
నిందితుడు భువనేశ్వర్
మీర్‌పేట: ప్రేమించాలని ఓ విద్యార్థినిని వేధిస్తున్న యువకుడిపై ఈ పెట్టి కేసు నమోదు చేసి పోలీసులు రెండు రోజులు జైలుశిక్ష విధించిన సంఘటన మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ యాదయ్య కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. అల్మాస్‌గూడకు చెందిన బాలిక స్థానిక పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. తిరుమలహిల్స్‌కు చెందిన కార్లకోట భువనేశ్వర్ (22) ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. గత కొన్ని రోజులుగా అతను స్కూల్ వద్దకు వెళ్లి తనను ప్రేమించాలని బాలికను వేధిస్తున్నాడు. దీనిపై బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ పెట్టి కేసు నమోదు చేసిన పోలీసులు రెండు రోజుల జైలుశిక్ష విధించారు.
Comments
Please login to add a commentAdd a comment