![Keralite girl stabbed to death by classmate in Karnataka - Sakshi](/styles/webp/s3/article_images/2018/02/21/killed.jpg.webp?itok=8auOlBgz)
అక్షత మృత దేహాన్ని తరలిస్తున్న దృశ్యం, అక్షత (ఫైల్),ప్రేమోన్మాది కార్తీక్ (ఫైల్)
బొమ్మనహళ్లి (మంగళూరు): సరస్వతీ నిలయంలో రక్తం చిందింది. అమ్మాయి త న ప్రేమను అంగీకరించలేదని ఒక యువకుడు ఉన్మాదిగా మారి ఆమెను కత్తితో పొడిచి చంపాడు. తాను కూడా పొ డుచుకుని ఆత్మహత్యా యత్నం చేయబోయాడు. ఈ విషా ద ఘటన మంగళవారం దక్షిణకన్నడ జిల్లా మంగళూరు స మీపంలో ఉన్న సుళ్యలో చోటు చేసుకుంది. అక్కడి నెహ్రు మెమోరియల్ కళాశాల్లో బీ.కాం చదువుతున్న కార్తీక్ (21) అనే విద్యార్థి ఈ ఘోరానికి ఒడిగట్టాడు. మృతురాలు అక్షత (21) ఇదే కళాశాల్లో బీఎస్సీ విద్యార్థిని.
ఇద్దరు సుళ్యవాసులే. కొంత కాలంగా కార్తీక్ అక్షతను ప్రేమిస్తున్నానని వెంటపడుతున్నాడు. అక్షత అతని ప్రేమను నిరాకరిస్తోంది. దీంతో కోపోద్రిక్తుడైన కార్తీక్ కళాశాల నుంచి అక్షత బయటకు వస్తున్న సమయంలో కత్తితో ఆమెపై దాడి చేశాడు. ఆరుసార్లు పొడవడంతో అమ్మాయి అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. కార్తీక్ కూడా ఆత్మహత్యయత్నం చేస్తుండగా స్థానికులు పట్టుకుని అతన్ని ఆస్పత్రికి తరలించారు. సుళ్య పోలీసులు సంఘటనా çస్థలానికి వచ్చి పరిశీలించి, కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment