వీడియోలు లీక్‌ చేసిన లవర్‌.. యువతి ఆత్మహత్య | lover leaks personal videos on social media, girl hangs self | Sakshi
Sakshi News home page

వీడియోలు లీక్‌ చేసిన లవర్‌.. యువతి ఆత్మహత్య

Published Thu, Apr 13 2017 2:18 PM | Last Updated on Tue, Sep 5 2017 8:41 AM

వీడియోలు లీక్‌ చేసిన లవర్‌.. యువతి ఆత్మహత్య

వీడియోలు లీక్‌ చేసిన లవర్‌.. యువతి ఆత్మహత్య

ఢిల్లీ యూనివర్సిటీలో చదివే 21 ఏళ్ల అమ్మాయి ఉత్తరఢిల్లీలోని రూప్‌నగర్‌ ప్రాంతంలోగల తమ ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తామిద్దరం కలిసున్న వ్యక్తిగత వీడియోలను తన ప్రేమికుడు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో తట్టుకోలేని ఆ యువతి.. ప్రాణాలు తీసుకుంది. స్కూల్‌ ఆఫ్‌ ఓ‍పెన్‌ లెర్నింగ్‌లో బీకాం చదువుతున్న ఆ యువతి.. తన చావుకు ప్రేమికుడే కారణమని చెబుతూ సూసైడ్‌ నోట్‌ రాసింది. ఇటీవలే ఆమె మోడల్‌ టౌన్‌ పోలీసు స్టేషన్‌లో తనపై అత్యాచారం జరిగినట్లు ఫిర్యాదు చేసిందని, అయితే పోలీసులు దానిపై చురుగ్గా స్పందించలేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ఆమె ఆత్మహత్య చేసుకోవడంతో అందుకు ప్రేరేపించాడంటూ నిందితుడు పట్నాకు చెందిన వేద్‌ ప్రకాష్‌ మీద పోలీసులు కేసు పెట్టారు. అతడిని అరెస్టు చేయడానికి ఓ బృందాన్ని పంపామని డీసీపీ జతిన్‌ నర్వాల్‌ తెలిపారు. యువతి కుటుంబం మధ్యప్రదేశ్‌లో ఉంటుంది.

ఆమె చదువుకోడానికి ఢిల్లీ వచ్చి తోటి విద్యార్థి అయిన ప్రకాష్‌తో ప్రేమలో పడింది. ఇద్దరూ ఒకే ప్రాంతంలో ఉండేవారు. పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నారు గానీ, తర్వాత ఎందుకోగానీ ఇద్దరికీ చెడిపోయింది. ఇద్దరూ మూడేళ్ల పాటు సహజీవనం చేసినట్లు తెలిసిందని, అయితే వాళ్ల కుటుంబాలు అంగీకరించలేదని పోలీసులు చెప్పారు. తల్లిదండ్రులను వదిలేసి తనతో పాటు బిహార్‌ వచ్చేయమని ప్రకాష్‌ అడిగేవాడని, అయితే అందుకు ఆమె నిరాకరించిందని అన్నారు. అలా రాకపోతే వ్యక్తిగత వీడియోలు బయట పెడతానంటూ అతడు బెదిరించేవాడని తెలిసింది.

కొంతకాలం తర్వాత అతడు బిహార్‌ వెళ్లిపోయాడని, ఆమె ఫోన్లు ఆన్సర్‌ చేయకపోవడంతో పాటు ఆమెను కలవడం కూడా మానేశాడని చెప్పారు. దాంతో ఆమె ఏప్రిల్‌ 8వ తేదీన తనపై అత్యాచారం జరిగినట్లు ఫిర్యాదు చేసిందని, తాము దానిపై విచారణ జరుపుతుండగానే ఆమె ప్రాణాలు తీసుకుందని పోలీసులు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement