఫ్‌దేశాలకు వెళ్లి ఉన్నారు. కుమార్తె మృతి విషయాన్ని తెలుసుకొని తల్లిదండ్రులు సోమవారం స్వగ్రామాని చేరుకొని కన్నీరుమున్నీరయ్యారు. మృతిరాలి తండ్రి ఈశ్వరయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ హేమీభాయి తెలిపారు. -
యువకుడి ఆత్మహత్యాయత్నం
బంజారాహిల్స్: జూబ్లీహిల్స్‌లోని ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్న యువతి(22)ని ప్రేమ పేరుతో వేధిస్తూ బ్లాక్మెయిల్ చేయడమేగాక పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో ఓ యువకుడు ఏకంగా యువతి ఇంటికి వెళ్లి ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన గద్వాల్లో చోటుచేసుకుంది. ఈ ఘటనలో నిందితుడిపై జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదై ఉంది. వివరాల్లోకి వెళితే.. గద్వాల్‌కు చెందిన యుగంధర్‌గౌడ్ జూబ్లీహిల్స్‌లోని ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తూ మియాపూర్‌లో ఉంటున్నాడు. అదే కార్యాలయంలో పనిచేస్తున్న యువతితో అతడికి పరిచయం ఏర్పడటంతో ప్రేమిస్తున్నానని అమె వెంటపడుతున్నాడు. దీనిపై బాధితురాలు ఫిర్యాదు చేయడంతో యాజమాన్యం అతడిని ఉద్యోగం నుంచి తొలగించింది. అయితే.. గత మార్చి 26న యుగంధర్ ఆమె కార్యాలయానికి వచ్చి మళ్లీ వేధించడం మొదలుపెట్టాడు. అంతటితో ఆగకుండా ఆమె సొంత ఊరైన గద్వాల్‌కు వెళ్లి తల్లిదండ్రులతో గొడవ పడ్డాడు. గత ఏప్రిల్ 18న ప్రేమించకపోతే అంతు చూస్తానంటూ బాధితురాలితో పాటు ఆమె తల్లిదండ్రులను హెచ్చరించాడు. దీంతో ఏప్రిల్ 19న బాధితురాలు జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి అతడిని రిమాండ్‌కు తరలించారు. 20 రోజుల పాటు జైలుశిక్ష అనుభవించి గత నెలలో బెయిల్‌పై విడుదలయ్యాడు. ప్రతి వారం జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో హాజరై సంతకం చేయాలని కోర్టు కండీషన్ బెయిల్ మంజూరు చేసింది. తాను మారిపోయానని జైలు జీవితం పగవాడికి కూడా వద్దని పోలీసులకు చెప్పే యుగంధర్ మూడు రోజుల క్రితం పెట్రోల్ బాటిల్‌తో సహా గద్వాల్‌లోని ఆమె ఇంట్లోకి వెళ్లి పెళ్లి చేసుకోవాలని బెదిరించాడు. బాధితురాలి కుటుంబసభ్యులు అతడిని బయటికి గెంటి తలుపు మూశారు. దీంతో వారి ఇంటి ఎదుటే పెట్రోల్ పోసుకొని నిప్పంటించాడు. తీవ్రంగా గాయపడిని యుగంధర్‌ను గద్వాల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే.. అతను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడా? సదరు యువతిపై పెట్రోల్ పోద్దామని వచ్చాడా? అన్న విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. -
ప్రేమ వేధింపులకు విద్యార్థిని ఆత్మహత్య
ఐటీ సిటీలో దారుణం చోటుచేసుకుంది. కేఆర్‌పురం పరిధిలోని రామ్మూర్తినగరలో ఇంటర్ విద్యార్థిని లీనా ఉరివేసుకుని తనువు చాలించింది కృష్ణరాజపురం: ప్రేమ వేధింపులను భరించలేక పీయూసీ విద్యార్థిని బలవన్మరణానికి ఒడిగట్టిన ఘటన మంగళవారం రాత్రి కేఆర్ పురం పరిధిలోని రామ్మూర్తినగర్ పొలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రామ్మూర్తినగర్లోని ఓ ప్రైవేటు కాలేజీలో పీయూసీ చదువుతుండే అక్షయనగర్‌కు చెందిన లీనా (17)ను అదే కాలేజీలో చదువుతున్న మంజునాథ్ అనే విద్యార్థి ప్రేమించాలంటూ చాలాకాలం నుంచి వెంట పడుతూ వేధిస్తున్నాడు. ఆమె ఎన్నిసార్లు తిరస్కరించినా మంజునాథ్ వినకపోగా రోజురోజుకు వేధింపులు తీవ్రతరం చేశాడు. ఇటీవల విద్యార్థినిని తన స్నేహితులతో కలసి బెదిరించిన చిత్రాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. మంజునాథ్ ప్రేమ వేధింపులు తాళలేక మంగళవారం రాత్రి లీనా ఇంట్లోనే ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. లీనా తల్లితండ్రుల ఫిర్యాదు మేరకు రామ్మూర్తినగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితున్ని అరెస్టు చేశారు. -
ప్రేమపేరుతో వేధింపులు
మీర్‌పేట: ప్రేమించాలని ఓ విద్యార్థినిని వేధిస్తున్న యువకుడిపై ఈ పెట్టి కేసు నమోదు చేసి పోలీసులు రెండు రోజులు జైలుశిక్ష విధించిన సంఘటన మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ యాదయ్య కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. అల్మాస్‌గూడకు చెందిన బాలిక స్థానిక పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. తిరుమలహిల్స్‌కు చెందిన కార్లకోట భువనేశ్వర్ (22) ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. గత కొన్ని రోజులుగా అతను స్కూల్ వద్దకు వెళ్లి తనను ప్రేమించాలని బాలికను వేధిస్తున్నాడు. దీనిపై బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ పెట్టి కేసు నమోదు చేసిన పోలీసులు రెండు రోజుల జైలుశిక్ష విధించారు. -
సీన్ రివర్స్; యువతి వేధింపులు
సాక్షి, హైదరాబాద్: ప్రేమ... పెళ్లి.... పగ... దాడి... హత్య... ఆత్మహత్య... రాష్ట్ర వ్యాప్తంగా వరుసపెట్టి ఇలాంటి ఉదంతాలే వెలుగు చూస్తున్నాయి. వీటిలో కొన్ని నగరంలోనూ చోటు చేసుకుంటున్నాయి. ఈ సిరీస్‌కు కొంత డిఫరెంట్‌గా రెండు లవ్‌స్టోరీలు సిటీ పోలీసు కమిషనరేట్‌లోని ఓ ఠాణా పరిధిలో వెలుగులోకి వచ్చాయి. ఓ యువతి వేధింపులు తట్టుకోలేక మెరిట్ స్టూడెంట్ పూర్‌గా మారిపోగా... మరో యువతి తనపై ‘వివక్ష’ చూపిందంటూ భగ్న ప్రేమికుడు ఠాణాకు ఎక్కాడు. చట్ట పరిధిలోకి రావంటూ పోలీసులు చెప్పిన అభిప్రాయంతో మౌఖిక ఫిర్యాదుల వద్దే ఆగిపోయిన ఈ రెండు ప్రేమ కథా విచిత్రాలూ రికార్డుల్లోకి ఎక్కలేదు. ఆ యువకుడి విషయంలో సీన్ రివర్స్... యువకులు ప్రేమ పేరుతో యువతుల వెంటపడటం, వారు తిరస్కరిస్తే వివిధ రకాలుగా వేధించడం... ఇలాంటి కేసులు తరచు పోలీసు రికార్డుల్లోకి ఎక్కుతూనే ఉంటాయి. దీనికి పూర్తి భిన్నమైన కథ ఈ యువకుడిది. ఓ వైద్యురాలి కుమారుడైన ఇతగాడు ఆది నుంచి మెరిట్ స్టూడెంట్. ఇంటర్మీడియట్‌ను 95 శాతం మార్కులతో పాసయ్యాడు. ఈ యువకుడినీ వైద్యుడినే చేయాలని భావించిన ఆ వైద్యురాలు నీట్ కోచింగ్ కోసం పశ్చిమ మండల పరిధిలోని ఓ ఇనిస్టిట్యూట్‌లో చేర్చారు. కొన్నాళ్ల పాటు ఇతడి కోచింగ్ సజావుగానే సాగింది. ఇతడితో పాటే కోచింగ్ తీసుకుంటున్న ఓ యువతికి మూర్ఛరోగం ఉంది. ఓ సందర్భంలో క్లాసులోనే కుప్పకూలిన ఆమెకు ఇతగాడు సాయం చేశాడు. అప్పటి నుంచి ఆ యువతి ప్రేమ పేరుతో అతడి వెంట పడడం ప్రారంభించింది. ఓ దశలో ఆమె వేధింపులు వాట్సాప్ వరకువెళ్ళాయి. అభ్యంతరకరమైన, అశ్లీల ఫొటోలు, సందేశాలతో అతడిని పూర్తిగా డిస్ట్రబ్ చేయడం మొదలెట్టింది. దీంతో ‘హీరో’ లాంటి స్టూడెంట్ మార్కులు ‘జీరో’లకు పడిపోయాయి. ఈ విషయం గమనించిన వైద్యురాలు ఆమెకు నచ్చజెప్పడానికి ప్రయత్నించినా సాధ్యం కాలేదు. చివరకు ఆమె పోలీసుస్టేషన్‌కు వచ్చి మౌఖికంగా ఫిర్యాదు చేశారు. ఇలా అయితే చట్టపరిధిలోకి రాదని పోలీసులు చెప్పడంతో తమ పేర్లు రికార్డుల్లోకి ఎక్కడ ఇష్టం లేని ఆమె ఫిర్యాదు ప్రయత్నం విరమించుకున్నారు. చివరకు కుమారుడి నుంచి స్మార్ట్‌ఫోన్, పాత ఫోన్ నెంబర్ లాక్కుని ఆంధ్రప్రదేశ్‌కు పంపి మరో ఇన్స్టిట్యూట్లో చేర్పించారు. ఆ ఫిర్యాదు చూసి అవాక్కైన పోలీసులు... ఈ భగ్న ప్రేమికుడి వ్యవహారం మరోలా ఉంది. ఉత్తర తెలంగాణలోని ఓ జిల్లాకు చెందిన యువకుడు ఉద్యోగం కోసం నగరానికి వలసవచ్చాడు. ఇతడికి పరిచయమైన ఓ యువతితో ప్రేమలో పడ్డాడు. వీరిద్దరూ కలిసి కొన్నాళ్ల పాటు చెట్టపట్టాలు వేసుకుని తిరిగారు. హఠాత్తుగా వీరి ప్రేమ వ్యవహారం బెడిసికొట్టంది. ఇతగాడి వ్యవహారశైలి నచ్చకో, పెళ్ళికి పెద్దలు నిరాకరించో, మరే ఇతర కారణమో కానీ ఆమె అతగాడికి దూరంగా ఉండటం మొదలెట్టింది. అయినప్పటికీ పట్టు వదలని ఈ యువకుడు కొన్ని రోజుల పాటు నిర్విరామంగా ఆమె వెంట పడ్డాడు. చివరకు ఆమెకు వివాహం నిశ్చయమైందని తెలియడంతో ఆమెపై ‘కక్ష’ కట్టాడు. ఇది తీర్చుకోవడానికి ‘లిఖిత పూర్వకంగా’ ఠాణా తలుపుతట్టాడు. ఆ ఫిర్యాదును చూసిన పోలీసులకు మతి పోయినంత పనైంది. దాదాపు రెండేళ్ళ పాటు ఆమె తనతో సన్నిహితంగా మెలిగిందని, అయితే ఓ దశలో ‘తన బ్యాగ్రౌండ్’ తెలిసిన తర్వాతే దూరంగా పెట్టడం మొదలెట్టిందని అందులో పేర్కొన్నాడు. ఇది కచ్చితంగా వివక్ష కిందికే వస్తుందంటూ పేర్కొన్న ఆ భగ్న ప్రేమికుడు ఆమెపై కేసు నమోదు చేయాలని కోరాడు. అంతటితో ఆగకుండా ఆమెపై చట్ట ప్రకారం చర్యలు కూడా తీసుకోవాలని పోలీసులకు అల్టిమేటం ఇచ్చాడు. అయితే ఈ ఆరోపణలపై అలా కేసులు నమోదు, చర్యలు తీసుకోవడం కుదరదంటూ పోలీసులు స్పష్టం చేశారు. దీంతో అతగాడు కోర్టుకు వెళ్లేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. -
పుట్టినరోజు నాడే కానరానిలోకాలకు..
భువనగిరి క్రైం : ప్రేమపేరుతో వేధింపులకు ఓ బాలిక బలైంది. కళాశాలకు వెళ్లి చదువుకునే విద్యార్థినిని నిత్యం వేధిస్తుండడంతో తీవ్ర మనస్తాపానికి గురై పుట్టిన రోజు నాడే ఆయువు తీసుకుంది. ఈ విషాద సంఘటన శుక్రవారం భువనగిరి పట్టణంలోని సింగన్నగూడెంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భువనగిరి పట్టణంలోని సింగన్నగూడెంకు చెందిన పెద్దపొల్ల నర్సింహ, స్వప్నలకు ముగ్గురు పిల్లలు. తల్లి పట్ట ణ పరిధిలోని ఓ దాబాలో పనిచేస్తుండగా, తండ్రి రోజూవారీ కూలి పనులు చేసుకుంటాడు. వీరి రెండో కూతురు మాధవి(16) భువనగిరిలోనే ఇం టర్ ప్రథమ సంవత్సరం చదువుతోంది. మాధవిని కొన్ని రోజులుగా భువనగిరి పట్టణంలోని ఎల్బీనగర్కు చెందిన శ్రీకాంత్, సింగన్నగూడేనికి చెందిన అన్నదమ్ములు బొంతల కిరణ్, తేజాలు ప్రేమపేరుతో వేధిస్తున్నారు. ఈ విషయం మా ధవి తన తల్లిదండ్రులకు చెప్పడంతో వారు యు వకులను మందలించారు. అయిన వారిలో మా ర్పు రాలేదు. గురువారం(ఈనెల19న) మాధవి పుట్టిన రోజు అవడంతో వేధింపుల భయంతో కళాశాలకు వెళ్లకుండా ఇంటి వద్దే ఉంది. మనస్తాపంతో దిగులు చెందిన మాధవి తలకు రాసుకునే నూనె(సూపర్ వేస్మాల్) డబ్బా తీసుకుని ఇంటి దగ్గరలోనే ఉన్న న్యూరవీంద్ర నగర్ వద్ద ఉన్న పో చమ్మ గుడి వద్దకు వెళ్లింది. ఈ విషయం నిం దితుల ద్వారానే తెలుసుకున్న మాధవి తల్లి అక్కడికి వెళ్లేలోపే అపస్మారక స్థితిలో ఉంది. దీంతో అప్రమత్తమైన తల్లి మాధవిని వెంటనే భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించింది. భువనగిరి ఏరి యా ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా పరిస్థితి మరింత విషమించడంతో హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సాయంత్రం మృతి చెందింది. నిందితులపై కేసు నమోదు చేశాం : సీఐ మాధవి మృతికి కారణమైన ముగ్గురు నిందితుల ను అదుపులోకి తీసుకున్నామని భువనగిరి పట్టణ సీఐ వెంకన్న తెలిపారు. ఈ ముగ్గురు కొంతకాలంగా మాధవిని ప్రేమపేరుతో వేధిస్తున్నారని చెప్పారు. వీరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, ఫోక్సో యాక్టు, ప్రేమపేరుతో వేధింపులతో వేధించినందుకు కేసు నమోదు చేశామని చెప్పారు. మా కూతురిని వాళ్లే పొట్టనబెట్టుకున్నారు : మాధవి తల్లిదండ్రులు తమ కూతురుని ఆ ముగ్గురు యువకులే పొట్టన పెట్టుకున్నారని మాధవి తల్లిదండ్రులు నర్సింహ, స్వప్నలు ఆరోపించారు. కొంతకాలంగా వీళ్లు మాధవిని వేధిస్తున్నారని చెప్పారు. పుట్టిన రోజు నాడు మాధవి గుడికి వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి వెళ్లిందన్నారు. విషయం తెలుసుకున్న శ్రీ కాంత్, తేజ, కిరణ్‌లు గుడి వద్దకు వెళ్లి బలవంతంగా సుపర్ వేస్మాల్ ఆయిల్‌ను తాగించారని ఆరోపించారు. మళ్లీ ఆ విషయాన్ని వాళ్లే తనకు వచ్చి చెప్పారని, తాము వెంటనే అక్కడికి వెళ్లి చూడగా తన కూతురు అపస్మారక స్థితికి చేరుకుం దని, వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లినట్టు చెప్పింది. ఆస్పత్రికి తీసుకువెళ్లే మార్గమధ్యలో ‘అమ్మ నాన్న నేను వెళ్లిపోతున్నాను.. అక్క జాగ్రత్త’ అని చెప్పిం దని తల్లి రోదించింది. తన కూతురు చావుకు కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలని కోరిం ది. ఇలాంటి పరిస్థితి ఎవరి తల్లిదండ్రులకు రావద్దని రోదిస్తూ చెప్పింది. మాధవి ఇంటి వద్ద బంధువుల రోదనలు మిన్నంటాయి. శ్రీకాంత్ ఆత్మహత్యాయత్నం ఈ కేసులో నిందితుడిగా ఉన్న శ్రీకాంత్ ఆ త్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని సీఐ వెం కన్న తెలిపారు. శ్రీకాంత్‌ను సికింద్రాబాద్ లోని గాంధీ ఆస్పత్రికి తరలించినట్లు, ప్రస్తు తం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉం దని ఆయన తెలిపారు. -
ప్రేమోన్మాదులు
సాక్షి ప్రతినిధి, చెన్నై: ‘ప్రేమించు..లేకుంటే ప్రాణం తీస్తా’ అంటూ కిరాతకంగా వ్యవహరించిన ప్రేమోన్మాదులు యువతుల గొంతుకోసిన దారుణ సంఘటనలు వేలూరు జిల్లాలో చోటుచేసుకున్నాయి. వేలూరు జిల్లా కేదాంతపట్టి గ్రామానికి చెందిన మునిరాజ్ కుమార్తె లావణ్య (23) హాస్టల్లో ఉంటూ కడలూరు జిల్లా చిదంబరంలోని అన్నామలై యూనివర్సిటీలో ఎమ్మెస్సీ రెండో సంవత్సరం చదువుతోంది. లావణ్యకు ఆమె సొంతూరికి చెందిన వ్యక్తి, చెన్నైలో సాఫ్ట్వేర్ ఇంజినీరుగా పనిచేస్తున్న నవీన్‌కుమార్ (27)కు మధ్య స్నేహం ఉంది. అయితే నవీన్‌కుమార్ మాత్రం ప్రేమించాల్సిందిగా వేధించేవాడు. దీంతో విసిగిపోయిన లావణ్య గత 20 రోజులుగా నవీన్‌కుమార్‌తో మాట్లాడడం మానేసింది. ఫోన్ కూడా తీయడం లేదు. దీంతో సోమవారం ఉదయం చిదంబరానికి వచ్చిన నవీన్కుమార్నేరుగా లావణ్య ఉంటున్న హాస్టల్‌కు వెళ్లి గేటుముందే నిలబడి మాట్లాడుకోవడంలో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. దీంతో కోపగించుకున్న నవీన్‌కుమార్ తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆమె గొంతుకోసి విచక్షణారహితంగా ముఖంపై కత్తితో దాడిచేశాడు. లావణ్య పెట్టిన కేకలకు పరిసరాల్లోని ఆటో డ్రైవర్లు ఉలిక్కిపడి ప్రేమోన్మాదిని పట్టుకునే ప్రయత్నం చేశారు. అయితే అతడు కత్తితో బెదిరించడంతో బలమైన రాళ్లు విసిరి యువతిని రక్షించారు. తీవ్రరక్తస్రావం అవుతున్న స్థితిలో సమీపంలోని లావణ్యను ఆస్పత్రిలో చేర్పించారు. స్థానికులు నవీన్‌కుమార్‌ను పట్టుకుని చితకబాదారు. తీవ్రగాయాలకు గురైన అన్ని ఆసుపత్రిలో చేర్పించి అన్నామలైనగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాట్పాడిలో.. వేలూరు జిల్లా కాట్పాడికి చెందిన షబ్బీర్ (23) అనే ఎంబీఏ విద్యార్థి అదే ప్రాంతానికి చెందిన యువతిని ప్రేమ పేరుతో వేధించేవాడు. మతం మార్చుకుని పెళ్లి చేసుకుందాం..లేకుంటే చంపేస్తాను అని బెదిరించేవాడు. దీంతో యువతి తల్లిదండ్రులు గత నెల జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో రోడ్డుపై నడిచి వెళుతున్న యువతిని అడ్డుకుని షబ్బీర్ కత్తితో గొంతుకోశాడు. ఆమె పెట్టిన కేకలతో జనం అక్కడికి చేరడంతో అతను పారిపోయాడు. తీవ్రంగా గాయపడ్డ యువతిని సమీపంలోని ప్రయివేటు ఆస్పత్రిలో చేర్పించారు. వేలూరు పోలీసులు షబ్బీర్‌ను అరెస్ట్ చేశారు. -
ప్రేమించపోతే ప్రాణం తీస్తారా?
బొమ్మనహళ్లి (మంగళూరు): సరస్వతీ నిలయంలో రక్తం చిందింది. అమ్మాయి త న ప్రేమను అంగీకరించలేదని ఒక యువకుడు ఉన్మాదిగా మారి ఆమెను కత్తితో పొడిచి చంపాడు. తాను కూడా పొ డుచుకుని ఆత్మహత్యా యత్నం చేయబోయాడు. ఈ విషా ద ఘటన మంగళవారం దక్షిణకన్నడ జిల్లా మంగళూరు స మీపంలో ఉన్న సుళ్యలో చోటు చేసుకుంది. అక్కడి నెహ్రు మెమోరియల్ కళాశాల్లో బీ.కాం చదువుతున్న కార్తీక్ (21) అనే విద్యార్థి ఈ ఘోరానికి ఒడిగట్టాడు. మృతురాలు అక్షత (21) ఇదే కళాశాల్లో బీఎస్సీ విద్యార్థిని. ఇద్దరు సుళ్యవాసులే. కొంత కాలంగా కార్తీక్ అక్షతను ప్రేమిస్తున్నానని వెంటపడుతున్నాడు. అక్షత అతని ప్రేమను నిరాకరిస్తోంది. దీంతో కోపోద్రిక్తుడైన కార్తీక్ కళాశాల నుంచి అక్షత బయటకు వస్తున్న సమయంలో కత్తితో ఆమెపై దాడి చేశాడు. ఆరుసార్లు పొడవడంతో అమ్మాయి అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. కార్తీక్ కూడా ఆత్మహత్యయత్నం చేస్తుండగా స్థానికులు పట్టుకుని అతన్ని ఆస్పత్రికి తరలించారు. సుళ్య పోలీసులు సంఘటనా çస్థలానికి వచ్చి పరిశీలించి, కేసు నమోదు చేశారు. -
ప్రేమించలేదని బీరు బాటిల్‌తో దాడి
వల్లేటివారిపాలెం: ప్రకాశం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమించలేదనే అక్కసుతో యువతిపై బీరు బాటిల్‌తో దాడి చేశాడో ప్రబుద్ధుడు. ఈ సంఘటన జిల్లాలోని వల్లేటివారిపాలెం మండలం కొండ సముద్రం గ్రామంలో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన యలమలమంద కవిత(18) కుటుంబ సభ్యులు గత కొంత కాలంగా హైదరాబాద్‌లో నివసిస్తున్నారు. గ్రామంలో ఉన్న అమ్మమ్మ ఆరోగ్యం బాలేకపోవడంతో.. ఆరు నెలల నుంచి కవిత స్వగ్రామంలోనే ఉంటోంది. అదే గ్రామానికి చెందిన ఘట్టమనేని రవి(22) కొంత కాలంగా ప్రేమ పేరుతో ఆమె వెంటపడుతూ వేధిస్తున్నాడు. ఈ విషయమై కొన్ని రోజుల క్రితం ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ కూడా జరిగింది. ఈ క్రమంలో కవిత ఊళ్లోనే ఉంటోందని తెలుసుకున్న రవి తిరిగి ఆమెను వేధింపులకు గురి చేయడం మొదలుపెట్టాడు. శుక్రవారం ఉదయం బహిర్భూమికి వెళ్లిన కవితను ప్రేమించమని వేధింపులకు గురిచేశాడు. దీనికి ఆమె నిరాకరించడంతో.. వెంట తెచ్చుకున్న బీరు బాటిల్ పగలగొట్టి ఆమెపై దాడి చేశాడు. ఈ దాడిలో ఆమె వీపు, చేతులు, మెడ భాగాల్లో గాయాలయ్యాయి. ఇది గుర్తించిన కుటుంబసభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు వివరాలు సేకరిస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
ప్రేమ వేధింపులకు డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య
ములుగు: జయశంకర్ జిల్లా ములుగులో దారుణం చోటు చేసుకుంది. వేధింపులు తాళలేక ఓ విద్యార్థిని వంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. చికిత్స నిమిత్తం ఆమెను ఆస్పత్రికి తరలించగా.. కొద్దిసేపటి క్రితం మృతి చెందింది. ఈ సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న రమ్య(19) ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ చదువుతోంది. కాగా.. గత కొన్ని రోజులుగా అమర్ అనే వ్యక్తి ఆమెను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. అమర్‌కు ఇంతకు ముందే పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ మధ్య కాలంలో అమర్ వేధింపులు ఎక్కువకావడంతో రమ్య ఇంట్లో ఎవరు లేని సమయంలో వంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. ఇది గుర్తించిన చుట్టుపక్కల వారు అంబులెన్స్ సాయంతో వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రేమ వేధింపులు: బాలిక ఆత్మహత్య
హైదరాబాద్: ప్రేమ వేధింపులతో ఓ బాలిక ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన నగరంలోని మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని హనుమాన్‌నగర్‌లో చోటు చేసుకుంది. స్థానికంగా నివాసముండే ముత్యాల సోనీ(17) అనే మైనర్ బాలికను అదే ప్రాంతానికి చెందిన సూరజ్ గత కొన్ని రోజులుగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. దీంతో అతని ప్రేమను నిరాకరిస్తూ వచ్చింది. గత కొన్ని రోజులుగా వేధింపులు ఎక్కువ కావడంతో.. బాలిక మల్కాజిగిరి పోలీసులను ఆశ్రయించింది. ఈ అంశంపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో.. సూరజ్ వల్ల తనకు, తన కుంటుంబానికి ప్రాణహాని ఉందని భావించిన బాలిక శుక్రవారం ఆత్మహత్య చేసుకుంది. అయితే విషయం శనివారం వెలుగులోకి వచ్చింది. చనిపోవడానికి ముందు బాలిక సూసైడ్ నోట్ రాసినట్లు సమాచారం. ఈ అంశంపై పోలీసులను వివరణ కోరగా వారి వాదన వేరే విధంగా ఉంది. బాలిక ఆత్మహత్యకు ముందు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
పాపం పల్లవి..
మృత్యువుతో పోరాడి తిరిగిరాని లోకాలకు.. ప్రేమ వేధింపులకు మరో యువతి బలి చాంద(టి)లో విషాదం అశ్రునయనాల మధ్య అంతిమ వీడ్కోలు పాపం పల్లవి.. కన్ను మూసింది. ప్రేమ వేధింపులతో జీవితాన్నే చాలించింది. కాలిన గాయాలతో ఏడు రోజులుగా ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడి.. చివరికి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. ఎంతో జీవితం ఉన్న పల్లవిని ఓ యువకుడి రూపంలో మృత్యువు ఇలా వెంటాడింది. పుట్టినప్పుడే తల్లి ప్రేమకు దూరమై.. పెంచి పెద్ద చేసిన నానమ్మ, తాతయ్యలకూ ఇప్పుడు దూరమైంది. వారికి తీరని శోకాన్ని మిగిల్చింది. ఆదిలాబాద్ రూరల్ : ఆదిలాబాద్ మండలం చాంద(టి) గ్రామానికి చెందిన పల్లవి(17) ఈ నెల 14న ఇంట్లోనే వేకువజామున ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటిచుకుంది. వెంటనే ఆమెను కుటుంబ సభ్యులు రిమ్స్‌కు తరలించి చికిత్స అందజేశారు. తండ్రి దేవిదాస్ ఫిర్యాదు మేరకు ఆదిలాబాద్ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేశారు. తన ఆత్మహత్యకు యువకుడి వేధింపులే కారణమని పల్లవి రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో వాంగ్మూలం ఇచ్చినట్లు అప్పట్లో పోలీసులు తెలిపారు. కాగా, ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో రిమ్స్ వైద్యుల సలహా మేరకు పల్లవిని అదే రోజు హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందినా పరిస్థితి మెరుగు కాకపోవడంతో బుధవారం రాత్రి మృతిచెందింది. దీంతో చాందా(టి)లో విషాదం అలుముకుంది. గురువారం గ్రామ శివారులో అంత్యక్రియలు నిర్వహించారు. కాగా, ఫిర్యాదు చేసిన వెంటనే దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు వేధింపులకు పాల్పడిన జైనథ్ మండలం లేఖర్వాడకు చెందిన యువకుడు చంద్రశేఖర్‌ను అరెస్టు చేసి ఇదివరకే రిమాండ్‌కు తరలించారు. పల్లవి జీవితమే విషాదం పల్లవి జీవితంలో అన్నీ విషాదాలే ఉన్నాయి. ఆమె పుట్టిన రెండు నెలలకే తల్లి మృతిచెందింది. ఏఆర్ కానిస్టేబుల్‌గా పనిచేసే తండ్రి దేవిదాస్ అప్పట్లోనే మరో వివాహం చేసుకోవడంతో పల్లవి తన తాతయ్య, నానమ్మ బాపురావు, లసుంబాయిల వద్దే పెరిగింది. వారు కూడా తల్లి లేని పిల్లను అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. ఆమె జీవితంపై అందమైన కలలు కన్న వారికి ఒక్కసారిగా పల్లవి మృతి విషాదం నింపింది. ఆమె వివాహం తమ చేతులమీదుగా చేద్దామనుకున్న వారికి ఈ సంఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఒకవేళ ఆస్తి పంపకాలు చేస్తే తల్లి లేని పిల్ల పల్లవి వివాహంలో ఇబ్బందులు అవుతాయని భావించిన తాత, నానమ్మలు తమ ముగ్గురు కుమారులకు ఆస్తి పంపకాలు చేయకపోవడం ఇక్కడ వారి మమకారాన్ని స్పష్టం చేస్తోంది. ప్రేమ భూతానికి బలి.. పల్లవి ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఆదిలాబాద్‌లోని ఓ ప్రైవేట్ కళాశాలలో చదివేది. రోజు బస్సు, ఆటోల ద్వారా రాకపోకలు సాగించేది. ఈ క్రమంలో ఆదిలాబాద్ పట్టణంలో పల్లవిని చూసిన జైనథ్ మండలం లేఖర్వాడకు చెందిన చంద్రశేఖర్ తనను ప్రేమించాలని ఆమె వెంట పడ్డాడు. ఈ పరిణామాలతో పల్లవి మనోవేదనకు గురైంది. యువకుడు వేధిస్తున్నాడని ఇంట్లో తెలియజేయడంతో తండ్రి కానిస్టేబుల్ దేవిదాస్ ఆదిలాబాద్ రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఘటనకు ఐదు రోజులు ముందు ఫిర్యాదు చేశారు. కానీ ఫిర్యాదు దర్యాప్తులో పోలీసులు జాప్యం చేశారని పల్లవి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. త్వరగా స్పందించి ఇలా జరిగేది కాదని వారి వాదన. -
పాపం పల్లవి..
ఆదిలాబాద్ రూరల్ : ఆదిలాబాద్ మండలం చాంద(టి) గ్రామానికి చెందిన పల్లవి(17) ఈ నెల 14న ఇంట్లోనే వేకువజామున ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటిచుకుంది. వెంటనే ఆమెను కుటుంబ సభ్యులు రిమ్స్‌కు తరలించి చికిత్స అందజేశారు. తండ్రి దేవిదాస్ ఫిర్యాదు మేరకు ఆదిలాబాద్ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేశారు. తన ఆత్మహత్యకు యువకుడి వేధింపులే కారణమని పల్లవి రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో వాంగ్మూలం ఇచ్చినట్లు అప్పట్లో పోలీసులు తెలిపారు. కాగా, ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో రిమ్స్ వైద్యుల సలహా మేరకు పల్లవిని అదే రోజు హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందినా పరిస్థితి మెరుగు కాకపోవడంతో బుధవారం రాత్రి మృతిచెందింది. దీంతో చాందా(టి)లో విషాదం అలుముకుంది. గురువారం గ్రామ శివారులో అంత్యక్రియలు నిర్వహించారు. కాగా, ఫిర్యాదు చేసిన వెంటనే దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు వేధింపులకు పాల్పడిన జైనథ్ మండలం లేఖర్వాడకు చెందిన యువకుడు చంద్రశేఖర్‌ను అరెస్టు చేసి ఇదివరకే రిమాండ్‌కు తరలించారు. పల్లవి జీవితమే విషాదం పల్లవి జీవితంలో అన్నీ విషాదాలే ఉన్నాయి. ఆమె పుట్టిన రెండు నెలలకే తల్లి మృతిచెందింది. ఏఆర్ కానిస్టేబుల్‌గా పనిచేసే తండ్రి దేవిదాస్ అప్పట్లోనే మరో వివాహం చేసుకోవడంతో పల్లవి తన తాతయ్య, నానమ్మ బాపురావు, లసుంబాయిల వద్దే పెరిగింది. వారు కూడా తల్లి లేని పిల్లను అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. ఆమె జీవితంపై అందమైన కలలు కన్న వారికి ఒక్కసారిగా పల్లవి మృతి విషాదం నింపింది. ఆమె వివాహం తమ చేతులమీదుగా చేద్దామనుకున్న వారికి ఈ సంఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఒకవేళ ఆస్తి పంపకాలు చేస్తే తల్లి లేని పిల్ల పల్లవి వివాహంలో ఇబ్బందులు అవుతాయని భావించిన తాత, నానమ్మలు తమ ముగ్గురు కుమారులకు ఆస్తి పంపకాలు చేయకపోవడం ఇక్కడ వారి మమకారాన్ని స్పష్టం చేస్తోంది. ప్రేమ భూతానికి బలి.. పల్లవి ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఆదిలాబాద్‌లోని ఓ ప్రైవేట్ కళాశాలలో చదివేది. రోజు బస్సు, ఆటోల ద్వారా రాకపోకలు సాగించేది. ఈ క్రమంలో ఆదిలాబాద్ పట్టణంలో పల్లవిని చూసిన జైనథ్ మండలం లేఖర్వాడకు చెందిన చంద్రశేఖర్ తనను ప్రేమించాలని ఆమె వెంట పడ్డాడు. ఈ పరిణామాలతో పల్లవి మనోవేదనకు గురైంది. యువకుడు వేధిస్తున్నాడని ఇంట్లో తెలియజేయడంతో తండ్రి కానిస్టేబుల్ దేవిదాస్ ఆదిలాబాద్ రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఘటనకు ఐదు రోజులు ముందు ఫిర్యాదు చేశారు. కానీ ఫిర్యాదు దర్యాప్తులో పోలీసులు జాప్యం చేశారని పల్లవి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. త్వరగా స్పందించి ఇలా జరిగేది కాదని వారి వాదన. మృత్యువుతో పోరాడి తిరిగిరాని లోకాలకు.. ప్రేమ వేధింపులకు మరో యువతి బలి చాంద(టి)లో విషాదం అశ్రునయనాల మధ్య అంతిమ వీడ్కోలు పాపం పల్లవి.. కన్ను మూసింది. ప్రేమ వేధింపులతో జీవితాన్నే చాలించింది. కాలిన గాయాలతో ఏడు రోజులుగా ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడి.. చివరికి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. ఎంతో జీవితం ఉన్న పల్లవిని ఓ యువకుడి రూపంలో మృత్యువు ఇలా వెంటాడింది. పుట్టినప్పుడే తల్లి ప్రేమకు దూరమై.. పెంచి పెద్ద చేసిన నానమ్మ, తాతయ్యలకూ ఇప్పుడు దూరమైంది. వారికి తీరని శోకాన్ని మిగిల్చింది. ఆదిలాబాద్ రూరల్ : ఆదిలాబాద్ మండలం చాంద(టి) గ్రామానికి చెందిన పల్లవి(17) ఈ నెల 14న ఇంట్లోనే వేకువజామున ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటిచుకుంది. వెంటనే ఆమెను కుటుంబ సభ్యులు రిమ్స్‌కు తరలించి చికిత్స అందజేశారు. తండ్రి దేవిదాస్ ఫిర్యాదు మేరకు ఆదిలాబాద్ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేశారు. తన ఆత్మహత్యకు యువకుడి వేధింపులే కారణమని పల్లవి రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో వాంగ్మూలం ఇచ్చినట్లు అప్పట్లో పోలీసులు తెలిపారు. కాగా, ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో రిమ్స్ వైద్యుల సలహా మేరకు పల్లవిని అదే రోజు హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందినా పరిస్థితి మెరుగు కాకపోవడంతో బుధవారం రాత్రి మృతిచెందింది. దీంతో చాందా(టి)లో విషాదం అలుముకుంది. గురువారం గ్రామ శివారులో అంత్యక్రియలు నిర్వహించారు. కాగా, ఫిర్యాదు చేసిన వెంటనే దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు వేధింపులకు పాల్పడిన జైనథ్ మండలం లేఖర్వాడకు చెందిన యువకుడు చంద్రశేఖర్‌ను అరెస్టు చేసి ఇదివరకే రిమాండ్‌కు తరలించారు. పల్లవి జీవితమే విషాదం పల్లవి జీవితంలో అన్నీ విషాదాలే ఉన్నాయి. ఆమె పుట్టిన రెండు నెలలకే తల్లి మృతిచెందింది. ఏఆర్ కానిస్టేబుల్‌గా పనిచేసే తండ్రి దేవిదాస్ అప్పట్లోనే మరో వివాహం చేసుకోవడంతో పల్లవి తన తాతయ్య, నానమ్మ బాపురావు, లసుంబాయిల వద్దే పెరిగింది. వారు కూడా తల్లి లేని పిల్లను అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. ఆమె జీవితంపై అందమైన కలలు కన్న వారికి ఒక్కసారిగా పల్లవి మృతి విషాదం నింపింది. ఆమె వివాహం తమ చేతులమీదుగా చేద్దామనుకున్న వారికి ఈ సంఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఒకవేళ ఆస్తి పంపకాలు చేస్తే తల్లి లేని పిల్ల పల్లవి వివాహంలో ఇబ్బందులు అవుతాయని భావించిన తాత, నానమ్మలు తమ ముగ్గురు కుమారులకు ఆస్తి పంపకాలు చేయకపోవడం ఇక్కడ వారి మమకారాన్ని స్పష్టం చేస్తోంది. ప్రేమ భూతానికి బలి.. పల్లవి ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఆదిలాబాద్‌లోని ఓ ప్రైవేట్ కళాశాలలో చదివేది. రోజు బస్సు, ఆటోల ద్వారా రాకపోకలు సాగించేది. ఈ క్రమంలో ఆదిలాబాద్ పట్టణంలో పల్లవిని చూసిన జైనథ్ మండలం లేఖర్వాడకు చెందిన చంద్రశేఖర్ తనను ప్రేమించాలని ఆమె వెంట పడ్డాడు. ఈ పరిణామాలతో పల్లవి మనోవేదనకు గురైంది. యువకుడు వేధిస్తున్నాడని ఇంట్లో తెలియజేయడంతో తండ్రి కానిస్టేబుల్ దేవిదాస్ ఆదిలాబాద్ రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఘటనకు ఐదు రోజులు ముందు ఫిర్యాదు చేశారు. కానీ ఫిర్యాదు దర్యాప్తులో పోలీసులు జాప్యం చేశారని పల్లవి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. త్వరగా స్పందించి ఇలా జరిగేది కాదని వారి వాదన. మృత్యువుతో పోరాడి తిరిగిరాని లోకాలకు.. ప్రేమ వేధింపులకు మరో యువతి బలి చాంద(టి)లో విషాదం అశ్రునయనాల మధ్య అంతిమ వీడ్కోలు -
ప్రేమ వేధింపులు తాళలేక..
ఆదిలాబాద్ రూరల్: ప్రేమ పేరిట ఓ యువకుడి వేధింపులు తాళలేక విద్యార్థిని ఆత్మహత్యకు యత్నించింది. ఈ సంఘటన ఆదిలాబాద్ మండలం చాందా-టి గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. చాందా-టి గ్రామానికి చెందిన విద్యార్థిని(17) ఆదిలాబాద్‌లోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. గ్రామం నుంచి కళాశాలకు నిత్యం బస్సులో రాకపోకలు సాగిస్తోంది. ఈ క్రమంలో జైనథ్ మండలం లేఖర్వాడకు చెందిన ఎం.చంద్రశేఖర్(24) పనీపాట లేకుండా తిరుగుతుంటాడు. తనను ప్రేమించాలంటూ ఆమెను వేధింపులకు గురి చేస్తున్నాడు. వేధింపులతో మనస్తాపం చెందిన ఆమె గురువారం వేకువజామున ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. శరీరం 80 శాతం కాలిపోవడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఆదిలాబాద్ రూరల్ ప్రొబేషనరీ ఎస్సై సుబ్బారావు తెలిపారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించామని పేర్కొన్నారు.