bsc student died
-
విద్యార్థిని అనుమానాస్పద మృతి
హసన్‌పర్తి: హనుమకొండ జిల్లా హసన్‌పర్తి శివారులోని ఓ విద్యాసంస్థలో బీఎస్సీ అగ్రికల్చర్ చదువుతున్న విద్యార్ధిని అనుమానాస్పదంగా మృతి చెందింది. అయితే తన కూతురును హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని మృతురాలి తండ్రి రాథోడ్ మోహన్‌సింగ్ ఆరోపించారు. ఈ మేరకు హసన్‌పర్తి ఠాణాలో ఫిర్యాదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలం కండెపల్లికి చెందిన రాథోడ్ మోహన్‌సింగ్ (డిప్యూటీ కలెక్టర్, మైనారిటీ కార్పొరేషన్ అ«ధికారి, నిర్మల్) కూతురు రాథోడ్ దీప్తి(19) కళాశాల హాస్టల్లోనే ఉంటూ అగ్రికల్చర్ బీఎస్సీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. శుక్రవారం దీప్తి కళాశాల హాస్టల్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఎంజీఎంకు తరలించారు. ఉరి వేసుకున్నట్టు సమాచారం ఇవ్వలేదు దీప్తి ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, గురువారం సాయంత్రం తాను ఫోన్లో మాట్లాడినట్టు తండ్రి మోహన్‌సింగ్ పేర్కొన్నారు. ఉదయం తన భార్య ఫోన్ చేస్తే త్వరగా ఎంజీఎంకు రమ్మన్నారే తప్ప ఆత్మహత్య చేసుకున్న విషయం చెప్పలేదన్నారు. మృతదేహాన్ని కిందకు దింపిన సమయంలో సెక్యూరిటీ సిబ్బందితోపాటు మరికొంతమంది మగవారు ఉన్నట్టు స్పష్టమవుతోందన్నారు. కిందకు దింపినప్పుడు తహసీల్దార్, పోలీసులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని ప్రశ్నించారు. దీప్తిపై అత్యాచారం, ఆపై హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని మృతురాలి తండ్రి మోహన్‌సింగ్ పోలీసులకు ఇచి్చన ఫిర్యాదులో పేర్కొన్నారు. 11,12 తేదీల్లో సీసీ ఫుటేజీ సేకరించాలని పోలీసులను కోరారు. దీప్తి మృతిపై సమగ్ర విచారణకు పలు విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. టీజీవీపీ, టీఎస్ఎఫ్, గిరిజన శక్తి మోర్చ సంఘాలు ఆ విద్యాసంస్థ ఎదుట ఆందోళన నిర్వహించాయి. యూనివర్సిటీ గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేశాయి. దీప్తి మృతిపై సమగ్ర విచారణ జరుపుతున్నట్టు హసన్‌పర్తి ఇన్స్పెక్టర్ గోపి తెలిపారు. కాజీపేట ఏసీపీ డేవిడ్ రాజు ఆధ్వర్యంలో ఈ విచారణ కొనసాగుతుందన్నారు. ఆత్మహత్య చేసుకున్న గదిని సీజ్ చేసినట్టు తెలిపారు. -
ప్రేమించపోతే ప్రాణం తీస్తారా?
బొమ్మనహళ్లి (మంగళూరు): సరస్వతీ నిలయంలో రక్తం చిందింది. అమ్మాయి త న ప్రేమను అంగీకరించలేదని ఒక యువకుడు ఉన్మాదిగా మారి ఆమెను కత్తితో పొడిచి చంపాడు. తాను కూడా పొ డుచుకుని ఆత్మహత్యా యత్నం చేయబోయాడు. ఈ విషా ద ఘటన మంగళవారం దక్షిణకన్నడ జిల్లా మంగళూరు స మీపంలో ఉన్న సుళ్యలో చోటు చేసుకుంది. అక్కడి నెహ్రు మెమోరియల్ కళాశాల్లో బీ.కాం చదువుతున్న కార్తీక్ (21) అనే విద్యార్థి ఈ ఘోరానికి ఒడిగట్టాడు. మృతురాలు అక్షత (21) ఇదే కళాశాల్లో బీఎస్సీ విద్యార్థిని. ఇద్దరు సుళ్యవాసులే. కొంత కాలంగా కార్తీక్ అక్షతను ప్రేమిస్తున్నానని వెంటపడుతున్నాడు. అక్షత అతని ప్రేమను నిరాకరిస్తోంది. దీంతో కోపోద్రిక్తుడైన కార్తీక్ కళాశాల నుంచి అక్షత బయటకు వస్తున్న సమయంలో కత్తితో ఆమెపై దాడి చేశాడు. ఆరుసార్లు పొడవడంతో అమ్మాయి అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. కార్తీక్ కూడా ఆత్మహత్యయత్నం చేస్తుండగా స్థానికులు పట్టుకుని అతన్ని ఆస్పత్రికి తరలించారు. సుళ్య పోలీసులు సంఘటనా çస్థలానికి వచ్చి పరిశీలించి, కేసు నమోదు చేశారు. -
ప్రేమ కోసం బలైన ఓ‘లేడి’కూన
బాపట్ల (గుంటూరు): ప్రేమ మధురమైనదని.. ప్రేమే జీవితమని.. ప్రియుడు తోడే ప్రపంచమని భావించిన ఆ యువతి చివరకు ఆ ప్రేమను పొందలేక తనకుతానే మరణశిక్ష విధించుకున్న ఉదంతం కన్నవారి కడుపు కోతను మిగిల్చింది. బాపట్ల వ్యవసాయ కళాశాలలో బీఎస్సీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న.. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరుకు చెందిన మీసాల సాయితేజస్విని (19) ప్రేమికుల రోజుకు రెండు రోజుల ముందే మృత్యువును ఆశ్ర యించింది. బుధవారం రాత్రి ఒంటిగంట వరకు ఫోన్లో ప్రియుడుతో సంభాషించి ఆ యువతి గురువారం ఉదయం 10గంటలకు మృత్యువాతపడింది. కిట్టు ఆలియాస్ యోగేశ్వరరావుతో ఆ యువతి ఫోన్ సంభాషణల రికార్డులను పోలీసులు, కళాశాల యాజమాన్యం పరిశీలించాయి. ఎస్ఎంఎస్లో ప్రియుడి నుంచి నిర్దేశించిన సమయంలోపు ఫోన్ రాకపోతే తరువాత తనతో మాట్లాడేందుకు అవకాశం ఉండదని స్పష్టంగా తెలిపినట్టు సమాచారం. తనకు తానే ప్రేమ కోసం శిక్షించుకున్న ఆ ‘లేడి’కూనను చూసి సాటి విద్యార్థినులు బావురమన్నారు. పుట్టిన రోజు బట్టలే.. పుట్టికి ఉపయోగపడ్డాయి సాయితేజస్విని చనిపోయిన సమాచారం తెలుసుకుని పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు నుంచి వచ్చిన తల్లిదండ్రులు భాస్కరరావు, వెంకటలక్ష్మి, సోదరుడు పవన్ బోరున విలపించారు. ఈనెల 22న తన పుట్టిన రోజు కోసం తల్లిదండ్రులతో కలిసి తాను ఎంతో ముచ్చటపడి కొనుగోలు చేసిన దుస్తులు చివరకు ఆ యువతి పుట్టికి ఉపయోగపడ్డాయి. ఈనెల 7న కొవ్వూరులో జరిగిన పెళ్లికి హాజరైన సాయితేజస్వితో మధుర సృ్మతులను తండ్రి భాస్కరరావు గుర్తుచేసుకుని విలపించిన తీరు చూపరులను కలచివేసింది.